vijay mallya

మాల్యాకు బ్రిటన్‌ కోర్టులో ఊరట.. కానీ

Updated By ManamSat, 06/16/2018 - 08:48

mallya  లండన్: బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు బ్రిటన్ కోర్టులో కాస్త ఊరట లభించింది. అతనికి సంబంధించిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బకాయిలను రాబట్టేందుకు బ్రిటన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన 13 బ్యాంకుల కన్సార్టియంకు ఊరట లభించింది. అయితే న్యాయపోరాటం కోసం భారత బ్యాంకులకు అవుతున్న ఖర్చును(రూ.1.80కోట్లు) మాత్రం తప్పకుండా మాల్యా చెల్లించాల్సిందేనని ఆదేశించారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ఆండ్రూ హెన్షా.. మాల్యా ఆస్తులను స్తంభింపజేసేందుకు నిరాకరించారు. కాగా మాల్యాను భారత్‌కు పంపాల్సిందిగా కోరుతూ భారత్ వేసిన పిటిషన్‌పై వచ్చే నెల వెస్ట్ మినిస్టర్ కోర్టులో తుది వాదనలు జరగనున్నాయి.మాల్యా, మోదీ రికార్డులు సేఫ్‌గానే ఉన్నాయి

Updated By ManamMon, 06/04/2018 - 10:28

Modi, Mallya ముంబై: ముంబైలోని ఆదాయపు పన్ను శాఖ ఆఫీసులో రెండు రోజుల క్రితం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మేహుల్ చౌక్సీ తదితర ఢిపార్టర్ల రికార్డులు కాలి బూడిద అయినట్లు వార్తలు రాగా, వాటిని సీబీడీటీ అధికారులు ఖండించారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ముఖ్యమైన ఫైల్స్ అన్ని తరలించామని వారు తెలిపారు.

వారికి సంబంధించిన డాక్యుమెంట్లను, రికార్డులను అంచనా కార్యక్రమంలో భాగంగా పలు భవంతుల్లో ఉన్న అసెస్‌మెంట్ విభాగాలకు పంపించినట్లు పేర్కొన్నారు. మరోవైపు మంటలు ప్రారంభం కాగానే, భవంతిలో చిక్కుకున్న ఆరుగురిని రక్షించామని, దాదాపు 120 ఫైర్‌ మెన్లు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారని డిప్యూటీ ఫైర్ ఆఫీసర్ రాజేంద్ర చౌదరి వెల్లడించారు.

 


 తెరపైకి విజయ్ మాల్యా బయోపిక్

Updated By ManamWed, 05/30/2018 - 11:03
mallya

బ్యాంకులకు కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా జీవితం వెండితెరపైకి రానుంది. సెన్సార్ బోర్డు మాజీ చీఫ్, దర్శకుడు పహ్లజ్ నిహ్లానీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. మాల్యాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద నటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బ్యాంక్ స్కాంల సన్నివేశాలను వినోదాత్మకంగా తెరకెక్కించామన్నారు.

ఇక ఈ చిత్రంలో కింగ్ ఫిషర్ క్యాలెండర్‌పై ఓ పాటను కూడా కంపోజ్ చేశామని, ఈ పాటకు చిన్ని ప్రకాశ్ కొరియోగ్రఫీ అందించాడని ఆయన వెల్లడించారు. ఇక ఈ చిత్రంలో గోవింద కొత్త అవతారంలో కనిపించనున్నాడని, ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుందని పహ్లజ్ అన్నారు. అయితే గతంతో పహ్లజ్ నిహ్లానీ, గోవిందతో ‘రంగీలా రాజా’ను తెరకెక్కించారు.

 మాల్యాను అప్పగించండి

Updated By ManamThu, 04/19/2018 - 07:57

Modi, Mallya లండన్: భారత బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను తమకు అప్పగించాలని ఆ దేశ ప్రధాని థెరిసా మేకు ప్రధాని మోదీ విఙ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. బ్రిటన్ పర్యటనకు వెళ్లిన మోదీ థెరిసా మేతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలపై ఈ ఇద్దరు చర్చించగా.. అందులో మాల్యా విషయం కూడా వచ్చినట్లు సమాచారం. అయితే దానిపై ఆమె ఎలా స్పందించిందన్న విషయం మాత్రం తెలియరాలేదు.

