telangana assembly elections

‘ముందస్తు’ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

Updated By ManamTue, 09/18/2018 - 14:22
high court

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. అలాగే ఓటర్ల సవరణ గడువు తగ్గించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం...ఎన్నికల కమిషన్ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.  ఎన్నికలు ఎలా నిర్వహించాలో ఈసీ చూసుకుంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.  మరోవైపు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని పిటిషనర్ తెలిపారు.ఢిల్లీ టు గ్రేటర్ పొలిటికల్ హీట్

Updated By ManamSat, 09/15/2018 - 14:33
 • రాజధానిలో కాంగ్రెస్, టీటీడీపీ నేతలు

 • చక్రం తిప్పుతున్న బీజేపీ నాయకులు 

 • గ్రేటర్ టు ఢిల్లీ నేతల టూర్లు

ముందస్తు ఎన్నికల యుద్ధభేరితో గ్రేటర్ రాజకీయాలు హస్తినకు చేరాయి. గ్రేటర్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను పూర్తి చేసేందుకు వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఢిల్లీలో మకాం వేశారు. టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీటీడీపీ పొత్తు పెట్టుకోవడంతో టికెట్ల కేటాయింపు ప్రక్రియ ఢిల్లీలో ఊపందుకున్నది.

ఇక బీజేపీ సైతం ఢిల్లీలోనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై చర్చించడం జరుగుతున్నది. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీజేపీ, టీటీడీపీకి చెందిన నాయకులు ఢిల్లీ నుంచి గ్రేటర్.. గ్రేటర్ టు ఢిల్లీ చక్కర్లు కొడుతున్నారు. టీఆర్‌ఎస్ మినహా ఇతర ప్రధాన పార్టీల సీట్ల కేటాయింపునకు హస్తిన కేంద్రంగా మారడం చర్చనీయాంశంగా మారింది. 

హైదరాబాద్  : రాష్ట్ర రాజకీయాలకు మరోమారు ఢిల్లీ కేంద్రంగా మారింది. మరోమారు తెలుగు రాష్ట్రానికి చెందిన టికెట్ల ఖరారు ప్రక్రియకు ఢిల్లీ కేంద్రంగా మారడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే గడచిన మూడున్నర దశాబ్దాలకాలంలో తెలుగుప్రజల ఆత్మగౌరవం పట్ల ప్రత్యేకంగా చర్చజరిగింది. తెలుగువారి హక్కుల కోసం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కొంత మేరకు ఇక్కడే నిర్ణయాధికారాలు జరుగుతున్నాయి. 

అయితే మరో మొన్నటి వరకు తెలుగు ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టాలని కోరుతూ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు ఎలుగెత్తి చాటడంతో తెలుగు ప్రజల నిర్ణయాధికారాలు తెలుగు రాష్ట్రాలలోనే జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతుండేవి. మరోమారు ఢిల్లీలో తెలంగాణలో పోటీ చేసే అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియకు వివిధ పార్టీలు ఢిల్లీలో మంతనాలు జరపడం ఆసక్తికరంగా మారింది. ఇదిలాఉండగా కేవలం టీఆర్‌ఎస్  ఓటమే లక్ష్యంగా మహాకూటమిగా ఏర్పాటైన కాంగ్రెస్, టీటీడిపి పార్టీలు తమతో పాటు సీపీఐని కలుపుకుని మహాకూటమిగా ఏర్పడిన విషయం విదితమే. 

అయితే తమతో పాటు తెలంగాణ జనసమితిని కలిసి రావాల్సిందిగా ఆహ్వానించినప్పటికి సీట్ల కేటాయింపులో భాగంగా పొత్తు కలవాలా వద్ద అన్న అంశంపై ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో 5 స్థానాలు దక్కించుకున్న బీజేపీ ఈ సారి కనీసం 10 స్థానాల్లో కాషాయం జెండా ఎగురవేయాలని సన్నాహాలు చేస్తోంది. టీటీడిపి కూడా గతంలో 10 స్థానాల్లో పాగా వేయగా ఈ సారి తమకు ఆ స్థానాలతో పాటు నగర శివారు స్థానాలను కేటాయించాలని పట్టుబడుతుండడంతో గ్రే టర్‌లో పొత్తుల్లో భాగంగా  ఏ నియోజకవర్గం ఏ పార్టీ అభ్యర్థికి వెళుతుందో ఆసక్తికరంగా మారింది.

