homosexuality

స్వలింగ సంపర్కం.. జన్యుపరం!

Updated By ManamTue, 09/25/2018 - 23:00
 • శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

Homosexualన్యూఢిల్లీ:  స్వలింగ సంపర్కం చివరికి అంతరించిపోతుందా? సాధారణంగా స్వలింగ సంపర్కమనే విధా నానికి ఆజ్యం పోసేది జన్యువుల ప్రభావమే నన్న విషయాన్ని మరోమారు పరిశోధకులు ధృవీకరిస్తూ సరికొత్త సమాచారాన్ని వెలుగు లోకి తెచ్చారు. భిన్న లింగాలతో పోలిస్తే స్వలింగ సంపర్కుల్లో పునరుత్పత్తి చాలా తక్కువ కనుక ఇది అంతరించిపో తుందన్న అంశం ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులను ఆలోచింపచేస్తోంది.  స్వలింగ సంపర్కాన్ని వెల్లడించే సమలక్షణం, భౌతిక లక్షణం వంటి వాటి పై పర్యావరణ కారకాలు ప్రభావం చూపుతాయని వీరు అంచనా వేశారు.  ఇందులో భాగంగా డార్విన్ ఉత్పరివర్తన సిద్ధాంతంపై కూడా శాస్త్రజ్ఞులు చర్చిస్తున్నారు.  పునరుత్పత్తి జరగనప్పుడు జన్యు సంక్రమణ సాగడం అసాధ్యమంటూ డార్విన్ సిద్ధాంతం చెబుతోంది..మరి స్వలింగ సంపర్కం లో అది సాధ్యం కాదు కనుక ఇందులో  సరికొత్త కోణం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సరైన చికిత్స అందిస్తే స్వలింగ సంపర్కాన్ని పార ద్రోలవచ్చని కూడా వీరు వెల్లడిస్తుండడం విశేషం.  అయితే జంతులో కంలో ఇది సర్వసాధారణం అని కూడా వీరు గుర్తుచేస్తున్నారు.  పెంగ్వి న్లతో పాటు పలు పక్షులు, జంతువుల్లో.. 500కు పైగా మానవేతర జీవజా లంలో ఇది అత్యంత సహజం.  కనుక ఇది అసహజమైనదనడం సరికాద ని శాస్త్రవేత్తలు గుర్తుచేస్తున్నారు.  స్వలింగ సంపర్కం ఎంతవరకు వంశపా రంపర్యంగా సంక్రమిస్తుందన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు.అంబరాన్ని అంటిన ఎల్జీబీటీల సంబరాలు

Updated By ManamThu, 09/06/2018 - 13:40
Love, Equally: Supreme Court Ends Section 377

న్యూఢిల్లీ : స్వలింగ సంప్కరం నేరం కాదంటూసుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుతో ఎల్జీబీటీల ఆనందం అంబరాన్ని అంటాయి. సెక్షన్ 377పై...ఇతరుల హక్కులను తగ్గించడం సామాజిక నైతికత కాదని, స్వలింగ సంపర్కాన్ని నేరంగా భావించడం అహేతుకం ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడిన విషయం తెలిసిందే. తాజా తీర్పుతో దేశవ్యాప్తంగా ఎల్జీబీటీలు సంతోషంతో స్వీట్లు పంచుకున్నారు. మరికొందరు డాన్సులు చేయగా,  బెలూన్స్ ఎగురవేసి ఆనందం వ్యక్తం చేసుకున్నారు. 

Love, Equally: Supreme Court Ends Section 377

మరోవైపు సుప్రీం తీర్పుకు మద్దతుగా పలువురు ప్రముఖులు ట్వీట్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ కరణ్ జోహార్... ‘ ఇది చరిత్రాత్మకమైన తీర్పు.. చాలా గర్వంగా ఉంది. దేశానికి మళ్లీ ఆక్సిజన్ అందడం ప్రారంభమైంది’ అని ట్విట్ చేశారు. అలాగే ప్రముఖ రచయిత చేతన్ భగత్, కేంద్ర మాజీమంత్రి శశిధరూర్‌, నటుడు ఆయుష్మాన్ ఖురానా తదితరులు సుప్రీం తీర్పున స్వాగతించారు.సెక్షన్ 377పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Updated By ManamThu, 09/06/2018 - 12:01
Gay sex is legal, Supreme Court rules in unanimous judgment

న్యూఢిల్లీ : సెక్షన్ 377పై సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పు వెల్లడించింది. స్వలింగ సంపర్కానికి ఉన్నత న్యాయస్థాపం చట్టబద్ధత కల్పించింది. స్వలింగ సంపర్కం నేరం కానే కాదని స్పష్టం చేసింది. ఇన్నాళ్లు వాళ్లంతా ద్వితీయశ్రేణి పౌరుల్లా దాక్కోవాల్సి వచ్చిందని, అందుకు ఈ సమాజం వారికి క్షమాపణ చెప్పాల్సిందేనని వ్యాఖ్యానించింది.