అయితే మాల్యాను భారత్‌కు రప్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మాల్యా విషయాన్ని అక్కడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా అక్కడి పోలీసులు రెండుసార్లు మాల్యాను అరెస్ట్ చేశారు. కానీ ఆ వెంటనే బెయిలుపై విడుదలయ్యాడు మాల్యా. ప్రస్తుతం మాల్యాపై అక్కడ విచారణ కొనసాగుతోంది.
 మాల్యా పెళ్లికి 'కింగ్‌ఫిషర్' బ్యూటీలు

Updated By ManamFri, 03/30/2018 - 14:41

Mallya బ్యాంకులకు వేలకోట్లు కుచ్చుటోపి పెట్టి, ప్రస్తుతం బ్రిటన్‌లో తలదాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మూడో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. తన ప్రియురాలు, ఎయిర్ హోస్టెస్‌ పింకీ లాల్వాణీని త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఇండియాలోని పలువురు సినీ, వ్యాపార ప్రముఖులకు మాల్యా ఆహ్వానాలు పంపారు. ఇక తాజా సమాచారం ప్రకారం గతంలో కింగ్‌ఫిషర్ బ్యూటీలైన దీపికా పదుకొణె, కత్రినా కైఫ్, నర్గీస్ ఫక్రి మాల్యా వివాహానికి వెళుతున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు పలువురు వ్యాపార ప్రముఖులు కూడా వీరి వివాహానికి హాజరు అవుతున్నట్లు సమాచారం.కింగ్‌ఫిషర్ క్లైములు చెల్లించాల్సిందే

Updated By ManamMon, 02/12/2018 - 22:08

విజయ్ మాల్యాకు ప్రతికూలంగా లండన్‌లో వెలువడిన మరో తీర్పు
Vijay Mallyaలండన్/సింగపూర్:
ప్రస్తుతం మూతపడిన స్థితిలో ఉన్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి ఆ సంస్థ అధినేత విజయ్ మాల్యా మరో న్యాయ పోరాటంలోను ఓటమిని చవి చూశారు. సింగపూర్‌కు చెందిన బి.ఓ.సి ఏవియేుషన్‌కు సుమారు 9 కోట్ల అవెురికన్ డాలర్లను క్లైములుగా చెల్లించవలసి ఉంటుందని బ్రిటన్ హైకోర్టు ఆదేశించింది. ఇది 2014లో విమానాలను లీజుకు ఇవ్వడానికి సంబంధించి  కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌తో ముడిపడిన కేసు. మద్యం వ్యాపారి 62 ఏళ్ళ విజయ్ మాల్య ఇప్పటికే అనేక కోర్టు కేసులతో సతమతమవుతున్నారు. భారతీయ బ్యాంకులకు ఆయన రూ. 9,000 కోట్ల మేరకు రుణ బకాయిలను ఎగవేసిన ఆరోపణను ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి తదుపరి విచారణకు ఆయనను అప్పగించాలని బ్రిటన్‌ను భారతదేశం కోరుతోంది. విమానాల లీజు కేసు మార్చి 16న లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టుకు తిరిగి వచ్చింది. ‘‘క్లైమ్‌ను విజయువంతంగా సమర్థించుకునే నిజమైన అవకాశం ప్రతివాదులకు లేదు’’ అని లండన్‌లో బిజినెస్ అండ్ ప్రాపర్టీ కోర్ట్స్ ఆఫ్ ద హైకోర్ట్‌కు చెందిన జస్టిస్ పికెన్ ఫిబ్రవరి 5న ఇచ్చిన తీర్పులో పేర్కొన్నారు. సింగపూర్‌లోని బి.ఓ.సి ఏవియేుషన్, బి.ఓ.సి ఏవియేుషన్ (ఐర్లాండ్) లిమిటెడ్ వేసిన దావాలో గింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్, యునైటెడ్ బ్రూవరీస్ (హోల్డింగ్స్) లిమిటెడ్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ‘‘తీర్పు మాకు సంతోషాన్ని ఇచ్చింది. ఈ దశలో ఇంతకుమించి వ్యాఖ్యానించదలచుకోలేదు’’ అని సింగపూర్‌లోని బి.ఓ.సి ఏవియేుషన్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ లీగల్ క్లైమ్ విమానాలను లీజుకిచ్చే కంపెనీ బి.ఓ.సి ఏవియేుషన్‌కు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కి మధ్య నాలుగు విమానాల లీజు అగ్రిమెంటుకు సంబంధించినది. మూడు విమానాల అప్పగింత పూర్తయింది. లీజు ఒప్పందం కింద చెల్లించవలసి ఉన్న మొత్తాలను తొక్కిపెట్టినందుకుగాను నాల్గవ విమానాన్ని అప్పగించలేదని చెబుతున్నారు. ఇటువంటి వ్యవహారాలలో అయితే సాధారణంగా సెక్యూరిటీ డిపాజిట్ సమస్య పరిష్కారానికి సహాయపడుతుంది. కానీ, ఈ కేసులో అది కూడా తగినంత లేదని, ‘‘ఒప్పందం ప్రకారం’’ కింగ్‌ఫిషర్ చెల్లించవలసి ఉన్న మొత్తానికి సరిపోయేంతగా అది లేదని బి.ఓ.సి ఏవియేుషన్ పేర్కొంది. దాని పర్యవసానంగానే అది లండన్ హైకోర్టును ఆశ్రయించింది. బి.ఓ.సికి చెల్లించవలసి ఉన్న బకాయిని వడ్డీతో సహా, కోర్టు ఖర్చులను కలిపి చెల్లించాలని జస్టిస్ పికెన్ తీర్పునిచ్చారు. అవన్నీ కలసి దాదాపు 9 కోట్ల అవెురికన్ డాలర్ల మేరకు ఉండవచ్చని భావిస్తున్నారు. ‘‘ఈ కేసులో రెండవ ప్రతివాది (యునైటెడ్ బ్రూవరీస్) మొదటి ప్రతివాది (కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్)తో కలసి సంయుక్తంగాను, విడి గాను కక్షిదారు (బి.ఓ.సి ఏవియేుషన్)కు బకాయి మొత్తంలో సగం చెల్లించడంలో బాధ్యత వహించవలసిందే’’ అని కోర్టు ఆదేశించింది. ఈ అంశంపై కింగ్‌ఫిషర్ ఇంకా స్పందించలేదు. 

