Jagga reddy

జైలు నుంచి జగ్గారెడ్డి విడుదల..

Updated By ManamMon, 09/24/2018 - 19:23
  • గాంధీభవన్‌లో మీడియా సమావేశం.. 

Jagga reddy, Bail release, Chanchalguda jail, Gandhi bhavan, KCRహైదరాబాద్: మానవ అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. సోమవారం న్యాయస్థానం జగ్గారెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే తప్పుడు కేసు పెట్టారని విమర్శించారు. ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేయడమే తాను చేసిన నేరమని, రాజకీయ కక్ష సాధింపుతోనే తనను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

కక్ష సాధింపుతో 14ఏళ్ల నాటి కేసును తిరగదోడారని అన్నారు. ఈ కేసులో నిర్దోషిగా బయటికి వస్తానన్న నమ్మకముందని జగ్గారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలపై ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పా? అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బతీయడమే కేసీఆర్ లక్ష్యమని జగ్గారెడ్డి విమర్శించారు. 



పోలీసుల కస్టడీకి జగ్గారెడ్డి

Updated By ManamWed, 09/19/2018 - 14:47
jaggareddy

హైదరాబాద్ :  మానవ అక్రమ రవాణా కేసులో చంచల్ గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న జగ్గారెడ్డిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ కోర్టు జగ్గారెడ్డిని మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. భారీ బందోబస్తు నడుమ కోర్టు ఆదేశాలతో ఆయనను మార్కెట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.



మూడురోజులపాటు పోలీస్ కస్టడీకి జగ్గారెడ్డి

Updated By ManamTue, 09/18/2018 - 17:09
Court grants police custody of jagga reddy

హైదరాబాద్ : కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి సికింద్రాబాద్ కోర్టు అనుమతిచ్చింది. నకిలీ పాస్‌పోర్టు, మనుషుల రవాణా తదితర కేసులలో ఆరోపణలు ఎదుర్కుంటున్న జగ్గారెడ్డిని తమ కస్టడీకి అనుమతించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే జగ్గారెడ్డిని కస్టడీకి అనుమతించరాదని ఆయన తరఫు న్యాయవాది కూడా పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సికింద్రాబాద్ కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతి మంజూరు చేసింది.

కాగా 2004లో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన భార్య నిర్మల, కుమార్తె జయలక్ష్మి, కుమారుడు భరత్‌సాయిరెడ్డి పేర్లతో గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబానికి నకిలీ పాస్‌పోర్టులు సృష్టించి.. అమెరికాకు తీసుకెళ్లారనే అభియోగాలతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.



జగ్గారెడ్డిపై 8 సెక్షన్ల కింద కేసులు

Updated By ManamTue, 09/11/2018 - 12:49

Jagga Reddyహైదరాబాద్: మానవ అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎనిమిది సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ కేసులో సోమవారం అర్ధరాత్రి జగ్గారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు డీసీపీ కార్యాలయంలో 3గంటల పాటు ఆయనను విచారించారు. అనంతరం ఐపీసీ 419, 490, 467, 468, 471, 370, పాస్ పోర్ట్ యాక్ట్ సెక్షన్ 12, ఇమ్మిగ్రేషన్ యాక్ట్ 24 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. కాగా కాసేపట్లో గాంధీ ఆసుపత్రిలో జగ్గారెడ్డికి వైద్యపరీక్షలు నిర్వహించనున్న పోలీసులు, అనంతరం కోర్టులో హాజరుపర్చనున్నారు.



అక్రమంగా రవాణా చేసేందుకు జగ్గారెడ్డి డబ్బులు తీసుకున్నారు

Updated By ManamTue, 09/11/2018 - 11:12

Sumathiహైదరాబాద్: కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారన్న ఆరోపణలు నార్త్‌జోన్ డీసీపీ సుమతి కొట్టివేశారు. భార్య, పిల్లల పేరుతో ముగ్గురిని జగ్గారెడ్డి అక్రమంగా అమెరికాకు తీసుకెళ్లారని సుమతి అన్నారు. భార్య, పిల్లలంటూ జగ్గారెడ్డి నకిలీ సర్టిఫికేట్లతో పాస్ట్‌పోర్టులు పొందారని సుమతి తెలిపారు. ఆధార్ డేటా ఆధారంగా కేసును చేధించామని, ముగ్గుర్ని అమెరికా తీసుకెళ్లడానికి రూ.15లక్షలు తీసుకున్నారని సుమతి అన్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.5లక్షలు తీసుకున్నట్లు జగ్గారెడ్డి ఒప్పుకున్నారని సుమతి పేర్కొన్నారు. 2004లో జగ్గారెడ్డి ముగ్గురిని విదేశాలకు అక్రమంగా పంపించారని.. ఇమ్మిగ్రేషన్, పాస్‌పోర్టు యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని చెప్పారు. సోమవారం జగ్గారెడ్డి మీద వచ్చిన ఫిర్యాదుపై నిశితంగా దర్యాప్తు చేశామని సుమతి వెల్లడించారు.



జగ్గారెడ్డి అరెస్ట్.. ఉద్రిక్తత!

Updated By ManamFri, 09/07/2018 - 14:40
  • ప్రజల ఆవేదన సభకు అనుమతి నిరాకరణ

  • జగ్గారెడ్డి సహా వంద మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

  • ఆయన అనుచరులకు, పోలీసులకు మధ్య తోపులాట

Jagga reddy, 100 party supporters, Prajala avedhana sabha, Police హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను వ్యతిరేకిస్తూ విపక్షాలు కన్నెర్ర చేశాయి. ‘ప్రగతి నివేదన సభ’ తరహాలో ‘ప్రజల ఆవేదన సభ’ను నిర్వహించేందుకు సన్నద్దమయ్యాయి. ఈ నేపథ్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సంగారెడ్డి గంజి మైదాన్‌లో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ‘ప్రజల అవేదన సభ నిర్వహించ తలబెట్టారు. అందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో గంజి మైదాన్‌‌కు వెళ్లేందుకు జగ్గారెడ్డి యత్నంచిగా పోలీసులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులకు, జగ్గారెడ్డి అనుచరులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు జగ్గారెడ్డితో పాటు వంద మందిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హస్నాబాద్‌లో కేసీఆర్ సభకు అనుమతి ఇచ్చిన పోలీసులు.. తమ సభకు ఎందుకు అనుమతి ఇవ్వరంటూ మండిపడ్డారు. పోలీసులు ఇంకా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడం దారుణమన్నారు. 





Related News