jubilee hills police

రేవంత్‌కు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు

Updated By ManamWed, 09/12/2018 - 12:34
Jubilee Hills  Police serve notice to Revanth reddy

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అవకతవకల కేసులో  కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.  తప్పుడు పత్రాలతో ఇళ్ల స్థలాల కేటాయించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి 15 రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆ నోటీసులలో రేవంత్ రెడ్డికి సూచించారు. 41 సీఆర్పీసీ కింద రేవంత్ సహా 13మందికి నోటీసులు ఇచ్చారు. అయితే ఎన్నికల బిజీలో ఉన్నందున విచారణకు హాజరు కాలేనని ఆయన లేఖ రాశారు.

Related News