అప్పగింత కేసు
మాల్యాను అప్పగించాలని ఇండియా పెట్టిన కేసులో తుది వాద ప్రతివాదనలలో ఒకటి మార్చి 16న సాగవలసి ఉంది. దానిపై ఛీఫ్ మేజిస్ట్రేట్ ఎమా అర్బత్‌నాట్ వచ్చే మే నెలలో తీర్పు వెలువరించవచ్చని భావిస్తున్నారు. మాల్యా అప్పగింత కేసులో కడపటి వాదనలు జనవరిలో సాగాయి. మాల్యా 6,50,000 పౌండ్ల బెయిల్ బాండ్ గడువును వచ్చే ఏప్రిల్ 2 వరకు పొడిగించారు. స్కాట్లండ్ యార్డ్ జారీ చేసిన వారంట్‌తో మాల్యాను గత ఏడాది ఏప్రిల్‌లో అరెస్టు చేశారు. అప్పగింత కేసుపై విచారణ గత ఏడాది డిసెంబరు 4న మొదైలెంది. అప్పటి నుంచి ఆయన దాని వాద ప్రతివాదనలకు హాజరవుతూ వస్తున్నారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ భారదేశంలో బ్యాంకులకు దాదాపు రూ. 9,000 కోట్ల మేరకు రుణం ఎగవేసిందని అంచనా. ఆయునను భారతదేశానికి బలవంతంగా తిప్పి పంపవచ్చా అనే అంశంపై వాదనలు సాగుతున్నాయి. తాము సవుర్పించిన ఆధారాలు ఆ వ్యాపారవేత్తకు ‘‘నిజాయతీ లేదు’’ అని ధ్రువీకరిస్తున్నాయని, ఆయన అక్రమ ప్రాతినిధ్యాల ద్వారా రుణాలు పొందారని, వాటిని తిరిగి చెల్లించే ఉద్దేశం ఆయునకు లేదని అప్పగింత కేసులో భారత ప్రభుత్వం తరఫున వాదిస్తున్న క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ పేర్కొంది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తీసుకున్న అప్పును చెల్లించలేకపోవడం వ్యాపార వైఫల్య ఫలితవేునని మాల్యా తరఫున వాదిస్తున్న న్యాయువాదుల బృందం చెబుతోంది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ విస్తృత కోణం నుంచి దాన్ని చూడాలని, దాని యజమానికి ‘‘మోసపూరిత’’ ఉద్దేశాలు లేవని అది అంటోంది. ప్రపంచ వ్యాప్తంగా మాల్యాకున్న 1.5 బిలియన్ డాలర్ల ఆస్తులను స్తంభింపజేసిన ఉత్తర్వుపై మరో కేసు కూడా నడుస్తోంది. 13 భారతీయ బ్యాంకులు సమర్పించిన డాక్యుమెంట్లపై రెండు రోజుల వాదనలు వచ్చే ఏప్రిల్ 11న ప్రారంభం కానున్నాయి. 
 విజయ్ మాల్యాకు ఎదురుదెబ్బ!

