Sardar Singh

సచిన్ స్ఫూర్తినిచ్చాడు

Updated By ManamSat, 09/15/2018 - 21:53
  • విశ్రాంత హాకీ ప్లేయర్ సర్దార్ సింగ్   

imageన్యూఢిల్లీ: ఈ ఏడాది ఆరంభంలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ తర్వాత నిరుత్పాహంతో ఉన్న తనకు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాటలు స్ఫూర్తి నిచ్చాయని.. తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించగలిగానని ఇటీవల రిటైర్ అయిన హాకీ మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ చెప్పాడు. 12 ఏళ్ల సుదీర్ఘ ఘనమైన కెరీర్ అనంతరం బుధవారం సర్దార్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన ఆసియా గేమ్స్‌లోనూ సర్దార్ పేలవ ప్రదర్శన కొనసాగింది. దీంతో భారత జట్టు కాంస్య పతకంతో తిరిగొచ్చింది. ఈ ఏడాది గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ తర్వాత సర్దార్ సింగ్ జట్టులో చోటు కోల్పోయాడు. దీంతో సచిన్ సలహా తీసుకోవాలని భావించాడు.

లెజెండ్ ఇచ్చిన టిప్స్ అద్భుతంగా పనిచేశాయి. దీంతో అతను మళ్లీ చాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు సంపాదించాడు. ఆ టోర్నీలో భారత జట్టు చారిత్రాత్మక రజత పతకం గెలిచింది. ‘సచిన్ పాజీ నాలో స్ఫూర్తి నింపారు. గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నాకు గత మూడు, నాలుగు నెలలుగా ఆయన చాలా సహాయం చేశారు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పని సందర్భమే లేదు. కామన్వెల్త్ గేమ్స్ జట్టు నుంచి నేను తొలగించబడినప్పుడు నేను పూర్తిగా నిరుత్సాహంతో ఉన్నాను. సచిన్ పాజీకి ఫోన్ చేసి మీరు డకౌట్ అయిన సందర్భంలో ఏం చేసే వారని అడిగాను. నాకు దాదాపు 20 నిమిషాలు కౌన్సిలెంగ్ ఇచ్చారు. విమర్శలను మర్చిపొమ్మన్నారు. ఉత్సాహంగా ఉండి ముందుకు సాగమన్నారు. పాత వీడియోలు చూసి ఓ అంచనాకు రమ్మని చెప్పారు. సహజసిద్ధమైన ఆటను ఆడమని సూచించారు. ఇవన్నీ నాకు ఎంతో ఉపయోగపడ్డాయి’ అని సర్దార్ చెప్పాడు.భారత హాకీ మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ రిటైర్మెంట్..

Updated By ManamWed, 09/12/2018 - 20:29

India hockey, Former India hockey captain, Sardar Singh, Sardar Singh retirementన్యూఢిల్లీ: భారత హాకీ మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ బుధవారం తన హాకీ క్రీడకు రిటైర్మెంట్‌  ప్రకటించాడు. గత 12ఏళ్లుగా ఎన్నో హాకీ టోర్నమెంట్‌లలో ఆడానని, ప్రస్తుతం యువ హాకీ క్రీడాకారులకు ఇది అనువైన సమయంగా పేర్కొన్నాడు. ఆసియా గేమ్స్ క్యాంపెయిన్‌లో భాగంగా జరిగిన టైటిల్ పోరులో భారత్ హాకీ జట్టు పరాజయం పాలై కాంస్యంతో సరిపెట్టుకుంది. దాంతో సర్దార్ తన హాకీ క్రీడకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. ‘‘చంఢీగఢ్‌లోని నా కుటుంబ సభ్యులు, స్నేహితులతో చర్చించాక హాకీ ఇండియా జట్టు నుంచి నిష్ర్కమించాల్సిందిగా నిర్ణయం తీసుకున్నాను. నాకు తెలిసి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను’’ అని తెలిపాడు.

ఆస్తకికరమైన విషయం ఏమిటంటే.. జకార్తాలో ఆసియాన్ క్రీడలు జరుగుతున్న సమయంలో సర్దార్.. తాను ఇంకా హాకీని వదల్లేకపోతున్నానని, చివరిగా టోక్యోలో 2020 ఒలింపిక్స్‌లో ఆడాలనేది కోరికగా ఉన్నట్టు సర్దార్ తన మనసులోని అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. కానీ, అనుకోని పరిస్థితుల్లో సర్దార్ తాను రిటైర్మెంట్‌ ప్రకటించాల్సి వచ్చింది. ఈ నెల 16 నుంచి భువనేశ్వర్‌లో ప్రారంభం కానున్న జాతీయ క్యాంపుకు ఎంపికైన 25 సభ్యుల కోర్ గ్రూపు నుంచి బుధవారం సర్దార్‌ను తప్పించారు. సర్దార్ వయస్సు, ఆటతీరు ప్రదర్శనలో వేగం తగ్గినట్టు గుర్తించిన సెలెక్టర్లు అతన్ని తప్పించినట్టు కనిపిస్తోంది.  

Related News