Ys Jagan mohan reddy

జగన్‌పై మండిపడ్డ ఎమ్మెల్యే అనిత

Updated By ManamWed, 11/14/2018 - 10:23

YS Jagan, Anithaతిరుపతి: జగన్ చేస్తున్న కోడి కత్తి డ్రామాను ఏపీ ప్రజలందరూ గమనిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనిత ప్రతిపక్షనేత జగన్‌పై విరుచుకుపడ్డారు. పోలీసు విచారణకు వైఎస్ జగన్‌ సహకరించకుండా చంద్రబాబుపై విమర్శలు చేయడం దారుణమని ఆమె మండిపడ్డారు. ఏడాది కాలంగా జగన్ చేస్తున్న ప్రజా సంకల్పయాత్రకు ఏపీ పోలీసులే రక్షణ కల్పించారని అనిత గుర్తు చేశారు. అయితే ఏపీ పోలీసులపై నమ్మకం లేదని జగన్ చెప్పడం దారుణమని ఆమె అన్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. పవిత్రమైన తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం దారుణమని చెప్పారు. కొండపై రాజకీయాలు మాట్లాడేవారిపై ఏపీ ప్రభుత్వం, టీటీడీ చర్యలు తీసుకోవాలని అనిత వ్యాఖ్యానించారు.వైసీపీలో చేరిన రామచంద్రయ్య

Updated By ManamTue, 11/13/2018 - 12:52
Ramachandraiah

విజయనగరం: బద్ధశత్రువైన టీడీపీతో జతకట్టినందుకు అలకబూనిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య ఆ పార్టీని వీడిన వీడి, వైఎస్సార్‌సీపీ పార్టీలో చేరారు. విజయనగరం జిల్లాలో ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన రామచంద్రయ్య, ఆ పార్టీ తీర్థం తీసుకున్నారు. ఈ సందర్భంగా రామచంద్రయ్యను ఆలింగనం చేసుకొని, కండువాను కప్పి సాధరంగా తన పార్టీలోకి ఆహ్వానించారు జగన్ మోహన్ రెడ్డి. రామచంద్రయ్య రాకతో వైఎస్సార్ జిల్లాలో పార్టీ మరింత బలపడుతుందని వైఎస్సార్‌సీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.వైఎస్సార్ సీపీలోకి కొండా సిద్ధార్థ

Updated By ManamMon, 11/12/2018 - 14:39
  • చంద్రబాబు సొంతజిల్లాలో టీడీపీకి షాక్

konda siddhartha joins ysr congress party

విజయనగరం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీలో కీలక నేతలు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. సుమారు 40 ఏళ్లుగా టీడీపీలోఉన్న కొండా కుటుంబం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది.   మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, తంబాలపల్లి సమన్వయ కర్త ద్వారాకనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పీటీఎం మండలం (పెద్దతిప్ప సముద్రం) ఎంపీపీ కొండా గీతమ్మ, కొండా సిద్ధార్థ అనుచరులు పార్టీలో చేరారు.

చిత్తూరు జిల్లా ప్రజలే కాదు...
ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబు పాలనను చిత్తూరు జిల్లా ప్రజలే కాదు... విలువలున్న టీడీపీ కుటుంబాలు నమ్మడం లేదు. కొండా కుటుంబం టీడీపీ ని వీడిందంటే..చంద్రబాబు ఎంత ఘోరంగా వ్యవహరిస్తున్నారా అర్థమవుతుంది. జగన్‌పై హత్యాయత్నం జరిగినా చాలా హుందాగా వ్యవహరించారు. చంద్రబాబులా పబ్లిసిటీ కోసం పాకులాడకుండా.... ప్రజలు సంయమనం పాటించేలా ప్రవర్తించారు. పాదయాత్రలో టీడీపీ మోసాలు ప్రజలకు తెలిసి వస్తున్నాయి. అందుకే వైఎస్సార్ సీపీలో కీలక నేతలు అంతా చేరుతున్నారు.’ అని అన్నారు.

