telangana assembly elections

11న తెలంగాణకు ఈసీ ప్రతినిధులు

Updated By ManamFri, 09/07/2018 - 18:26
Election Commission team to visit Telangana

న్యూఢిల్లీ : తెలంగాణ శాసనసభ రద్దు అయిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై అంచనా వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలోని ఎన్నికల నిర్వహణపై ఈ బృందం అంచనా వేసి ఓ నివేదిక ఇవ్వనుంది.  

సీనియర్ డిప్యూటీ కమిషనర్ ఉమేశ్ సిన్హా ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రతినిధి బృందం హైదరాబాద్ రానుంది. నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈసీ బృందం అధ్యయనం చేయనుంది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఇవాళ సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యారు.

గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన తెలంగాణ ప్రతిపక్షాలు
మరోవైపు తెలంగాణలోని ప్రతిపక్షాలు గవర్నర్ నరసింహన్ అపాయింట్‌మెంట్ కోరాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను కొనసాగించవద్దని గవర్నర్‌కు విజ్ఞప్తి చేయనున్నాయి.. టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్‌లతో కూడిన అఖిలపక్షం గవర్నర్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికలపై వారంలో నిర్ణయం!

Updated By ManamFri, 09/07/2018 - 16:35
CEC OP Rawat breaks his silence over telangana elections

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలో, లేదో అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ ఓపీ రావత్‌ స్పష్టం చేశారు. దీని సాధ్యాసాధ్యాలపై సమగ్రంగా చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని, దానికి వారం సమయం పట్టవచ్చని అన్నారు. 

అలాగే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి నుంచి నివేదిక వచ్చాకే ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం కాకుండా ఎవరూ ప్రకటించకూడదన్నారు. అయితే నేతలే ఎన్నికల తేదీలను ప్రకటించడం దురదృష్టకరమన్న రావత్ ... ఎవరో చెప్పిన జోస్యానికి...ఈసీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్, మిజోరాం సహా నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు తెలంగాణలో కూడా ఎన్నికలు నిర్వహించాలంటే అందుకు తగిన ఏర్పాట్లను సమీక్షించాల్సి ఉంటుందని ఓపీ రావత్ పేర్కొన్నారు. చట్టంలో ఈ విషయంపై ప్రత్యేకంగా ఎలాంటి నిబంధనా లేదని, దీనిపై 2002లో రాష్ట్రపతి సుప్రీం కోర్టు అభిప్రాయం కోరగా.. అసెంబ్లీ రద్దయినప్పుడు ఎన్నికలు త్వరగా జరపాలని అత్యున్నత న్యాయస్థానం సూచించిందన్నారు. 

ఎందుకంటే ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఆయాచిత ప్రయోజనంపొందేలా ఆరు నెలల పాటు అధికారంలో ఉండకూడదని సూచించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటామని రావత్‌ స్పష్టం చేశారు. అలాగే జమిలి ఎన్నికలైతే పార్లమెంట్‌తో పాటే తెలంగాణ అసెంబ్లీకి జరిగేవని, ఏప్రిల్‌ 2019లో అవి జరగాల్సి ఉందన్నారు. కానీ ఇప్పుడు ఆ వాదనకు అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు.  తెలంగాణలో ముందస్తుపై ఈసీ కీలక వ్యాఖ్యలు

Updated By ManamFri, 09/07/2018 - 14:19
Elections in Telangana might not necessarily be held along with other four states

న్యూఢిల్లీ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం అసెంబ్లీ రద్దయితే వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, ఆరు నెలల పాటు ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ మాట్లాడుతూ.. నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు తెలంగాణలోనూ ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తామని  తెలిపారు. రద్దైన అసెంబ్లీకి మొదటి ప్రాధాన్యంలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు.   

మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ శుక్రవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో భేటీ కానున్నారు. తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీతో ఆయన సమావేశం అవుతారు. అలాగే ఈరోజు సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం భేటీ జరుగనుంది. నాలుగు రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలపై సీఈసీ చర్చించనుంది. కాగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలో ఈ ఏడాది డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.ఎమ్మెల్యే అభ్యర్థులకు కేసీఆర్ దిశా నిర్దేశం.. 