ఢిల్లీ రాజకీయాలు...
ముందస్తు ఎన్నికల్లో దూకుడు పెంచే ప్రయత్నంలో భాగంగా టీపీసీసీ నేతలు శుక్ర వారం తమ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీని కలిసి టీటీడిపితో పొత్తుల అంశంపై చర్చించారు.  తెలంగాణలో ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తోందని అందులో భాగంగా పార్టీ నాయకులు ఐకమత్యంగా పనిచేయాలని సూచించారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి ప్రతీ ఒక్కరూ పార్టీ గెలుపు కొరకు కష్టపడి పనిచేయాలని సూచించారు.ఖచ్చితంగా గెలిచే స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే పోటీ చేయాలని పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పొత్తులో భాగంగా కలిసి వచ్చే పార్టీ అభ్యర్థులకు టికెట్లు కేటాయించాలని ఆదేశించారు. 

దీంతో గ్రేటర్‌లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరికి టికెట్లు వస్తాయో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గ్రేటర్‌లో బీజేపీ స్థానాలతో రెండు అసెంబ్లీ స్థానాలు మినహాయించి మిగతా అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదున్న టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు ధీటుగా మహాకూటమి అభ్యర్థులు ఉంటారా లేదా అన్న చర్చ ఇప్పుడు గ్రేటర్‌లో జోరందుకుంది. గత  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే స్థానంలో కూడా గెలుపొందకపోవడంతో ఈ సారి మెజార్టీ స్థానాల్లో పాగా వేసేందుకు ఆ పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 

కదనోత్సాహంతో కషాయదళం..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి ఈ సారి రాష్ట్ర ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే టీఆర్‌ఎస్ ముందంజలో ఉండగా బీజేపి శనివారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభం చేయనుంది. ఇందులో భాగంగానే కషాయదళాధిపతి అమిత్‌షా శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి కావడంతో కమల శ్రేణులు జోష్‌తో ఉన్నారు. 

గతసారి ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపి గ్రేటర్‌లో 5 స్థానాలు దక్కించుకోగా ఈ సారి కనీసం 10 స్థానాల్లో పాగా వేయాలని అధినాయకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. టీఆర్‌ఎస్, మహాకూటమి అభ్యర్థులు బరిలో ఉన్న చోట అంతకంటే ఫాలోయింగ్ ఉన్న నాయకులను తమ పార్టీ తరపున పోటీలో ఉంచాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగానే నియోజకవర్గానికో మెనిఫెస్టోను తయారు చేస్తూ ప్రజల్లోనికి వెళ్లేందుకు ఆ పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

సందిగ్ధంలో టీజేఎస్...
గ్రేటర్‌లో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతుండగా ఒక్క తెలంగాణ జనసమితి మాత్రం తాము ఏ పార్టీతో జత కలవాలన్న దానిపై ఇంకా నిర్ణయానికి రాలేదు. ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన కోదండరాం ఎన్నికల సమయంలో తన సొంత పార్టీ విషయంలో ఎటూ తేల్చుకోలేక పోవడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

విద్యార్థుల్లో ఎక్కువ పట్టున్న కోదండరాం గ్రేటర్‌లో  ఏ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారా అన్న అంశంపై ఇప్పుబు అన్నీ వర్గాల్లో చర్చ జరగుతోంది. మొత్తం మీద అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలోనికి దూకేందుకు సిద్ధం అవుతుండడంతో గ్రేటర్‌లో పొలిటికల్ హీట్ నెలకొంది. ఏదేమైనా టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ఢిల్లీలో కాంగ్రెస్, టీటీడీపీ సీట్ల కేటాయింపులు.. అభ్యర్థుల ఎంపికకు బీజేపీ అధినేతలు చర్చలు జరుపుకోవడం చర్చనీయాంశంగా మారింది.  ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ సంతృప్తి..

