telangana assembly

'కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చితీరుతాం'

Updated By ManamTue, 03/27/2018 - 13:54

Water resources, Crore Yards, Telangana State, Telangana assembly హైదరాబాద్: జాతీయ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ ఆదాయం ఎక్కువని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ వచ్చాక రాష్ట్ర ఆదాయం 224 శాతం పెరిగిందని చెప్పారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘దేశం మొత్తంలో రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ’ అని వ్యాఖ్యానించారు. జాతీయ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర ఆదాయం ఎక్కువని, పెంచిన సంపదను ప్రజలకు పంచుతున్నామని చెప్పారు. ఇది ప్రతిపక్షాలకు నచ్చడం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అవినీతిని అరికట్టామని తెలిపారు. రాష్ట్రంలో ఖర్చవుతున్న ప్రతి పైసాకు లెక్కుందని, అప్పు తెచ్చిన ప్రతి పైసాను ప్రాజెక్టుల కోసం వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు. సచివాలయంలో ఇప్పుడు ఎక్కడా పైరవీలు లేవని అన్నారు. ప్రాజెక్టుల కోసం విజయవంతంగా భూసేకరణ చేశామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 26వేల మంది పనిచేస్తున్నారని, త్వరలో చాలా జిల్లాలకు గోదావరి నీరు రాబోతోందని కేసీఆర్ పేర్కొన్నారు కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చితీరుతామన్నారు.కోమటిరెడ్డి, సంపత్‌లకు హైకోర్టులో స్వల్ప ఊరట

Updated By ManamMon, 03/19/2018 - 16:40

komatireddyహైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యేల శాసనసభ్యత రద్దు కేసుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 6వారాల పాటు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దని ఎన్నికల సంఘానికి కోర్టు ఆదేశాలిచ్చింది. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనర్హులని తెలిసింది. ఇదిలా ఉంటే కోర్టు ఈ కేసుకు సంబంధించి శాసనసభలోని ఒరిజినల్ సీసీ ఫుటేజీలను సమర్పించాలని ఆదేశించింది. శాసనసభలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పైకి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మైక్‌‌ను విసిరేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో స్వామిగౌడ్ కంటికి గాయమైంది. ఈ నేపథ్యంలోనే ఆ అంశాన్ని తీవ్రంగా పరిగణించారు శాసనసభ స్పీకర్. దీంతో స్పీకర్ మధుసూదనా చారి వారిద్దరి సభ్యత్వాన్ని రద్దు చేశారు. అంతేగాకుండా కాంగ్రెస్ సభ్యులందరిపైనా సస్పెన్షన్ విధించారు.తీవ్ర ఉత్కంఠ.. కోమటిరెడ్డిపై వేటు?

Updated By ManamTue, 03/13/2018 - 09:09

komati reddy

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో సోమవారం జరిగిన ఘటనను సర్కార్ సీరియస్ తీసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై టీ. సర్కార్ వేటు వేసే యోచనలో ఉంది. ఆయనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, రామ్మోహన్ రెడ్డిపై కూడా వేటు అవకాశాలు కనిపిస్తున్నాయి. పదవీకాలం ముగిసే వరకూ ఈ ముగ్గురిపై వేటు వేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాకుండా కాంగ్రెస్ సభ్యులను కూడా సస్పెన్షన్‌ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాగా మరికొద్దిసేపట్లో స్పీకర్ ప్రకటన చేయనున్నారు. అసలు సభ్యులను ఎన్నిరోజులు సస్పెండ్ చేయాలన్నది స్పీకర్ మధుసూదనచారి తేల్చనున్నారు. స్పీకర్ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే మరికొద్దిసేపట్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

రెండు ప్రతిపాదనలను సర్కార్ పరిశీలిస్తోంది. నలుగురు కాంగ్రెస్ సభ్యుల్ని ఈ సెషన్స్ నుంచి సస్పెండ్ చేయడం లేదా.. ఏడాది పాటు సస్పెండ్ చేస్తారా అన్నది తేలనుంది. కాగా తమ సభ్యుల్ని సస్పెండ్ చేస్తే సభను బహిష్కరించే యోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని సమాచారం. అయితే కోమటిరెడ్డి మాత్రం గవర్నర్ టార్గెట్ చేస్తే శాసనమండలి ఛైర్మన్ తగిలిందని చెబుతున్నారు. స్వామిగౌడ్‌కు గాయమైందని రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేయటంతో పాటు క్షమాపణ చెప్తానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.మార్షల్స్ నన్ను గాయపరిచారు: కోమటిరెడ్డి

Updated By ManamMon, 03/12/2018 - 12:15

Komat Reddy హైదరాబాద్: అసెంబ్లీలో పోడియం దగ్గరకు వెళ్లిన తమపై మార్షల్స్ దాడి చేశారని.. ఈ ఘర్షణలో తన కాలికి కూడా గాయాలయ్యాయని, ఇప్పుడే ఎక్స్‌రే కూడా తీసుకున్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వెల్‌లోకి దూసుకుపోయిన కోమటి రెడ్డి పైకి హెడ్‌ ఫోన్స్ విసిరిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మండలి చైర్మన్ కంటికి గాయం కాగా.. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయింది.

