Aravinda Sametha Veera Raghava

నేరుగా అరవింద పాటలు

Updated By ManamMon, 09/17/2018 - 10:50

Aravinda Samethaఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఇందులో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటించగా.. నాగబాబు, ఈషా రెబ్బా, ఆదర్శ్ తదితరులు కీలకపాత్రలలో కనిపించనున్నారు. కాగా ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన సింగిల్ అందరినీ ఆకట్టుకోగా.. ఈ నెల 20న అన్నీ పాటలు నేరుగా మార్కెట్‌లోకి రానున్నాయి. ఇక మూవీ విడుదలకు ముందు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. వీటితో పాటు ఈ నెల 18న ఎన్టీఆర్ అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ను ఇవ్వనుంది చిత్ర యూనిట్. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ అండ్ హాసిని బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

 ఎన్టీఆర్ చిత్రంలో మెగాస్టార్..?

Updated By ManamTue, 09/11/2018 - 11:26

NTR, Amitabhయంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఈ చిత్ర షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేయగా.. ఈ మూవీకి సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలింనగర్‌లో వినిపిస్తోంది. అదేంటంటే ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 

మనం చిత్రం ద్వారా టాలీవుడ్‌లో అతిథి పాత్రలో కనిపించిన అమితాబ్ బచ్చన్.. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డిలో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ క్రమంలో అరవింద సమేతలో కూడా అతిథి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

Related News