fassak

వాట్ ద ఫసాక్...

Updated By ManamWed, 09/12/2018 - 14:18

fassak

హైటెక్ యుగంలో ప్రతిది ఇప్పుడు ఫాస్ట్‌గా రిసీవ్ చేసుకుంటున్నారు యంగ్‌స్టర్స్. చేతిలో మొబైల్, ఆఫీస్ వేళల్లో కంటి ముందు సిస్టం.. ఇంకే ముంది బాహ్య ప్రపంచంలో, సినిమాల్లో ఏదైనా జోక్ పేలినా లేదా పొలిటీషియన్స్ నోరు జారినా ఇప్పుడు ప్రతిది జోక్ గా అవతార మెత్తుతుంది. ఒకప్పుడు ఓ జోక్ ని పది మంది లో పంచుకోవాలనుకుంటే జంకే జనాలు లేటెస్ట్‌గా వచ్చిన ఫన్ పేజ్ లు, ట్రోల్ పేజ్‌ల పుణ్యాన మెమేల  రూపంలో ఆయుధం దొరికినట్టైంది. 

సాధారణంగా  మనం మాట్లాడేప్పుడు అందరికి కొన్ని ఊత పదాలు తరచూ ఉపయోగిస్తుంటాం. ఆశ్చర్యమైన, సంతోష మైనా , దుఖమైనా, ఎలాంటి ఎమోషన్ అయినా సరే ఠక్కునా ఆ పదాలు బయటికి రావాల్సిందే.... ఒకప్పుడు సినీ హీరోలను వారి డైలాగ్స్‌ను కాపీ కొట్టి  వ్యంగానికి ఉపయోగించే ఊతపదాలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్స్, ఫేస్‌బుక్ నుండి వచ్చేస్తున్నాయి. 

మారుతున్న జెనెరేషన్‌కి తగ్గట్టు ఫాస్ట్ కల్చర్ ప్లస్ నేటి ట్రెండ్‌కి తగ్గట్టు ఈ పదాలు నెటిజన్స్‌తో పాటు సాధారణ జనాలకు కూడ నవ్వు పుట్టిస్తున్నాయి. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లేదా ట్విట్టర్ ఏ సోషల్ మీడియా అయినా కానివ్వండి ట్రోలర్స్ రూల్ చేస్తున్నారు. ఒకప్పుడు కేవలం ఫోటోలు పెట్టుకోవటానికి, తమ ఎమోషన్స్ పంచుకోవటానికి వేదికగా మారిన సోషల్ మీడియా ఇప్పుడు రాజకీయ నాయకుల కుళ్ళు కుతంత్రాలను, సెలెబ్రిటీల లేటెస్ట్ అప్‌డేట్స్, జోక్స్‌ని ట్రోల్ చేయటంతో లక్షల వ్యూవ్స్, మనీని సంపాదించి పెడుతున్నాయని ప్రెజెంట్ ఓ యూత్ ఊతపదం ఫసక్ అని హైదరాబాద్‌కి చెందిన సుందర్ తెలిపాడు. 

ఇప్పటికే వేలాది మంది పేజీలను క్రియేట్ చేసి ట్రోలర్స్‌గా మారుతున్నారు. వాట్సప్‌లో ఏదైనా జోక్ పేలితే చాలు వాటికి ఎఫ్బీ, సోషల్ మీడియా మాథ్యమాల ద్వార విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంది. ఒక సాధారణ పౌరున్ని హీరో చేయాలన్నా, ఓ రాజకీయ నాయకుణ్ణి జీరో చేయాలనుకున్న సోషల్ మీడియా చేతికి దొరికారో ఇక ఖేల్ ఖతం అనుకోవచ్చు.  

ఉదాహరణకి కేరళ  వరదల్లో చిక్కుకున్న వారికి తన వీపు మీద ఎక్కించుకున్న చిత్రం లోని అబ్బాయి హీరో అయితే ఓ ఫేమస్ పొలిటీషియన్ యాంకర్ అడిగిన ప్రశ్నకు తప్పుడు సమాధానమిచ్చి పదవి పోగొట్టుకున్నారనే వార్తలు విపరీతమైన ఫాలోయింగ్‌ని తెచ్చిపెట్టాయి అనడంలో సందేహమేమి లేదు. ఇకపోతే సోషల్ మీడియాలో ఎంత పాజిటివ్ ఉందో అంతే నెగెటివ్ న్యూస్ కూడ ఈజీగా స్ప్రెడ్ అవుతుందని తస్మాత్ జాగ్రత్త అని పోలీసులు కూడా చాలాసార్లు సాఫ్ట్‌గా వార్నింగ్‌లు ఇచ్చారు.

Related News