Polio

కలుషిత పోలియో వ్యాక్సిన్లు ధ్వంసం

Updated By ManamFri, 10/12/2018 - 07:15
  • బీ10048-పోలియో చుక్కలను నిషేదించిన కేంద్రం

  • అందుబాటులోకి 3లక్షల కొత్త వ్యాక్సిన్లు

Polioహైదరాబాద్:  కలుషిత పోలియో వ్యాక్సిన్‌లను ధ్వంసం  చేయడానికి  తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ రంగం సిద్ధ్దం చేసింది. ఈ మేరకు అనుమతి కోరు తూ కేంద్ర వైద్యశాఖకు లేఖ రాసింది. రాష్ట్ర వ్యాప్తంగా  2లక్షల మంది చిన్నారులకు కలుషిత చుక్కలను పంపిణీ చేసినట్టు ఆ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో పోలియో చుక్కలు వేయించుకున్న చిన్నారుల తల్లి దండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాగా కలుషిత పోలియో చుక్కల ప్రభావాన్ని తట్టుకునే రోగనిరోధక శక్తి చిన్నారుల్లో ఉన్నందున ఎటువంటి ప్రమాదం లేదని వైద్యారోగ్యశాఖ అధికారులు భరోసా కలిపిస్తున్నారు.  మిగిలిన వాటిలో కలుషితం అయినట్టు భావిస్తున్న బ్యాచ్ నంబర్ -బీ 10048 గల బాటిళ్లలోని   10లక్షల డోసుల పోలియో చుక్కలను జిల్లాలు మండలాల నుండి వేగవంతంగా హైదరాబాద్ వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి తెప్పించారు.  ప్రత్యేక పద్ధతిలో వీటిని ధ్వంసం చేయడానికి  రంగం సిద్ధ్దం చేసినట్లు వైద్యశాఖ వర్గాలు తెలిపాయి.

కేంద్రం నిషేదించిన వ్యాక్సిన్ బ్యాచ్ నంబర్- బీ10048
తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాష్ట్రల్లో  పోలియో చుక్కల వ్యాక్సిన్ బ్యాచ్ నంబర్ -బీ 10048 గల బాటిళ్లలోని వ్యాక్సిన్ అనేక మం ది చిన్నారులకు ఇచ్చినట్లు  ఆయా రాష్ట్రాల వైద్యశాఖ అధికారులు కేంద్ర వైద్యశాఖకు స్పష్టం చేశారు. ఈ బ్యాచ్ నంబర్ గల కలుషిత పోలియో చుక్కలను ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఘజియాబాద్‌లోని బయోమెడ్ సంస్థ తయారు చేసినట్లు కేంద్రం గుర్తించింది.  మూడు రాష్ట్రాలకు మూడు బ్యాచ్ నంబర్‌లను సరఫరా చేయగా 1.5 లక్షల యూనిట్ల వ్యాక్సిన్‌లను 2016 ఏప్రిల్ మాసం తరువాత పుట్టిన చిన్నారులకు అందించినట్టు నిర్ధారించారు. కలుషిత పోలియోడ్రాప్స్ ను వెనక్కి తెప్పించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలియో చుక్కల కోరత ఏర్పడింది. నిషేదిత వ్యాక్సిన్ స్థానంలో తెలంగాణ రాష్ట్రానికి మరో మూడు లక్షల స్వచ్ఛమెన పోలియో నివారణ వ్యాక్సిన్‌ను తెప్పించారని వైద్య ఆరోగ్యకుటుంబ సంక్షేమశాఖ అధికారులు తెలిపారు.    టీకా పక్షవాతం

Updated By ManamMon, 09/10/2018 - 02:02

Polio‘పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం’ పేరుతో దా దాపు రెండు దశాబ్దాల పాటు సాగిన పోలియో వ్యతిరేక యుద్ధంలో 1985లో లక్షన్నర సహజ పోలియో కేసులు నమోదైన ఇండియా ఎట్టకేలకు 2014 మార్చి నాటికి నెగ్గి ప్రపంచ పోలియో రహిత దేశాల్లో ఒకటిగా నిలిచింది. పోలియో రాహిత్యమన్నది నేడొక విరోధాభాసగా నిలిచింది. న్యూఢిల్లీలోని ‘సెయింట్ స్టీఫెన్ హాస్పిటాలిన్’లో పెడియా ట్రిక్స్ విభాగం అధిపతి జాకబ్ పులియేల్ సారథ్యంలో ‘జాతీయ నిఘా గణాంకాల’ ఆధారంగా జరిగిన అధ్యయనం ఆధారంగా 2000-2017 మధ్యకాలంలో పోలియో నిర్మూలన కార్యక్రమం (ఓరల్ పోలియో వాక్సిన్-ఓపీవీ) పర్యవసానంగా 4,90,000 మంది పక్షవాతానికి (పెరాల్సిస్) గురయ్యారన్న గణాంకాలు భయాందోళనలకు గురిచేస్తోంది. ఇదంతా ట్రైవెలెంట్ ఓపీవీ వల్ల జరిగిందని భారత ప్రభు త్వం విశ్వసిస్తోంది. అయితే పారిశుద్ధ్యం, తాగునీరు, పోషకా హార లోపం వంటి సమస్యలతో సతమతమవుతున్నంత కాలమూ, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్థాన్ తదితర పొరు గు దేశాల్లో పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం విజయవంతం కానంత వరకు భారత్‌కు పోలియో మహమ్మారి ప్రమాదం పొంచే ఉంటుందన్న విషయాన్ని పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. 