Updated By ManamFri, 09/14/2018 - 17:47
 Election Commission CEO Rajat Kumar press meet

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి వ్యక్తం చేసిందని  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితాలోని అభ్యంతరాలన్ని పరిష్కరిస్తామని  పేర్కొన్నారు.  ఓటరు జాబితాలతో పోలింగ్ బూత్‌ల వారీగా విభజన జరుగుతుందని తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పలు సూచనలు చేసిందని అన్నారు.

ఆరు నెలల్లోగా ఎన్నికల నిర్వహించాలనే నిబంధన ఉందని, ఈవీఎం మిషన్లు రాగానే వాటిని అన్ని రాజకీయ పార్టీల సమక్షంలోనే పరిశీలిస్తామని రజత్ కుమార్ తెలిపారు. ఈసారి ఎన్నికల్లో వీవీప్యాట్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నామని, ఈవీఎంలపై ఎలాంటి అనుమానాలు వద్దని అన్నారు. ఈ నెల 20లోగా రాష్ట్రానికి కావాల్సిన ఈవీఎంలు వస్తాయని, అలాగే 52వేల బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతుందన్నారు.

ఇక ఎన్నికల సందర్భంగా నగదు పంపిణీ చేయకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, అభ్యర్థుల ఎన్నికల ఖర్చును క్షుణ్ణంగా పరిశీలిస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా సోషల్ మీడియాతో ఎన్నికల ప్రచారంపై నిఘా ఉంటుందన్నారు.  అలాగే మీడియా మానిటరింగ్ కమిటీ కూడా ఉంటుందని అన్నారు.

అలాగే ఓటర్లను చైతన్యపరిచేందుకు తమ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టిందని రజత్ కుమార్ తెలిపారు. ప్రతి గ్రామంలోనూ ప్రజలను చైతన్య పరిచేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈ నెల 15, 16వ తేదీల్లో గ్రామస్థాయిలో పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాపై ఉన్న అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరిస్తామని చెప్పారు.తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ

Updated By ManamFri, 09/14/2018 - 13:54

Congress forms screening committe for Telangana assembly electionsన్యూఢిల్లీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణకు స్క్రీనింగ్ కమిటీకి భక్త చరణ్‌‌దాస్ ఛైర్మన్‌గా, సభ్యులుగా జ్యోతిమణి సెన్నిమలై, శర్మిష్ట ముఖర్జీని నియమిస్తూ రాహుల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ తెలంగాణలో  సీట్ల సర్థుబాట్లు, అభ్యర్థుల ఎంపికపై  దృష్టి పెట్టనుంది.

రాహుల్‌తో ముగిసిన భేటీ
కాగా అంతకు ముందు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, అభ్యర్థుల ఎంపిక, అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై చర్చించారు. భేటీ అనంతరం తెలంగాణ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ... పొత్తుల విషయంలో రాహుల్ దిశానిర్ధేశం చేశారని తెలిపారు. పొత్తును తాము వ్యతిరేకించలేదని, అయితే తమ అభిప్రాయాలు తెలిపామన్నారు. అందరూ సమిష్టిగా పనిచేసి పార్టీని గెలిపించాలని రాహుల్ సూచించినట్లు తెలిపారు. 

అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని రాహుల్ గాంధీ సూచించినట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే మీడియాలో ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయరాదని, ఏదైనా ఉంటే పార్టీ సభల్లోనే మాట్లాడాలని సూచన చేశారన్నారు.

అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సుమారు 15 నిమిషాలు పాటు రాహుల్‌తో ఏకాంతంగా చర్చలు జరిపారు. గ్రూప్‌లు వీడి ఒకరికొకరు సహకరించుకోవాలని రాహుల్ సూచించినట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని తాము నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 105 అభ్యర్థులకు కేసీఆర్ ఫోన్?

