ali

పండుగాడి ఫోటో స్టూడియో

Updated By ManamSun, 10/28/2018 - 18:17
  • అలీ హీరోగా ‘పండుగాడి ఫోటో స్టూడియో’ (వీడు ఫోటో తీస్తే పెళ్ళి అయిపోద్ది) ప్రారంభం

ali pandugadi photo studio

‘యమలీల’ చిత్రంతో హాస్య కథానాయకుడిగా నిరూపించుకున్న అలీ హీరోగా మళ్ళీ పూర్తీ వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ‘పండుగాడి ఫోటో స్టూడియో’ చిత్రం గుంటూరు జిల్లా తెనాలిలో శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. ఈ కామెడీ చిత్రానికి  ‘వీడు ఫోటో తీస్తే పెళ్ళి అయిపోద్ది’ అనేది ట్యాగ్‌లైన్. పెదరావూరు ఫిల్మ్ స్టూడియో పతాకంపై దిలీప్ రాజా దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ తొలి క్లాప్‌ను ఇవ్వగా, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ముహూర్తపు వేడుకల్లో పాల్గొని చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు అందజేశారు.

ఈ సందర్భంగా నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ.. ‘కామెడీ చిత్రాలు కరువైన ఈ రోజుల్లో హాస్య ప్రియులకు పండుగాడి ఫోటో స్టూడియో సినిమా ఫుల్ మీల్స్ అవుతుందని ఆశిస్తున్నాను. దేవుళ్ళను పూజించకుండా సినిమా ముహూర్తానికి హాస్యబ్రహ్మ జంధ్యాల, సంచలన దర్శకుడు కె.బాలచందర్ ఫోటోలకు దర్శకుడు దిలీప్ రాజా చేతులు జోడించి నమస్కరించడం చూశాక ఆయన అభిరుచి ఎలాంటిదో స్పష్టం అవుతుంది. ఈ సినిమా ఘన విజయం సాధించి చిత్రయూనిట్‌కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను..’ అని అన్నారు. 

తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కథ అంతా నాకు తెలుసు. హాస్యప్రధానమైన చిత్రం. పండుగాడు ఎవరికీ ఫోటో తీసినా వారికి పెళ్ళి అయిపోతుందనే ఇతివృత్తం ఈ సినిమాలో హాస్యానికి కేంద్రం అవుతుంది. దాదాపు 1150 సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించిన అలీ మాత్రమే ఈ పాత్రకు న్యాయం చేయగలడనే దర్శకుడి ఆలోచనను నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

హర్రర్ చిత్రాలు విపరీతంగా రిలీజ్ అవుతున్న ఈరోజుల్లో కుటుంబ సభ్యలతో కలిసి చూసేలా దర్శకుడు దిలీప్ రాజా ఈచిత్రాన్ని రూపొందిస్తారని ఆశిస్తున్నాను. రాజాకు కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి బూతు పదాలకు, ద్వందార్దాలకు ఇందులో చోటు ఉండదు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను..’ అన్నారు.

దర్శకుడు దిలీప్ రాజా  మాట్లాడుతూ..‘హాస్యానికి అపహాస్యానికి రెండు అక్షరాలు మాత్రమే తేడా ఉంటుంది. దీన్ని గమనించే పూర్తీ స్థాయి కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్టులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. నా సినిమా.. హాస్యంలో జంధ్యాల, దర్శకత్వంలో బాలచందర్ గారి ప్రభావం ఉంటుందన్నారు. అందుకే దేవుళ్ళకు మొక్కకుండా వారికే మొక్కాను. ఇందులో పండుగాడి పాత్రను అలీగారు మాత్రమే చేయగలరు. 

నేను పెద్ద పోటుగాడిని, సూపర్ హిట్ సినిమా తీస్తున్నానని ముందే చెప్పటం లేదు. అది తేల్చాల్సింది ప్రేక్షకులు మాత్రమే. అయితే ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఈ సినిమా మళ్లీ ఓ జంధ్యాల మార్క్ కామెడీ సినిమాగా ఉంటుందని, సినిమా హాలు నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా నేను సృష్టించిన పాత్రలు ప్రేక్షకులను పలకరిస్తాయని మాత్రం చెప్పగలను. ఇందులో ప్రతి పాత్రను..  ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా డిజైన్ చేశాను..’ అని అన్నారు. 

ఈ సినిమా హీరో అలీ మాట్లాడుతూ.. ‘కథ చాలా బాగుంది. కథతో పాటు ఇందులో పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇళయరాజా దగ్గర పనిచేసిన యాజమాన్య సంగీతంలో, బాలీవుడ్ గాయని శ్రేయా ఘోషల్ పాడిన పాటలు ప్రేక్షకులని మెప్పిస్తాయి. చాలా కాలం తర్వాత ఫుల్ కామెడీ సినిమాలో చేస్తున్నాను. తప్పకుండా అందరికీ నచ్చుతుంది..’ అన్నారు. అలీ, రిషిత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రదీప్ రావత్, జీవ, సుధ, దేవిశ్రీ, చిత్రం శ్రీను, వర్ధమాన నటి టీనా చౌదరి, జబర్దస్ట్ రాము తదితరులు నటిస్తున్నారు.మంచి సందేశంతో 

Updated By ManamMon, 09/17/2018 - 04:05

imageఖయూమ్, తనిష్క్, రాజన్, షానీ, పృథ్విరాజ్, సమీర్, లోహిత్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘దేశంలో దొంగలు పడ్డారు’. ఈ చిత్రాన్ని అలీ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘‘నా చిరకాల మిత్రుడు అలీ సోదరుడు ఖయ్యూం ఇందులో ప్రధాన పాత్ర పోషించడం చూసి నాకు ఓ గుడ్ ఇంప్రెషన్ వచ్చింది. డైరెక్టర్ గౌతమ్ ఫస్ట్‌టైమ్ డైరెక్ట్ చేస్తున్నప్పటికీ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం ఓ సీనియర్ మోస్ట్ డైరెక్టర్ హ్యాండిల్ చేస్తున్నట్లుగా అనిపించింది.

