E-Commarce

దేశానికి ఈ-కామర్స్ అత్యవసరం

Updated By ManamTue, 09/11/2018 - 01:40

 పెద్దయెత్తున డిజిటల్ వ్యాపారం అభివృద్ధి చెందే పక్షంలో సబ్సిడీలు కూడా రైతులకు సక్రమంగా, నేరుగా అందుతాయి. 1990ల ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భారతదేశానికి ఎంత ప్రయోజనం చేకూర్చిందో, ఈ-కామర్స్ కూడా భారతదేశానికి అంత మేలు చేకూరుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే, వలసవాదులు విసిరిన  సవాలుకు భారతదేశం సరైన జవాబు చెప్పినట్టవుతుంది. 

E-Commarceచరిత్రాత్మకంగా చూస్తే, ఇతర దేశాలలో మాదిరిగా భారతదేశంలో మార్కెట్ వ్యవస్థ ఎదగలేదనిపిస్తుంది. ఒకప్పుడు భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్‌వారు ముడి సరుకులు ఎగుమతి చేసి, వస్తువులను దిగుమతి చేసుకోవడం కోసం ముంబై, కోల్‌కతా, చెన్నై రేవులను అభి వృద్ధి చేయడం మీదే దృష్టి కేంద్రీకరించారు. కేవలం రేవు నగరాలకు అండగా ఉండడానికే ఇతర నగరాల అభివృద్ధి జరిగింది. ప్రాథమిక వస్తువుల కొనుగోలు ను స్థిరీకరించడానికి, భారతదేశంలోని ఇతర ప్రాంతా లకు టోకు వస్తువులను పంపిణీ చేయడానికి ఇలా నగరాలను అభివృద్ధి చేశారు. ఇతర చిన్నా చితకా నగ రాలను కూడా స్థానిక మార్కెట్లుగా ఉపయో గించు కోవడం కోసమే అభివృద్ధి చేశారు. ఇటువంటి స్థానిక మార్కెట్లలో చేతి వస్తువులు, ఇతర పరికరాలను అ మ్మడం, కొనడం చేసేవారు. నిజానికి ఈ కార్యకలా పాల్లో బ్రిటిష్ ప్రభుత్వం ఎక్కువగా జోక్యం చేసుకు నేది కాదు. ప్రాథమికంగా కొన్ని రవాణా వసతులు కల్పించడం, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చే యడం, శాంతిభద్రతలను నెలకొల్పడం, వ్యవసా యోత్పత్తులకు నిబంధనలతో కూడిన మార్కెట్లు సృ ష్టించడం మాత్రమే బ్రిటిష్ పాలకులు నిర్వర్తించే వారు.

దరిమిలా దేశంలో ఓ అవ్యవస్థీతకృత మార్కెట్ రూపుదిద్దుకుంది. మానవ ఆవాసాల మధ్య ఒక సం బంధం అంటూ లేకుండాపోయింది. దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే, నగరాలు, పల్లెల మధ్య సరైన నిష్పత్తి లేకుండాపోయింది. మధ్యలో అక్కడక్కడా కొ న్ని పట్టణాలు కూడా ఏర్పడ్డాయి కానీ, వాటికి, స్థానిక పరిస్థితులకు ఏమాత్రం సంబంధం లేదు. ఉదాహరణ కు, 1950లలో జాన్సన్ రాసిన గ్రంథం ప్రకారం, 13 లక్షల జనాభా కలిగిన కాన్పూర్ చుట్టుపక్కల సుమా రు 11,239 గ్రామాలు రూపుదిద్దుకున్నాయి కానీ, నగరాలు, పట్టణాల సంఖ్య మాత్రం 24ను దాటిపో లేదు. భారతదేశంలో సగటున 468 గ్రామాలను ఒక పట్టణం ఏర్పడి ఉంది. ఇలా మానవ ఆవాసాలన్నీ చిందరవందరగా ఉండకుండా, సరైన రీతిలో పట్ట ణాలు, నగరాలు ఏర్పడితే భారత్‌లో అమెరికాలో మాదిరిగా 47,000 పట్టణాలు రూపుదిద్దుకుని ఉండే వి. ఇప్పుడు భారతదేశంలో ఉన్నవి 2,000 పట్టణాలు మాత్రమే. పట్టణాభివృద్ధి కోసం భారత ప్రభుత్వం ఎన్ని విధాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఎన్ని కార్యక్రమాలు రూపొందిస్తున్నప్పటికీ, బ్రిటిష్ కాలం నాటి పట్టణాలు, నగరాల స్వరూప స్వభావాలను కొ ద్దిగా కూడా మార్చలేకపోతున్నట్టు 1987 నాటి జాతీ య పట్టణీకరణ కమిషన్ నివేదిక తెలియజేసింది.

