sreesanth

శ్రీశాంత్‌పై పవన్ హీరోయిన్ ఫైర్

Updated By ManamWed, 10/17/2018 - 10:45

Sreesanthమ్యాచ్‌ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్‌కు దూరమై ప్రస్తుతం నటుడిగా కొనసాగుతున్న శ్రీశాంత్‌పై పవన్ కల్యాణ్ హీరోయిన్ ఫైర్ అయ్యింది. కొమరం పులితో దక్షిణాదికి పరిచయమైన నిఖిషా పటేల్.. ప్రస్తుతం అడపాదడపా చిత్రాలలో నటిస్తోంది. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీశాంత్.. తన భార్య గురించి చెబుతూ ఆమెను ఏడేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నానని తెలిపాడు. 

దీనిపై నిఖిషా మండిపడుతూ వేరే అమ్మాయిని ఏడేళ్లుగా ప్రేమిస్తూ వచ్చిన శ్రీశాంత్ తనతో ఏడాది సహజీవనం గురించి ఏం చెబుతాడని ప్రశ్నించింది. అతడితో బ్రేకప్ తరువాత ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటున్నానని, అయితే శ్రీశాంత్ నిజాన్ని దాచడం మాత్రం సహించలేకపోతున్నానని ఆమె తెలిపింది.

కాగా క్రికెటర్‌గా మంచి ఫాంలో ఉన్న సమయంలో శ్రీశాంత్, నిఖిషా పటేల్ సహజీవనం చేశారు. అయితే దీని గురించి ఈ జంట అప్పట్లో నోరు మెదపలేదు. ఇక మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల తరువాత భువనేశ్వరి అనే యువతిని శ్రీశాంత్ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఒక బాబు, ఒక పాప ఉన్న విషయం తెలిసిందే.బిగ్‌బాస్‌లోకి మాజీ క్రికెటర్..?

Updated By ManamMon, 09/10/2018 - 15:11

sreesanthహిందీలో విజయవంతంగా దూసుకుపోతున్న బుల్లితెర షోలలో బిగ్‌బాస్ ఒకటి. ఇప్పటికే 11 సీజన్‌లు పూర్తి అవ్వగా.. ఈ నెల 16 నుంచి 12వ సీజన్ ప్రారంభం కానుంది. కండలవీరుడు సల్మాన్‌ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించబోయే ఈ షోలో ఎవరెవరు పాల్గొనబోతున్నరానే విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. 

ఇందులో భాగంగా ఇప్పటికే దీపికా కకర్, సలీన్ బానోత్, కమెడియన్ భర్తీ సింగ్, ఆమె భర్త హార్ష్ లింబాచియా ఎంపిక ఖరారు కాగా.. తాజాగా బహిష్కృత క్రికెటర్ శ్రీశాంత్‌ కూడా ఇందులో పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా టీమిండియాలో ఓ వెలుగు వెలిగిన శ్రీశాంత్.. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఇండియన్ క్రికెట్ టీం నుంచి బహిష్కరించబడ్డాడు. ఆ తరువాత నిర్దోషిగా తేలాడు. అయినా అతడిని టీంలోకి తీసుకునేందుకు బీసీసీఐ ఒప్పుకోలేదు. ఇక క్రికెట్ నుంచి బయటకొచ్చిన శ్రీశాంత్ ఆ తరువాత కొన్ని సినిమాలలో నటించాడు. అలాగే కేరళ ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలో నిలబడి ఓడిపోయిన విషయం తెలిసిందే.బీసీసీఐకి సుప్రీం కోర్టు నోటీసులు

Updated By ManamMon, 02/05/2018 - 12:44

BCCIన్యూఢిల్లీ: భారత క్రికెట్ బోర్డు బీసీసీఐకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ సస్పెన్షన్‌పై నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం బీసీసీఐని ఆదేశించింది. అయితే 2013లో జరిగిన ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్‌పై బీసీసీఐ నిషేధం విధించింది. అయితే ఆ తరువాత అతడు నిర్దోషి అని తేల్చినప్పటికీ.. బీసీసీఐ నిర్వహించే ఏ క్రికెట్‌ ఆటలలోనూ అతను పాల్గొనకూడదంటూ కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తూ శ్రీశాంత్ సుప్రీంను ఆశ్రయించారు. దీనిని విచారించిన అత్యున్నత న్యాయస్థానం నాలుగు వారాల్లోకి సమాధానం చెప్పాలని బీసీసీఐకి ఆదేశాలు జారీ చేసింది.ద్రవిడ్, ధోనీలే విలన్స్: శ్రీశాంత్

Updated By ManamMon, 11/06/2017 - 18:35

sreesanthభారత మాజీ క్రికెట్ కెప్టెన్లు రాహుల్ ద్రవిడ్, మహేంద్ర సింగ్ ధోనీలపై కేరళకు చెందిన నిషేధిత క్రికెటర్ శ్రీశాంత్ ఫైరయ్యాడు. తన కెరీర్, జీవితంలో ప్రస్తుతం నెలకొన్న దుస్థితికి వారిద్దరే కారణమని దుయ్యబట్టాడు. వారిద్దరూ తనకు సహకారం అందించలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. తన శక్తిసామర్థ్యాల గురించి బాగా తెలిసినా, రాజస్థాన్ రాయల్స్ జట్టులో నిలదొక్కుకునేందుకు ద్రవిడ్ సాయం చేయలేదన్నాడు. అలాగే ధోనీకి తాను భావోద్రేకంతో మెసేజ్ పంపానని, అయితే దీనికి ధోనీ ఎలాంటి రిప్లై ఇవ్వలేదన్నాడు. 

బీసీసీఐపై కూడా శ్రీశాంత్ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డాడు. బీసీసీఐని ఓ ప్రైవేటు సంస్థగా అభివర్ణించాడు. అనుమతి ఇస్తే వేరే దేశం కోసం ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు వ్యాఖ్యానించాడు. 

Related News