ఈ నేపథ్యంలో మాట్లాడిన ఆయన.. తమ నిరసనను తెలిపేందుకే పోడియం దగ్గరకు వెళ్లామని చెప్పారు. నిరసనను చెప్పే హక్కు తమకు ఉందని.. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చాలా మంది మార్షల్‌ను లోపలికి రప్పించి తమను అడ్డుకున్నారని.. ఆ క్రమంలో సహనం కోల్పోయి అలా చేశామని ఆయన అన్నారు. ఇప్పుడు తమను అంటున్న టీఆర్ఎస్ ఎంపీలు గతంలో ఎన్నిసార్లు పోడియంను చుట్టిముట్టలేదని.. హరీష్ రావు అయితే గవర్నర్‌ను కొట్టేందుకే వెళ్లారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా టీఆర్‌ఎస్ ఎంపీలు రోజూ పార్లమెంట్‌లో పోడియంను చుట్టుముడుతున్నారని.. వారు చేస్తే తప్పు కాదా? అంటూ ప్రశ్నించారు.

 ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానం

Updated By ManamFri, 11/17/2017 - 12:00

ప్రపంచ తెలుగు మహాసభలపై తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం శాసనసభలో ప్రకటన చేశారు. డిసెంబర్‌ 15 నుంచి 19 వరకూ ప్రపంచ తెలుగు మహాసభ‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. భాషా ప్రేమికులందరినీ మహాసభలకు సభాముఖంగా ఆహ్వానంపలుకుతున్నట్లు చెప్పారు. అంతకు ముందు ప్రశ్నోత్తరాల సమయంలో ఎస్సీ నిధులపై కేసీఆర్‌ వివరణ ఇచ్చారు. ఎస్సీ నిధులు పక్కదారి పట్టలేదని,  ప్రతీ పైసా నిజాయితీగా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ సంక్షేమంపై సభలో సవివరంగా చర్చిద్దామని ప్రతిపాదించిన సీఎం...అసెంబ్లీని ప్రోరోగ్‌ చేయకుండా వాయిదా వేయాలని అన్నారు. సభలో సవివరంగా చర్చిస్తేనే ఎస్సీల సంక్షేమానికి ఎవరేం చేశారో తెలుస్తుందన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల సంక్షేమమే తమ థ్యేయమని స్పష్టంచేశారు. అలాగే ఎస్సీ నిధుల ఖర్చులో అధికారుల అలసత్వం ఉందని తెలిస్తే.. అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఎస్సీ నిధులు పక్కదారి పట్టాయని ఆయన విమర్శించారు.
 ‘కోమ‌టోళ్లు సామాజిక స్మ‌గ్ల‌ర్లు’ పై అసెంబ్లీలో చ‌ర్చ‌

Updated By ManamThu, 11/09/2017 - 13:29

kanche ailah book, mla ganesh guptha, telangana assemblyహైదరాబాద్: కోమ‌టోళ్ల‌ను సామాజిక స్మ‌గ్ల‌ర్లుగా పేర్కొంటూ ప్రొఫెస‌ర్ కంచ ఐల‌య్య రాసిన పుస్తకం ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. శీతాకాల స‌మావేశాల్లో భాగంగా అసెంబ్లీలో ప్రొఫెసర్ కంచ ఐలయ్య రచించిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకంపై చర్చించారు. గురువారం జీరో అవర్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఈ విషయాన్ని ప్రస్తావనకు తెచ్చారు. కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు పుస్తకాన్ని నిషేధించాలని స్పీకర్‌‌ తరఫున టీఆర్ఎస్ సర్కార్‌ను ఆయన కోరారు. అయితే ఈ పుస్తకంపై సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని ఆసక్తిగా మారింది.ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉన్నాం: కేటీఆర్

Updated By ManamTue, 11/07/2017 - 14:07

telangana assembly, ktr on unemploymentహైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. శాసనసభలో బీజేపీ సభ్యులు నిరసన తెలపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. శాసనసభలో తొలి ప్రశ్న బిజెపిదే అయినప్పుడు వాయిదా వేయమనడం సరికాదన్నారు. సభలో చర్చకు రాకుండా రచ్చకు రావడం ఇదేం నీతి అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగ కల్పన, తాగునీటి సమస్యలపై అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.

Related News