Telangana assembly dissolution

రాజకీయ చదరంగంలో గురుశిష్యులు..! 

Updated By ManamTue, 09/18/2018 - 13:23
  • ‘శంకరుడి’ రాజకీయ పాచికలు పారేనా..? 

  • షాద్‌నగర్‌లో పొలిటికల్ గేమ్ షురూ

  • వీర్లపల్లి, కడెంపల్లిలకు ‘శంకరుడి’ అభయహస్తం 

p shankar rao play key role in next assembly elections

షాద్‌నగర్ : రాజకీయ ఓనమాలు దిద్దిన చోటే.. అగ్రగణ్య స్థాయికి చేరుకొని నాలుగుసార్లు శాసనసభకు ఎన్నికై..పలుమార్లు అమాత్యులుగా కొనసాగి..  రాష్ట్ర, దేశ స్థాయిలో సంచలనం రేకెత్తించే సంఘటనల్లో ఆయన ఓ కీలక బిందువుగా మారారు. రాజకీయాల్లో అజాతశత్రువుగా తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకొని.. రాజకీయాల్లో దూసుకుపోయారు.. నమ్ముకున్న వారి పట్ల కరుణ చూపే భోళా శంకరుడు అతను.. అదే విధంగా తన పట్ల వ్యతిరేకత వహిస్తే వారి పాలిట తాండవ శంకరుడు.. అతనే షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ పి. శంకర్‌రావు. 

1983లో షాద్‌నగర్ నియోజకవర్గంలో రాజకీయ ఓనమాలు దిద్దుకొని ఎమ్మెల్యేగా మొదటిసారి ఎంపికయ్యారు. ఇక ఆ తరువాత 1989, 99, 2004 సంవత్సరాల్లో ఆయన షాద్‌నగర్ నియోజకవర్గం నుండి అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనతను సాధించారు. ఆయన హయాంలోనే షాద్‌నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా పేరొచ్చింది.

2009లో షాద్‌నగర్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం నుండి జనరల్ కేటగిరీ కింద మారడంతో శంకర్ రావు ఇక్కడి రాజకీయాల నుండి తప్పుకున్నారు. ఆ తరువాత 2009లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి అక్కడ కూడా విజయాన్ని సొంతం చేసుకొని హ్యాట్రిక్ గెలుపులతో ఎమ్మెల్యేగా మూడుసార్లు ఎన్ని కై ప్రజల దృష్టిని ఆకర్షించారు.

అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లా కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో రాష్ట్ర జౌళిశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2009లో షాద్‌నగర్ నియోజకవర్గం నుండి శంకర్‌రావు తరువాత ఎమ్మెల్యేగా గెలిచిన  చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి కూడా శంకర్‌రావు శిష్యుడే.

అయితే కాలక్రమేణా వచ్చిన బేధాభిప్రాయాల వల్ల మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డికి, శంకర్‌రావుకు మధ్య మనస్పర్థలు ఏర్పడి వారు రాజకీయ శత్రువులుగా మారారు. ఈ క్రమంలో ప్రతాప్‌రెడ్డితో రా జకీయంగా విభేదించిన డాక్టర్ పి.శంకర్‌రావు శిష్యులు కొత్తూరు మండలానికి చెందిన కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, వీర్లపల్లి శంకర్‌లు కూడా ఆయనతోనే చెలిమై ఉన్నారు.

Telangana Congress leader Shankar Rao play key role in shadnagar constituencyఈ రాజకీయ చదరంగంలో గురుశిష్యులు డాక్టర్ పి. శంకర్‌రావు, కడెంపల్లి శ్రీనివాస్‌గౌడ్, వీర్లపల్లి శంకర్‌లు ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కీలకంగా మా రారు. టీఆర్‌ఎస్ పార్టీకి అసమ్మతి నేతగా మారిన వీర్లపల్లి శంకర్ ఇప్పుడు కీలక వ్యక్తిగా మారారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను ఆశిస్తున్న మరో యువనేత కడెంపల్లి శ్రీనివాస్‌గౌడ్ సైతం ప్రతాప్‌రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఈ మొత్తం రాజకీయ చదరంగంలో మాజీ మంత్రి డాక్టర్ పి. శంకర్‌రావు గురువు స్థానంలో పాచికలు వేస్తున్నారు. 