అందుకే రాజీనామా చేశాం..
కొండా సిద్ధార్థ మాట్లాడుతూ... టీడీపీలో ఎన్టీఆర్ స్థాపించిన విలువలేవి లేవు. 40 ఏళ్లుగా టీడీపీలో ఉన్న మేము అందుకే రాజీనామా చేసాం. జగన్ పోరాటం, పాదయాత్రను చూసి అండగా నిలవాలని నిర్ణయించాం. టీడీపీలో నిజమయిన నాయకులకు, కార్యకర్తలకు విలువలేదు అని వ్యాఖ్యానించారు. ద్వారకనాథరెడ్డి నాయకత్వాన్ని తామంతా బలపరచి, వైఎస్‌ జగన్‌‌ని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా కృషి చేస్తామని తెలిపారు.

konda siddhartha joins ysr congress party

బీసీ నేతలు చేరిక..
మరోవైపు పాప‌య్య‌వ‌ల‌స వ‌ద్ద వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో  మార్గాని నాగేశ్వ‌ర‌రావు, మార్గాని భ‌ర‌త్‌.  రాజ‌మండ్రికి చెందిన బీసీ సంఘం నేతలు, జేఏసీ నేత‌లు, శెట్టిబ‌లిజ‌, గౌడ‌, ఈడిగ నేత‌లు పార్టీలో చేరారు.జగన్ పాదయాత్రకు భారీ భద్రత

Updated By ManamMon, 11/12/2018 - 12:17

Jagan Mohan Reddyఅమరావతి: దాదాపు 17రోజుల విరామం తరువాత ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రను ప్రారంభించారు. విజయనగరం జిల్లా మక్కువ మండలం పాయకపాడు నుంచి జగన్ తన పాదయాత్రను పున:ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జగన్‌కు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీస్ సెక్యురిటీ, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రీన్, బ్లూ, రెడ్ విభాగాలుగా సెక్యూరిటీని విభజించారు. జగన్‌ను కలుసుకోవాలనుకునే వారి కోసం రెడ్ కార్డులను ఇష్యూ చేశారు. అలాగే జగన్‌ను అనుసరించే ఎమ్మెల్యేలు, నేతలు, ఇతర సిబ్బందికి బ్లూ కార్డులు, బందోబస్తులో ఉన్న పోలీసులకు గ్రీన్ కార్డులను ఇచ్చారు. కాగా కేసు విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు వస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే.విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్

Updated By ManamSun, 11/11/2018 - 19:34

Ys Jagan mohan reddy, Vizag airport, YSRCP, Jagan Padayatraవిశాఖ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు వద్ద జగన్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జగన్ విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి ప్రజాసంకల్పయాత్రను పునఃప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా రోడ్డుమార్గంలో విజయనగరం జిల్లా మక్కువకు జగన్ బయల్దేరారు. గత నెల 25న వైఎస్‌ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకోవడంతో పాదయాత్రకు విరామం ప్రకటించారు. వైఎస్ జగన్‌ వెంట వైఎస్సార్‌ సీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మిథున్‌ రెడ్డి తదితరులు ఉన్నారు. గవర్నర్‌తో ముగిసిన చంద్రబాబు భేటీ

Updated By ManamSun, 11/11/2018 - 15:22

Chandrababu naidu, Governor narasimhan, AP cabinet meeting, Ys jagan mohan reddyఅమరావతి: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం ముగిసింది. మంత్రవర్గ విస్తరణలో భాగంగా మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించేందుకు గవర్నర్‌ ఆదివారం అమరావతికి వచ్చారు. అనంతరం చంద్రబాబు గవర్నర్‌తో భేటీ అయ్యారు. దాదాపు గంటసేపు తాజా పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. జగన్‌పై హత్యాయత్నం, సిట్‌ దర్యాప్తు, రాష్ట్రంలో బీజేపీ నేతల తీరుపై ఆయన గవర్నర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది.

