Fight Masters

వారి సలహా మేరకే ‘అరవింద’ క్లైమాక్స్‌ను మార్చా

Updated By ManamFri, 10/12/2018 - 10:54

Trivikramఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ క్రమంలో సినిమా విజయంపై దర్శకుడు త్రివిక్రమ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

సక్సెస్ మీట్‌లో మాట్లాడిన త్రివిక్రమ్ ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ‘‘సాధారణంగా ఏ సినిమాలో అయినా చివరిలో యుద్ధం జరుగుతంది. అలా కాకుండా ఈ సినిమాలో మేము యుద్ధం తరువాత కథను చెప్పగలిగాము. నిజానికి క్లైమాక్స్ కోసం ఓ యాక్షన్ సీన్ అనుకున్నాం. కానీ యాక్షన్‌తో క్లైమాక్స్ వద్దని ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ సూచించారు. వారి సూచన అందరికీ నచ్చడంతో అలాగే చేశాం. సినిమా రిలీజ్ తరువాత క్లైమాక్స్‌పై మంచి ప్రశంసలు వినిపిస్తున్నాయి. అందుకు రామ్-లక్ష్మణ్‌కు థ్యాంక్స్ చెబుతున్నాం’’ అని త్రివిక్రమ్ అన్నారు.



రిటైర్మెంట్ తీసుకోనున్న రామ్-లక్ష్మణ్

Updated By ManamWed, 09/12/2018 - 14:37

Ram- Lakshmanఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఫైట్స్ అందించిన టాలీవుడ్ ఫైట్ మాష్టర్స్ రామ్- లక్ష్మణ్ త్వరలో రిటైర్మెంట్ తీసుకోనున్నారు. ఈ విషయాన్ని ఆ ఇద్దరు వెల్లడించారు. త్వరలో సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకొని, తమ గ్రామానికి వెళ్లి సాధారణ జీవితాన్ని గడపాలనుకుంటున్నామని రామ్- లక్ష్మణ్ తెలిపారు. 

కాగా 2001లో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన రామ్- లక్ష్మణ్‌లు 1100పైగా సినిమాలకు ఫైట్స్ అందించారు. ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. పలు చిత్రాల్లో కూడా నటించారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’తో పాటు మహేశ్ బాబు ‘మహర్షి’, విజయ్ ‘సర్కార్’ చిత్రాలకు పనిచేస్తున్నారు. 





Related News