ఇద్దరు శిష్యులను రాజకీయాలకతీతంగా వారిని ఎప్పటికప్పుడు సమాయత్తం చేస్తున్నారు. శంకర్ రావు తాజాగా వ్యవహ రిస్తున్న శైలిని చూస్తుంటే షాద్ నగర్  కాంగ్రెస్ రాజకీయాల్లో జోక్యం చేసుకొని ప్రతాప్‌రెడ్డికి పరోక్షం గా ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారు. కాంగ్రెస్‌లో ఏకచత్రాధిపత్యంతో దూసుకుపోతున్న చౌలపల్లి ప్రతాప్ రెడ్డికిదీటుగా ఢిల్లీ స్థాయిలో శ్రీనివాస్‌గౌడ్‌ను టికెట్ కోసం పురమాయించారు. అంతే కాదు ప్రతాప్‌రెడ్డి గత ఎన్నికల్లో ఓడిపోయేందుకు ఈ గురుశిష్యుల త్రయం ముఖ్య భూమిక పోషించిందన్న విషయం అందరికి విదితమే.

తాజాగా జరుగనున్న ఎన్ని కల్లో శంకర్‌రావు శిష్యులై న కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ టికెట్‌ను ఆశిస్తుంటే.. వీర్లపల్లి శంకర్ టీఆర్ఎస్ టికెట్ను ఆశించి భంగపడ్డారు. ఒకవైపు వీర్లపల్లి శంకర్‌ను, మరోవైపు కడెంపల్లి శ్రీనివాస్‌గౌడ్‌ను రాజకీయంగా నడుపుతూ తన మార్క్‌ను ప్రదర్శిస్తున్నారు. ఏ కారణాల చేతైనా శ్రీనివాస్‌గౌడ్, వీర్లపల్లి శంకర్‌లు పార్టీ టికెట్ దక్కకపోతే వారిని స్వతంత్ర అభ్యర్థి బరిలో నిలిపేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అవసరమైతే తన శిష్యులను ఏకం చేసి ఎవరో ఒకరిని రంగంలో దింపి అటు ప్రతాప్ రెడ్డికి, ఇటు అంజయ్యయాదవ్‌కు ఝలక్ ఇవ్వాలని చూస్తున్నారు.

తన శిష్యులను ఎమ్మెల్యేలుగా చూడాలనుకుంటున్న శంకర్‌రావు అందుకు తగ్గట్టుగానే మాస్టర్‌ప్లాన్ వేసినట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో వీర్లపల్లి శంకర్ టీఆర్‌ఎస్ అసమ్మతి సభల్లో డాక్టర్ పి.శంకర్‌రావును అదే పనిగా కొనియాడుతుండడం గమనించదగ్గ అంశం. షాద్‌నగర్ నియోజకవర్గాల్లో శంకర్‌రావు మార్క్ గురించి ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు సభల్లో చెబుతుండడం ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ శంకర్‌రావు సమీకరణలు షాద్‌నగర్ నియోజక వర్గంలో ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారో వేచి చూడాల్సిందే.అసెంబ్లీ రద్దుపై పిటిషన్ కొట్టివేత

Updated By ManamWed, 09/12/2018 - 12:54

Telangana Assembly Dissolution petition dismissed by high courtహైదరాబాద్ : తెలంగాణ శాసనసభ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు బుధవారం కొట్టివేసింది. అసెంబ్లీ రద్దును సవాల్‌ చేస్తూ న్యాయవాది రాపోలు భాస్కర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం రాజ్యాంగం, చట్టాలు ఉల్లంఘించినట్లు పిటిషన్‌లో కనిపించడం లేదని పేర్కొంది. రాజ్యాంగం, చట్టాల ఉల్లంఘన జరగనప్పుడు తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టేసింది.

కాగా తెలంగాణ రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు పరిపాలించమని ప్రజలు అధికారాన్ని యిచ్చారని, కానీ, 9 నెలల కాలం ఉండగానే ముఖ్యమంత్రి సరైన కారణాలు లేకుండా ప్రభుత్వాన్ని రద్దు చేయడం దారుణమని న్యాయవాది రాపోలు భాస్కర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అసెంబ్లీని రద్దు చేయడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన పిటిషన్‌లో తెలిపారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలను నిర్వహించడం వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని భాస్కర్ ప్రస్తావించారు. ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యేంత వరకు ఎలాంటి ఎన్నికలు జరగకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో భాస్కర్ కోరారు.ప్రతిపక్షాలవి కాకిగోల...

