telangana assembly

టీ. ఎన్నికల షెడ్యూల్‌పై డీకే అరుణ పిటిషన్

Updated By ManamMon, 10/08/2018 - 12:22
DK aruna-Mnama Telugu News

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ను ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి. కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం రద్దు చేసిన తీరు రాజ్యాంగ విరుద్ధమని, శాసనసభను సమావేశపరచకుండా  9 నెలల ముందుగానే ప్రభుత్వాన్ని ఎలా రద్దు చేస్తారని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు.అసెంబ్లీ రద్దుపై పిటిషన్ కొట్టివేత

Updated By ManamWed, 09/12/2018 - 12:54

Telangana Assembly Dissolution petition dismissed by high courtహైదరాబాద్ : తెలంగాణ శాసనసభ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు బుధవారం కొట్టివేసింది. అసెంబ్లీ రద్దును సవాల్‌ చేస్తూ న్యాయవాది రాపోలు భాస్కర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం రాజ్యాంగం, చట్టాలు ఉల్లంఘించినట్లు పిటిషన్‌లో కనిపించడం లేదని పేర్కొంది. రాజ్యాంగం, చట్టాల ఉల్లంఘన జరగనప్పుడు తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టేసింది.

కాగా తెలంగాణ రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు పరిపాలించమని ప్రజలు అధికారాన్ని యిచ్చారని, కానీ, 9 నెలల కాలం ఉండగానే ముఖ్యమంత్రి సరైన కారణాలు లేకుండా ప్రభుత్వాన్ని రద్దు చేయడం దారుణమని న్యాయవాది రాపోలు భాస్కర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అసెంబ్లీని రద్దు చేయడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన పిటిషన్‌లో తెలిపారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలను నిర్వహించడం వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని భాస్కర్ ప్రస్తావించారు. ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యేంత వరకు ఎలాంటి ఎన్నికలు జరగకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో భాస్కర్ కోరారు.బాబూ మోహన్‌కు షాక్

Updated By ManamThu, 09/06/2018 - 15:28
Telangana CM KCR Given Big Shock to mla Babu Mohan

హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా ఆందోల్‌ శాసనసభ్యుడు బాబూ మోహన్‌కు ఎన్నికల ముందే షాక్ తగిలింది.  బాబూ మోహన్‌కు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గురువారం వెల్లడించారు. కాగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి దామోదర రాజనర్సింహపై దాదాపు నాలుగువేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.

అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సర్వేలో ఎమ్మెల్యే బాబూ మోహన్‌కు మైనస్ మార్కులు పడటంతో పాటు, ఆయన నియోజకవర్గంలోని కార్యకర్తలతో పాటు, సమస్యలు పట్టించుకోవడంతో గట్టి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కాగా గతంలో కేసీఆర్ నిర్వహించిన సర్వేలో బాబూ మోహన్‌కు పాస్ మార్కులు కూడా రాకపోవడంతో ఆయనను పిలిచి హెచ్చరించినా ఫలితం లేకపోయింది. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఆంధోల్ నియోజకవర్గ అభ్యర్థిగా జర్నలిస్ట్  క్రాంతి కుమార్ పేరును కేసీఆర్ ప్రకటించారు. 

కాగా తెలంగాణ అసెంబ్లీ రద్దు అయిన రోజే కేసీఆర్...  105మంది పార్టీ అభ్యర్థులను ప్రకటించడం విశేషం. అలాగే  చెన్నూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన నల్లాల ఓదేలు కూడా చుక్కెదురు అయింది. ఆయనకు కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ లభించలేదు. కేసీఆర్ సంచలన నిర్ణయం

Updated By ManamThu, 09/06/2018 - 15:10
  • అసెంబ్లీ రద్దు రోజే అభ్యర్థుల ప్రకటన

  • 105మంది అభ్యర్థుల ప్రకటన

CM KCR  Announce First List Of 105 Candidates in telangana assembly elections

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రద్దు రోజే రానున్న ఎన్నికలకు 105 నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. 

తెలంగాణ శాసనసభ రద్దు అనంతరం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... . ‘105 నియోజకవర్గాలకు ఇవాళ పేర్లు ప్రకటిస్తున్నాము. అయితే ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను త్వరలోనే ఖరారు చేస్తాం. 15 సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరిగింది. ప్రస్తుతం ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రమే టికెట్ నిరాకరించారు.