ట్రైలర్ ఇంప్రెస్సీవ్ గా ఉంది. ఈరోజుల్లో నిరుపేదలైనటువంటి వారి పిల్లలను మోసం చేసి అన్యాయంగా, అక్రమంగా రవాణా చేయడమనేది రోజూ మనం పేపర్లలో కూడా చూస్తూ ఉన్నాం. అలాంటి కంటెంట్‌ను సబ్జెక్టుగా తీసుకొని ఈ సినిమా చేసిన గౌతమ్ కచ్చితంగా ఒక మంచి సందేశం అందించాడని భావిస్తున్నాను. ఖయ్యూమ్‌కి ట్రర్నింగ్ పాయింట్ అవుతుందని భావిస్తున్నాను. ఎంటైర్ యూనిట్‌కి అభినందనలు’’ అన్నారు.‘దేశంలో దొంగలు పడ్డారు’ సాంగ్ 

Updated By ManamSat, 09/08/2018 - 13:56
Desamlo Dongalu Paddaru song released

ప్రముఖ హాస్యనటుడు అలీ సమర్పణలో ఖ‌యూమ్‌, తనిష్క్, రాజ‌న్‌, షానీ, పృథ్విరాజ్‌, స‌మీర్‌, లోహిత్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన సినిమా `దేశంలో దొంగ‌లు ప‌డ్డారు`. సారా క్రియేషన్స్ ప‌తాకంపై రూపొందిన ఈ చిత్రానికి గౌత‌మ్ రాజ్‌కుమార్ దర్శకత్వం వహించారు. ర‌మా గౌత‌మ్ నిర్మాత‌. శాండీ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర పాటలు సెలెబ్ కనెక్ట్ మ్యూజిక్ ద్వారా   విడుదలవుతున్నాయి. 

ఈ సినిమాలోని ‘షరతుల పంజరమే’ అనే పాటను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. దేశంలో దొంగలు పడ్డారు అనేది పాపులర్ టైటిల్.  ఇప్పుడదే టైటిల్‌తో నేటి జనరేషన్ కు తగ్గట్టుగా కరెంట్ ఇష్యూస్‌తో దర్శకుడు ఈ సినిమా చేయటం మంచి ప్రయత్నం.‌ నటుడిగా ఖయ్యుమ్‌కు ది బెస్ట్ మూవీగా నిలవాలి. దర్శకుడి గౌతమ్ రాజ్ కుమార్  టేకింగ్ , విజువల్స్ ది బెస్ట్ అనేలా‌ ఉన్నాయి. టీజర్, సాంగ్ నాకు చాలా నచ్చాయన్నారు.

ఖ‌య్యుమ్ మాట్లాడుతూ.‌..సాంగ్ విడుదల చెసిన శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు.నటుడిగా వంద సినిమాలు చేశాను.  నా కంటూ ఓ డ్రీమ్ రోల్  ఉంది. అది ఈ సినిమాలో చేశాను. టీమ్ అంద‌రూ క‌ష్ట‌ప‌డి పనిచేశారు. మదర్ సెంటిమెంట్ ఉన్న సినిమా ఇది. హ్యూమ‌న్ ట్రాఫికింగ్ మీద ఉంటుంది. నా లైఫ్‌లో చెప్పుకునే సినిమా అవుతుందన్నారు.

ద‌ర్శ‌కుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ ఇదొక క్రైమ్ థ్రిల్ల‌ర్‌. హ్యూమ‌న్ ట్రాఫికింగ్ అంశాన్ని హైలైట్ చేస్తూ, ఇప్పుడు స‌మాజంలో జ‌రుగుతున్న ప‌రిస్థితుల‌ను ప్ర‌తిబింబిస్తూ క‌థ‌ను తెర‌కెక్కించామన్నారు.

సెలెబ్ కనెక్ట్ అధినేత సుమన్ మాట్లాడుతూ ..  సినిమా నచ్చి మూవీ కి సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నాము. సెలెబ్ కనెక్ట్ మ్యూజిక్ ద్వారా పాటలను విడుదల  చేస్తున్నాము.ఇకపై కూడా ఇలాంటి మరిన్ని మంచి సినిమాలను ప్రోత్సహించాలన్నదే మా అభిలాష అన్నారు.

గిరిధ‌ర్‌, జ‌బ‌ర్ద‌స్త్ రాఘ‌వ‌, వినోద్‌, త‌డివేలు త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ధారులు. ఈ సినిమాకు కెమెరా: శేఖ‌ర్ గంగ‌న‌మోని, సంగీతం: శాండీ, ఎడిటింగ్‌: మ‌ధు.జి.రెడ్డి, క‌ళ‌: మ‌ధు రెబ్బా, సమర్పణ: అలీ,ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: సాయికుమార్ పాల‌కుర్తి, స‌హ నిర్మాత‌లు: సంతోష్ డొంకాడ‌, సెలెబ్.

Related News