Nabha Natesh

యంగ్‌ హీరోతో దర్శకేంద్రుడి చిత్రం..?

Updated By ManamTue, 11/06/2018 - 12:45

Raghavendra Rao‘ఓం నమో వేంకటేశాయ’  తరువాత దాదాపు ఏడాదిన్నరగా ఖాళీగా ఉన్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు త్వరలో ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ‘ఈ నగరానికి ఏమైంది’ ఫేమ్ విశ్వక్‌సేన్ నాయుడు హీరోగా రాఘవేంద్రరావు ఓ చిత్రానికి ప్లాన్ చేసినట్లుగా సమాచారం. అంతేకాదు ఇందులో నబా నటేశ్, ఈషా రెబ్బాలను హీరోయిన్లుగా ఫిక్స్ చేసినట్లు కూడా టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.డ్యాన్సర్‌గా రవితేజ..?

Updated By ManamSat, 11/03/2018 - 10:13

Ravi Teja‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ ఓ చిత్రంలో నటించబోతున్నాడు. ‘డిస్కో రాజా’ అనే  పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నబా నటేశ్.. ‘ఆర్ఎక్స్100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇక ఈ చిత్రంలో రవితేజ డిస్కో డాన్సర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దానికి తగ్గట్లే ‘డిస్కో రాజా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’లో నటించగా.. ఈ నెల 16న ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రవితేజ సరసన ఇలియానా నటించింది.‘అదుగో’ రిలీజ్ డేట్ ఫిక్స్

Updated By ManamFri, 10/26/2018 - 11:53

Adugoపందిపిల్ల ప్రధానపాత్రలో విలక్షణ దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన చిత్రం ‘అదుగో’. ఇప్పటికే అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి విడుదల తేది ఫిక్స్ అయ్యింది. నవంబర్ 7వ తేదిన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఇక ఈ చిత్రంలో అభిషేక్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటించగా.. ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై రవిబాబు ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇప్పటకే పలు ప్రమోషన్లలో అందరినీ ఆకట్టుకున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి. మరోవైపు అవును2తో కాస్త ఢీలాపడ్డ రవిబాబు ఈ మూవీతో మళ్లీ ఫాంలోకి రావాలని చూస్తున్నాడు.మహేశ్ మేనల్లుడి చిత్రం ప్రారంభం

Updated By ManamThu, 10/18/2018 - 10:15
Ashok Galla

సూపర్‌స్టార్ మహేశ్ బాబు కుటుంబం నుంచి మరో వారసుడు సినీ ఇండస్ట్రీకి రాబోతున్నాడు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా ‘అదే నువ్వు అదే నేను’ అనే చిత్రం ప్రారంభం అయ్యింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్ర పూజా కార్యక్రమానికి దర్శకుడు రాఘవేంద్రరావు, సూపర్‌స్టార్ కృష్ణ, దర్శకురాలు మంజుల, గల్లా కుటుంబం తదితరులు హాజరయ్యారు. ఇక ఇందులో అశోక్ సరసన ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నబా నటేశ్ నటించనుండగా, హిప్ హాప్ తమిళ సంగీతం అందించనున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశి అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు.రవితేజ సినిమాలో నభా నటేష్

Updated By ManamSun, 09/23/2018 - 02:05

టాలీవుడ్‌కి వివిధ ప్రాంతాలకు చెందిన హీరోయిన్లు ఎంతో మంది పరిచయమ వుతుంటారు. కానీ, అందరూ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక పోవచ్చు. కొంతమందికి ఒకటి, రెండు సినిమాలు చేసిన తర్వాత హీరోయిన్‌గా మంచి బ్రేక్ వస్తుంది. దాంతో టాప్ హీరోయిన్లుగా వెలిగిపోతారు. మరికొందరు తొలి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించు కుంటారు. ఈమధ్యకాలంలో చాలా మంది హీరోయిన్లు ఈ తరహా పేరును సంపాదించుకున్నారు. తాజాగా నభా నటేష్‌కి స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. సుధీర్‌బాబు హీరోగా నటించి, నిర్మించిన ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది నభా నటేష్.