Updated By ManamThu, 09/06/2018 - 20:34

KCR, Telangana Assembly elections, TRS MLA candidates, 105 MLA candidates, Election campaignహైదరాబాద్: తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశం ముగిసింది. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ప్రకటించిన 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి వారితో కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తోంది. తమ ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు వివరిస్తూ అభ్యర్థులంతా ప్రచారంలో భాగంగా ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి 105 మంది అభ్యర్థులకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. హుస్నాబాద్‌ బహిరంగ సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. టీఆర్‌ఎస్ సీనియర్ నేత కేశవరావు ఆధ్వర్యంలో మెనిఫెస్టో కమిటీ త్వరలోనే పార్టీకి సంబంధించిన మెనిఫెస్టోను అందజేస్తుందని తెలిపారు.

‘‘రేపటి నుంచి ప్రజల్లోకి వెళ్లండి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ఖాళీ చేయండి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. టికెట్ వచ్చిందని గర్వపడొద్దు. నియోజకవర్గంలోని అన్ని స్థాయిలో నేతలను కలుపుకొనిపోవాలి. ప్రతీ నియోజకవర్గంలోకి వస్తా. ఒక్కోరోజు రెండు మూడు నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుంది. అసంతృప్త నేతలుంటే మీరే బుజ్జగించాలి. ప్రతి నియోజకవర్గంలో ఫీడ్ బ్యాక్ తీసుకుంటా. ప్రచారంలో అలసత్వం ప్రదర్శిస్తే నాకు సమాచారం వస్తుంది. మరో సమావేశంలో కలుద్దాం’’ అని అభ్యర్థులకు కేసీఆర్ సూచనలు చేశారు. 15 రోజుల తర్వాత జిల్లాల వారీగా కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. మళ్లీ గజ్వేల్ నుంచే కేసీఆర్...

Updated By ManamThu, 09/06/2018 - 16:22
KCR to contest from Gajwel Constituency In Assembly Election

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గజ్వేల్ నుంచే పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన మెదక్ జిల్లా గజ్వేల్ నుంచే పోటీ చేసిన విషయం తెలిసిందే. కాగా 2014సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ నుంచి ఎంపీగా, గజ్వేల్‌ నుంచి ఎమ్మెల్యేగా కేసీఆర్ గెలుపొందారు. ఆ తర్వాత ఆయన ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు.

అయితే థర్డ్ ఫ్రంట్ పేరుతో ప్రాంతీయ పార్టీలను కూడగట్టుకుంటున్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళతారనే ప్రచారం జోరుగా జరిగింది. దీంతో ఆయన వచ్చే ఎన్నికలోల కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగుతారనే వార్తలు వెలుపడ్డాయి. చివరకూ గులాబీ అధినేత ఎక్కడ నుంచి పోటీకి దిగుతారనే దానిపై క్లారిటీ ఇవ్వడంతో ఇటువంటి ఊహాగానాలకు తెరపడిటనట్లు అయింది.బాబూ మోహన్‌కు షాక్

Updated By ManamThu, 09/06/2018 - 15:28
Telangana CM KCR Given Big Shock to mla Babu Mohan

హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా ఆందోల్‌ శాసనసభ్యుడు బాబూ మోహన్‌కు ఎన్నికల ముందే షాక్ తగిలింది.  బాబూ మోహన్‌కు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గురువారం వెల్లడించారు. కాగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి దామోదర రాజనర్సింహపై దాదాపు నాలుగువేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.

అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సర్వేలో ఎమ్మెల్యే బాబూ మోహన్‌కు మైనస్ మార్కులు పడటంతో పాటు, ఆయన నియోజకవర్గంలోని కార్యకర్తలతో పాటు, సమస్యలు పట్టించుకోవడంతో గట్టి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కాగా గతంలో కేసీఆర్ నిర్వహించిన సర్వేలో బాబూ మోహన్‌కు పాస్ మార్కులు కూడా రాకపోవడంతో ఆయనను పిలిచి హెచ్చరించినా ఫలితం లేకపోయింది. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఆంధోల్ నియోజకవర్గ అభ్యర్థిగా జర్నలిస్ట్  క్రాంతి కుమార్ పేరును కేసీఆర్ ప్రకటించారు. 

కాగా తెలంగాణ అసెంబ్లీ రద్దు అయిన రోజే కేసీఆర్...  105మంది పార్టీ అభ్యర్థులను ప్రకటించడం విశేషం. అలాగే  చెన్నూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన నల్లాల ఓదేలు కూడా చుక్కెదురు అయింది. ఆయనకు కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ లభించలేదు. 

Related News