race gurram

బ్రేకింగ్ న్యూస్.. 'రేసు గుర్రం' సీక్వెల్‌లో బ‌న్నీ

Updated By ManamWed, 05/09/2018 - 19:19

race gurramస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిలిచిన చిత్రాల‌లో 'రేసు గుర్రం' ఒక‌టి. 2014లో వ‌చ్చిన ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్‌గా ఘ‌న‌విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా.. అవార్డుల‌ను సైతం మూట‌గ‌ట్టుకుంది.  సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా అన్న‌ద‌మ్ముల అనుబంధం నేప‌థ్యంలో తెర‌కెక్కింది. ఇదిలా ఉంటే.. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల క‌థ‌నాల ప్రకారం ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించి ద‌ర్శ‌కుడు, ఇత‌ర వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి. కాగా.. బ‌న్నీ తాజా చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' ఇటీవ‌ల విడుద‌లై న‌టుడిగా అత‌ని స్థాయిని మ‌రింత పెంచింది. స‌మ్మర్‌లో మెగా (బ్ర‌ద‌ర్) సెంటిమెంట్‌

Updated By ManamMon, 04/30/2018 - 22:29

megaబాక్సాఫీస్ స‌క్సెస్ ఫార్ములాల్లో బ్ర‌ద‌ర్ సెంటిమెంట్ కూడా ఒక‌టి. అన్న‌ద‌మ్ముల అనుబంధం నేప‌థ్యంలో సాగే ఈ చిత్రాల్లో భావోద్వేగాలు స‌రిగ్గా పండితే చాలు.. ఆ సినిమా క‌చ్చితంగా విజ‌య‌తీరాల‌కు చేరుతుంది. ఈ విష‌యాన్ని మ‌రోసారి నిరూపించిన చిత్రం 'రంగ‌స్థ‌లం'. త‌ను ప్రాణంగా ప్రేమించే అన్నయ్య త‌న క‌ళ్ళ‌ముందే చ‌నిపోతే.. అత‌ని హ‌త్య‌కు ప్ర‌తీకారం తీర్చుకోవ‌డంతో పాటు త‌న‌ ఆశయాన్ని ఓ స్త్రీతో (రంగ‌మ్మ‌త్త‌) నెర‌వేర్చిన ఓ తమ్ముడి కథే ఈ చిత్రం. రామ్‌చ‌ర‌ణ్‌లోని న‌టుడ్ని కొత్త కోణంలో ఆవిష్క‌రించిన ఈ సినిమా.. ఈ వేస‌వి ఆరంభంలో విడుద‌లై అత‌ని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ ఫిల్మ్‌గా నిలిచింది. ఒక్క‌ చ‌ర‌ణ్ అనే కాదు.. మెగా ఫ్యామిలీకి చెందిన అగ్ర క‌థానాయ‌కులంద‌రికీ 'బ్ర‌ద‌ర్ సెంటిమెంట్' ఉన్న సినిమాలు భ‌లేగా క‌లిసొచ్చాయి. ముఖ్యంగా ప‌రాజ‌యాల్లో ఉన్న‌ప్పుడో లేదంటే స‌రైన విజ‌యం కోసం ఎదురుచూస్తున్న‌ప్పుడో మెగా ఫ్యామిలీకి ఈ బ్ర‌ద‌ర్ సెంటిమెంట్ సినిమాలు అచ్చొచ్చాయి. మ‌రో విష‌య‌మేమిటంటే.. వేస‌విని టార్గెట్‌గా చేసుకుని వ‌చ్చిన ఈ త‌ర‌హా చిత్రాలైతే.. బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. కాస్త ఆ వివ‌రాల్లోకి వెళితే..

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా ఏమిటో నిరూపించిన చిత్రాల్లో ‘గ్యాంగ్ లీడర్’ది ప్ర‌త్యేక స్థానం. బ్ర‌ద‌ర్ సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమాలో.. అన్నయ్యల క్షేమం కోసం ఆరాటపడే తమ్ముడి పాత్ర‌లో చిరు న‌ట‌న అభిమానుల్ని ఫిదా చేసింది. 'రాజా విక్ర‌మార్క‌', 'స్టూవ‌ర్ట్ పురం పోలీస్ స్టేష‌న్' వంటి వ‌రుస ప‌రాజ‌యాల త‌రువాత.. ఈ సినిమా విజ‌యం చిరుకి నూత‌న ఉత్తేజాన్నిచ్చింది. 1991 వేస‌వికి విడుద‌లైన ఈ సినిమా ఆ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకి ముందు, త‌రువాత కూడా కొన్ని బ్ర‌ద‌ర్ సెంటిమెంట్ ఉన్న చిత్రాల్లో (‘ఊరికిచ్చిన మాట’, ‘ఆలయశిఖరం’, ‘మగధీరుడు’, ‘అన్నయ్య’) చిరు సంద‌డి చేశారు.

