Jagityal

ఆర్టీసీ చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదం

Updated By ManamTue, 09/11/2018 - 16:19
  • 51కి పెరిగిన మృతుల సంఖ్య

kondagattu bus accident: For the first time in the history of RTCకొండగట్టు : జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటన ఆర్టీసీ చరిత్రలోనే అది పెద్దదిగా చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 51మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 32మంది మహిళలు, 15మంది పురుషులు, నలుగురు చిన్నారులు ఉన్నారు. గాయపడ్డ మరో 37మందిని  జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్ ఆస్పత్రుల్లో చికిత్స అందచేస్తున్నారు. మృతుల్లో ఎక్కువమంది పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు చెందినవారు ఉన్నారు. బస్సు డ్రైవర్ శ్రీనివాస్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

Kondagattu bus accident: 51 dead, 37 injured in Telangana

ఆంజనేయస్వామికి ప్రీతిపాత్రమైన మంగళవారం కావడంతో కొండగట్టుపైన ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి భారీగా వెళ్లిన భక్తులు త్వరగా రావాలనే తొందరలో సానివారంపేట నుండి జగిత్యాల వస్తున్న ఆర్టీసీ బస్సులో  పరిమితికి మించి ఎక్కారు. తిరుగు ప్రయాణీకులతో ఘాట్ రోడ్‌పై జగిత్యాల వస్తున్న ఆ బస్సు స్పీడ్ బ్రేకర్ వద్ద కుదుపుకు గురవడంతో ప్రయాణీకులు డ్రైవర్ వైపుకి ఒరగటంతో బస్సు అదుపు తప్పి సుమారు 30 అడుగుల లోతులో ఘాట్ రోడ్డు నుండి పడిపోయింది. అయితే బస్సు రాంగ్ రూట్‌లో రావడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానికులు వెల్లడించారు.

బస్సులో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడంతోనే ప్రమాదం జరిగిందని, మరోవైపు బస్సు బ్రేకులు కూడా ఫెయిల్ అవడంతోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 88 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులు ఉండడంతో ఒకరి మీద మరొకరు పడటంతో ఊపిరాడక అధిక సంఖ్యలో ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ మృతుల్లో 35మందిని పోలీసులు గుర్తించారు.

మృతుల వివరాలు:

1. లాంబ కోటవ్వ 65 ( హిమత్ రావుపేట)
2. బందం లసవ్వ 65 ( ముత్యంపేట)
3. బొల్లారం బాబు 54 ( శనివారంపేట)
4. లైసెట్టి చంద్రయ్య 45 (శనివారంపేట)
5. ఎండికల ఎంకవ్వ ( శనివారంపేట)
6.ఇంద్రికాల సుమ 30 (శనివారంపేట)
7. రాజవ్వ 56 (డబ్బు తిమ్మయ్యపల్లి)
8. ఉత్తమ్ నందిని (కొనపూర్)
9 మాల్యాల అనిల్19 (హిమత్ రావుపేట)
10. గాజుల చిన్నవ్వ 60 ( డబ్బు తిమ్మయ్యపల్లి)

11. నామాల మౌనిక 24 సం ( శనివారంపేట)
12. బైరి రిత్విక్ 3సం ( రామసాగర్)
13. పోలు లక్ష్మి 50 ( హిమత్ రావుపేట)
14. చెర్ల లక్ష్మి 45 ( హిమత్ రావుపేట)
15. గండి లక్ష్మీ 60 ( శనివారం పెట)
16. డబ్బు అమ్మయి 50 ( డబ్బు తిమ్మయ్యపల్లి)
17. బండపల్లి చిలుకవ్వ 76 
18. గోలి అమ్మాయి 44 ( శనివారం పేట)
19. తిప్పర్తి వెంకటరత్నం 56 ( తిరుమల పూర్)
20. కంకణాల ఎల్లవ్వ 70 (సండ్రలపల్లి