Updated By ManamFri, 09/14/2018 - 13:29

kcr phone call to party condidates

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు, అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్.... టికెట్లు కేటాయించిన 105 మంది అభ్యర్థులతో ఫోన్‌లో మాట్లాడారు. గురువారం సాయంత్రం ఆయన ఒక్కో అభ్యర్థితో నాలుగు నిమిషాలు పాటు ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదుపై దృష్టి సారించాలని కేసీఆర్ ఈ సందర్భంగా సూచించినట్లు సమాచారం. 

అలాగే బూత్ కమిటీల నియామకాలతో పాటు, పార్టీ నేతలందరితో సమన్వయంతో పని చేసుకోవాలని గులాబీ బాస్ పేర్కొన్నట్లు తెలుస్తుంది. అలాగే ప్రచారన్ని ముమ్మరం చేయాలని సూచించడంతో పాటు,  ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తులను బుజ్జగించే బాధ్యత తామే తీసుకుంటామని కేసీఆర్... అభ్యర్థులకు భరోసా ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఈ నెల 2వ తేదీన రంగారెడ్డి జిల్లా కొంగరకొలాన్ ‘ప్రగతి నివేదన సభ’లో కేసీఆర్ 105మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.అమిత్ షా వచ్చిన తర్వాతే...

Updated By ManamWed, 09/12/2018 - 18:22
 • కుటుంబ పాలనను ఓడించాలి

 • గ్రామాల్లో బీజేపీలో భారీ చేరికలు

 • ఎన్నికల షెడ్యూల్ తర్వాతే అభ్యర్థుల ప్రకటన

 • బీజేపీ తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి

bjp leader kishan reddy comments on party condidates list

హైదరాబాద్ : గత కొన్ని రోజలుగా అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంలో మునిగిపోయాయి. కానీ బీజేపీ మాత్రం తమకేం తొందర లేదని, ముందెళ్లిన పార్టీలు తొందరగా అలసిపోతాయని ఆ పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ వంటి కుటుంబ పార్టీలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నాలుగేండ్ల తర్వాత ఫ్రంట్ పెడతామని టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్న వారసత్వ రాజకీయాలకు బుద్ధిచెప్పాలని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వచ్చిన తర్వాతనే ఏ పార్టీతోనైనా చర్చలు, పొత్తులు ఉంటాయని ప్రకటించారు.

కేంద్రంలో బీజేపీ పథకాలను చూసి గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున యువత చేరుతోందని తెలిపారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని నష్టపోయినట్టు పేర్కొన్నారు. చుట్టు పక్కల రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, తెలంగాణలోనూ బీజేపీనే గెలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ తీసుకువస్తున్న ఫ్రంట్‌ల‌తో టెంట్లతో తమకేమీ నష్టం లేదని విమర్శించారు. తెలంగాణలో తమ హామీలపై వస్తున్న విమర్శలను చూసి టీఆర్‌ఎస్ భయపడి ముందస్తు ఎలక్షన్స్ పెట్టిందని విమర్శించారు.

అసోంలో చివరి మూడు రోజుల్లో తీర్పు మారిందని, ఆంధ్రలో కూడా వారం రోజుల ముందు జగన్ ముందున్నప్పుటికీ మోదీ పర్యాటనతో టీడీపీ గెలిచిందని వివరించారు. తెలంగాణలో చేయాల్సిన కార్యచరణపై బహిరంగ సభలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. అమిత్ షా సభ తర్వాత తెలంగాణలో బీజేపీలో మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థులను ముందుగానే ప్రకటించబోమని, ఎన్నికల షెడ్యూల్ తర్వాతే బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.శివార్లపైనే టీడీపీ టార్గెట్!

Updated By ManamMon, 09/10/2018 - 13:37
 • సెక్యూలర్ ఓట్లు రాబట్టే యత్నం...

TDP eyes to sweep city outskirts of hyderabad seats in Telangana assembly elections

హైదరాబాద్ : గత ఎన్నికల్లో మంచి ఫలితాలను రాబట్టిన టీడీపీ ఈసారి కూడా ఎన్నికల్లోను సత్తా చాటాలనుకుంటోంది. తమ అభ్యర్థులపై ఇప్పటికే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ వర్గాలకు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తెలంగాణ టీడీపీకి ఇప్పటికీ మంచి పట్టు ఉన్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. టీడీపీలో పోటీ చేసి గెలిచిన వారు పార్టీ వీడి పోయినా కార్యకర్తల బలం తగ్గలేదని సమాచారం.