ఒకరు ఆందోల్ ఎమ్మెల్యే. మరొకరు  చెన్నూరు ఎమ్మెల్యే. 15 సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరిగింది. అలాగే మేడ్చల్, మల్కాజ్‌గిరి, చొప్పదండి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్ నియోజవకర్గాలకు ఆయా స్థానిక లీడర్లతో మాట్లాడి అభ్యర్థులను ప్రకటిస్తాం.’ అని అన్నారు. 

CM KCR  Announce First List Of 105 Candidates in telangana assembly electionsCM KCR  Announce First List Of 105 Candidates in telangana assembly electionsCM KCR  Announce First List Of 105 Candidates in telangana assembly electionsCM KCR  Announce First List Of 105 Candidates in telangana assembly electionsCM KCR  Announce First List Of 105 Candidates in telangana assembly elections


అసెంబ్లీ రద్దుకు గవర్నర్ ఆమోద ముద్ర

Updated By ManamThu, 09/06/2018 - 14:55

telanganaహైదరాబాద్ : తెలంగాణ శాసనసభ రద్దు తీర్మానానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ గెజిట్ విడుదల చేశారు. అలాగే అపద్ధర్మ ముఖ్యమంత్రిగా అప్పటివరకూ కేసీఆర్ కొనసాగాలని గవర్నర్ ఈ సందర్భంగా కేసీఆర్‌ను కోరినట్లు తెలుస్తోంది. కాగా అంతకు ముందు కేసీఆర్ ...శాసనసభను రద్దు చేస్తూ మంత్రివర్గం తీసుకున్న ఏకవాక్య తీర్మాన ప్రతిని గవర్నర్‌కు అందచేశారు.

కేసీఆర్ సుమారు అరగంటకు పైగా గవర్నర్‌తో సమావేశం అయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి నేరుగా తెలంగాణ భవన్‌కు బయల్దేరి వెళ్లారు. మరోవైపు కేబినెట్ సమావేశం నిర్ణయాలను మధ్యాహ్నం 2:30 గంటలకు కేసీఆర్ మీడియాకు వెల్లడించనున్నారు. తెలంగాణ శాసనసభ రద్దు

Updated By ManamThu, 09/06/2018 - 13:25
Telangana Assembly dissolved, kcr met governor

హైదరాబాద్ :  తొమ్మిది నెలల ముందుగానే  తెలంగాణ శాసనసభ రద్దు అయింది. అసెంబ్లీని రద్దుకు సిఫార్సు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం గురువారం తీర్మానం చేసింది. మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేరుగా రాజ్‌భవన్‌కు బయల్దేరి వెళ్లారు. శాసనసభ రద్దుపై మంత్రివర్గ సిఫార్సును కేసీఆర్ ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్‌కు అందచేశారు. కాగా అసెంబ్లీ రద్దుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2:30 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు.

అంతకు ముందు ప్రగతి భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయింది. మంత్రివర్గ సమావేశానికి డిప్యూటీ సీఎంలు మహ్మద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, హరీశ్‌రావు, కేటీఆర్, జగదీశ్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, పద్మారావు, చందూలాల్, జోగు రామన్న, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.అసెంబ్లీ రద్దుపై నిర్ణయం కేసీఆర్‌దే...

Updated By ManamSun, 09/02/2018 - 11:42
MP kavitha condemns congress allegations over  Pragathi Nevadana Sabha

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ శాసనసభ రద్దుపై తుది నిర్ణయం తీసుకునేది తమ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆరేనని ఆయన కుమార్తె ఎంపీ  కవిత స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా కొంగరకొలాన్ ప్రగతి నివేదన సభ వద్ద ఆమె ఆదివారం మాట్లాడుతూ... ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్‌ఎస్‌దే విజయమని, కేసీఆర్ నిర్ణయం కోసం అందరం ఎదురు చూస్తున్నామని అన్నారు. నాలుగున్నరేళ్ల జరిగిన ఈ సభ ద్వారా సీఎం ప్రజలకు వివరిస్తారన్నారు. 

