crazy crazy feeling

పోస్ట్ ప్రొడక్షన్‌లో ‘క్రేజీ క్రేజీ ఫీలింగ్’

Updated By ManamWed, 09/12/2018 - 17:46
crazy crazy feeling

విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం  ‘క్రేజీ క్రేజీ ఫీలింగ్’ . సంజయ్ కార్తీక్ దర్శకుడు.  విష్వంత్ , పల్లక్ లల్వాని జంటగా నటిస్తున్నారు . షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది . ఈ సందర్బంగా దర్శకుడు సంజయ్ మాట్లాడుతూ .. కేరింత , మనమంతా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విష్వంత్ హీరోగా , పల్లక్ లల్వాని హీరోయిన్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది . ప్రేమికుల మధ్య వుండే ఫీలింగ్స్ ని వినోదాత్మకంగా చూపిస్తున్నాం. వెన్నెల కిశోర్ పాత్ర ఆకట్టుకుంటుంది . 

నిర్మాత మధు మాట్లాడుతూ .. ప్రేమ, ఫీల్, వినోదం ఈ మూడు అంశాలకు ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు సంజయ్ యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ గా క్రేజీ క్రేజీ ఫీలింగ్ ని రూపొందిస్తున్నారు . ప్రసాద్ లాబ్స్ , రామానాయుడు స్టూడియోల్లో నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి . విడుదలయ్యేంత వరకే చిన్న సినిమా, విజయం సాధించి పెద్ద సినిమా అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విష్వంత్ , పల్లక్ లల్వాని ,వెన్నెల కిశోర్ , ఫిదా ఫేమ్ శరణ్య, సుమన్, పోసాని తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో, సాహిత్యం సురేష్ ఉపాధ్యాయ , కాసర్ల శ్యామ్ , కెమెరా సుభాష్ దొంతి , ఆర్ట్ నాగు , కొరియోగ్రఫీ రాజకిరణ్, చార్లీ.





Related News