21. చెర్ల గంగవ్వ 75 (శనివారం పేట)
22. ఒడినల లసమవ్వా 55 ( తిమ్మయ్యపల్లి)
23. ఒడినల కాశిరం 65 ( తిమ్మయ్యపల్లి)
24 బొంగిని మల్లయ్య 55 (పెద్దపల్లి)
25. గోల్కొండ లచవ్వ 50( డబ్బు తిమ్మయ్యపల్లి) 
26.గోల్కొండ దేవవ్వ 63 ( డబ్బు తిమ్మయ్యపల్లి)
27.కొండ అరుణ్ సాయి 5 (కోరేం) 
28. బొంగోని మదనవ్వా 65(పెద్దపల్లి)
29. శమకురా మల్లవ్వ 38 (తిర్మల్పూర్)
30. సలేంద్ర వరలక్ష్మి 28 (శనివారంపేట)


31. కుంబల సునంద 45 (శనివారంపేట)
32. గుడిసె రాజవ్వ 50 ( శనివారం పేట)
33. పందిరి సతవ్వ 75 (హిమత్ రావుపేట)
34. దాసరి సుశీల 55 (తిరుమలపూర్)
35. రాగల ఆనందం 55 (రామసాగర్) 
36. నేదునూరి మదనవ్వ 75 ( హిమాత్రవుపేట)
37. చెర్ల హైమా 30 ( హిమాత్రవుపేట)
38. పిడిగు రాజవ్వ 30 (డబ్బు తిమ్మయ్యపల్లి)అంజన్న సన్నిధిలో తీవ్ర విషాదం

Updated By ManamTue, 09/11/2018 - 13:52
  • కొండగట్టు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం

  • ఆర్టీసీ బస్సు బోల్తా, 45మందికి పైగా మృతి

  • పెరుగుతున్న మృతుల సంఖ్య

  • మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

  • రాంసాగర్ నుంచి జగిత్యాల వెళుతుండగా ప్రమాదం

Kondagattu bus accident: 40 dead, 28 injured in Telangana

కొండగట్టు : జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలోని ఘాట్ రోడ్డు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 40మందికి పైగా మృతి చెందారు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలంలోనే 26మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 21మంది మహిళలు, 20మంది పురుషులు, నలుగురు చిన్నారులు ఉన్నారు. బాధితులంతా జిగిత్యాల జిల్లాకు చెందినవారే.

తీవ్రంగా గాయపడినవారిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, వైద్యం అందిస్తున్నారు. మరోవైపు ఘ‌ట‌నాస్థ‌లంలోనే అత్య‌వ‌స‌ర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్పీ సింధూ శర్మ, కలెక్టర్ శరత్ సంఘటనాస్థలానికి చేరుకుని, సహాయక చర్యలు సమీక్షిస్తున్నారు. మరోవైపు ప్రమాదంపై అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 

అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 70మంది వరకూ ప్రయాణికులు ఉన్నట్లు సమచారం. కాగా శనివారంపేట నుంచి  ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు జగిత్యాల నుంచి రాంనగర్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. 
Bus accident at Kondagattu Ghat Roadకొండగట్టులో ఘోర రోడ్డు ప్రమాదం

Updated By ManamTue, 09/11/2018 - 12:10

51మంది దుర్మరణం, మరో 30మందికి గాయాలు

 

20 killed in kondagattu road accident

కరీంనగర్ : జగిత్యాల జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 50మంది దుర్మరణం చెందగా, మరో 30మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. 

కాగా ప్రమాదానికి గురైన బస్సు జగిత్యాల డిపోకి చెందింది. ఘాట్ రోడ్డు దిగుతుండగా బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అయితే బస్సు డ్రైవర్ కు అనుభవం లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.  ప్రమాదానికి గురైన బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో సుమారు 86మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది.

మరోవైపు స్థానికులు బస్సులో చిక్కుకున్న బాధితులను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మృతుల్లో మహిళలతో పాటు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై మాజీమంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బస్సు ప్రమాద బాధితులను ఆదుకుంటామని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. 

Related News