Ys Jagan mohan reddy

12 నుంచి జగన్ ప్రజాసంకల్పయాత్ర

Updated By ManamSat, 11/10/2018 - 12:05
ys Jagan mohan reddy To Resume Padayatra From Nov 12

హైదరాబాద్ :  కత్తిదాడి నుంచి కోలుకుంటున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరిగి ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించనున్నారు. ఆయన ఈ నెల 12వ తేదీ నుంచి పాదయాత్రను చేపట్టనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శనివారం అధికారికంగా ఓ లేఖను విడుదల చేశారు. కాగా విశాఖ విమానాశ్ర‌యంలో గ‌త నెల 25వ తేదీన వైఎస్ జగన్‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిన నేప‌థ్యంలో వైద్యులు ఆయ‌న‌కు చికిత్స జ‌రిపి విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించడంతో పాద‌యాత్ర‌కు విరామం ప్రకటించారు.

గాయం నుంచి కోలుకున్న వైఎస్ జగన్ ముందుగా ప్ర‌క‌టించిన విధంగా ఇచ్చాపురం వ‌ర‌కు త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగించాల్సి ఉన్నందున విరామం అనంత‌రం సోమ‌వారం నుంచి విజ‌య‌న‌గ‌రం జిల్లా సాలూరు నియోజ‌క‌వ‌ర్గం మ‌క్కువ నుంచి పాద‌యాత్ర పునః ప్రారంభించనున్నారు.జగన్, పవన్‌లపై వర్ల రామయ్య కామెంట్స్ 

Updated By ManamThu, 11/08/2018 - 20:00

Varla Ramaiah, Ys Jagan mohan reddy, Pawan Kalyanవిజయవాడ: వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే జోగి రమేశ్ వంద రెట్లు బెటర్ అని ఏపీ ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య విమర్శించారు. వ్యవస్థను గౌరవించి స్టేషన్‌కు హాజరయ్యారని ఆయన ప్రశంసించారు. గురువారం వర్ల రామయ్య విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినే పవన్ కల్యాణ్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ పరిణితి లేని నాయకుడు.. రాతి నేలపై నాటిన మొక్కలాంటివాడని దుయ్యబట్టారు.

ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాకు పవన్ అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీ విలీనం తప్పనిపించలేదా? అని ప్రశ్నించారు. కోడి కత్తి డ్రామా రక్తి కట్టించి జగన్ రెస్టు తీసుకున్నాడని వర్ల విమర్శించారు. బీజేపీకి మానసపుత్రుడు గాలి జనార్ధన్ రెడ్డి అని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.  జగన్ కోలుకోవాలని.,

Updated By ManamWed, 11/07/2018 - 10:13

Balarajuఅమరావతి: ఇటీవల విశాఖపట్నం విమానాశ్రయం శ్రీనివాసరావు అనే వ్యక్తి చేతిలో దాడికి గురైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోలుకోవాలని కోరుతూ ఓ మాజీ ఎమ్మెల్యే మోకాళ్లపై గుడి మెట్లు ఎక్కారు.  పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ రాష్ట్ర ఎస్టీ విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గుబ్బల మంగమ్మతల్లి ఆలయానికి వెళ్లి జగన్ కోలుకోవాలని మొక్కుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జగన్‌కు ఏమీ కాదని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, కోట్లాది తెలుగు ప్రజలు జగన్‌కు తోడుగా ఉన్నారని తెలిపారు.చంద్రబాబు బొమ్మ ఎలా వేస్తారు?

Updated By ManamTue, 11/06/2018 - 13:29
Anam Ramanarayana Reddy

హైదరాబాద్ : రాష్ట్రంలో నారాసుర రాజకీయ పాలనా వధ జరిగితే ప్రజలు నిజమైన దీపావళి జరుపుకుంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘తిత్లీ తుపానును కూడా చంద్రబాబు నాయుడు తన స్వార్థానికి వాడుకున్నారు. నష్టపరిహారం చెక్కులపై చంద్రబాబు బొమ్మ ఎలా వేస్తారు. తుపానులు వస్తే సంక్షోభంను కూడా తన స్వార్థానికి వాడుకునే వ్యక్తి. హుద్ హుద్ తుపాను, తిత్లీ తుపాను వస్తే నీ స్వార్థానికి వాడుకున్నావు. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి వ్యవస్థలను వాడుకుంటున్నారు.

