home to home campaigning

ఇంటింటి ప్రచారానికి సమాయత్తం

Updated By ManamWed, 09/12/2018 - 01:23
  • అభివృద్ధి, సంక్షేమమే తెరాస ప్రధానాస్త్రాలు  

హైదరాబాద్: తెరాస  శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించేందుకు సమాయత్తమయ్యాయి. ప్రతి పక్షాలు క్షేత్ర స్థ్ధాయికి చేరక ముందే తొలిదశ ప్రచారం ముగించాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రచార సామాగ్రిని రాష్ట్ర పార్టీ కార్యాలయం నుండి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 426 ప్రచారాంశాల తో నియోజక వర్గాల వారిగా కరపత్రాలను ముద్రిస్తున్నారు.   ప్రచార రథాలు  త్వరలోనే అభ్యర్ధులకు అంద చేయబోతున్నాయి. దాదాపు 70 నుండి 80 మంది అభ్యర్ధులు ప్రత్యేకంగా ప్రచార రథాల ను సిద్ధం చేసుకుంటున్నారు. బలమైన కాంగ్రెస్ అభ్యర్థ్ధులు పోటీలో ఉన్న నియోజక వర్గాలపైన తెరాస నాయకత్వం ప్రత్యేక శ్రద్ధ్ద కనబ రుస్తోంది.

imageగత ఎన్నికల్లో అతి స్వల్ప మెజా రిటీతో ప్రతిపక్షాలు గెలిచిన నియోజక వర్గాల పైన దృష్టి కేంద్రీకరించబోతుంది.పోటీలో ఉన్న వారందరిని గెలిపించుకోవాలనే ఆలోచనలో కేసీఆర్  ఉన్నందున 100 రోజుల్లో 50 ఎన్నికల బహిరంగ సభలు జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని పార్టీ వర్గాలు వెల్లడిం చాయి. ఇప్పటికే కొందరు అభ్యర్థ్ధులు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మరి కొందరు వినాయక చవితి తర్వాత ప్రచారం ప్రారంభిం చాలనే ఆలోచనతో ఉన్నారు. అభ్యర్థ్ధులను ప్రకటించినప్పటికీ చివరి నిమిషం లో పేర్లు తారుమారవుతాయనే భయంతో ఉన్న కొందరు అభ్యర్థ్ధులు అయోమయంలో పడిపోయారు. ఇప్పటి వరకు రంగంలోకి దిగండని కొందరికి మాత్రమే సంకేతాలు అందాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో అత్యధికులు ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. నల్లగొండ, ఖమ్మం, మహ బూబ్‌నగర్, రంగా రెడ్డి, హైదరాబాద్ జిల్లా పరిధిలో ప్రచారం కొంత ఆలస్యంగా ప్రారం భించే అవకాశం ఉంది.

మంత్రులు ఈటెల రాజేందర్, టి. హరీష్‌రావులు ఇప్పటికే జిల్లా నేతలతో సమావేశమయ్యారు. వరంగల్ జిల్లా నేతలు కూడా సమావేశం ఏర్పాటు చేసి తాజా పరిస్థితులను బేరీజు వేసుకున్నారు. ఆదిలాబా ద్ జిల్లాలో కూడా పలువురు అభ్యర్ధులు సీనియర్లను కలుసుకోవడం, ప్రజల మద్దతు ఉన్న నాయకులను ప్రచారంలో దింపడం జరు గుతుంది. పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్ నుండేఅభ్యర్థ్ధులు, రెబల్స్‌తో తాజా పరిణామాలపై చర్చిస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా నియోజక వర్గాల వారిగా పరిస్థితులను సమీక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ తదుపరి సభల తేదీలు త్వరలోనే ఖరారు చేస్తారని పార్టీ నాయకులు తెలిపారు. ప్రతిపక్షాలు అభ్యర్థ్ధులను ప్రకటించక ముందే తొలి దశ ప్రచారం ముగించాలనే ఆలోచనలో పలువురు అభ్యర్థ్ధులు ఉన్నారు. పెన్షన్లు, కల్యా ణలక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు, కుల వృత్తులకు సాయం, వ్యవ సాయానికి ని రంతర విద్యుత్, పంచాయతీలుగా గిరి జన తండాలు, మైనార్టీ సంక్షేమం, మరమగ్గాల ఆధునీకరణతో పాటు దాదాపు 426 అంశాలను ప్రచారం కోస ం గుర్తించారు. నియోజక వర్గాల వారిగా వివిధ పథకాల అమలును ప్రచారంలో పెట్టడం ద్వా రా ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందాలన్నారు.

Related News