సాధారణ సూత్రం ఏమిటంటే, మానవ ఆవాస ప్రాంతాలన్నీ ఒక పద్ధతి ప్రకారం, పైనుంచి కింది వరకూ ఒక వరసలో ఒక ప్రత్యేక విధి నిర్వహణ కోసం ఏర్పడాల్సి ఉంటుం ది. ప్రజల్లోని వివిధ వర్గాల మధ్య సమన్వయానికి అవి తోడ్పడాలి. అంతేకాదు, అవి పరస్పరం ఆధారపడి ఉండా లి. అంటే ఓ కుగ్రామం నుం చి నగరం వరకూ ప్రజల మధ్య నిత్య సంపర్కం, కల యిక, మేళవింపు ఏర్పడి ఉం డాలి. పాశ్చాత్య దేశాలలో ఇ ది ఎలా జరుగుతోందో చూ ద్దాం. అక్కడ నగరాలన్నీ కా లక్రమేణా ఒక పద్ధతి ప్రకా రం ఒక వరుసలో తమను తాము ఏర్పాటు చేసుకున్నాయి. అక్కడ వివిధ రకాల వస్తువులు, ఉత్పత్తులు అమ్మే స్థలాల మధ్య సమన్వయం ఏర్పడింది. వివిధ ఉత్పత్తులు అమ్మే వారి మధ్య, కొనేవారి మధ్య సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డాయి. ఫలితంగా నగరాలన్నీ ఒక వరుస ప్రకా రం పద్ధతి ప్రకారం రూపుదిద్దుకున్నాయి. చిన్న నగ రాల్లో చిన్న వస్తువులు, తొందరగా అమ్ముడుబోయే వస్తువులు, చౌక వస్తువులు అమ్మడం జరుగుతుం టుంది. పెద్ద నగరాల్లో ఉన్న చిల్లర వర్తకులు విలాస వంతమైన వస్తువులు, ఖరీదైన వస్తువులు అమ్మడం పరిపాటయిపోయింది. ఈ విధంగా ఓ వరుస క్రమం లో మానవ ఆవాసాలు ఏర్పడడం వల్ల, ప్రభుత్వ సంస్థలు గానీ, ప్రైవేట్ వంటి ప్రభుత్వేతర సంస్థలు గానీ పెట్టే పెట్టుబడులకు సరైన ప్రతిఫలాలు అందే అవకాశం ఉంటుంది. 
   