చంద్రబాబు తన స్వార్థానికి ఎంతమందిని బలి చేస్తారు. డీజీపీని అడుగుతున్నా. ఆపరేషన్ గరుడ గురించి చెప్పిన శివాజీని ఎందుకు పిలిపించి ప్రశ్నించలేకపోతున్నావ్. ప్రభుత్వాల్నే కూల్చివేస్తానని పబ్లిక్‌గా చెబుతున్న వ్యక్తిని ఎందుకు అడగలేకపోతున్నారు. నీ ఇంటెలిజెన్స్ డీజీ, సిబ్బందిని ఎక్కడకు పంపారు. తెలంగాణలో ఎన్నికలలో వాళ్లు పనిచేస్తున్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏమైంది. నీ వైఫల్యం వల్ల ఎమ్మెల్యే బలయ్యారు. 

ప్రతిపక్షపై దాడి అనేది ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదా? పోలీస్ నిఘా వ్యవస్థలు ఏమయ్యాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీసు కేసులు పెడతావా? వ్యవస్థలను వాడుకోవడంలో చంద్రబాబును మించినవారు లేరు. జాతీయ పార్టీలను నువ్వు కూడగట్టడం ఏంటి?. వాళ్లే కూటమిగా ఏర్పడి యూపీఏగా ఉంటే ...నేనే కూడగట్టాను అంటూ నీ పచ్చమీడియా ద్వారా డబ్బా కొడుతున్నావు. వారి అవసరం కోరి నువ్వు వెళ్లావు. వాళ్లతో భాగస్వామి
అవడానికి వెళ్లేవే తప్ప. నీ అదుపాజ్ఞలలో ఉండటానికి వారు సిద్దంగా లేరు.

2019 ఎన్నికలలో నారాసుర రాజకీయ వ్యవస్దను కూల్చేందుకు ప్రజలు సిద్దమై ఉన్నారు. నీవు చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయావు. రాష్ర్టానికి మూలాధారమైన ఆర్థిక వ్యవస్దను నిర్వీర్యం చేశావు. నీవు, నీ ఆర్థికమంత్రి కలసి వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారు.  రాష్ర్ట సంక్షోభంలో నీ సంక్షేమం చూసుకున్నావు. ఒకటిన్నర లక్షల అప్పుచేసి నీవు చేసిందేమిటి. వైఎస్సార్ ఏ ప్రాజెక్ట్‌లైతే తీసుకువచ్చి ప్రాజెక్ట్‌లు ప్రారంభించారో వాటిని ఏమైనా పూర్తి చేశావా. కాంట్రాక్టర్లకు, నీ కుటుంబానికి లబ్దిచేకూర్చేలా చేసుకున్నావు తప్పితే రాష్ట్రానికి ఒరిగిందేమి లేదు.  త్వరలో జరగబోయే ఎన్నికలలో నారాసుర రాజకీయ భూస్దాపితం జరుగుతుంది. 

జగన్ ఏ ప్రాంతానికి వెళ్లిన ప్రజాదరణ కనిపిస్తోంది. ఆయన నాయకత్వంలోనే ప్రజలు భవిష్యత్తులో నిజమైన దీపావళి జరుపుకుంటారు. జగన్‌పై దాడి జరిగిన నిముషాలలోనే ఆ అంశాన్ని తక్కువచేసి చూపే ప్రయత్నం చంద్రబాబు, డీజీపీ ప్రారంభించారు.  డీజీపీ ఇరవై నిముషాలలోనే, కేసు సివిల్ పోలీసుకు హ్యాండోవర్ కాకముందే దాడి జగన్ అభిమాని చేశారు అని ప్రకటించారు. దళితుడు చేశాడు అని వివరాలు చెప్పేశారు. ఆ తర్వాత కొద్దిగంటలకు ముఖ్యమంత్రి, హోంమంత్రి వల్లె వేశారు. ఇదంతా  కుట్రపూరితంగా చేశారని తెలిసిపోతుంది.

రిమాండ్ రిపోర్ట్ లో హత్యాయత్నం అని చెప్పినా ఇప్పటికీ దానిపై దుష్ర్పచారం చేస్తున్నారు. అందుకే మేం నిష్పాక్షిక విచారణ కోరుతున్నాం.  కుట్రలో ప్రధాన భాగస్వామి చంద్రబాబునాయుడు. రెండో కుట్రదారుడు డీజీపీ ఠాగూర్, మూడో కుట్రదారుడు హోంమంత్రి తర్వాత ఆయన మంత్రివర్గ సహచరులు. ఆ తర్వాత ఆపరేషన్ గరుడ అని వ్యవస్థకు శ్రీకారం చుట్టిన కుట్రదారులందర్ని విచారించాల్సిన అవసరం ఉంది.