ఓపీవీ ఇమ్యునైజేషన్ కార్యక్రమం వల్ల మొదట్లో పోలియో కొంత తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా 2002లో పో లియో వ్యాధి ఒక ఉపద్రవాన్ని సృష్టించింది. వ్యాధి ప్రేరిత ప్రతికూల ప్రభావాలు నమోదా కావడంతో ఓపీవీపై చాలా సందేహాలు వ్యక్తమైనాయి. భారత్‌లో పక్షవాతం, అవయవాలు చచ్చుపడటం వంటి రుగ్మతల్ని ఎన్‌పీఏఎఫ్‌పీ (నాన్ పోలియో అక్యూట్ ఫ్లాసిడ్ పెరాల్సిస్)గా పరిగణిస్తారు. డీడీ టీ, క్రిమిసంహారక మందులు, సీసం, ఆర్సనిక్ తదితర న్యూరోటాక్సిన్ రసాయనాలు, ఇంజెక్షన్లు, వాక్సిన్ల పారిశు ద్ధ్యం, పోషకాహారం కొరత ఉన్న చోట పోలియో తరహా రుగ్మతలు ఏర్పడుతాయి. ఉత్తరప్రదేశ్, బిహార్‌ల్లో ఎక్కడైతే పీపీవీ చుక్కలు పలుమార్లు వేశారో అక్కడ వ్యాక్సిన్ ప్రేరిత నరాల బలహీనతలు, పక్షవాతం వంటి రుగ్మతలు సంభవిం చినట్లు పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోను ఇలాంటి కేసులు నమోదైన విషయం విదితమే. కోతుల్లోని వైరస్‌లు, ఫినాల్, పాలీసోర్బేట్ 80 అనే ఎం డోక్రిన్ ఎంజైమ్‌ను గందరగోళపరిచే అంశాలతో తయార య్యే ఓపీవీ కేన్సర్ లేదా వంధ్యత్వం కలిగిస్తుందా లేదా అ నే క్లీనికల్ పరీక్షలు నిర్వహించకుండానే వినియోగంలోకి తీసుకురావడంలో బిలియన్ డాలర్ల కుట్ర ఉందని నిపుణులు విమర్శిస్తున్నారు. అదీకాకుండా పోలీయోను కలిగించే మూడు ఎంటరో వైరస్‌లను మాత్రమే ఓపీవీ నివారిస్తుంది. అ లా జరిగినపుడు ఇతర ఎంటరో వైరస్‌లు విజృంభించి పోలియో వ్యాధి తరహా పక్షవాతాన్ని కలిగించిన సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యాయి. మూడు వైరస్‌లకే దిక్కులేకపోతే, ప్రస్తుతం తాజాగా రెండు వైరస్‌ల లక్ష్యంతో పనిచేసే ఓపీవీ చుక్కల్ని వాడటం వల్ల ప్రయోజనం లేక పోగా, ప్రమాదకరంగా పరిణమించే అవకాశం లేకపోలేదు. పారిశుద్ధాన్ని మెరుగు పరచడం, క్రమం తప్పకుండా ఐపీవీ వాక్సినేషన్ చేసినట్లయితే పోలియోను సులభంగా నివారిం చగలం.