కాంగ్రెస్, టీడీపీతో పొత్తుకు ఇరు వర్గాల నుంచి సానుకూల స్పందనలు వస్తున్నాయి. ఇరు పార్టీలు కలిసి పోటీ చేసినా నగర శివార్లలో మాత్రం తమ పార్టీకే మంచి మద్దతు ఉన్నదని టీడీపీ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నగర శివారుల్లో తమ పార్టీ అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలని కోరనుంది.

గత ఎన్నికల్లో ఎల్‌బినగర్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్రానగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నంలలో విజయం సాధించింది. గెలిచిన అభ్యర్థులు పార్టీలు మారినా ఓట్లు మాత్రం ప్రజల్లో టీడీపీకే సానుకూల స్పందన ఉన్నట్టు సమాచారం. 

ఎక్కువ శాతం సెక్యూలర్ ఓట్లు ఉన్నందున తమ పార్టీ అభ్యర్థులనే నిలబెట్టేందుకు టీడీపీ సిద్ధమైంది. మహేశ్వరం నియోజకవర్గంలో దేవేందర్‌గౌడ్‌కు గట్టి పట్టు ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శేరిలింగంపల్లిలోనూ బలమైన క్యాడర్ ఉందని ఇక్కడ గతంలో టీడీపీ అభ్యర్థి పోటీ చేసి విజయం సాధించడంతో తమ అభ్యర్థినే నిలబెట్టేందుకు సన్నద్దమవుతోంది.

ఉప్పల్‌లో గత ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించాడని, ఇక్కడ నుంచి కూడా తమ అభ్యర్థిని బరిలోకి దించ నున్నట్టు సమాచారం. కూకట్‌పల్లిలోనూ టీడీపీకి మంచి పట్టు ఉందని, తమ అభ్యర్థికే ఇక్కడి నుంచి టికెట్ కేటాయించేలని పార్టీ వర్గాలు కాంగ్రెస్‌ను కోరనున్నట్టు సమాచారం.

ఇబ్రహీంపట్నంలో గత ఎన్నికల్లో మంచి మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గెలవడంతో ఇప్పటికీ అక్కడ పార్టీ బలంగా ఉందని, తమ అభ్యర్థి తప్పనిసరిగా పోటీ చేస్తాడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజేంద్రనగర్, ఎల్‌బీ నగర్‌లోనూ టీడీపీకి మంచి పట్టు ఉందని, ఇక్కడి నుంచి కూడా తమ అభ్యర్థికే టికెట్ ఆశిస్తున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

గత ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన తమ పార్టీ నుంచి గెలిచిన నేతలు వలస వెళ్లినా క్యాడర్ బలంగా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లోనూ తమకే అధికంగా సీట్లు వస్తాయని ఆశిస్తున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.అవసరమైతే చంద్రబాబు ప్రచారం..

Updated By ManamSun, 09/09/2018 - 16:38
L ramana comment on telangana assembly elections

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అవసరం అయినచోట టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గొంటారని టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ తెలిపారు. ఆదివారం తెలంగాణ టీడీపీ నేతల భేటీ ముగిసిన అనంతరం ఎల్ రమణ మీడియాతో మాట్లాడారు. ‘పొత్తులు, సీట్ల కేటాయింపు విషయంలో కొంచెం ఇబ్బంది అయినా పట్టువిడుపులు ఉంటాయి. 

కాంగ్రెస్ సహా కలిసివచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని సూచించాం. పొత్తులపై మా ప్రతిపాదనకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. నిర్ణయాలు తీసుకునే పూర్తి స్వేచ్ఛ అధినేత  మాకు ఇచ్చారు. కాంగ్రెస్‌తో పొత్తుపై టీడీపీ శ్రేణులు అర్థం చేసుకుంటారు. అవసరం అయితే చంద్రబాబు ప్రచారంలో పాల్గొంటారు’ అని ఆయన తెలిపారు.