అధికార దుర్వినియోగం అన్నది ఒట్టిమాటేనని, అవన్నీ కాంగ్రెస్ ఆరోపణలే అని ఎంపీ కవిత కొట్టిపారేశారు.  ప్రతి పనికి, ప్రభుత్వ శాఖలన్నింటికీ టీఆర్ఎస్ పార్టీ తరపున డబ్బు చెల్లిస్తున్నామన్నారు. ప్రజలకు ఓ సుస్థిరమైన పాలన ఇవ్వాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్నారు. ఎన్నికలు కలిసి వచ్చినా, తర్వాత వచ్చినా తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కవిత ధీమా వ్యక్తం చేశారు.'అసెంబ్లీని రద్దు చేస్తే.. ఆరు నెలల్లో ఎన్నికలు..'

Updated By ManamSun, 08/26/2018 - 21:00

Telangana Assembly, elections, 6 months, TRS MP Vinodన్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తే ఆరు నెలల్లో తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌ చెప్పారు. ఢిల్లీలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీని రద్దు చేసిన పక్షంలో 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. జమిలీ ఎన్నికలు వస్తున్నాయని ఎన్నికలు పొడిగించడానికి వీల్లేదన్నారు. ముందస్తు ఎన్నికలపై చర్చ జరుగుతున్నది వాస్తవమేనని స్పష్టం చేశారు. కానీ ఎన్నికల కమిషన్‌ తుది నిర్ణయం తీసుకోవాలన్నారు.

సోమవారం నితిన్‌ గడ్కరీని సీఎం కేసీఆర్‌ కలుస్తారని చెప్పారు. సీఈసీ సమావేశానికి టీఆర్‌ఎస్‌ తరపున తాను హజరుకానున్నట్టు ఎంపీ వినోద్ తెలిపారు. కాగా, సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, పలు అంశాలపై చర్చించిన సంగతి తెలిసిందే. గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ

Updated By ManamThu, 08/23/2018 - 20:31

CM KCR, Governor Narasimhan, Raj Bhavan, Telangana Assemblyహైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌‌తో సమావేశమయ్యారు. గురువారం సాయంత్రం రాజ్ భవన్‌కు కేసీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో తాజా పరిణామాలపై చర్చకు వచ్చినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘కంటి వెలుగు’ కార్యక్రమంపై కేసీఆర్ గవర్నర్‌కు వివరించినట్లు తెలిసింది.

ఇటీవల రైతు కుటుంబాలకు రైతుబీమా కింద వెంటనే పరిహారం చెల్లిస్తున్నట్లు ప్రకటించిన సీఎం.. సంబంధిత వివరాలను గవర్నర్‌కు చెప్పినట్లు సమాచారం. అదేవిధంగా శాసనసభ సమావేశాల నిర్వహణ అంశం కూడా చర్చలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. 

సీఎం ఆదేశం మేరకే ఎన్నికల కమిషనర్‌తో భేటీ..
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మలు ఎన్నికల ప్రధాన కమిషనర్‌తో గురువారం భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో బుధవారం మంత్రులతో సమావేశం జరిగిన మరుసటి రోజే.. కేటీఆర్ ఎన్నికల కమిషనర్‌తో సమావేశం కావడమనేది ముందస్తు ఎన్నికలకు సూచనగా నిలిచింది. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు కేటీఆర్, రాజీవ్ శర్మలు ఎన్నికల కమిషనర్‌తో సమావేశమయ్యారని టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు చెబుతున్నారు. ఆ భేటీలో ప్రధానంగా జమిలి ఎన్నికలపైనే చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉండదని, దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే.. రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని ఎన్నికల కమిషనర్ వారికి వివరించినట్టు సమాచారం. ఈ దశలో అసెంబ్లీ ఎన్నికలను ఎలాంటి అనుమానం లేకుండా ముందస్తుగా నిర్వహించుకోవచ్చనే నిర్ధారణకు వచ్చారు.

