photo feature

క్లిక్‌మనిపిస్తే..

Updated By ManamFri, 09/07/2018 - 00:08

imageఅటు ఫోటోగ్రఫీని, ఇటు తనలో దాగిన కళను రెండిటినీ సమన్వయ పరుస్తూ రఘు మందాటి  ప్రొఫెషనల్ గా దూసుకుపోతున్నారు. ఫోటోగ్రఫీతో పాటు డిజిటల్ చిత్రాలు వేయడం, సాహిత్యం మీద మక్కువతో రచనలు చేయడం, ప్రకృతిని ఆరాధించడం తన అభిరుచులు. ఓ కళతో తాను ఆధరణ పొందటమే కాకుండా పదిమందికి పనికల్పించడం రఘూలో ఉన్న మరో ప్రత్యేకత. ఫోటోగ్రఫీనే వృత్తిగా ప్రవృత్తిగా స్వీకరించిన రఘు మందాటితో ఈ వారం మిసిమి ముచ్చట్లు....

చిన్నతనంలో పుట్టినరోజుకో, పెళ్ళికో ఫోటో తీయించుకోవాలంటే చాలా ప్రయాసతో కూడిన పనిగా ఉండేది. మరిప్పుడో కాదే సందర్భమూ ఫోటోకి అనర్హము అన్నట్టు తయాైరెంది. ప్రతీ సందర్భాన్ని కెవెురాలో బంధించుకుని చూసి మురిసిపోతున్నాం. ఫోటోలు అందరూ తీస్తారు. కానీ వాటిలో జీవాన్ని, జవాన్ని నింపి చూపగలిగే వారు కొందరే ఉంటారు. ఫోటో అనేది మన జ్ఞాపకాల పొదరిల్లుకు జీవం పోసేది. మరిలాంటి ఫోటో జీవితాంతం మన జ్ఞాపకాల్లో పదిలంగా దాచుకోవాలంటే దానికి ఒకప్పుడు ఏమోగానీ ఇప్పుడు మాత్రం చాలా సులుైవెపోయింది. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ చేతిలో తమ వేడుకను పెడితే చాలు దివి భువికి దిగి వచ్చిందా అన్నంత  ఆశ్చర్యాన్ని మన కళ్ళల్లో నింపి మొత్తం వేడుకను రూపొందిస్తున్నారు.

image


వరంగల్‌లో పుట్టాను. చదువంతా అక్కడే జరిగింది. హైదరాబాద్‌కి డిగ్రీ చదువుతుండగా వచ్చాను. వరంగల్‌లో చదువుతున్నప్పుడే ఐడియాలో పని చేసాను. అదే జాబ్ లో హైదరాబాద్ లోనూ చేరాను. తరువాత కొద్ది కాలానికి మల్టీ నేషనల్ కంపెనీలో అవకాశం వచ్చింది. అప్పుడే ఫోటోగ్రఫీ కళమీద ఆసక్తి కలిగింది. దీనితో పాటు సినిమా, రచనైవెపు కూడా దృష్టి పెట్టాను. చిన్న పోకెట్ కెమెరా పట్టుకుని ఖాళీ దొరికితే ప్రకృతి వైపు పరుగులు పెట్టేవాడిని. నేను తీసిన ఫోటోకి బహుమతిని అందుకున్నాకా, ఇంకా బలంగా ఫోటోగ్రఫీ మీద ప్రేమ బలపడింది. తీసిన ఫిల్మ్  డెవలెప్ చేయించడానికి నాదగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఆ నెగిటివ్‌లోనే  రంగుల్లో  ఫోటో ఏలా ఉంటుందో ఊహించుకునే వాడిని. తరువాత చిన్నగా డబ్బులు పోగుచేసుకున్నాకా నాలుగు నెలలకు ఫింట్ వేయించి వాటిని చూసుకుని మురిసిపోయెువాడిని. ఫోటో తీయడమే కాదు, ప్రకృతిలో అందాలను చూపించడంలో మరో కోణాన్ని చూడసాగాను.

 ఫోటోగ్రఫీకి సంబంధించి కొన్ని గ్రూపుల ద్వారా ఫేస్ బుక్, ట్విట్టర్‌లలో వారితో పరిచయంతో పాటు వర్క్ పరంగా మంచి సలహాలను తీసుకునే వాడిని. ప్రతివారం గ్రూపు సభ్యులం అందరం ఏదో ఒక చోట కలిసేవారం. తెలియకుండానే ఓ కొత్తప్రపంచం వచ్చి నన్ను హత్తుకున్నట్టు ఉండేది. హైదరాబాద్‌లోనే కాకుండా చుట్టుపక్కల యాత్రకు వెళ్ళి అక్కడి దృశ్యాలను కూడా కెవెురాలో బంధించేవాడిని. 

నెమ్మదిగా నా ఫోటోగ్రఫీ కళపై ఆసక్తి కొనసాగుతుండగానే, ఇటు నా ఊరు, చిన్ననాటి జ్ఞాపకాలను పేపరుపై పెట్టడం imageమొదలుపెట్టాను. అలా నాకు తెలియకుండానే నాలో దాగున్న రచయిత మేలుకున్నాడు. రాసిన వాటిని నా ఫేస్ బుక్ వాల్ మీద పెట్టేవాడిని. అవి చదివిన స్వర్ణగారని, ఆమె డాక్టర్. తను నా జ్ఞాపకాలను పుస్తక రూపంలోకి చెస్తానని అన్నారు. అలా నా కథలన్నీ కలిపి జ్ఞాపకాల గొలుసు పుస్తకం వెలువడింది. కొంత కాలానికి నెమ్మదిగా ఉద్యోగం వదిలి ఫుల్ టైం ప్రొఫిషనల్ ఫోటోగ్రాఫర్‌గా నిలదొక్కుకున్నాను. అప్పుడే బాంబేలో ఓ కల్చర్ మొదైలెంది. వెడ్డింగ్ నంతా ఓ వీడియోలో మూడు నుండీ నాలుగు నిముషాల పాటు కుదించి వెడ్డింగ్ హైలెట్స్ లా వీడియో చేయడం. ఇది మన హైదరాబాద్ లో నేనూ ప్రారంభించాను. యూట్యూబ్‌లో పెడితే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదే నా కెరియర్ ప్రారంభానికి నాంది. రెండు మూడేళ్ళలో 200 పెళ్ళిళ్ళకు వర్క్ చేసాను. అప్పటినుండీ  నాతో కొందరిని కలుపుకుని ఓ సంస్థను స్థాపించాను. అదే  మెమరీ మేకర్స్. ఫోటోగ్రఫీతో సంస్థద్వారా  చాలా ప్రదేశాలు చుట్టి వచ్చాము. అందులో నాకు చాలా ఆనందం కనిపిస్తుంది. 

Related News