డిజిటల్ వ్యాపారం అనివార్యం
మానవ ఆవాసాల మధ్య ఒక వరుస ప్రకారం సంబంధం ఏర్పడాలంటే, కొన్ని మధ్యంతర నగరా లను కూడా నిర్మించాలని పాలకులు సంకల్పించారు. నిజానికి ఇది మొదటి నుంచీ ఉన్న పద్ధతే. కొత్తగా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈ మధ్యంతర నగరాలకు ఆర్థిక పునాదులు నిర్మించాలని కూడా భావించారు. నిజానికి ఇటువంటి పునాదులు నిర్మిం చడం అంత తేలికగా పూర్త య్యే వ్యవహారం కాదు. ఆర్థి క పునాదులతో పాటు, ప్రాథ మిక సదుపాయాలు కల్పిం చాలి. పెద్దయెత్తున గృహని ర్మాణం చేపట్టాలి. రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయా లి. పర్యావరణ పరిరక్షణ క ల్పించాలి. ఇంకా ఎన్నో చే యాల్సి ఉంటుంది. ఇలాంటి అవ్యవస్థీకృత మానవ ఆవా సాలను, మార్కెట్లను సరైన మార్గంలోకి తీసుకురావడా నికి ఈ-కామర్స్ సరైన మా ర్గంగా కనిపిస్తోంది. ప్రభుత్వం చేపట్టే చర్యలు ఊపం దుకోవాలంటే అందుకు సరైన విధానం ఈ-కామర్స్ అనే చెప్పాలి. ఉత్పత్తిదారుల్ని, గిడ్డంగుల్ని నేరుగా వినియోగదార్లతో కలపడానికి ఈ-కామర్స్ ఎంతగా నో ఉపయోగపడుతుంది. దీనివల్ల దళారీల బెడద ఉండదు. ఎవరి అనవసర జోక్యమూ ఉండదు. భౌతి కంగా మార్కెట్‌లో ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. వినియోగదారు మార్కెట్‌కి ప్రత్యక్షంగా వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. దీనివల్ల ప్రతిదీ ఓ వరుస క్రమంలో ఉండాలన్న పరిస్థితి తప్పుతుంది. ఆర్థిక ప్రతిఫలాలు సకాలంలో, సక్రమంగా అందడానికి ఎ టువంటి ఆటంకమూ ఉండదు. అన్నిటికన్నా ము ఖ్యంగా లావాదేవీల్లో, క్రయ విక్రయాల్లో మానవ జోక్యాన్ని నివారించడానికి, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ఇది ఎంతగానో ఉపయోగ పడుతుంది. రవాణాలు, రాకపోకలు బాగా తగ్గిపోతాయి. కుటుంబాలలోనివారు మార్కెట్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఒక వ్యక్తి అనేక కుటుంబాలను కలిసి మార్కెట్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడు తుంది. ప్రతిసారీ వ్యక్తులు కలుసుకోవాల్సిన అవసరం లేకుండా డిజిటల్ వ్యాపారం మార్కెట్‌ను పెంచుతుంది. స్వయంగా రంగంలోకి దిగి, పెద్దయెత్తున మార్కెట్ వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం లేకుండానే సువ్యవస్థీకృత మార్కెట్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి డిజిటల్ వ్యాపారం అవకాశం కల్పిస్తుంది.

వ్యవసాయదారుల ఆదాయం గణనీయంగా పెరగడానికి కూడా డిజిటల్ వ్యాపారం అవకాశం ఇస్తుంది. ఈ-కామర్స్ కంపెనీలు నేరుగా వ్యవసాయదారు ల నుంచి వారి ఉత్పత్తులు కొని, భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం అమ్మడానికి వీలుంటుంది. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా అమ్మడానికి అవకాశం ఉంటుంది. రైతులకు గిట్టుబాటు ధరలు చెల్లించవచ్చు. వినియోగదారులకు సరైన వస్తువులు విక్రయించవచ్చు. అంతేకాక, గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పెద్దయెత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. పెద్దయెత్తున డిజిటల్ వ్యాపారం అభివృద్ధి చెందే పక్షంలో సబ్సిడీలు కూడా రైతులకు సక్రమంగా, నేరుగా అందుతాయి. 1990ల ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భారతదేశానికి ఎంత ప్రయోజనం చేకూర్చిందో, ఈ-కామర్స్ కూడా భారతదేశానికి అంత మేలు చేకూరుస్తుంది. ముఖ్యం గా చెప్పాలంటే, వలసవాదులు విసిరిన  సవాలుకు భారతదేశం సరైన జవాబు చెప్పినట్టవుతుంది. 
(రచయిత ఐఐసీఏ డైరెక్టర్ జనరల్. వ్యాసంలోని అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతం) 

Related News