Omkaara

జాతీయ అవార్డు గ్రహీత ప్రాణం కాపాడిన ఆమిర్

Updated By ManamMon, 09/10/2018 - 13:00

Aamir Khanతన సినిమా కోసం పనిచేసిన జాతీయ అవార్డు గ్రహీత ప్రాణాన్ని బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్‌ కాపాడారు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. కాగా ఆమిర్ నటించిన ‘దంగల్‌’ చిత్రానికి పనిచేసిన సౌండ్ డిజైనర్ సాజిత్ కోయేరి తీవ్ర అస్వస్థతకు గురై గురువారం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అయితే అక్కడున్న డాక్టర్లు కనీసం ట్రీట్‌మెంట్ ఇవ్వకుండా అతడిని అలానే వదిలేశారు. దీంతో అతడి పరిస్థితి క్షీణిస్తుండటంతో ఏమీ చేయాలో పాలుపోని సాజిత్ కుటుంబసభ్యులు ఆమిర్‌ను ఆశ్రయించారు.

విషయం తెలుసుకున్న ఆమిర్ వెంటనే సాజిత్‌ను కొకిలాబెన్ ఆసుపత్రికి మార్పించడమే కాకుండా.. అనిల్ అంబానీతో మాట్లాడి అత్యవసర చికిత్స అందేలా చర్యలు తీసుకున్నాడు. దీంతో కోలుకున్న సాజిత్.. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆమిర్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కాగా ‘బర్ఫీ’, ‘హైదర్’, ‘ఓంకార’, ‘దంగల్’ వంటి హిట్ చిత్రాలకు సాజిత్ పనిచేశాడు. ఓంకార చిత్రానికి గానూ ఆయనకు జాతీయ అవార్డు కూడా లభించింది.

Related News