firecrackers

రెండు గంటలే కాల్చాలి

Updated By ManamWed, 10/24/2018 - 02:18
  • కాలుష్యరహితమైన వాటికే అనుమతి.. శబ్ద.. వాయుకాలుష్యం వస్తే కుదరదు

  • ఈ కామర్స్ సైట్ల అమ్మకంపై ఆంక్షలు.. పూర్తి నిషేధం విధింపునకు తిరస్కారం

  • వాటి అమ్మకందారులకూ జీవించేహక్కు.. ప్రజలకు కూడా అదే హక్కు ఉంటుంది

  • రెండింటి మధ్య సమతౌల్యం సాధించాలి.. పరిమిత శబ్దం వచ్చేవాటినే అమ్మాలి

  • సామూహిక దీపావళిని ప్రోత్సహించండి.. సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పు

firecrackersన్యూఢిల్లీ: దీపావళి రోజున కేవలం రెండు గంటలు మాత్రమే పటాకులు కాల్చుకోవాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అదికూడా శబ్దం, పొగ తక్కువగా వచ్చే ‘హరిత’ పటాకులు మాత్రమే కాల్చాలని తెలిపింది. అనుమతించిన పరిమితి దాటి శబ్దం వచ్చే టపాసులను ఈ కామర్స్ సైట్లలో కూడా అమ్మడానికి వీల్లేదని స్పష్టం చేసింది. జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మంగళవారం సంచలన తీర్పు వెల్లడించింది. దీపావళి టపాసుల కారణంగా వస్తున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా వాటి ఉత్పత్తి, అమ్మకాలను నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. టపాసులపై సంపూర్ణ నిషేధం విధించేందుకు కోర్టు నిరాకరించింది. కోర్టు సూచనలను ఈ కామర్స్ వెబ్‌సైట్లు పాటించకపోతే, వాటిని పూర్తిగా మూసేస్తామని హెచ్చరించింది. దీపావళి, ఇతర పండుగల సందర్భంగా ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతంలో సామూహికంగా టపాసులు కాల్చే విధానాన్ని ప్రోత్సహించాలని, అలాగే అన్ని రాష్ట్రాలలో ఇలా చేసేందుకు అవకాశాలు పరిశీలించాలని ధర్మాసనం తెలిపింది. నిషేధిత టపాసులు అమ్మితే, ఆ పరిధిలోని పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓలు బాధ్యులవుతారని స్పష్టం చేసింది. టపాసుల తయారీదారుల జీవన భృతికి సంబంధించిన ప్రాథమిక హక్కులు సహా అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు అంతకుముందు చెప్పింది. అదే సమయంలో దేశంలోని 130 కోట్ల మంది ఆరోగ్య హక్కును కూడా చూడాలని తెలిపింది. రాజ్యాంగంలోని 21వ అధికరణం (జీవించే హక్కు) ఈ రెండు వర్గాల ప్రజలకూ ఉంటుందని, అందువల్ల దేశవ్యాప్తంగా టపాసులపై నిషేధం విధించేముందు ఈ రెండింటిమధ్య సమతౌల్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని న్యాయమూర్తులు అన్నారు. టపాసుల వల్ల కలిగే కాలుష్యం, ఇతర ప్రభావాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. టపాసుల అమ్మకాన్ని పూర్తిగా నిషేధించకూడదని, దానికి బదులు గట్టిగా నియంత్రించాలని టపాసుల ఉత్పత్తిదారులు కోర్టును కోరారు. కేవలం టపాసుల వల్ల మాత్రమే కాలుష్యం పెరగదని, దానికి గాలి, ఉష్ణోగ్రతలాంటివి కూడా దోహదం చేస్తాయని అన్నారు. గత సంవత్సరం దీపావళికి ముందు అక్టోబరు 9వ తేదీన ఢిల్లీలో టపాసుల అమ్మకాన్ని సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిషేధించింది. కనీసం ఒకటి రెండు రోజులు అమ్ముకోడానికైనా అనుమతి ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేసినా, అందుకు కూడా అనుమతించలేదు. నెటిజన్ల మండిపాటు టపాసులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై నెటిజన్లు మండిపడుతున్నారు. బాణాసంచా పేలి ముగ్గురు సజీవ దహనం

Updated By ManamWed, 09/12/2018 - 13:11
Three killed in cracker blast in tamilnadu

చెన్నై : తమిళనాడు చెన్నైలో విషాద ఘటన చోటుచేసుకుంది. బాణాసంచా పేలి ముగ్గురు సజీవ దహనం అయిన దుర్ఘటన నగరంలో  శాస్త్రినగర్లో బుధవారం ఉదయం జరిగింది. టపాసులను కొనుగోలుచేసిన ఓ వ్యక్తి వాటిని వాహనంలోకి లోడ్ చేయిస్తుండగా, ఒక్కసారిగా పేలుడు సంభవించింది.

ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.  మరోవైపు  పేలుడు ధాటికి సమీపంలోని అయిదు ఇళ్లతో పాటు, ఓ అపార్ట్‌మెంట్ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

Related News