పోలీసు యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది. ముఖ్యమంత్రి తీరు గురివింద తన నలుపు ఎరగదు అన్నట్లు ఉంది.  బీజేపీతో అంటకాగింది, హోదా వద్దు ప్యాకేజి ముద్దు అన్నది చంద్రబాబు. హోదా కావాలని జగన్ అసెంబ్లీలో అడిగితే హోదా వద్దు ప్యాకేజి కావాలని తీసుకుని ధన్యవాద తీర్మానం పెట్టారు. యుటర్న్‌లు తీసుకుని పబ్బం గడుపుకుంటున్న నీవు ఇతర పార్టీలను ఎలా విమర్శిస్తావు.’ అని సూటిగా ప్రశ్నించారు.జగన్‌ ‘ప్రజా సంకల్ప యాత్ర’కు ఏడాది 

Updated By ManamTue, 11/06/2018 - 08:55

 

YS Jagan Mohan Reddy

అమరావతి: ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏడాది పూర్తి అయ్యింది. 2017 నవంబర్ 6న వైఎస్సార్ జిల్లా ఇడుపుల పాయ వద్ద జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. ఈ ఏడాదిలో 11జిల్లాలను పూర్తిచేసిన జగన్.. 12వ జిల్లాలో యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు 122 నియోజవర్గాలు, 205మండలాల్లో పాదయాత్రను పూర్తిచేశారు. అలాగే 113 బహిరంగసభలు, 42చోట్ల ముఖాముఖిలను చేపట్టారు జగన్.

అయితే ఓ కేసు విచారణ నిమిత్తం గత నెల 25న హైదరాబాద్‌కు బయల్దేరిన జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. శ్రీనివాసరావు అనే వ్యక్తి కోడి పందేలకు ఉపయోగించే కత్తితో జగన్‌పై దాడి చేయడంతో ఆయన చేతికి గాయం అయ్యింది. దీంతో ఆయన విశ్రాంతి తీసుకుంటుండగా.. ఈ నెల 10 నుంచి పాదయాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. కాగా పాదయాత్రలో జగన్ ఇప్పటివరకు 3211.5కిలోమీటర్లు నడిచారు జగన్.

ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నా:వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
తన పాదయాత్ర ఏడాది పూర్తి చేసుకోవడంపై జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్‌లో స్పందించారు. ‘‘ఏడాదిగా పాదయాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నా. గాయం నుంచి కోలుకుంటున్నా. త్వరలో పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తా’’ అని జగన్ ట్వీట్ చేశారు.ఎవరో చేయించిన పనికి నా తమ్ముడు బలయ్యాడు

Updated By ManamMon, 11/05/2018 - 09:29

Srinivasa Raoఅమరావతి: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నాన్ని తన తమ్ముడితో ఎవరో చేయించారని శ్రీనివాసరావు సోదరి రత్నకుమారి అనుమానం వ్యక్తం చేశారు. ఎవరు చేయించారో చెబుదామన్నా చేయించిన వాళ్లు అతడిని బెదిరించి ఉంటారని, అందుకే చెప్పడం లేదేమో అంటూ ఆమె తెలిపింది. వాళ్లు డబ్బు ఇస్తామని ఆశ పెట్టి ఉంటారని, అందుకే ఇలా చేశాడని ఆమె కన్నీరుతో తెలిపింది.

చేతిలో రూపాయి కూడా లేని శ్రీనివాసరావు ఇంతటి దారుణానికి ఒడిగడతాడని తాము ఊహించలేదని, ఇందుకు కారకులైన వారు ఇప్పుడు తన తమ్ముడిని ఏమి చేస్తారోనని భయంగా ఉందని రత్నకుమారి పేర్కొంది. ఎవరో చేయించిన పనికి తన తమ్ముడు బలైపోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఎప్పుడూ చిన్న ఫోన్‌ను వాడే తమ తమ్ముడు 9ఫోన్లు మార్చాడంటేనే నమ్మలేకపోయామని.. రూ.20, రూ.30లు కూడా అడిగి తీసుకొని వెళ్లేవాడని రత్నకుమారి చెప్పింది. 'దొంగలు, గజదొంగలు కలిసినట్టుగా ఉంది'

Updated By ManamSun, 11/04/2018 - 13:39

Botsa Satyanarayana, TDP, Congress, Chandrababu naidu, Ys jagan mohan reddy, Pawan Kalyanవిశాఖపట్నం: టీడీపీని కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్‌తో కలిసారని వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. దొంగలు, గజ దొంగలు కలిసినట్లుగా ఉంది వారి కలయిక అని బొత్స మండిపడ్డారు. ఆదివారం విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రాష్ట్రంలో వ్యవస్థలను చిన్నాభిన్నం చేశారని ధ్వజమెత్తారు. 

