AP cabinet meeting

గవర్నర్‌తో ముగిసిన చంద్రబాబు భేటీ

Updated By ManamSun, 11/11/2018 - 15:22

Chandrababu naidu, Governor narasimhan, AP cabinet meeting, Ys jagan mohan reddyఅమరావతి: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం ముగిసింది. మంత్రవర్గ విస్తరణలో భాగంగా మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించేందుకు గవర్నర్‌ ఆదివారం అమరావతికి వచ్చారు. అనంతరం చంద్రబాబు గవర్నర్‌తో భేటీ అయ్యారు. దాదాపు గంటసేపు తాజా పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. జగన్‌పై హత్యాయత్నం, సిట్‌ దర్యాప్తు, రాష్ట్రంలో బీజేపీ నేతల తీరుపై ఆయన గవర్నర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది.

తిత్లీ తుపాను కేంద్రం ఆశించిన స్థాయిలో సాయం అందించలేదన్న విషయాన్ని గవర్నర్‌ వద్ద ప్రస్తావించారు. కేంద్రం తీరును సీఎం తప్పుబట్టారు. ఏపీ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్‌కు సూచించారు. జగన్‌పై దాడి అంశంలో గవర్నర్‌ నేరుగా డీజీపీకి ఫోన్‌ చేసి నివేదిక కోరడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. 



'డీఎస్సీపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం' 

Updated By ManamTue, 09/04/2018 - 20:44

Ganta Srinivasa rao, DSC Posts, AP cabinet meetingవిజయవాడ: డీఎస్సీ పరీక్షపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఏపీ మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్సీ పోస్టులకు సంబంధించి వివరాలను సిద్ధం చేశామన్నారు. ఈనెల 6న జరిగే ఏపీ కేబినెట్ సమావేశంలో డీఎస్సీపై ఓ నిర్ణయానికి వస్తామని పేర్కొన్నారు. ట్రిపుల్‌ ఐటీలకు సంబంధించి సంబంధిత అధికారులు, డైరెక్టర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇందులో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులు, మెంటార్లు, బోధనేతర సిబ్బంది సమ్మె నోటీసు అంశంపై చర్చిస్తామన్నారు. అదేవిధంగా నూజివీడు ట్రిపుల్‌ ఐటీపై వస్తోన్న అనేక విమర్శలపైనా సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి గంటా స్పష్టం చేశారు. 





Related News