image


రవిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ‘అదుగో’ ఆమె తొలి సినిమా అయినప్పటికీ రిలీజ్ పరంగా ‘నన్ను దోచుకుందువటే’ తొలి సినిమాగా చెప్పుకోవాలి. కర్ణాటక నుంచి దిగుమతి అయిన నభా ఈ సినిమాలో గ్లామర్‌తో, నటనతో అందర్నీ ఆకట్టుకుంటోంది. తాజాగా సమాచారం ప్రకారం తన తదుపరి సినిమాని కూడా ఓకే చేసేసిందట. రవితేజ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నభా హీరోయిన్‌గా ఎంపికైంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. నవంబర్‌లో ఈ సినిమా ప్రారంభమవుతుంది.  రవితేజతో ‘నేలటిక్కెట్టు’ చిత్రాన్ని నిర్మించిన రామ్ తాళ్ళూరి ఈ సినిమాకు నిర్మాత.
 

image

 ‘నన్ను దోచుకుందువటే’ రివ్యూ

Updated By ManamFri, 09/21/2018 - 12:53
Nannu Dochukunduvate

స‌మ‌ర్ప‌ణ‌: శ్రీమ‌తి రాణి పోసాని
బ్యాన‌ర్‌:  సుధీర్‌బాబు ప్రొడ‌క్ష‌న్స్‌
న‌టీన‌టులు:  సుధీర్‌బాబు, న‌భా న‌టేశ్‌, నాజ‌ర్‌, తుల‌సి, సుద‌ర్శ‌న్, పృథ్వీ, జీవా, వైవా హ‌ర్ష‌ త‌దిత‌రులు
సంగీతం: అజ‌నీశ్ లోక్‌నాథ్‌
కెమెరా: సురేశ్ ర‌గుతు
ఎడిటింగ్‌:  ఛోటా కె.ప్ర‌సాద్‌
నిర్మాత :  సుధీర్‌బాబు
ద‌ర్శ‌క‌త్వం :  ఆర్‌.ఎస్‌.నాయుడు

ఇన్ని రోజులు హీరోగా రాణించిన సుధీర్‌బాబు ఉన్న‌ట్లుండి ట‌ర్న్ తీసుకుని నిర్మాత‌గా కూడా మారాడు. త‌నే హీరోగా, నిర్మాత‌గా చేసిన చిత్రం `నన్నుదోచుకుందువ‌టే`. టైటిల్ వింటేనే ఇదొక ల‌వ్‌స్టోరి అని ఎవ‌రికైనా అర్థ‌మైపోతుంది. కాబ‌ట్టి క‌థ గురించి, సినిమా ఎలా ఉంటుందో అని ప్ర‌త్యేకంగా ప్రేక్ష‌కుడు ఆలోచించుకునే పని ఉండ‌దు. `స‌మ్మోహ‌నం` వంటి స‌క్సెస్ త‌ర్వాత ఆర్‌.ఎస్‌.నాయుడు అనే కొత్త ద‌ర్శ‌కుడు సుధీర్‌బాబు చేసిన ఈ ప్ర‌య‌త్నం ఎంత వ‌రకు స‌త్ప‌లితాన్నిచ్చిందో తెలుసుకోవాలంటే క‌థేంటో చూద్దాం

క‌థ:
కార్తీక్ (సుధీర్ బాబు) ఓ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజ‌ర్‌గా ఉంటాడు. త‌న‌కు అమెరికా వెళ్లాల‌నేదే ల‌క్ష్యంగా ఉంటుంది. ఆ ల‌క్ష్యంతో చిన్న‌ప్పుడే త‌ల్లి చనిపోయినా.. తండ్రి(నాజ‌ర్‌)కి దూరంగా హాస్ట‌ల్స్‌లో పెరుగుతాడు. రోజులో 18 గంట‌ల‌కు పైగా ఆఫీస్ వ‌ర్క్‌లోనే ఉంటాడు. కార్తీక్ పెళ్లిని అత‌ని మేన‌కోడ‌లుతో చేయాల‌ని అత‌ని తండ్రి నిశ్చ‌యిస్తాడు. అయితే త‌న మేన‌కోడ‌లు మ‌రొక‌రిని ప్రేమిస్తుంద‌ని తెలుసుకుని.. త‌న‌కు సిరి అనే గ‌ర్ల్‌ఫ్రెండ్ ఉంద‌ని అబ‌ద్ధం చెబుతాడు. అది నిజమా?  కాదా?  అని తెలుసుకోవ‌డానికి హైద‌రాబాద్ వ‌చ్చిన తండ్రి కోసం షార్ట్ ఫిలింస్‌లో న‌టించే మేఘ‌న‌(న‌భా న‌టేశ్‌)ను సిరిగా యాక్ట్ చేయ‌మంటాడు. సిరి ప్ర‌వ‌ర్త‌న‌, క‌లుపుగోలుత‌నం కార్తీక్ తండ్రికి నచ్చుతుంది. ఈ ప్ర‌యాణంలో కార్తీక్‌, మేఘ‌న‌లు ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డ‌తారు. వారి ప్రేమ‌ను వ్య‌క్తం చేసుకోవాల‌నుకునే స‌మ‌యంలో అనుకోని మ‌లుపులు తీసుకుంటుంది క‌థ‌. ఆ మ‌లుపులేంటి?  చివ‌ర‌కు కార్తీక్‌, మేఘ‌న ఒక్క‌ట‌య్యారా?   కార్తీక్ అమెరికా వెళ్లాల‌నే ల‌క్ష్యం నేర‌వేరిందా?  అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