బ్రిటిష్ కాలం నాటి సెక్షన్ 377ను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. లైంగిక ధోరణి ఆధారంగా ఒకరి పట్ల వివక్ష చూపించడం అంటే.. రాజ్యాంగం వారికి ప్రసాదించిన ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర వ్యాఖ్యానించారు. తీర్పులోని ప్రధాన భాగాన్ని ఆయనే స్వయంగా చదివి వినిపించారు. ఇద్దరు వయోజనుల మధ్య పరస్పర అంగీకారంతో కూడిన లైంగిక సంబంధాలను నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377ను రద్దుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏ ఒక్క పౌరుడి ప్రాథమిక హక్కులను కాలరాయడానికీ సంఘ నీతిని ఉపయోగించకూడదని, సంఘనీతి అనే బలిపీఠంపై రాజ్యాంగ నైతికతను బలివ్వకూడదని జస్టిస్ దీపక్ మిశ్రా వ్యాఖ్యానించారు.

ఎల్‌జీబీటీ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) వర్గాన్ని వేధించడానికి ఐపీసీ సెక్షన్ 377ను ఒక ఆయుధంలా వాడుతున్నారని ప్రధాన న్యాయమూర్తి విమర్శించారు. ఈ తీర్పు విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్న మొత్తం ఐదుగురు న్యాయమూర్తులు ఏకగ్రీవంగా ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. అయితే ఐదుగురు కలిసి నాలుగు వేర్వేరు తీర్పులు వెల్లడించారు. పరస్పర అంగీకారం ఉన్న, అంగీకారం లేని లైంగిక చర్యలకు మధ్య తేడాను సెక్షన్ 377 గమనించలేకపోయిందని వారు అన్నారు. అయితే ఈ తీర్పు తర్వాత కూడా జంతువులతో సంభోగాన్ని మాత్రం నేరంగానే పరిగణిస్తున్నారు. 

నేపథ్యం ఇదీ..
బ్రిటిష్ రాజ్యంలో 1553లో రూపొందించిన బగ్గరీ చట్టం ఆధారంగా సెక్షన్ 377ను రూపొందించారు. దీని ప్రకారం ఇద్దరు మగవాళ్లు లేదా ఇద్దరు ఆడవాళ్ల మధ్య లైంగిక కార్యకలాపాలను నేరంగా పరిగణిస్తారు. 2009 సంవత్సరంలో ఒకసారి ఈ అంశం ఢిల్లీ హైకోర్టులో విచారణకు వచ్చినపుడు ఆ కోర్టు సెక్షన్ 377ను కొట్టేసింది, స్వలింగ సంపర్కం నేరం కాదని చెప్పింది కూడా. కానీ, 2013 సంవత్సరంలో మళ్లీ సుప్రీంకోర్టు ఆ తీర్పును కొట్టేసి, కేవలం పార్లమెంటు మాత్రమే చట్టాలను మార్చాలని తెలిపింది. మరోసారి ఈ అంశం 2016లో సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. 

ఎల్జీబీటీ వర్గానికి చెందిన ఐదుగురు ప్రముఖులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. వారు.. భరతనాట్య కళాకారుడు నవతేజ్ జోహార్, సాంస్కృతిక నిపుణులు అమన్ నాథ్, రెస్టారెంట్ల యజమానులు రితుదాల్మియా, ఆయేషా కపూర్, పాత్రికేయుడు సునీల్ మెహ్రా. కేసు విచారణకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేశారు. జూలై 17వ తేదీన దీనిపై వాదనలు ముగిశాయి. అప్పుడు తీర్పును వాయిదా వేశారు. 

ఆ తర్వాత మధ్యలో చాలాసార్లు ఈ చట్టాన్ని దాదాపుగా రద్దు చేయచ్చన్న మాట వినిపిస్తూనే వచ్చింది గానీ, తుది తీర్పు మాత్రం గురువారం వెల్లడైంది. ఈ విషయంలో తాము ఎలాంటి నిర్ణయం తీసుకునేది లేదని, కోర్టు విజ్ఞతకే వదిలేస్తున్నామని ఎన్డీయే ప్రభుత్వం విచారణ సమయంలో తెలిపింది. అయితే ఇలాంటి విషయాల్లో ఇచ్చే తీర్పుల వల్ల ఇక వావి వరుసలు లేని శృంగారం లాంటి విపరీత చేష్టలకు ‘భాగస్వామిని ఎంచుకునే హక్కు’ వెళ్లకూడదని సూచించింది. 

