allahabad

రావణ్, దుర్యోధన్ అనే పేర్లు ఎందుకు పెట్టలేదు..?

Updated By ManamMon, 11/05/2018 - 10:17

Yogi Adityanathలఖ్‌నౌ: ఉత్తరప్రదేశ్‌లోని ప్రాచీన నగరం అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మారుస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతోందని పలువురు విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై తాజాగా స్పందించిన యోగీ ఆదిత్యనాథ్.. తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

‘‘అలహాబాద్‌ పేరును నేను మార్చాలనుకున్నప్పుడు కొంతమంది వ్యతిరేకించారు. కొంతమంది అసలు పేరులో ఏముంది అని ప్రశ్నించారు. ఇప్పుడు నేను వారి తల్లిదండ్రులను అడుగుతున్నా.. ఆందోళన చేస్తున్న వారి పేర్లను రావణ్, దుర్యోధన్ అని ఎందుకు పెట్టలేదు. ఈ దేశంలో పేర్లకు చాలా ప్రాముఖ్యత ఉంది అని యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. అలాగే అలహాబాద్ మొదటి పేరు ప్రయాగ్ అని.. 1575లో మొఘల్ చక్రవర్తి అక్బర్ దానిని ఇలాహాబాద్‌గా మార్చాడని ఆదిత్యనాథ్ చెప్పుకొచ్చారు. కాగా ఉత్తరప్రదేశ్‌లో ఉన్న మొఘల్‌సరై రైల్వే స్టేషన్ పేరును కూడా దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్‌గా యోగీ ప్రభుత్వం మార్చిన విషయం తెలిసిందే.రిటైర్డ్ ఎస్పీపై దుండగుల దాడి.. 

Updated By ManamTue, 09/04/2018 - 15:36
  • యూపీలోని అలహాబాద్‌లో ఘటన.. 

Retired cop, 70 beaten to death, public view, Allahabadలఖ్‌నవ్: 70ఏళ్ల అబ్దుల్ సమీద్ ఖాన్ అనే రిటైర్డ్ ఎస్పీపై దుండగులు కర్రలతో దాడిచేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం కిరణా సరుకులు కొనేందుకు బజారుకు సైకిల్‌పై వెళ్తున్న సమీద్ ఖాన్‌ను ముగ్గురు దుండగులు వెంబడించారు. వెనుక నుంచి కర్రలతో వెంబండించి సమీద్‌ను సైకిల్ మీద నుంచి కింద పడేసి కర్రలతో చితకబాదారు. ముందుగా ఓ దుండగుడు కర్రతో దాడిచేయగా, మిగతా ఇద్దరూ జత కలిసి మాజీ ఎస్పీని తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన సమీద్ ఖాన్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

రిటైర్డ్ ఎస్పీని ముగ్గురు రోడ్డుపై చావబాదుతున్నప్పటికీ అటుగా వెళ్తున్న వారంతా చూసిచూడనట్టుగా వెళ్లిపోవడం బాధాకారం. సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ముగ్గురి నిందితుల్లో ఇద్దరు మహ్మద్ యూసఫ్, జునైద్‌లను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. నిందితుల్లో జునైద్ అనే వ్యక్తి పేరిట క్రిమినల్ రికార్డు ఉందని, ఆస్తులకు సంబంధించిన గొడవల వల్లే ఈ దాడికి పాల్పడినట్టు అలహాబాద్ జిల్లా ఎస్ఎస్‌పీ నితిన్ తివారీ చెప్పారు. విచారణ కొనసాగుతున్నట్టు తివారీ తెలిపారు.  ఏడాదిలో వర్షాలకు 1400 మంది బలి

Updated By ManamMon, 09/03/2018 - 22:56
  • కేంద్ర హోం శాఖ నివేదిక వెల్లడి

allahabadన్యూఢిల్లీ: ఈ ఏడాది వర్షాకాలంలో దేశవ్యాప్తం గా వివిధ ప్రమాదాలు, ఘటన ల్లో 1,400 మంది మృతి చెందారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. వీరిలో అత్యధికంగా కేరళ వరదల్లో 488 మంది దుర్మరణం పాలయ్యారని తెలిపింది. పది రాష్ట్రాల్లో ప్రమాద ఘటనలు ఎక్కువగా జరిగాయని పేర్కొంది.  కేరళలోని 14 జిల్లాల్లో వరదల ప్రభావం తీవ్రంగా చూపిందని, 54.11 లక్షల మందిపై ఏదో రకంగా ప్రభావం పడిందని తెలిపింది. దాదాపు 14.52 లక్షల మంది నిరాశ్రయులయ్యారని, వారంతా ఇంకా పునరా వాస శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారని వెల్లడించింది. ఈ రాష్ట్రంలో 57,024 హెక్టార్లలో పంట నష్టం సంభవిం చిందని పేర్కొంది. 

జలపాతం..మహోగ్రరూపం!
గలగలా దుంకుతున్న జలపాతం అందాలను చూస్తూ తన్మయత్వంలో ఉండగా.. ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. ఎవరో బకెట్లతో నీళ్లను కుమ్మరించినట్లుగా మహోగ్రరూపం దాల్చింది. ఒక్కసారిగా దుమికి దుమికి పడింది. ఆ సమయంలో అక్కడ 180 మంది వరకు పర్యాటకులు ఉన్నారు.  ఉత్తరాఖండ్ ముస్సోరిలోని కెంప్టీ వాటర్ ఫాల్స్ వద్ద ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. జోరున కురిసిన వర్షాలకు జలపాతంలో నీటి ఉధృతి పెరిగి..కొండలను చీల్చుకుంటూ నీరు కిందకు వచ్చింది. జలపాతం హోరు కు ఒక్కసారిగా భయభ్రాం తులకు గురై పరుగులు తీశారు. అనేక మంది నీళ్లలో చిక్కుకుపోయారు. సకాలంలో పోలీసులు స్పందించడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు.

కేరళలో ర్యాట్ ఫీవర్ విజృంభణ
కేరళలో వరదల అనంతరం అంటువ్యాధుల విజృంభించే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందినట్లుగానే జరుగుతోంది. నీటి ఆధారంగా వచ్చే ర్యాట్ ఫీవర్‌లో ఇప్పటి వరకు 12 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. మరో 350 మంది ఆ వ్యాధి లక్షణాలతో చికిత్స చేయించుకున్నారని, మరో 150 మందికి ఈ వ్యాధి సోకినట్లుగా నిర్ధారణ అయ్యిందని చెప్పారు. కోజికోడ్, ములప్పురం జిల్లాల్లోనే ఈ వ్యాధి ఎక్కువగా ఉందని, నివారణకు అన్ని చర్యలు తీసుకంటున్నామని ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ వెల్లడించారు. వైద్యాధికారులతో పాటు పారిశుద్ధ్యానికి సంబంధించి అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ఈ ర్యాట్ ఫీవర్‌కు సంబంధించి మందులను అన్ని ఆరోగ్య శిబిరాల్లో ఉంచామని చెప్పారు.

Related News