Alastair Cook

అలెస్టర్ కుక్‌కు మీడియా స్పెషల్ గిఫ్ట్‌!

Updated By ManamTue, 09/11/2018 - 17:08

33 bottles of beer, Alastair Cook, farewell gift, mediaఓవల్: అంతర్జాతయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్ అలెస్టర్ కుక్‌కు మీడియా నుంచి ప్రత్యేక బహుమతి అందింది. భారత్‌తో జరిగే ఆఖరి టెస్టులో సోమవారం నాల్గోరోజున అలెస్టర్‌కు మీడియా సమక్షంలో ఘనంగా వీడ్కోలు పలికారు. తన ఫైనల్ టెస్టు ఇన్నింగ్స్‌లో కుక్ 33వ సెంచరీ పూర్తి చేశాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫిరెన్స్‌‌లో మీడియా సమక్షంలో కుక్‌కు 33 బీర్ బాటిళ్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. గతవారమే తాను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు కుక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ జట్టులో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన టెస్టు బ్యాట్స్‌మన్‌గా నిలిచిన కుక్.. 45.35 సగటుతో మొత్తం 12472 పరుగులు సాధించగా, అందులో 33 సెంచరీలు, 57 హాఫ్ సెంచరీలను తన పేరిట లిఖించుకున్నాడు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘‘మీడియా తరపు నుంచి కుక్.. నిన్ను అభినందిస్తున్నాం. కొన్నేళ్లుగా ఒక ఆటగాడిగా, ఇంగ్లండ్ కెప్టెన్‌గా నీ ప్రదర్శన ఎంతో అద్భుతం. ప్రత్యేకించి మీడియాతో నీకున్న అనుబంధం విషయంలో ఎంతో సంతోషకరం. నీ కోసం చిన్న గిఫ్ట్‌ తెచ్చాం. డిన్నర్ సమయంలో నువ్వు వైన్ తాగనని, బీర్ తాగే వ్యక్తినని చెప్పినట్టు గుర్తు. అందుకే నీ కోసం 33 బీర్ బాటిళ్లు తెచ్చాం. అందులో ఒక్కో బీర్ బాటిల్.. మీడియాలో ప్రతి ఒక్కరి సందేశంగా భావించు’’ అని పేర్కొన్నారు. దీనిపై కుక్ స్పందిస్తూ..‘ప్రియమైన నా మీడియా మిత్రులకు కృతజ్ఞతలు’’ అంటూ కరచాలనం చేస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో కుక్‌ ఫేర్‌వేల్ డే సందర్భంగా 33వ సెంచరీ సాధించి తన 291వ టెస్టు ఇన్నింగ్స్‌‌తో చెరగని ముద్రవేశాడు.    రిటైర్మెంట్ ప్రకటించిన కుక్

Updated By ManamTue, 09/04/2018 - 00:37
  • టీమిండియాతో ఐదో టెస్టు తర్వాత గుడ్‌బై

Cookలండన్: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, టెస్టు క్రికెట్‌లో దేశంలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ అలైస్టర్ కుక్ టీమిండియాతో చివరి, ఐదో టెస్టు తర్వాత రిటైర్ కానున్నట్టు ప్రకటించాడు. ఇండియా, ఇంగ్లాండ్ మధ్య చివరి ఐదో టెస్టు ఈ నెల 7వ తేదీన ది ఒవల్‌లో ప్రారంభం కానుంది. 161 టెస్టుల తర్వాత రిటైర్ కావాలని ఆలోచించిన 33 ఏళ్ల కుక్ 44.88 సగటుతో 12,254 పరుగులు చేశాడు. ఇందులో 32 సెంచరీలు, 56 అర్ధ సెంచరీలున్నాయి. ఇతని అత్యధిక స్కోరు 294. 2011 సిరీస్‌లో బర్మింగ్‌హామ్ టెస్టులో టీమిండియాపై ఈ స్కోరు చేశాడు. ఇక వన్డేలో 92 మ్యాచ్‌ల్లో 3,204 పరుగులు సాధించాడు. ఇందులో అతని అత్యధికం 137 పరుగులు. అయితే ప్రస్తుత సిరీస్‌లో కుక్ స్కోరింగ్ పేలవంగా ఉంది. నాలుగు టెస్టుల్లో ఆడిన ఏడు ఇన్నింగ్స్‌ల్లో 109 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో టెస్టు జట్టులో అతని స్థానం అనుమానంగా మారింది. అయితే ఏం జరగబోతోందనేది అతనికి బాగా తెలుసు. ‘టీమిండియాతో ఈ టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. నాలో ఇక క్రికెట్ అంటూ ఏమీ మిగల్లేదు. నాకున్నదంతా సమర్పించాను. ఇంగ్లీష్ గొప్ప క్రికెటర్లతో కలిసి సుదీర్ఘ కాలం ఆడటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను అని కుక్ చెప్పాడు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణానికి దూరమవుతున్నట్టు కుక్ చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు కుక్ రిటైర్మెంట్!

Updated By ManamMon, 09/03/2018 - 21:31

Alastair Cook, England retirement, India seriesలండన్: అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. భారత్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ 60 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఆఖరి ఐదో టెస్ట్ తర్వాత తాను క్రికెట్ నుంచి తప్పకుంటున్నట్లు 33 ఏళ్ల క్రికెటర్ కుక్ వెల్లడించాడు. ఇంగ్లండ్ తరఫున 161 టెస్టులు ఆడిన కుక్.. 44.88 యావరేజ్‌తో 12,254 పరుగులు సాధించాడు. ఇందులో 32 సెంచరీలు, 56 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

తద్వారా టెస్టుల్లో 10వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్‌గా కుక్ రికార్డు సృష్టించాడు. ఈ ఫీట్‌ని అతను 31 సంవత్సరాల, 157 రోజుల్లో సాధించడం విశేషం. గతంలో ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండగా.. తాజాగా అలెస్టర్ కుక్ ఆ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 

Related News