కాగా ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ టీడీపీ ఆదివారం మూడు కమిటీలు ఏర్పాటు చేసింది. ఎన్నికల సమన్వయ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ప్రచార కమిటీలను నియమించింది.  ఎన్నికల సమన్వయ కమిటీలో ఎల్. రమణ, దేవేందర్ గౌడ్, రావుల, నామా నాగేశ్వరరావు, రేవూరి, పెద్దిరెడ్డి, మండవను నియమించగా, మేనిఫెస్టో కమిటీలో దేవేందర్ గౌడ్, రావుల చంద్రశేఖర్, బి. నర్సింహులు, అలీ మస్కటి, శోభారాణిని నియమించారు. అలాగే ప్రచార కమిటీల నియామకంలో గరికపాటి, సండ్ర , కొత్తపేట, అరవింద్ కుమార్ గౌడ్, లక్ష్మణ్ నాయక్ రమావత్‌ నియమితులయ్యారు.కుత్బుల్లాపూర్‌లో ఈసారి హోరాహోరేనా...?

Updated By ManamSun, 09/09/2018 - 15:25
 •  కుత్బుల్లాపూర్‌లో రాజుకుంటున్న ముందస్తు వేడి..!

 •  ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్న ఎమ్మెల్యే అభ్యర్థులు

 •  తెరాస నుండి తాజా మాజీ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ పేరును ప్రకటించిన కేసీఆర్  

 •  ఇంటింటికీ శ్రీశైలంగౌడ్ పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి మాజీ ఎమ్మెల్యే కూన  

 •  తెరాస రెబల్ బరిలో కొలన్ హన్మంత్‌రెడ్డి

 • టీడీపీ నుండి పోటికి సిద్దమవుతున్న బూర్గుబావి హన్మంత్‌రావు

 • బీజేపీ నుండి డాక్టర్ ఎస్. మల్లారెడ్డి, చెరుకుపల్లి భరతసింహ్మరెడ్డి..

 • పోత్తుకు సై అంటున్నా వామపక్షాలు

telangana assembly elections: Reddy for the tough fight in Quthbullapur Constituencyకుత్బుల్లాపూర్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రాజకీయవేడి వాడివేడిగా రాజుకుంటుంది. ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీచేసే అశావాహులు అధిష్టానం చుట్ట్టూ చక్కర్లు కోడుతూ టికెట్ ల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రధానంగా టీఆర్‌ఎస్, కా్రంగెస్, తెరాస రెబల్ అభ్యర్థి మధ్యనే గట్టి పోటీ ఉంటుందని రాజాకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇటీవల టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసిన 105 మంది తెరాస శాసనసభ అభ్యర్థుల జాబితాల్లో తాజా మాజీ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ పేరును ఖారారు చేయడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలుతూ ఆయనకు ఆభినంధనలు తెలిపేందుకు క్యూ కట్టారు. 

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తెరాస అభ్యర్థిగా వివేకానంద్ పేరును ప్రకటించడంతో ఇతర పార్టీల నుండి పోటీచేసే అభ్యర్థులకు  తమ పార్టీల నుండి టికెట్ దక్కుతుందో లేదోననే  టెన్షన్ అశావాహుల్లో మొదలైంది. గత 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ నుంటి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని అతితక్కువ మెజార్టీతో ఓటమి చెందిన కొలను హన్మంత్‌రెడ్డికి రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుండి పోటీచేసే అవకాశం దక్కకపోవడంతో నిరాశకు గురైన ఆయన ఇటీవల ఆయన వర్గీయులతో, అనుచరులతో సమావేశమై తెరాస నుండి రెబల్ అభ్యర్థిగా పోటీచేసేందుకు బరిలోకి దిగ డానికి సిద్దమైనట్లుగా ఆయన స్పష్టం చేశారు.

