ntr

‘ఆర్ఆర్‌ఆర్’ కోసం కొత్త భాష..?

Updated By ManamTue, 11/13/2018 - 10:28
RRR

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి పూజా కార్యక్రమాలను పూర్తి అవ్వగా.. నవంబర్ 19నుంచి మొదటి షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

కాగా ‘బాహుబలి’ చిత్రంలో కిలికి అనే భాషను పరిచయం చేసిన రాజమౌళి ఈ చిత్రం కోసం కూడా మరో కొత్త భాషను సృష్టించాలని అనుకుంటున్నారట. ఇందులో భాగంగా తెలుగులో సాయి మాధవ్ బుర్రా, తమిళ్‌లో కర్కి(కిలికి భాష రచయిత)లను రంగంలోకి దింపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ పాత్ర కోసం ఆ ఇద్దరు కొత్త భాషను సృష్టించబోతున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.మహానాయకుడు వాయిదా పడనుందా!

Updated By ManamMon, 11/12/2018 - 23:11

imageనందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తూ.. ఆయన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్‌ను ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’, ‘యన్.టి.ఆర్ మహానాయకుడు’ అనే రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. ముందుగా ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’ని జనవరి 9న.. ‘యన్.టి.ఆర్ మహానాయకుడు’ చిత్రాన్ని జనవరి 24న విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. అయితే ఇంత తక్కువ వ్యవధితో రెండు భాగాన్ని విడుదల చేయడం వల్ల బయ్యర్లు నష్టపోయే అవకాశం ఉండటంతో రెండో భాగం ‘యన్.టి.ఆర్ మహానాయకుడు’ చిత్రాన్ని ఫిబ్రవరి 14న విడుదల చేయాలనుకుంటున్నట్లు సమాచారం. మరి దీనిపై చిత్ర దర్శకుడు క్రిష్, నిర్మాతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఈ చిత్రంలో విద్యాబాలన్, రానా, సచిన్ ఖేడేకర్, జిస్సేన్ గుప్తా, సుమంత్, సహా పలువురు అగ్రతారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రారంభం

Updated By ManamSun, 11/11/2018 - 11:45
RRR

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించనున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ప్రారంభమైంది. క్రేజీ మల్టీస్టారర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్ర పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, సురేశ్ బాబు, వివి వినాయక్, రానా, శోభు యార్లగడ్డ తదితరులు హాజరయ్యారు. అలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కూడా పూజకు హాజరయ్యారు. ఇక ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. జనవరి నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.‘ఎన్టీఆర్ ఫొటో, పేరు వాడుకోవద్దు’

Updated By ManamSat, 11/03/2018 - 18:18
TDP-Congress alliance: Lakshmi Parvati protests at NTR Ghat

హైదరాబాద్: ‘తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఎన్టీఆర్ టీడీపీని నెలకొల్పారు. కానీ, నీచ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నేడు కేంద్ర నాయకుల వద్ద వంగివంగి దండాలు పెడుతున్నాడు’  అని స్వర్గీయ ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి అన్నారు. ‘ఎన్టీఆర్ భార్యగానే వచ్చాను. రాజకీయాలు చేయడానికి కాదు’ అని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుపొట్టుకోవడాన్ని లక్ష్మీపార్వతి ఖండించారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచాడని నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని ఆమె నిరసన తెలిపారు. చంద్రబాబు దుష్ట రాజకీయాలపై లక్ష్మీపార్వతి ఒక లేఖ రాసి ఎన్టీ రామారావు సమాధి వద్ద ఉంచారు.

ఏనాడూ కేంద్రానికి దాసోహం అవకుండా, ఎవరికీ  తలవంచకుండా ఎన్టీఆర్ పరిపాలన చేశారని గుర్తుచేశారు. నేడు కేవలం తన స్వార్ధం కోసం చంద్రబాబు కాంగ్రెస్‌తో జతకట్టారనీ, మహనీయుడయిన ఎన్టీఆర్ పేరుని కూడా ఉచేరించే అర్హత చంద్రబాబుకు లేదని లక్ష్మిపార్వతి ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఎన్టీఆర్ పేరు గానీ, ఫోటో గాని పెట్టుకొనే హక్కు టీడీపీ కోల్పోయిందని వ్యాఖ్యానించారు.‘తమ్ముళ్ల’ రోషం, పౌరుషం ఏమైంది?

Updated By ManamSat, 11/03/2018 - 15:50
YSRCP MP Vijay Sai Reddy Tweet Irks Telugudesam party

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ‘తెలుగు తమ్ముళ్ల రోషం, పౌరుషం ఏమైంది? మీ ఆరాధ్య దైవం ఎన్టీఆర్ ఆత్మ ఘోష వినపడలేదా? నాడు వెన్నుపోటు పొడిచిన బాబు నేడు ఆయన ఆత్మక్షోభకు గురిచేస్తే తిరగబడరా? ఏ సిద్ధాంతంతో ఎన్టీఆర్ పార్టీ పెట్టారో దానిని చంద్రబాబు కాంగ్రెస్ కాళ్ల దగ్గర పెట్టి కళ్లకద్దుకుంటుంటే మీ రక్తం మరిగిపోవడం లేదా? అని ప్రశ్నించారు. ఈ మేరకు విజయసాయి రెడ్డి శనివారం ట్వీట్ చేశారు.‘యన్‌టిఆర్‌’లో వినాయక్..?

