America Tour

నారా లోకేశ్ అమెరికా పర్యటన రద్దు

Updated By ManamMon, 10/15/2018 - 08:51

Nara Lokeshఅమరావతి: మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన రద్దు అయ్యింది. ఈ నెల 17,18,19 తేదీల్లో అమెరికాలో జరగనున్న వరల్డ్ ఫుడ్ ప్రైజ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొనాల్సి ఉంది. అయితే శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమైన ఉన్న నారా లోకేశ్.. పూర్తి స్థాయిలో గ్రామాలు కోలుకొని, సాధారణ స్థితికి వచ్చే వరకు అక్కడే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా టూర్‌ను రద్దు చేసుకున్నారు.

కాగా వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు అందించిన వారికి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అత్యున్నత పురస్కారం ఇవ్వనుంది. ఈ కార్యక్రమంలో భారతీయ వ్యవసాయ రంగం- టెక్నాలజీ అనుసంధానంతో పాటు దేశ వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులపై కీ నోటు ప్రసంగం ఇచ్చేందుకు మంత్రి నారా లోకేశ్‌కు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ నిర్వాహకులు ఆహ్వానం పంపారు. ఇందుకోసం మూడు రోజులు అమెరికాకు వెళ్లేందుకు నారా లోకేశ్ నిర్ణయించుకున్నారు.



ముగిసిన అమెరికా పర్యటన.. విజయవాడకు చంద్రబాబు

Updated By ManamFri, 09/28/2018 - 08:55

Chandrababu Naiduఅమరావతి: ఐక్యరాజ్యసమతి ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ పర్యటనను ముగించుకున్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన విజయవాడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు వీరేంద్ర తదితరులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. మరోవైపు ప్రకృతి వ్యవసాయంపై ప్రసంగించేందుకు ఐక్యరాజ్యసమితికి వెళ్లిన చంద్రబాబుకు అక్కడ ఘన స్వాగతం లభించిన విషయం తెలిసిందే. ప్రసంగానికి ముందు ప్రవాసాంధ్రులతో భేటీ అయిన చంద్రబాబు, టీడీపీని గెలిపించమని కోరారు. అలాగే పలు కంపెనీలతో సమావేశం అయి ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు.



చంద్రబాబు అమెరికా పర్యటన ఖరారు

Updated By ManamTue, 09/11/2018 - 10:28

Chandrababu Naiduఅమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికా పర్యటన ఖరారైంది. ఈ నెల 23 నుంచి 26వ తేది వరకు నాలుగురోజులు చంద్రబాబు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. అనంతరం వివిధ వ్యాపారవేత్తలతో సమావేశం కానున్నారు. పర్యటనను ముగించుకొని ఈ నెల 27న అమెరికా నుంచి ఏపీకి తిరిగి రానున్నారు చంద్రబాబు.





Related News