చరిత్ర క్షమాపణ చెప్పాలి
ఇంతకాలం స్వలింగ శృంగారాన్ని నేరం అని చెప్పడం ద్వారా ఎల్జీబీటీ వర్గానికి చేసిన అన్యాయానికి గాను చరిత్ర వారికి క్షమాపణ చెప్పాలని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా కోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి..

 • ప్రముఖ జర్మన్ తత్వవేత్త చెప్పినట్లు.. ‘‘నేనేంటో అదే. అందువల్ల నన్ను నన్నుగానే చూడండి’. 
 • ఒకరి పేరుకు గుర్తింపు చాలా కీలకం. రాజ్యాంగం ప్రతి ఒక్క వ్యక్తి గుర్తింపు గురించి నొక్కి చెప్పారు. వ్యక్తుల గోప్యత అనేది రాజ్యాంగ మూలసూత్రం. 
 • ఎల్జీబీటీలకు కూడా ఇతర పౌరుల్లాగే సమాన హక్కులుంటాయి. 
 • వారి లైంగిక ధోరణిని సాకుగా చూపి వివక్ష చూపితే అది వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లే. 
 • రాజ్యాంగం అనేది సజీవ పత్రం. సమాజంలోని అసమానతలు, అన్యాయంతో పోరాడేందుకు దాని వ్యావహారిక తాత్పర్యాన్ని చూసుకోవాలి.
 • ఏ ఒక్కరి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడానికి సాంఘిక నైతికతను ఉపయోగించకూడదు. సాంఘిక నైతికత అనే బలిపీఠంపై రాజ్యాంగ నైతికతను బలివ్వకూడదు.
 • అంగీకారంతో కూడిన, అంగీకారం లేని లైంగిక సంబంధాల మధ్య తేడాను గుర్తించడంలో సెక్షన్ 377 విఫలమైంది. ఎల్జీబీటీలపై వేధింపులకు అదో ఆయుధంగా మారింది, వారిపట్ల వివక్ష చూపుతోంది.
 • ఎల్జీబీటీలు కూడా గౌరవంతో జీవించే ప్రాథమిక హక్కు కలిగి ఉంటారు. అలాంటి వారికి చట్టపరమైన రక్షణ పొందే అధికారం ఉంది.
 • తమ లైంగిక ధోరణిని పూర్తిగా ప్రదర్శించే హక్కును ఎల్జీబీటీ వర్గానికి నిరాకరించడం అంటే, రాజ్యాంగం వారికి ప్రసాదించిన హక్కులను కాలరాయడమే. వారి గోప్యత హక్కును నిరాకరించడమే.
 • చరిత్ర ఎల్జీబీటీ వర్గానికి క్షమాపణలు చెప్పాల్సిందిఏ. ఇన్నాళ్లూ వాళ్లు భయంతో జీవించాల్సి వచ్చింది.

ఐపీసీ సెక్షన్ 377 అంటే..

ఐపీసీ సెక్షన్ 377... ఈ సెక్షన్ కింద ప్రకృతి విరుద్ధంగా జరిగే లైంగిక సంపర్కం నేరం. మగవాళ్ళు మగవాళ్లతో.. లేదా మహిళలు మహిళలతో శృంగారంలో పాల్గొనడం అనైతిక చర్యగా పరిగణిస్తారు. ఐపీసీ 377 సెక్షన్ కింద ‘అసహజమైన నేరాల’ (ఎవరైనా పురుషుడు, లేదా స్త్రీ, లేదా జంతువుతో అసహజ సంపర్కానికి) పాల్పడేందుకు ప్రయత్నించినా, పాల్పడినా వారికి యావజ్జీవిత జైలు శిక్ష, లేదా పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం వుంది.

దీనితో పాటు భారీ జరిమానా కూడా విధించొచ్చు. స్వలింగ సంపర్కం నేరం కిందకే వస్తుందంటూ గతంలో(2013) అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వగా.. ఇప్పుడు ఆ తీర్పును సుప్రీంకోర్టు తాజాగా సమీక్షిస్తూ చరిత్రాత్మక తీర్పునిచ్చింది.

Related News