సెప్టెంబర్ మొదటివారంలోనే అసెంబ్లీ రద్దు..
ఇదిలావుంటే.. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు 2019, ఏప్రిల్- మే నెలల్లో నిర్వహించాల్సి ఉంది. కానీ సీఎం కేసీఆర్ అసెంబ్లీని ముందస్తుగానే రద్దు చేసే యోచనలో కన్పిస్తున్నారు. అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే.. సాంకేతిక పరంగా ఆరు నెలలకు ముందుగానే శాసనసభను రద్దు చేయాలి. అంటే ఈ లెక్కన రాష్ట్ర శాసనసభను సెప్టెంబర్ మొదటి, రెండో వారంలో రద్దు చేయాల్సి ఉంది. లేనిపక్షంలో ఆ ఎన్నికలను ముందస్తు ఎన్నికలుగా పరిగణించే అవకాశం ఉండదు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ సెప్టెంబర్ మొదటి వారంలోనే శాసనసభను రద్దు చేయనున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ రెండో తేదీన కొంగర కలాన్ బహిరంగ సభలో ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నట్టు ప్రకటిస్తారని సమాచారం. ఆ సభ అనంతరం రెండుమూడు రోజుల్లో శాసనసభను రద్దు చేయాలని గవర్నర్‌ను కోరనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. అనంతరం డిసెంబర్‌లో ఎన్నికలు వచ్చే అవకాశముంది.

ప్రతిపక్షాలను మట్టికరిపించేందుకే..
రాష్ట్రంలో ఇటీవల ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్.. రాజకీయంగా తన యాక్టివిటీని క్రమక్రమంగా పెంచుతోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఉద్దేశంతో కాంగ్రెస్ శ్రేణులు.. ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీని సైతం రాష్ట్రానికి రప్పించుకున్నారు. అవకాశం పోతే మళ్లి రాదన్న ఉద్దేశంతో ఒకటీ రెండు బహిరంగ సభలను భారీగానే నిర్వహించారు. కాంగ్రెస్ శ్రేణులు సైతం ఊహించని విధంగా ఆ సభలకు కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారని, ఆ సభలో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్, రాహుల్ ప్రసంగాలకు అద్భుత స్పందన వచ్చిందనే సమాచారం సీఎం కేసీఆర్‌కు విశ్వసనీయ వర్గాలు పూసగుచ్చినట్టుగా వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సభలను తలదన్నేలా.. టీఆర్‌ఎస్ బహిరంగ సభను ఎవరూ ఊహించని రీతిలో నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఆ సభతోనే ముందస్తు ఎన్నికలకు శంఖారావం ఊదాలని భావిస్తున్నారు.

ఎన్నికల శంఖారావంగా కొంగరకలాన్ ప్రగతి నివేదన సభ...
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు అధికార టీఆర్‌ఎస్ పార్టీ తొలి బహిరంగ సభగా కొంగర కలాన్ సభ నిలవనుంది. ఎవరూ ఊహించని రీతిలో 1600 ఎకరాల విస్తీర్ణంలో ఈ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొంగర కలాన్ సభ.. జనసంద్రాన్ని తలపించేలా.. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది జన సమీకరణ చేసేలా జిల్లాలు, నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 40 వేల మందిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే పార్టీ ప్రాబల్యం అంతగా లేని నియోజకవర్గాల్లో 25 వేలకు తక్కువ కాకుండా జనసేకరణ ఉండాలని సూచించారు. అందుకు సంబంధించి జిల్లాల్లోని అందరి ఎమ్మెల్యేను సమన్వయం చేసుకుంటూ జనసమీకరణ చేపట్టాలని మంత్రులను ఆదే శించారు. జిల్లాలవారీగా మంత్రులను కేటాయించి ఆ జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులను పూర్తిస్థాయిలో సహకరించాలని చెప్పారు. దీంతో పాటు శుక్రవారం టీఆర్‌ఎస్ భవన్‌లో నిర్వహించే పార్టీ సమావేశంలో నేతలకు బహిరంగ సభ ఏర్పాట్లపై దిశానిర్దేశనం చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని.. ఇప్పుడు కష్టపడిన నేతలకే.. నామినేటెడ్ పదవులతో పాటు పార్టీలను పెద్దపీట వేస్తారని చెప్పనున్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ పట్టు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
రాష్ట్రంలో నేటికీ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ప్రాంతాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని ఆయా ప్రాంతాల మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులను ఆదేశించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతుల్లో ఓడిపోయిన టీఆర్‌ఎస్ అభ్యర్థికి అండదండలు అందించాలని మంత్రులతో పాటు పక్క నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేకు ఇప్పటికే సూచించారు. ప్రధానంగా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాలను వచ్చే ఎన్నికల్లో ఏలాగైనా కైవసం చేసుకోవాలని, అందుకు తగిన విధంగా పార్టీ శ్రేణులను సంసిద్ధులను చేయాలని అక్కడి ప్రజాప్రతినిధులకు సూచించారు. నల్లగొండ జిల్లాకు సంబంధించి హుజూర్‌నగర్, నల్లగొండ, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాలను కైవసం చేసుకోవడంతో పాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచినా.. బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపైనా దృష్టి పెట్టాలని ఆ జిల్లా మంత్రిని ఆదేశించారు.