ప్ల‌స్ పాయింట్స్‌:
- నటీన‌టుల ప‌నితీరు
-కెమెరా పనిత‌నం
- ఫ‌స్టాఫ్‌లో వైవా హ‌ర్ష‌, సుధీర్ కామెడీ ట్రాక్‌

మైన‌స్ పాయింట్స్‌:
- క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం
- అన్ని వ‌ర్గాల‌ను మెప్పించే  కంటెంట్ కాదు
- ట్యూన్స్‌, బ్యాగ్రౌండ్ స్కోర్ సోసోగానే ఉంది

Nannu Dochukunduvate


విశ్లేష‌ణ‌
ఈ మ‌ధ్య‌నే `స‌మ్మోహ‌నం`తో హిట్ అందుకున్న క‌థానాయ‌కుడు సుధీర్‌బాబు. ఇందులో ప‌ర్ఫెక్ట్ కేర‌క్ట‌ర్‌ని ప్లే చేశారు. ప‌నిలో సిన్సియారిటీ ఉన్న బాస్‌గా కాస్త ఎక్కువ బాగా న‌టించారు. తండ్రి ముందు బాధ‌ప‌డే కొడుకుగా న‌టించే స‌న్నివేశాల్లో ఇంకాస్త మెచ్యూరిటీ కావాలేమోననిపించింది. అల్ల‌రిపిల్ల‌గా, నేటి త‌రానికి ప్ర‌తినిధిలా న‌భా చ‌క్కగా న‌టించింది. న‌భా తెలుగమ్మాయి కాదంటే ఎవ‌రూ న‌మ్మ‌రేమో. సౌత్ ఇండియ‌న్ గ‌ర్ల్ కాబ‌ట్టి ఆ అడ్వాంటేజెస్ ఉన్నాయి త‌న‌కి. సింగిల్ మ‌ద‌ర్‌గా, కూతురి ఇష్టాయిష్టాల‌ను అర్థం చేసుకునే త‌ల్లిగా తుల‌సి చ‌క్క‌గా న‌టించారు. మిగిలిన పాత్ర‌లు కూడా వాటి ప‌రిధి మేర‌కు బాగానే చేశారు. నిర్మాత పెట్టిన ఖ‌ర్చు కూడా తెర‌పై క‌నిపించింది. ఇన్నేళ్లుగా ఎన్ని సినిమాల్లో న‌టించినా రానంత లాభం ఈ సినిమాతో వ‌చ్చింద‌ని ఆ మ‌ధ్య సుధీర్ బాహాటంగానే చెప్పారు. అజ‌నీష్ సంగీతం ఇంకాస్త విన‌సొంపుగా ఉంటే బావుండేది. ఎడిటింగ్ విష‌యంలోనూ కాసింత క‌త్తికి ప‌దును పెట్టాల్సింది. డైలాగులు ఎఫెక్టివ్‌గా రాసుకుని ఉంటే బావుండేది. నిజానికి మంచి డైలాగులకు స్కోప్ ఉన్న సినిమా ఇది. చూసినంత సేపూ స‌ర‌దాగా సాగుతుంది. మాస్ ప‌ల్స్ ని అందుకునే స‌న్నివేశాలు మాత్రం త‌క్కువ‌గానే ఉన్నాయి. బీ,సీల్లో ఎలా ఆడుతుందో చూడాలి. మ‌ల్టీప్లెక్స్ మ‌న‌సుల‌ను మాత్రం దోచుకుంటుంది.
బాట‌మ్ లైన్‌: మ‌ల్టీప్లెక్స్ ఆడియ‌న్స్ ని `దోచుకుందువ‌టే`
రేటింగ్‌: 2.5/5కొడుకో.. కూతురో పుట్టినట్లు అనిపిస్తుంది - సుధీర్‌బాబు

