New Popular Oscar Category

ఆ కేటగిరిని వాయిదా వేసిన ఆస్కార్

Updated By ManamFri, 09/07/2018 - 14:43

Oscar అంతర్జాతీయ అకాడమీ అవార్డ్స్‌ ఆస్కార్‌లో ఇటీవల చేర్చిన ఔట్‌స్టాండింగ్ ఎచీవ్‌మెంట్ ఇన్ పాపులర్ ఫిలిం కేటగిరిని వాయిదా వేశారు. ఎలాంటి విమర్శలు లేకుండా బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన చిత్రానికి గానూ ఈ అవార్డును ఇవ్వాలని అనుకున్నారు. రానున్న ఆస్కార్ అవార్డ్స్ కార్యక్రమంలో ఈ కేటగిరీని పెట్టాలనుకున్నారు. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీంతో ఈ కేటగిరిని వాయిదా వేస్తున్నట్లు ఆస్కార్ ఫిలిం అకాడమీ అధ్యక్షుడు జాన్ బైలీ వెల్లడించారు.

ఈ మధ్య కాలంలో మంచి కాన్సెప్ట్‌లతో వస్తున్న సినిమాలకు గుర్తింపు ఇవ్వడానికే ఈ కేటగిరీని పెట్టామని, చాలామందికి ఆ కేటగిరీకి ఉన్న విలువ అర్థం చేసుకోలేకపోయారని జాన్ ఈ సందర్భంగా తెలిపారు.

Related News