ఇక పవన్ కల్యాణ్ విష‌యానికి వ‌స్తే.. 'పులి', 'తీన్ మార్‌', 'పంజా' వంటి మూడు ప‌రాజ‌యాల త‌రువాత విజ‌యాన్ని అందించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. చెడు దారిలో వెళ్తున్న త‌మ్ముడ్ని మార్చి.. ప్రయోజకుడిని చేసే అన్న‌గా ఇందులో సంద‌డి చేశారు ప‌వ‌న్‌. 2012 వేస‌వికి విడుద‌లైన ఈ సినిమా.. ఆ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా కంటే ముందు.. ‘తమ్ముడు’ (1999) చిత్రం కోసం అన్న‌య్య ల‌క్ష్యాన్ని నెర‌వేర్చే త‌మ్ముడిగా సంద‌డి చేసి విజ‌యాన్ని అందుకున్నారు ప‌వ‌న్‌.

మ‌రో మెగా హీరో అల్లు అర్జున్ విష‌యానికి వ‌స్తే.. అత‌ని కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ హిట్‌గా నిలిచిన ‘రేసుగుర్రం’ కూడా బ్ర‌ద‌ర్ సెంటిమెంట్‌తో కూడిన చిత్ర‌మే. 'ఇద్ద‌ర‌మ్మాయిల‌తో' వంటి బిలో యావ‌రేజ్‌ త‌రువాత బ‌న్నీ హీరోగా న‌టించిన ఈ సినిమా.. 2014 వేస‌వికి విడుద‌లై ఆ ఏడాదిలో భారీ విజ‌యం సాధించింది.

మొత్తానికి.. చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్‌.. ఇలా మెగా ఫ్యామిలీలోని అగ్ర క‌థానాయ‌కులంద‌రికి 'బ్ర‌ద‌ర్ - స‌మ్మ‌ర్ సెంటిమెంట్' బాగా వ‌ర్క‌వుట్ అయింద‌నే చెప్పాలి.                  - మ‌ల్లిక్ పైడిథ‌మ‌న్‌కి మ‌రో అవ‌కాశం

Updated By ManamMon, 10/02/2017 - 21:00

'కిక్‌', 'బృందావ‌నం', 'మిర‌ప‌కాయ్‌', 'దూకుడు', 'బిజినెస్‌మేన్‌', 'నాయ‌క్', 'రేసు గుర్రం', 'స‌రైనోడు' వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌తో తెలుగులో క్రేజీ మ్యూజిక్‌ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు థ‌మ‌న్‌. తాజాగా 'మ‌హానుభావుడు'తో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడీ యువ సంగీత ద‌ర్శ‌కుడు. నాగార్జున‌, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన 'రాజుగారి గ‌ది2'తో పాటు సాయిధ‌ర‌మ్ తేజ్ 'జ‌వాన్‌', విక్ర‌మ్ త‌మిళ చిత్రం 'స్కెచ్‌', మ‌ల్టీస్టార‌ర్ హిందీ మూవీ 'గోల్‌మాల్ ఎగైన్' చిత్రాల‌కూ థ‌మ‌న్‌నే సంగీత‌మందిస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. థ‌మ‌న్ ఖాతాలో మ‌రో మంచి ఆఫ‌ర్ చేరింది. 'ఖైదీ నెం.150' వంటి హిట్ చిత్రం త‌రువాత వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రానికి థ‌మ‌న్‌నే సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంపిక‌య్యాడు. గ‌తంలో వీరి కాంబినేష‌న్‌లో 'నాయ‌క్' వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కాగా, ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది.'సైరా' తోనైనా బ్రేక్ చేస్తాడా?

Updated By ManamFri, 09/15/2017 - 15:27

 

జ‌యాప‌జ‌యాలు అనేవి చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స‌ర్వ సాధార‌ణం. కాక‌పోతే.. ఒక్కోసారి వ‌రుస‌గా విజ‌యాలు ప‌ల‌క‌రిస్తే.. మ‌రోసారి వ‌రుస‌గా ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రిస్తాయి. అయితే ద‌ర్శ‌కుడు సురేంద‌ర్  రెడ్డి విష‌యంలో మాత్రం కొంచెం భిన్నంగా ఉంటుందీ ప‌రిస్థితి. 'కిక్' నుంచి సురేంద‌ర్ రెడ్డి సినిమాల‌ను గ‌మ‌నిస్తే.. ఓ హిట్, ఆ త‌రువాత ఫ్లాప్,  ఆ త‌రువాత మ‌ళ్లీ హిట్ .. ఇలా సినిమాకో ఫ‌లితం వ‌స్తోంది.

'కిక్' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన 'ఊస‌ర‌వెల్లి' ఫ్లాప్ అయితే.. ఆ త‌రువాత 'రేసు గుర్రం' రూపంలో హిట్ వ‌చ్చింది. మ‌ళ్లీ 'కిక్ 2' రూపంలో ఫ్లాప్. ఆ త‌రువాత వ‌చ్చిన 'ధ్రువ' హిట్‌. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం చిరంజీవి 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహా రెడ్డి' చేస్తున్న సురేంద‌ర్ రెడ్డికి..ఆర్డ‌ర్ ప్ర‌కారం మ‌ళ్లీ ఫ్లాప్ వ‌స్తుందా?  లేదంటే  ట్రాక్ రికార్డ్‌ని బ్రేక్ చేసేలా హిట్ వ‌స్తుందా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. 

Related News