Updated By ManamThu, 09/06/2018 - 16:07
telangana cm kcr speech in talangana bhavan

హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయ అసహనం కనిపిస్తోందని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ రద్దు అనంతరం ఆయన తొలిసారి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. అనేక త్యాగాలు, పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని, అయితే రాష్ట్రంలో రాజకీయ అసహనం కనిపిస్తోందని, అది మంచిది కాదని అన్నారు.  

ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలు అని, మైనర్ ఇరిగేషన్ పూర్తిగా ధ్వంసమైతే.. కాంగ్రెస్ సన్నాసులు పట్టించుకోలేదని విమర్శించారు. గత ఆర్థిక సంవత్సరంలో నీటిపారుదల రంగం కోసం ఖర్చు చేసింది 25 వేల కోట్లు అని అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల్లో కమీషన్లు తీసుకున్నట్లు విమర్శలు చేస్తున్నారని, ఆ విమర్శల్లో వాస్తవాలు లేవని కేసీఆర్ తేల్చిచెప్పారు. ఒక సాక్ష్యం, ఆధారం లేకుండా ప్రతిపక్షాలు ఇష్టారీతిన విమర్శలు చేయడం సరి కాదని అన్నారు.

అలాగే ప్రతిపక్షాలవి కాకిగోల అన్న కేసీఆర్... రాష్ట్ర అభివృద్ధిపై అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.  ఈ నాలుగేళ్లలో తెలంగాణ ఆర్థిక ప్రగతి 17.17 శాతం అని, ఈ అయిదు నెలల్లో  రాష్ట్ర ప్రగతి 21.96 శాతం నమోదు అయిందన్నారు.  తెలంగాణ రాష్ట్ర ప్రగతి ఆగకూడదనే తాము ముందుకు సాగుతున్నామన్నారు.  దేశంలో ఏ రాష్ట్రం సాధించని ప్రగతిని సాధించామని, తెలంగాణకు ఇప్పటివరకూ 40 అవార్డులు వచ్చాయని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అసెంబ్లీ రద్దుకు గవర్నర్ ఆమోద ముద్ర

Updated By ManamThu, 09/06/2018 - 14:55

telanganaహైదరాబాద్ : తెలంగాణ శాసనసభ రద్దు తీర్మానానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ గెజిట్ విడుదల చేశారు. అలాగే అపద్ధర్మ ముఖ్యమంత్రిగా అప్పటివరకూ కేసీఆర్ కొనసాగాలని గవర్నర్ ఈ సందర్భంగా కేసీఆర్‌ను కోరినట్లు తెలుస్తోంది. కాగా అంతకు ముందు కేసీఆర్ ...శాసనసభను రద్దు చేస్తూ మంత్రివర్గం తీసుకున్న ఏకవాక్య తీర్మాన ప్రతిని గవర్నర్‌కు అందచేశారు.

కేసీఆర్ సుమారు అరగంటకు పైగా గవర్నర్‌తో సమావేశం అయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి నేరుగా తెలంగాణ భవన్‌కు బయల్దేరి వెళ్లారు. మరోవైపు కేబినెట్ సమావేశం నిర్ణయాలను మధ్యాహ్నం 2:30 గంటలకు కేసీఆర్ మీడియాకు వెల్లడించనున్నారు. తెలంగాణ శాసనసభ రద్దు

Updated By ManamThu, 09/06/2018 - 13:25
Telangana Assembly dissolved, kcr met governor

హైదరాబాద్ :  తొమ్మిది నెలల ముందుగానే  తెలంగాణ శాసనసభ రద్దు అయింది. అసెంబ్లీని రద్దుకు సిఫార్సు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం గురువారం తీర్మానం చేసింది. మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేరుగా రాజ్‌భవన్‌కు బయల్దేరి వెళ్లారు. శాసనసభ రద్దుపై మంత్రివర్గ సిఫార్సును కేసీఆర్ ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్‌కు అందచేశారు. కాగా అసెంబ్లీ రద్దుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2:30 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు.

అంతకు ముందు ప్రగతి భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయింది. మంత్రివర్గ సమావేశానికి డిప్యూటీ సీఎంలు మహ్మద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, హరీశ్‌రావు, కేటీఆర్, జగదీశ్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, పద్మారావు, చందూలాల్, జోగు రామన్న, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Related News