తిత్లీ తుపాను కేంద్రం ఆశించిన స్థాయిలో సాయం అందించలేదన్న విషయాన్ని గవర్నర్‌ వద్ద ప్రస్తావించారు. కేంద్రం తీరును సీఎం తప్పుబట్టారు. ఏపీ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్‌కు సూచించారు. జగన్‌పై దాడి అంశంలో గవర్నర్‌ నేరుగా డీజీపీకి ఫోన్‌ చేసి నివేదిక కోరడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. రేపటి నుంచి జగన్ యాత్ర ప్రారంభం

Updated By ManamSun, 11/11/2018 - 10:18

YS Jagan Mohan Reddyఅమరావతి: ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర సోమవారం నుంచి పున: ప్రారంభమవ్వనుంది. గత నెల 25న విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిలో గాయపడిన జగన్.. పాదయాత్రకు విరామం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నందున సోమవారం నుంచి తిరిగి పాదయాత్రను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘరాం తెలిపారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని మక్కువ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభమవ్వనుందని తెలిపారు. అయితే పాదయాత్ర సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎడమ చేతిని ఎవరూ తాకకుండా చూసుకోవాలని, సాధ్యమైనంత వరకూ ఆ చేతిని పైకి లేపే ప్రయత్నం చేయవద్దని డాక్టర్లు జగన్‌కు తెలిపారు. ఈ మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే గాయం పూర్తిగా మానేందుకు సమయం పడుతుందని వారు హెచ్చరించారు. 12 నుంచి జగన్ ప్రజాసంకల్పయాత్ర

Updated By ManamSat, 11/10/2018 - 12:05
ys Jagan mohan reddy To Resume Padayatra From Nov 12

హైదరాబాద్ :  కత్తిదాడి నుంచి కోలుకుంటున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరిగి ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించనున్నారు. ఆయన ఈ నెల 12వ తేదీ నుంచి పాదయాత్రను చేపట్టనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శనివారం అధికారికంగా ఓ లేఖను విడుదల చేశారు. కాగా విశాఖ విమానాశ్ర‌యంలో గ‌త నెల 25వ తేదీన వైఎస్ జగన్‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిన నేప‌థ్యంలో వైద్యులు ఆయ‌న‌కు చికిత్స జ‌రిపి విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించడంతో పాద‌యాత్ర‌కు విరామం ప్రకటించారు.

గాయం నుంచి కోలుకున్న వైఎస్ జగన్ ముందుగా ప్ర‌క‌టించిన విధంగా ఇచ్చాపురం వ‌ర‌కు త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగించాల్సి ఉన్నందున విరామం అనంత‌రం సోమ‌వారం నుంచి విజ‌య‌న‌గ‌రం జిల్లా సాలూరు నియోజ‌క‌వ‌ర్గం మ‌క్కువ నుంచి పాద‌యాత్ర పునః ప్రారంభించనున్నారు.జగన్, పవన్‌లపై వర్ల రామయ్య కామెంట్స్ 

Updated By ManamThu, 11/08/2018 - 20:00

Varla Ramaiah, Ys Jagan mohan reddy, Pawan Kalyanవిజయవాడ: వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే జోగి రమేశ్ వంద రెట్లు బెటర్ అని ఏపీ ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య విమర్శించారు. వ్యవస్థను గౌరవించి స్టేషన్‌కు హాజరయ్యారని ఆయన ప్రశంసించారు. గురువారం వర్ల రామయ్య విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినే పవన్ కల్యాణ్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ పరిణితి లేని నాయకుడు.. రాతి నేలపై నాటిన మొక్కలాంటివాడని దుయ్యబట్టారు.

ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాకు పవన్ అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీ విలీనం తప్పనిపించలేదా? అని ప్రశ్నించారు. కోడి కత్తి డ్రామా రక్తి కట్టించి జగన్ రెస్టు తీసుకున్నాడని వర్ల విమర్శించారు. బీజేపీకి మానసపుత్రుడు గాలి జనార్ధన్ రెడ్డి అని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.  జగన్ కోలుకోవాలని.,

Updated By ManamWed, 11/07/2018 - 10:13

Balarajuఅమరావతి: ఇటీవల విశాఖపట్నం విమానాశ్రయం శ్రీనివాసరావు అనే వ్యక్తి చేతిలో దాడికి గురైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోలుకోవాలని కోరుతూ ఓ మాజీ ఎమ్మెల్యే మోకాళ్లపై గుడి మెట్లు ఎక్కారు.  పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ రాష్ట్ర ఎస్టీ విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గుబ్బల మంగమ్మతల్లి ఆలయానికి వెళ్లి జగన్ కోలుకోవాలని మొక్కుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జగన్‌కు ఏమీ కాదని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, కోట్లాది తెలుగు ప్రజలు జగన్‌కు తోడుగా ఉన్నారని తెలిపారు.

Related News