Updated By ManamFri, 11/02/2018 - 09:58

V.V.Vinayakబాలకృష్ణ ప్రధానపాత్రలో క్రిష్ దర్శకత్వంలో భారీ తారాగణంతో తెరకెక్కుతున్న చిత్రం ‘యన్‌టిఆర్’. నటసార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం గురించిన మరో వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే ఈ చిత్రంలో సెన్సేషనల్ దర్శకుడు వినాయక్ నటించనున్నారట. లెజండరీ దర్శకుడు దాసరి నారాయణ రావు పాత్రలో వినాయక్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు, మనుషులంతా ఒక్కటే, సర్కస్ రాముడు, విశ్వరూపం, ప్రేమ సింహాసనం వంటి హిట్ చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వ్యక్తిగతంగానూ ఎన్టీఆర్‌తో దాసరికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పాత్ర కూడా కీలకం అవ్వనుండగా.. దాసరి పాత్రలో వినాయక్ కనిపించనున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఈ చిత్రాన్ని బాలకృష్ణ, విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.వాయిదా పడనున్న ‘యన్‌టిఆర్’..?

Updated By ManamWed, 10/31/2018 - 10:40

NTRనటసార్వభౌమ ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యన్‌టిఆర్’. ఎన్టీఆర్ వారసుడు బాలకృష్ణ ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘యన్‌టిఆర్-కథానాయకుడు’, ‘యన్‌టిఆర్-మహానాయకుడు’ అనే రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మొదటి భాగంలో ఎన్టీఆర్ సినీ చరిత్రను, రెండో భాగంలో ఆయన రాజకీయ జీవితాన్ని చూపించనున్నారు.

ఇక మొదటి చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9, రెండో భాగాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 24వ తేదిన విడుదల చేయనున్నట్లు అధికారికంగా కూడా ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం రెండో భాగం విడుదలను వాయిదా వేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. మొదటి భాగం తరువాత రెండో భాగ ప్రమోషన్లలో సమయం తక్కువగా ఉన్నందున ఫిబ్రవరికి యన్‌టిఆర్-మహానాయకుడును వాయిదా వేయాలని అనుకుంటున్నట్లు టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.‘ఆర్ఆర్ఆర్‌’పై మరో ఆసక్తికర వార్త

Updated By ManamTue, 10/30/2018 - 16:32

RRRఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి మల్టీస్టారర్ చిత్రం ప్రకటించినప్పటి నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ స్థాయిలో అంచనాలు మొదలయ్యాయి. అందుకు తగ్గట్లుగా రాజమౌళి కూడా పక్కా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్నాడు. అయితే ఈ చిత్రం ఇంకా సెట్స్ మీదకు వెళ్లకముందే దీని గురించి ఏదో ఒక ఆసక్తికర వార్త వినిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో ‘ఆర్ఆర్ఆర్’ గురించిన మరో వార్త తాజాగా ఫిలింనగర్‌లో వినిపిస్తోంది.

అదేంటంటే ఈ సినిమాలో కీలకమైన ఇంటర్వెల్ సీన్‌ను రాజమౌళి భారీగా డిజైన్ చేస్తున్నాడట. ఈ ఒక్క సీన్‌నే దాదాపు 45రోజుల పాటు తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు కూడా తెలుస్తోంది. మరి వీటన్నింటిలో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.హరికృష్ణ అస్థికలు నిమజ్జనం

Updated By ManamTue, 10/30/2018 - 15:13

Harikrishnaరోడ్డు ప్రమాదంలో మరణించిన నందమూరి హరికృష్ణ అస్థికలను ఆయన కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రం బీచుపల్లి సన్నిధికి వెళ్లిన ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు వేదమంత్రోచ్ఛారణల మధ్య హరకృష్ణ అస్థికలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఆ ఇద్దరికి చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున అక్కడకు చేరుకోగా.. భద్రతా సిబ్బంది దగ్గరకు రానివ్వకపోవడంతో వెనుదిరిగి వెళ్లారు. అయితే నల్గొండ జిల్లాలో ఆగష్టు 29న జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతిచెందిన విషయం తెలిసిందే.‘ఆర్ఆర్ఆర్‌’లో ముగ్గురు హీరోయిన్లు..?

Updated By ManamMon, 10/29/2018 - 12:44

RRRఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ఓ మల్టీస్టారర్‌ను తెరకెక్కించనున్నారు. నవంబర్‌లో ఈ చిత్రం ప్రారంభం అవ్వనుండగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కథానుగుణంగా ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటించనుండగా, అందులో ఒక ఫారిన్ బ్యూటీ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్న విషయం తెలిసిందే.

Related News