బలంగా మారనున్న ప్రభుత్వ పథకాలు..
దేశంలో ఎక్కడా లేని ప్రజాసంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మిషన్ కాకతీయ మొదలుకుని.. కంటి వెలుగు పథకం వరకు దాదాపు ప్రజలందరూ హర్షిస్తున్న పథకాలుగానే కొనసాగుతున్నాయి. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కంటి వెలుగు, పాడి బర్రెల పంపిణీ, సబ్సిడీ గొర్రెలు, ఉచితంగా చేప పిల్లల పంపిణీ వంటి పథకాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడింపజేశాయి. ప్రధానంగా రైతు బంధు పెట్టుబడి పథకానికి సంబంధించి రైతులకు ప్రభుత్వాన్ని మరింత దగ్గరకు చేశాయి. రైతు బీమా పథకం.. వ్యవసాయరంగంలో ఓ నూతన శకానికి నాంది పలికిందనే చెప్పాలి. అయితే ఈ పథకాల పై ప్రతిపక్షాలను నుంచి భారీగానే విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం ఏంత ఉందనే విషయం పక్కనబెడితే.. కేసీఆర్ కిట్ వంటి పథకంతో ప్రభుత్వ వైద్యాలయాలు పూర్వవైభవాన్ని సంతరించుకున్నాయనే చెప్పొచ్చు. ప్రభుత్వ పథకాల బలంగా సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు రెడీ అవుతున్నారని విశ్వసనీయవర్గాలు సైతం వెల్లడిస్తున్నాయి. ఇంతకు ముందస్తు ఎన్నికల ప్రకటన.. సెప్టెంబర్ రెండో తేదీన జరిగే.. కొంగర్‌కలాన్ బహిరంగ సభతో తేటతెల్లమవుతుందా? లేక శుక్రవారం జరిగే పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంతో తెలనుందా? వేచిచూడాల్సిందే మరీ..