మీరా.. దేశంలోని వ్యవస్థలపై మాట్లాడేదని బొత్స దుయ్యబట్టారు. బీజేపీ కన్నా ఎక్కువ చంద్రబాబే వ్యవస్థలను నాశనం చేశారన్నారు. ఇచ్చిన మాటనిలబెట్టుకోవడం కోసం పుట్టిన పార్టీ వైసీపీగా అభివర్ణించారు. జగన్‌పై హత్యాయత్న ఘటనపై థర్డ్ పార్టీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జగన్‌, పవన్‌ను ఆడించే స్క్రిప్ట్‌ ఢిల్లీలో తయారువుతోందన్నారు. శ్రీనివాస్ కాల్‌డేటాను తీస్తే అసలు సూత్రధారులు బయటకొస్తారని బొత్స తెలిపారు. జగన్‌తో కూడా బాబు చేతులు కలుపుతారు

Updated By ManamSat, 11/03/2018 - 10:29

Pawan Kalyanఅమరావతి: కాంగ్రెస్-టీడీపీ పొత్తు కేవలం ట్రైలర్ మాత్రమేనని.. ఆ సినిమా ఆడే అవకాశం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. చంద్రబాబు రాజకీయ ప్రయాణం ఎక్కడ మొదలైందో, చివరకు అక్కడకే చేరుకుందని పవన్ చెప్పారు. 2014లో కూడా చంద్రబాబును పూర్తిగా నమ్మలేదని.. కానీ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయనకు మద్దతు ఇచ్చానని పవన్ అన్నారు.

తాను అడ్డంకిగా అనిపిస్తే.. జగన్‌తో కూడా చేతులు కలపడానికి చంద్రబాబు సిద్ధపడతారని పవన్ ఎద్దేవా చేశారు. జనసేన ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని, ప్రజలతోనే పొత్తు పెట్టుకుంటుందని ఈ సందర్భంగా పవన్ తెలిపారు. జగన్‌లా లక్షల కోట్లు తన వద్ద లేవని, అలాగే చంద్రబాబులా హెరిటేజ్ ఫ్యాక్టరీలు లేవని పవన్ అన్నారు.'తల్లి, చెల్లి దాడి చేయించారనడం తప్పు'

Updated By ManamFri, 11/02/2018 - 20:33

Pawan Kalyan, Vizag airport, YSRCP, Ys Jagan mohan Reddy, Ys Vijayamma, Sharmila విజయవాడ: విశాఖ విమానాశ్రయంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి స్పందించారు. జగన్‌పై దాడి జరగడం చాలా దురదృష్టకరమన్నారు. శుక్రవారం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలులో ‘సేనానితో రైలు ప్రయాణం’లో భాగంగా విజయవాడ నుంచి తునికి వెళ్తున్న సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడారు. జగన్‌పై దాడి ఘటనపై టీడీపీ నేతలు వెకిలిగా మాట్లాడటం సరికాదన్నారు. జగన్‌పై దాడి ఘటనను లోతుగా విశ్లేషించాలని కోరారు. తల్లి, చెల్లి దాడి చేయించారని కొందరు నేతలు వ్యాఖ్యానించడం తప్పు అన్నారు.

ఎక్కడైనా తల్లే కొడుకుపై దాడి చేయిస్తుందా? అని పవన్ ప్రశ్నించారు. విజయమ్మ, షర్మిల తనను దూషించినా.. తాను ఏమీ అనలేదని ఈ సందర్భంగా పవన్ గుర్తుచేశారు. దాడి కావాలని చేశాడా? ఎవరైనా చేయించారా?.. కుట్రా అనేది విచారణలో పోలీసులు తేల్చాలన్నారు. రాజకీయ జోక్యం లేకుండా విచారణ జరిపి దాడి ఘటనలో వాస్తవాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉందని, తన పర్యటనలో కూడా పోలీసులు రక్షణ కల్పించకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డానన్నారు. శ్రీనివాస్ కస్టడీ పొడిగింపునకు కోర్టు నిరాకరణ

Updated By ManamFri, 11/02/2018 - 19:07
  • నేటితో ముగిసిన పోలీసుల కస్టడీ... కోర్టులో హాజరు

  • కోర్టు తిరస్కరించడంతో తిరిగి జైలుకు తరలింపు 

Court, Srinivasa rao, Police custody extension, Ys Jagan mohan Reddyవిశాఖపట్నం: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై దాడి ఘటనలో నిందితుడు శ్రీనివాసరావు కస్టడీ పొడిగింపునకు పోలీసులు కోర్టును అభ్యర్థించారు. మరికొన్ని రోజుల కస్టడీ పొడిగించాలని పోలీసులు కోరారు. శ్రీనివాస్‌ను పోలీసుల కస్టడీ అప్పగించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దాంతో నిందితుడిని తిరిగి జైలుకు తరలించారు.

శుక్రవారంతో శ్రీనివాస్ కస్టడీ ముగియడంతో పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపరిచారు. మరికొన్ని రోజులు కస్టడీకి అప్పగించాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. వారి వాదనలను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో శ్రీనివాసరావు‌ను విశాఖ జైలుకు తరలించారు. 

Related News