Updated By ManamFri, 01/19/2018 - 11:04
  • కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ కేసులో మాల్యా సహా 18 మందికి అరెస్ట్ వారెంట్ జారీ

  • బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశాలు.. 19 సంస్థలపై ప్రత్యేక నేర కేసు 

Vijay Mallya, arrest warrant,  Kingfisher Airlines case, Speical Court Issue న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుడు విజయ్ మాల్యాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కేసులో మాల్యా సహా 18 మందికి అరెస్ట్ వారెంట్ జారీ చేయాల్సిందిగా బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) ఫిర్యాదు మేరకు ప్రత్యేక న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని దర్యాప్తు సంస్థ, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి 2012లో పలు కంపెనీ చట్టాలను ఉల్లంఘించినట్టు గుర్తించింది. కింగ్ పీషర్ ఎయిర్‌లైన్స్ కేసులో దాదాపు రూ.9 వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టిన మాల్యా తప్పించుకుని లండన్ పారిపోయి చాలాకాలంగా తలదాచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు విజయ్ మాల్యాతో పాటు మరో 18 మందికి అరెస్ట్ వారెంట్ జారీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు 19 సంస్థలపై ‘ప్రత్యేక నేర కేసు’ కూడా నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. లండన్ కోర్టుకు మాల్యా.. తేలిపోనుందా?

Updated By ManamThu, 01/11/2018 - 20:23

vijay mallyaలండన్: బ్యాంకులకు రూ.9వేల కోట్లకు పైగా ఎగ్గొట్టి లండన్‌లో విలాస జీవితం గడుపుతున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సంబంధించిన కేసులో లండన్ కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. ఈ కేసు విచారణలో భాగంగా వెస్ట్‌మినిస్టర్ మాజిస్ట్రేట్స్ కోర్టుకు విజయ్ మాల్యా హాజరయ్యాడు. మాల్యా బ్యాంకులను మోసం చేశాడని.. అందుకు సంబంధించిన ఆధారాలను భారత్ లండన్ కోర్టులో సమర్పించింది. విజయ్ మాల్యాను తమకు అప్పగించాలని భారత్ గట్టిగా పట్టుబడుతోంది. 2016 మార్చిలో మాల్యా భారత్‌ను విడిచి లండన్‌కు పారిపోయాడు. ఏప్రిల్ 2017లో మాల్యాను అక్కడి పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ.. 6,50000 పౌండ్లు చెల్లించి పూచీకత్తుతో బెయిల్‌పై బయటికొచ్చాడు. ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి ఎర్బూత్‌నట్ ముంబై జైలులో ఉండే సౌకర్యాలను గురించి భారత్‌ నుంచి ఇప్పటికే వివరణ తీసుకున్నారు.   కోర్టు తీర్పు భారత్‌కు అనుకూలంగా ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. అయితే తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా.. మరొకరు కోర్టు తీర్పును లండన్ హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది.ముంబై జైలే మాల్యాకు ఇల్లు

Updated By ManamSun, 11/26/2017 - 17:09

mallyaముంబై: బ్యాంకులకు రూ.9వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను స్వదేశానికి తీసుకొచ్చి కారాగారంలో బంధించేందుకు భారత్ రంగం సిద్ధం చేసినట్లే కనిపిస్తోంది. దాదాపు సంవత్సరానికి పైగా లండన్‌లో విలాస జీవితం గడుపుతున్న మాల్యా దోబూచులాటలు ఇక సాగేలా కనిపించడం లేదు. తాజాగా బ్రిటన్ కోర్టుకు ఈ రకమైన సంకేతాలు పంపేందుకు భారత్ సిద్ధమైంది. ముంబైలోని అర్థుర్ రోడ్‌లో ఉన్న జైలులో మాల్యాను ఉంచుతామనే విషయాన్ని వచ్చే వారం బ్రిటన్ కోర్టు ముందు భారత్ వెల్లడించనుంది. క్రౌన్ ప్రాసిక్యూషన్ ఏజెన్సీ ఈ సమాచారాన్ని బ్రిటన్ కోర్టుకు తెలియపరచనుంది. మాల్యాను ఇండియాకు తరలించే విషయంలో డిసెంబర్ 4న బ్రిటన్ కోర్టులో విచారణ ప్రక్రియ మొదలుకాబోతోంది.

