ntr

ఎన్టీఆర్ చిత్రంలో మెగాస్టార్..?

Updated By ManamTue, 09/11/2018 - 11:26

NTR, Amitabhయంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఈ చిత్ర షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేయగా.. ఈ మూవీకి సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలింనగర్‌లో వినిపిస్తోంది. అదేంటంటే ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 

మనం చిత్రం ద్వారా టాలీవుడ్‌లో అతిథి పాత్రలో కనిపించిన అమితాబ్ బచ్చన్.. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డిలో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ క్రమంలో అరవింద సమేతలో కూడా అతిథి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.ఆంధ్రా పార్టీకాదు...అందరి పార్టీ

Updated By ManamSat, 09/08/2018 - 17:26
l ramana

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తెలంగాణలో టీడీపీ లేకుండా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని ఆయన చెప్పుకొచ్చారు.  టీడీపీ ఆంధ్రుల పార్టీ అన్న కేసీఆర్... గతంలో టీడీపీ ఎమ్మెల్యే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.  

టీడీపీ ఆంధ్రా పార్టీ కాదని అందరి పార్టీ అన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆత్మ హైదరాబాద్‌లోనే ఉందని అన్నారు. తెలంగాణలో అప్పులు ఎలా పెరిగాయో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ప్రగతి భవన్‌ను ప్రభుత్వ ఆస్పత్రిగా మార్చడం ఖాయం అని ఎల్ రమణ వ్యాఖ్యానించారు. 

కాగా తెలంగాణలో  ముందస్తు ఎన్నికల నేపథ్యంలో  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాదులోని లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌లో తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా పొత్తులపైనే చర్చ జరిగింది. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో చంద్రబాబు...పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.నేడు హరికృష్ణ పెద్ద కర్మ.. పూర్తైన ఏర్పాట్లు

Updated By ManamSat, 09/08/2018 - 09:22

Harikrishnaగత నెల 29న నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సినీ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ  పెద్ద కర్మ ఇవాళ జరగనుంది. నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ గ్రాండ్ లాన్స్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికి జలవిహార్‌లో ఏర్పాట్లు పూర్తి కాగా, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దీనికి హాజరయ్యే అవకాశం ఉంది.

అయితే నెల్లూరు జిల్లాలో ఓ వివాహ వేడుక కోసం గత నెల 29న హరికృష్ణ కారులో వెళుతుండగా.. నార్కట్‌పల్లి సమీపంలో ఆయన కారు డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన హరికృష్ణను కామినేని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.‘యన్‌టిఆర్‌’లో రాశిఖన్నా.. క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ

Updated By ManamThu, 09/06/2018 - 14:29

Raashi Khannaబాలకృష్ణ ప్రధానపాత్రలో క్రిష్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘యన్‌టిఆర్’. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటుండగా.. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రంలో జయప్రద పాత్రలో బబ్లీ గర్ల్ రాశిఖన్నా నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇవి కాస్త ఆమె వరకు చేరడంతో వాటిపై రాశిఖన్నా స్పందించింది.

తను ఈ చిత్రంలో ఇంకా భాగం అవ్వలేదని తెలిపింది. యన్‌టిఆర్ చిత్రం కోసం ఎవరూ తనను సంప్రదించలేదని, మీలాగే నాకు కూడా ఇది ఓ వార్త అంటూ పేర్కొంది. కాగా రాశిఖన్నా నటించిన తమిళ చిత్రం ఇమైక్క నొడిగల్ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.ఎన్టీఆర్ కుమార్తెగా నితిన్ చెల్లెలు

Updated By ManamTue, 09/04/2018 - 14:41

Heroshini Komali ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నటసార్వభౌమ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం యన్‌టిఆర్. బాలకృష్ణ ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. విష్ణు ఇందూరి, బాలకృష్ణ, సాయి కొర్రపాటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కుమార్తె ఉమా మహేశ్వరి పాత్రలో కోమలి సిస్టర్ హిరోషినీ నటించనుంది. 

అంతేకాదు ఈ చిత్ర షూటింగ్‌లో కూడా తాను భాగం అయినట్లు ఆమె అధికారికంగా తెలిపింది. ఈ సందర్భంగా హిరోషినీ మాట్లాడుతూ.. ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రంలో తనకు అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని, తనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని పేర్కొంది. అయితే చిన్నప్పటి నుంచి ఎన్నో మిమిక్రీ షోలలో సందడి చేసిన హిరోషినీ.. ‘అ ఆ’ చిత్రంలో నితిన్ చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తుండగా.. రానా, సుమంత్, ప్రకాశ్ రాజ్, మంజిమా మోహన్, కల్యాణ్ రామ్, వెంకటేశ్, కీర్తి సురేశ్, అనుష్క, శ్రియ, మోహన్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.పాడె మోసిన చంద్రబాబు..

