VRO Exam

మంగళసూత్రాల వివాదంపై కమిషన్ సీరియస్

Updated By ManamMon, 09/17/2018 - 17:35
  • వీఆర్వో పరీక్షలో మంగళసూత్రాల వివాదం

  • దర్యాప్తు చేసి టీఎస్‌పీఎస్సీకి మెదక్ జిల్లా కలెక్టర్ నివేదిక

  • పరీక్షా కేంద్రాన్ని బ్లాక్ లిస్టులో పెట్టిన కమిషన్

TSPSC serious on No entry into VRO exam hall with mangalsutra

హైదరాబాద్ : తెలంగాణ ప్రబుత్వం ఆదివారం నిర్వహించిన వీఆర్‌ఓ పరీక్షకు హాజరైన మహిళా అభ్యర్థుల ‘మంగళ సూత్రాలు’ వివాదం అంశాన్ని  టీఎస్‌పీఎస్సీ సీరియస్‌గా తీసుకుంది. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ పట్టణంలోని లిటిల్‌ ప్లవర్‌ స్కూల్‌లోని పరీక్ష కేంద్రానికి వచ్చిన  మహిళలను అడ్డుకున్న పరీక్షా కేంద్రం సిబ్బంది, మహిళా అభ్యర్థుల ఒంటిపై పుస్తెలు, మట్టెలు ఉండకూడదని, అవి తీస్తేనే పరీక్ష రాయడానికి అనుమతిస్తామని స్పష్టం చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తాళి బొట్టు, మెట్టెలు  తీసి తమ భర్తలకు ఇచ్చి పరీక్ష రాసేందుకు లోపలకు వెళ్ళారు. దీంతో భర్తలు తమ భార్యల తాళిబొట్లు పట్టుకొని నిరసన చేపట్టడంతో  పోలీసులు, జిల్లా అధికారులు రంగంలోకి దిగారు.

ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో  టీఎస్‌పీఎస్సీ నివేదిక ఇవ్వాలంటూ మెదక్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేపట్టిన కలెక్టర్... ఈ చర్యతో పలువురు మహిళా అభ్యర్థులు ఇబ్బందిపడిన  విషయం వాస్తవమేనంటూ సోమవారం నివేదిక సమర్పించారు. దీంతో ఆ కేంద్రాన్ని బ్లాక్ లిస్టులో పెట్టాలని కమిషన్ ఆదేశించింది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌కు టీఎస్‌పీఎస్సీ సూచించింది.



16న వీఆర్వో పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి.. 

Updated By ManamWed, 09/12/2018 - 20:42

VRO Exam, TSPSC secreatary Vani prasadh, VRO Hall tickets Download హైదరాబాద్‌: తెలంగాణలో ఈ నెల 16న జరగనున్న వీఆర్వోల రాత పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు బుధవారం టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీ ప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 700 వీఆర్వో పోస్టులకు 10,58,868 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని ఆమె చెప్పారు. ఇప్పటివరకూ 7,73,000 మంది అభ్యర్థులు వీఆర్వో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్టు పేర్కొన్నారు. 16వ తేదీ (ఆదివారం) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని వాణీ ప్రసాద్ తెలిపారు.

పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, గ్యాడ్జెట్లు, పర్సులను పరీక్ష హాలులోకి అనుమతించమని తేల్చి చెప్పారు. పరీక్ష రోజున ఉదయం 10.45 గంటలలోపు అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి చేరుకోవాలన్నారు. వీఆర్వో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులంతా తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే జిల్లాల హెల్ప్ డెస్క్‌ను సంప్రదించవచ్చునని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 2945 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వాణీ ప్రసాద్ తెలిపారు. 





Related News