Updated By ManamWed, 09/19/2018 - 20:01
nannu dochukundhuvate

సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ పతాకంపై సుధీర్‌బాబు, నభా నటేశ్ జంటగా నటించిన చిత్రం ‘నన్నుదోచుకుందువటే’. ఆర్.ఎస్.నాయుడు దర్శకుడు. ఈ నెల 21న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో హరీశ్ శంకర్ మాట్లాడుతూ ‘‘సాఫ్ట్‌వేర్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేసి నన్నుదోచుకుందువటే అనే టైటిల్ పెట్టాడంటే.  డైరెక్టర్ స్పాన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ‘సమ్మోహనం’ సినిమాలో సుధీర్ పెర్‌పార్మెన్స్‌కు ఫ్యాన్ అయ్యాను. అజనీష్ ట్యూన్ సెన్స్ బావుంది. సురేశ్ ఫోటోగ్రఫీ కాంటెంపరరీగా ఉంది. నభా నటేశ్ చాలా ఎక్స్‌ప్రెసివ్ హీరోయిన్.

    సుధీర్ ప్యాషన్‌తోనే సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇదే ప్యాషన్ తనను ఇంకా ముందుకు తీసుకెళుతుంది’’ అన్నారు. ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ ‘‘నేను చేసిన పదిహేను నిమిషాల షార్ట్‌ఫిలిం చూసి నచ్చడంతో సుధీర్‌బాబుగారు సినిమా ప్రొడ్యూస్ చేశారు. నభా నటేశ్ ఎనర్జిటిక్ గర్ల్. మంచి పెర్ఫామర్. అందరూ చక్కగా సపోర్ట్ చేశారు’’ అన్నారు. సుధీర్ బాబు మాట్లాడుతూ ‘‘మా ప్రొడక్షన్‌లో తొలి సినిమా. ఆర్.నాయుడుగారు కథ చెప్పినప్పుడు హీరో సుధీర్‌తో పాటు ప్రొడ్యూసర్ సుధీర్‌కి కూడా కథ బాగా నచ్చేసింది. నభా నటేశ్ చాలా మంచి నటి. హీరోగా చేస్తూ నిర్మాతగా చేయడం అంటే డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. బాగాఎంజాయ్ చేశాను. నాకొక కొడుకో, కూతురో పుట్టినట్టుగా ఉంది’’ అన్నారు. 
 నాకేం కొత్త కాదు

Updated By ManamTue, 09/18/2018 - 03:33

‘‘నటిగా కెమెరా ముందు నటించడం నాకేం కొత్త కాదు. అయితే ‘నన్ను దోచుకుందువటే’ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న పాత్రలో నటించడం ఎగ్జయిటింగ్‌గా అనిపించింది’ అన్నారు నబా నటేశ్. ఈమె కథానాయికగా నటించిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. ఈ నెల 21న విడుదలవుతుంది. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ‘‘రిలీజ్ పరంగా చూస్తే ‘నన్ను దోచుకుందువటే’ నా డెబ్యూ మూవీ.

image


రెండేళ్లు థియేుటర్స్ కోర్సు చేశాను. అలాగే మోడలింగ్ కూడా చేశాను. సుధీర్‌గారు హీరోగానే కాదు.. నిర్మాతగా కూడా నాకు స్పేస్ ఇచ్చారు. సన్నివేశాలను ఇద్దరం డిస్కస్ చేసుకోవడం వల్ల నాకు నటించేటప్పుడు మరింత ఈజీ అయింది. అలాగే డైరెక్టర్ రాజశేఖర్ నాయుడుగారు ఓ సీన్‌ను వివరించే తనకు ఎలాంటి అవుట్‌పుట్ కావాలో చెప్పి.. ‘నువ్వేలా చేస్తావో నీ ఇష్టం’ అనేవారు. నటిగా అంత మంచి స్పేస్ దొరికినప్పుడు ఎవైరెనా బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తారు. సెట్స్‌లో ప్రతి రోజూ కొత్తగా అనిపించేది’’ అన్నారు.
 

image

 అమెరికా వెళ్లే ప్రతోడి మీద అమ్మాయిలకు ఇష్టం ఉండదు

Updated By ManamTue, 09/11/2018 - 11:53

Nannu Dochukunduvate‘సమ్మోహనం’ చిత్రంతో ఈ ఏడాది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సుధీర్ బాబు.. త్వరలో ‘నన్ను దోచుకుందువటే’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. కామెడీ, యాక్షన్ మిళితమై వచ్చిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. చూస్తుంటే ఈ చిత్రంతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకునేలా ఉన్నాడు. కాగా ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన నబా నటేషి నటించగా.. నాజర్, షణ్ముక, వర్షిణి, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధీర్ నిర్మించగా.. అంజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించాడు.

Related News