మాల్యా తరపు లాయర్ భారత జైళ్లు సురక్షితం కాదని, అక్కడ ఉంచితే మాల్యా ప్రాణాలకే ప్రమాదకరమని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా భారత్ ఈ విషయాన్ని బ్రిటన్ కోర్టుకు వివరించనుంది. మాల్యాకు జైలులో భద్రత లేదని చెప్పడం కేసును పూర్తిగా పక్కదోవ పట్టించడమేనని, ఖైదీల భద్రత విషయంలో భారత జైళ్లు ఇతర దేశాలకు ఏ మాత్రం తీసిపోవని భారత ప్రతినిధులు కోర్టుకు వివరించనున్నారు. భారత్‌లో జైలులో ఉంచితే తన ప్రాణాలకే ముప్పని మాల్యా పదేపదే చేస్తున్న వ్యాఖ్యలను అధికారులు ఖండించారు. ఈ తరహా వ్యాఖ్యలు చేసి మాల్యా కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ముంబైలోని జైలు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించామని, భద్రత విషయంలో భయపడాల్సిన అవసరం లేదని లండన్ కోర్టుకు భారత్ వెల్లడించనుంది. అక్రమ ఆయుధాల కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా ఈ జైలులో కొన్నాళ్లు గడిపాడు.మాల్యాకు వాద్రా కౌంటర్

Updated By ManamTue, 11/21/2017 - 13:13
  • నీలా డబ్బులు ఎగ్గొట్టి పరాయి దేశం పారిపోలేదు.. నా దేశ న్యాయవ్యవస్థపై నాకు చాలా విశ్వాసం

  • దమ్ముంటే వచ్చి కేసులను ఎదుర్కో.. డబ్బులిచ్చేయ్.. నా పేరు వాడకు.. నీతో నాకు పోలిక లేదు: వాద్రా

Robert Vadra File Photoన్యూఢిల్లీ, నవంబరు 21: విజయ్ మాల్యా వ్యాఖ్యలపై రాబర్ట్ వాద్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. తానూ రాబర్ట్ వాద్రాలా రాజకీయ బాధితుడినేన్న వ్యాఖ్యలపై కౌంటర్ ఇక్చారు. మాల్యా వ్యాఖ్యలను తప్పుబట్టారు. తాను రాజకీయ బాధితుడినే అయినా, మాల్యాలా తన అధికారాలను దుర్వినియోగం చేయలేదని, వేరొకరి సొమ్ముతో పారిపోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మాల్యా వ్యాఖ్యలపై ట్విట్టర్‌లో స్పందించిన వాద్రా.. మాల్యాపై మండిపడ్డారు. ‘‘అవును. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇతరులు నా పేరును వాడుకుంటున్నారన్న విషయం మరోసారి రుజువైంది. లండన్ కోర్టుల్లో మాల్యా నా పేరును ప్రస్తావించినట్టు తెలిసింది. కాబట్టి, మాల్యాకు నేను చెప్పేది ఒకటే. నేను రాజకీయ బాధితుడినే. కానీ, నేను నా అధికారాలను దుర్వినియోగం చేయలేదు. నా దేశ న్యాయవ్యవస్థపై నాకు చాలా విశ్వాసం ఉంది. మాల్యాలా నేను పరుల సొమ్ముతో దేశం విడిచి ఎప్పుడూ పారిపోలేదు’’ అని వాద్రా గట్టి కౌంటర్ ఇచ్చారు. మాల్యా భారత్‌కు వచ్చి పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులను ఎదుర్కోవాలని సూచించారు. ‘‘మాల్యాకు నాదొక సలహా. భారత్‌కు వచ్చి కేసులను ఎదుర్కో. ప్రజలకు ఇవ్వాల్సిన బాకీలన్నీ ఇచ్చేయ్. నా పేరును వాడుకోవడం ఆపేయ్. ఏ విషయంలోనైనా నీతో నాకు పోలిక లేదు’’ అని వాద్రా కౌంటర్ విసిరారు. 

 

Related News