జపాన్‌లో మూడు నెలలపాటు ఓపీవీ వాడిన అనంతరం మురుగ కాల్వలలో, నదులలో అత్యంత తీక్షణమైన పోలియో వైరస్‌లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అలాంటిది, 1978 నుంచి మంద్రస్థాయిలోను, 1997 నుంచి ఒక ఉద్య మంగా ఓపీవీని వినియోగించిన భారత్‌లో ఇంకెంత తీక్షణ మైన వైరస్‌లు పరిసరాల్లో ఉన్నాయో ఆందోళన కలిగించే విషయం. దాంతో దేశంలో సహజ వైరస్‌ల కంటే ఎన్‌పీఏ ఎఫ్‌పీ పక్షవాత మరణాల సంఖ్య అధికంగా సంభవించిన విష యం తలచుకుంటే వళ్ళు గగుర్పాటుకు గురవుతుంది. ఎన్‌పీఏఎఫ్‌పీ కేసుల్ని, వ్యాక్సిన్ ప్రేరిత రుగ్మతల్ని పోలియో కేసుల్ని, ఇతరత్రా ఇన్ఫెక్షన్ల వల్ల ఏర్పడే పోలియో తరహా రుగ్మతల్ని పోలియో వ్యాధిగా పరిగణించకుండా, కేవలం సహజ పోలియో వైరస్ వల్ల సంభవించే పక్షవాతం తదితర లక్షణాల్ని మాత్రమే పోలియో కేసులుగా ప్రభుత్వం గుర్తించడంతో కొన్నేళ్లలోనే అనూహ్యంగా భారత్ పోలియోరహిత దేశంగా నిలిచింది. సహజ పోలియో వైరస్‌లు సోకిన 95 శాతానికి పైగా మందిలో ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉండవని వైద్య శాస్త్రం చెబుతుంది. ప్రభావితమైన వారిలో కొద్దిమందికి జలుబు మాత్రమే చే స్తోంది. ఇంకొందరిలో తాత్కాలిక అంగవైకల్యం కొద్దిరోజు లు ఇబ్బంది పెడుతుంది. కేవలం ఒక శాతానికి కంటే తక్కు వ మందిలో మాత్రమే శాశ్వతంగా పక్షవాతం సంభవిస్తుం దని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. తీక్షణమైన పోలియోను ఎదుర్కొనే  రోగ నిరోధక శక్తి పెరుగుదలకు సహజ పోలియో వైరస్ సోకడం ప్రయోజనకరమని వైద్యశాస్త్రం వివరిస్తోంది. రోగ నిరోధక శక్తిని పెంచే సహజ వైరస్‌లను ఓపీవీతో ని ర్మూలించడం ద్వారా ఇతర ఎంటరో వైరస్‌లు విజృంభించి శిశువులను పక్షవాతానికి గురిచేస్తున్నాయి. భవిష్యత్ తరాలు మరిన్ని ప్రాణాంతక వ్యాధులకు గురయ్యే ప్రమాదకర వాతావరణం పోలియో నిర్మూలనా కార్యక్రమంతో అవ తరించింది.   ప్రపంచ ఆరోగ్య సంస్థ 2013-18 పోలియో ఎరాడికేషన్ అండ్ ఎండ్‌గేమ్ స్ట్రాటజీ ప్లాన్ ప్రకారం వాక్సి న్ కారక పక్షవాతాన్ని నిరోధించేందుకు ఓపీవీ వినియోగా న్ని ప్రపంచవ్యాప్తంగా నిలిపి వేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికైనా ప్రమాదకరమైన సజీవ పోలియో వైరస్‌లతో గుంపువ్యాక్సిన్‌గా తయారుచేస్తున్న ఓపీవీ వినియోగాన్ని క్ర మంగా ఉపసంహరించాలి. దానిస్థానంలో చనిపోయిన లేదా క్రియాశీలత కోల్పోయిన పోలియో వైరస్‌లతో తయారయ్యే ఐపీవీ వ్యాక్సిన్‌లను దేశవ్యాప్తంగా యుద్ధప్రాతి పదిక కార్యక్రమాన్ని చేపట్టాలి. అలాకాక ప్రస్తు తం బైవెలెంట్ ఓపీవీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం భావితరాలకు అన్యాయం చే సినట్లే.  ఇదేవిధంగా హైపటిటిస్ బి, సి, స్వైన్ ఫ్లూ, జికా వైరస్, ఎబోలా, నిఫా తదితర అనేక రకాల వాక్సిన్ వాక్సిన్ వాణిజ్యంలో  ప్రజల ఆరోగ్యాన్ని ఫార్మా కార్పొరేట్ సంస్థలు సొమ్ము చేసుకుంటు న్నాయి. భూతాపంతో సంభవించబోయే భవిష్యత్ జనాభా ఉపద్రవాలను నివారించేందుకు వెనకబడిన దేశాల్లో జనా భాను తగ్గించే పారిశ్రామిక దేశాల అజ్ఞాత వ్యూహం అమ లులో వాక్సిన్‌లు కీలక అస్త్రాలుగా ఉన్నాయి. ఆ పథకంలో భాగంగా వాక్సిన్ వాణిజ్యంలో ‘బిల్ అండ్ మిలింద గేట్స్ ఫౌండేషన్’ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. వాక్సిన్‌ల నాణ్య త వినియోగ విధానం, క్లినికల్ పరీక్షలు వగైరా అంశాలను ప్రభుత్వాలు గంభీరంగా పట్టించుకోవాలి. దేశ, విదేశీ ఫార్మా కార్పొరేట్ సంస్థలు, విధానకర్తల కూటమి ప్రజారోగ్యంతో చెలగమాటడం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 

Related News