నేడు ఢిల్లీకి కేసీఆర్
సీఎం కేసీఆర్ రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు, ఇతర కేంద్ర మంత్రులను కలుస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు వినతులు చేసినా, కేంద్రం నుంచి ఆశించిన స్పందన రావడం లేదని కేసీఆర్ భావిస్తున్నారు. తానే స్వయంగా వెళ్ళి అవసరమైతే ఢిల్లీలోనే రెండు, మూడు రోజులుండి, ప్రధాని, ఇతర మంత్రులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోవాలని సీఎం నిర్ణయించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసుకున్న జోనల్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం లభించకపోవడంతో పంచాయతీ కార్యదర్శుల నియామకంతోపాటు మరికొన్ని నియామకాల్లో జాప్యం జరుగుతోందని, జోనల్ వ్యవస్థకు తక్షణం ఆమోద ముద్ర వేయించే విషయంలో ప్రధాని చొరవ చూపాలని కేసీఆర్ కోరనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ ఢిల్లీలోనే ఉండి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై సమీక్షిస్తున్నారు. అయినా ఆశించిన ఫలితం రావడం లేదు. దీంతో సీఎం స్వయంగా ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. జోనల్ వ్యవస్థతో పాటు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అదనపు ఎఫ్.ఆర్.బి.ఎం. నిధుల విడుదల, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన రూ.450 కోట్ల నిధుల విడుదల, మహిళా సంఘాలు, రైతులకు ఇచ్చే రుణాలపై ఇచ్చే వడ్డీ రాయితీలో కేంద్ర ప్రభుత్వ వాటా విడుదల, హైకోర్టు విభజన, రీజనల్ రింగు రోడ్డుకు నిధులు, సెక్రటేరియట్ నిర్మాణానికి రక్షణ శాఖ స్థలాల కేటాయింపు తదితర అంశాలపై ప్రధానితో పాటు కేంద్ర మంత్రులతో మాట్లాడి రావాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ సారి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రధాని వద్ద ప్రస్తావించాలని సీఎం భావిస్తున్నారు. వెంటనే రాష్ట్రానికి సంబంధించిన అంశాలప పరిష్కారానికి పిఎంఓ చొరవ చూపాలని ప్రధానిని కేసీఆర్ కోరనున్నారు. కేసీఆర్  వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రామక ష్ణ రావు, ఇతర ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే బుధవారం ప్రగతి భవన్ వేదికగా సీఎం కే సీఆర్ మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ముఖ్యంగా ముందస్తు ఎన్నికల చుట్టూనే చర్చ జరిగిందని సమాచారం. దీనికి తోడు గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ కూడా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌తో మంత్రి వర్గ సమావేశంలో చర్చించిన అంశాలతోపాటు ముందస్తు ఎన్నికల విషయంపై కూడా చర్చించినట్టు సమాచారం. ఇటీవల గవర్నర్ ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో అమరావతిలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికలపై ప్రస్తావన వచ్చిందని, సీఎం కేసీఆర్ ముందుస్తుకు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబుతో నరసింహన్ చెప్పినట్టు సమాచారం. ఈనేపథ్యంలో గవర్నర్‌తో చర్చించిన గంటల వ్యవధిలోనే ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిస్తానని కేసీఆర్ ప్రకటించడంతో ముందస్తు ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతోపాటు గురువారమే తెలంగాణ రాష్ట్ర ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ ఢిల్లీకి వెళ్లి ఎన్నికల కమిషన్ అశోక్ లావాసాతో భేటీ అయి చర్చించారు. రాజీవ్ శర్మ ఢిల్లీలో ఉండగానే సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో కలిసి ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశమవుతుంది. 

హైదరాబాద్‌లో పెరిక భవనం..
హైదరాబాద్ నగరంలో పెరిక కులస్తులకు భవనం నిర్మించడానికి అవసరమైన స్థలం, నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎమ్మెల్సీ బోడకుంట వెంకటేశ్వర్లు ప్రగతి భవన్‌లో గురువారం కేసీఆర్‌ను కలిశారు. ఖైరతాబాద్ చౌరస్తాలో తమ కులానికి అత్యంత విలువైన స్థలం, భవనం ఉండేదని, కానీ రోడ్డు వెడల్పులో చాలా భాగం కోల్పోయామని వెంకటేశ్వర్లు వివరించారు. తమ కులస్థుల సామాజిక, విద్య రంగాల్లో పురోగతికోసం కార్యకలాపాలు చేపట్టడానికి హైదరాబాద్‌లో భవనం అవసరమని ఆయన వినతి పత్రం సమర్పించారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు. పెరిక కులస్తులకు వెంటనే స్థలం, నిధులు కేటాయించాలని చెప్పారు. దీనికోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి ఈటెల రాజేందర్‌ను కోరారు.

బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా పూజారుల శంభయ్య
తెలంగాణ రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన పూజారుల శంభయ్యను నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్‌ను ఆదేశించారు.టీ. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

Updated By ManamWed, 03/28/2018 - 10:24

టీ. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమవ్వగానే స్పీకర్ మధుసుదనాచారి తొలుత ప్రశ్నోత్తరాల చేపట్టారు. ప్రశ్నోత్తరాల అనంతరం అసెంబ్లీలో ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లుపై చర్చను చేపట్టనున్నారు. మరోవైపు మండలిలో రెవెన్యూ, రికార్డుల ప్రక్షాళన, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, రైతులకు ఎకరాకు రూ. 8 వేల పెట్టుబడి అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

అసెంబ్లీ ముట్టడికి యత్నం..
నేడు ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యూనివర్శిటీలు బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు అసెంబ్లీ ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.

Related News