Updated By ManamThu, 08/30/2018 - 16:02
  • సీఎంతో పాటు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి జాస్తి చలమేశ్వర్

  • అధికార లాంఛనాలతో కొనసాగిన హరికృష్ణ అంతిమయాత్ర.. 

CM Chandrababu naidu lifts brother in law HariKrishna 

హైదరాబాద్: దివంగత నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర కొనసాగింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి హరికృష్ణ పార్థివ దేహాన్ని బయటకు తీసుకొచ్చారు. మెహదీపట్నం నుంచి జూబ్లీహీల్స్ మహాప్రస్థానం వరకు హరిక్రిష్ణ అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో ప్రజా రథం వరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన బావమరిది హరికృష్ణ పార్థీవదేహాన్ని మోసారు.

ఆయనతో పాటు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ కూడా పాడె పట్టుకున్నారు. ఒకవైపు చంద్రబాబు పాడె మోస్తుంటే.. మరోవైపు జాస్తి చలమేశ్వర్ మోస్తూ ముందు నడిచారు. హరికృష్ణ పార్థీవదేహం వెంట ఆయన కుమారులు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, కుటుంబ సభ్యులు మందుకు సాగారు. సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అధికారి లాంఛనాలతో హరికృష్ణ అంతిమ సంస్కారాలు జరుగనున్నాయి. హరికృష్ణ అంతిమ యాత్ర.. 

Updated By ManamThu, 08/30/2018 - 15:58

Nandamuri Hari Krishna, Hari Krishna funerals, TDP workers, CM Chandrababu naidu, NTR, Kalyanramహైదరాబాద్: దివంగత నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభమైంది. గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో నివాసం నుంచి హరికృష్ణ పార్థివ దేహాన్ని బయటకు తీసుకువచ్చారు. అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు మొదలయ్యాయి. మెహదీపట్నం నుంచి జూబ్లీహీల్స్ మహాప్రస్థానం వరకు హరిక్రిష్ణ అంతిమ యాత్ర కొనసాగనుంది.

సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంతిమ సంస్కారాలు జరుగనున్నాయి. హరికృష్ణ కడచూపు కోసం అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 'హరికృష్ణ అమర్ రహే' అంటూ అభిమానులు నినాదాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. హరికృష్ణ పార్థీవదేహాన్ని ఇంట్లో నుంచి ప్రచార రథం ఎక్కించారు. దాదాపు పది కిలోమీటర్ల మేర హరికృష్ణ అంతిమయాత్ర కొనసాగనుంది. హరికృష్ణ అరుదైన ఫొటో.. నాన్న ముందు రథసారధి

Updated By ManamWed, 08/29/2018 - 15:14

Harikrishnaనల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు, రాజకీయ నాయకుడు హరికృష్ణ కన్నుమూశారు. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులను ఆయన మరణంపై సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు క్రిష్.. ఓ అరుదైన ఫొటోను షేర్ చేసుకున్నారు.

అది హరికృష్ణ చిన్న వయసుకు సంబంధించింది కాగా.. అందులో ఎన్టీఆర్ ముందు నడుస్తున్నారు. 1962లో దేశ రక్షణ కోసం ఎన్టీఆర్ విరాళాలు సేకరిస్తున్న సందర్భంలో ఈ ఫొటోనే తీశారు. దీన్ని షేర్ చేసిన క్రిష్.. ‘‘మార్పు కోసం రామ రథ చక్రాలు నడిపిన చైతన్య రథ సారధి.. చిన్ననాటే జనం కోసం తండ్రి ముందు నడిచిన వారసత్వం’’ అంటూ పేర్కొన్నారు.హరికృష్ణ తనయులకు చంద్రబాబు పరామర్శ

Updated By ManamWed, 08/29/2018 - 14:58

Chandrababuహైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మరణించిన సినీ, రాజకీయ నాయకుడు హరికృష్ణ కుమారులు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. నల్గొండ జిల్లా నర్కాట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు నాయుడు అక్కడున్న ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లను కలిసి పరామర్శించారు. పోస్ట్‌మార్టం అనంతరం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ హరికృష్ణకు నివాళులు అర్పించారు.నందమూరి హరికృష్ణ దుర్మరణం

Updated By ManamWed, 08/29/2018 - 08:19
hari krishna

హైదరాబాద్‌ : నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ కుమారుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి వద్ద జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, ఆయనను హుటాహుటీన కామినేని ఆస్పత్రికి తరలించారు.

తీవ్ర గాయాలపాలై దాదాపు మూడు గంటల పాటు మృత్యువుతో పోరాడిన హరికృష్ణ చివరకు కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న హరికృష్ణ కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు హుటాహుటిన అక్కడకు వెళ్లగా.. ఆయన బావ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయల్దేరారు. అయితే హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రామ్ కూడా నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. మరోవైపు ఆయన మృతితో ఇటు కుటుంబసభ్యులు, అటు అభిమానులు తీవ్ర విషాదంలో మునగగా.. పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. 

HarikrishnaHarikrishnaHarikrishna

 

Related News