దీంతో టీఆర్‌ఎస్ పార్టీ నుండి కె.పి.వివేకానంద్, టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థిగా కొలన్ హన్మంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేయడానికి సిద్దమవడంతో టీఆర్‌ఎస్ పార్టీ ఓట్లు చీలే అవకాశముందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కె.ఎం. ప్రతాప్ కుడా తెరాస రెబల్‌గా పోటీచేసేందుకు సిద్దమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఇక మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ తన క్యాడర్‌తో సమావేశాలు ఏర్పాటుచేసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కా్రంగెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యక్తలకు దిశానిర్ధేశం చేస్తూ పోటీకి సై అంటున్నాడు.గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసేందుకు టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి బూర్గుబావి హన్మంత్‌రావు సిద్దమవుతున్నారు. 

ఇక బీజేపీ విషయానికి వస్తే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్. మల్లారెడ్డి, నియోజకవర్గం నాయకులు చెరుకుపల్లి భరతసింహ్మరెడ్డి సైతం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసేందుకు టికెట్ కోసం ముమ్మర ప్రయత్నం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.ఇక వామపక్ష నాయకులు పోటీకి సై అంటారా..లేక ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారా అనేది వేచి చూడాలి.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కా్రంగెస్, టీడీపీ పోత్తు పెట్టుకుని బరిలోకి దిగితే టీఆర్‌ఎస్‌కు కష్టంగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. ఏది ఏమైన్నప్పటికీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి ఎవరెవరూ ఎమ్మెల్యే అభ్యర్థలుగా పోటీచేయనున్నారో..పోటీచేస్తే ప్రధాన పోటీలో గెలిచేదెవరో వేచి చూడాలిమంచిరెడ్డి..ముచ్చటగా మూడోసారి..

Updated By ManamSun, 09/09/2018 - 15:14

mla manchireddy kishan reddy

ఇబ్రహీంపట్నం:  తెలంగాణ రాష్ట్ర సమితి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిత్వానికి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీంతో స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రచారాన్ని షురూ చేశారు. అందరూ అనుకున్నట్లుగానే తెరాస అధినేత కేసీఆర్ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేరును ఖరారు చేస్తూ మొదటి అభ్యర్థుల జాభితాను విడుదల చేశారు.

దీంతో ఇబ్రహీంపట్నంపై మరో మారు పాగా వేసేందుకు మం చిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదివరకే రెండు మార్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా గెలుపొందిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి నియోజకవర్గంపై గట్టి పట్టుంది. కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఇబ్రహీంపట్నంలో గత 2009 ఎన్నికల్లో మహాకూటమితో బరిలోకి దిగిన మంచిరెడ్డి ఎమ్మెల్యేగా మొదటి సారి గెలుపొందారు. 

ఆ తరువాత 2014 ఎన్నికల్లో రాష్ట్రమంతటా తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నా తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశ్, కాంగ్రెస్ రెబెల్ మల్‌రెడ్డి రంగారెడ్డి, తెరాస నుండి పోటీలో ఉన్న కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డిలకు గట్టి షాక్ ఇస్తూ మరోమారు శాసనసభకు ఎన్నికయ్యారు.

mla manchireddy kishan reddy contest in mla

తెలంగాణ రాష్ట్ర సమితి నుండి అభ్యర్థి పోటీలో ఉన్నప్పటికి ఈ ప్రాంతంలో తెదేపా అభ్యర్థిగా గెలుపొందారంటే ఆయన చరిష్మా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ నుండి గెలుపొందినప్పటికి ప్రస్తుతం తెరాసలో ఉండి నియోజ కర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, సమస్యల పరిష్కారానికి కృషి చేశారని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేరు సంపాధించారు.

దీంతో తెరాస అధిష్టానం కూడా ఆయన పేరునే ఖరారు చేసింది. అనుకున్నట్లుగానే ఆయనే ఇక్కడి నుండి తెరాస అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఇప్పుడే ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల నియోజకవర్గ పరిధిలోని యాచారం మండలం నందివనపర్తి గ్రామం నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ముచ్చటగా మూడో సారి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పాగా వేసేందుకు కలిసివచ్చే అంశాలపై దృష్టి పెట్టారు.

Related News