banks

బ్యాంకులకు బకాయిల భారం

Updated By ManamTue, 08/14/2018 - 01:27

imageమన దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు అధికారిక లెక్కల ప్రకారం సుమారు 6 లక్షల కోట్ల రూపాయల బాకీలు గుట్టల్లా పేరుకుపోయాయి. తీసుకొన్న అప్పులను చెల్లించ కుండా సతాయిస్తున్న వందలాది సంస్థలున్నాయి. బ్యాంకుల్లో ఈ సమస్య ఇంతగా తయారవడానికి కారణాలను చూస్తే - మనకు ముఖ్యంగా 2 విషయాలు బోధపడతాయి. అవి.. బ్యాంకుల రుణ మంజూరు విధానం లోపభూయిష్టమైనా కావాలి లేదా రుణాలు ఇచ్చే  అధికారుల్లో చిత్తశుద్ధి అయినా కొరవడి ఉండాలి. రుణ మంజూరు విధానాలు తప్పుల తడక గా ఉండే అవకాశాలు చాలా తక్కువ. కొన్ని దశాబ్దాలుగా పకడ్బందీ పద్ధతులకు దేశవాళీ బ్యాంకులు పెట్టింది పేరు. నిర్దిష్ట విధానాల ప్రాతిపాదికన కొనసాగు తున్న భారతీయ బ్యాం కింగ్‌లో నిరర్ధక ఆస్తులు పెరిగిపోవడానికి ఆ వ్యవ స్థలను నిర్వహిస్తున్న కొందరు అధికారుల చిత్తశుద్ధి లోపం కారణ మవుతోంది. వ్యాపారం జరగని, నష్టాలతో మూసివేత ప్రమా దం ఎదుర్కొంటున్న కింగ్ ఫిషర్ వంటి సంస్థలకు వేల కోట్ల రూపాయల రుణాన్ని బ్యాంకులు ఏ ప్రాతిపాదికన మంజూరు చేయగలిగాయన్న ప్రశ్నకు వారి వద్ద సమాధానం లేదు.

రుణాల మంజూరు పూర్తిగా బ్యాంకుల అంతర్గత వ్యవహారం మాత్రమే కాదు. బ్యాంకులు ప్రజాధనానికి కేవలం ధర్మకర్తలు మాత్రమే! ప్రజల నుండి డిపాజిట్ల రూపంలో పోగుపడిన మొత్తాలను విచ్చల విడిగా రుణ వితరణలను చేసే అధికారం బ్యాంకులకు ఏ మాత్రం లేదు. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం - 1949లో భారీ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. వ్యాపారం సక్రమంగా లేని, దివాలా తీయడానికి దగ్గరగా ఉన్నటువంటి సంస్థలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేసిన దాఖలాలు అనేకం ఉన్నాయి. క్షేత్రస్థాయి పరిశీలనతో నిమిత్తం లేకుండా కేవలం ప్రాజె క్టు నివేదికల ఆధారంగా అప్పులివ్వడమే సమ స్యను తెచ్చిపెడుతోంది. బ్యాంకులు మం జూరు చేసిన రుణాలు ఎలా వినియోగ మవుతున్నాయన్న విషయంపైనా బ్యాంకులు శ్రద్ధ పెట్టడం లేదు. భారీ ఎత్తున రుణాలు మంజూరు చేసే విషయంలో బ్యాంకులు ఒక సమూహంగా ఏర్పడతాయి. అందులో పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వజూపిన బ్యాంకు నాయకత్వపు బాధ్యత నిర్వహిస్తుంది. పెద్ద బ్యాంకుల వనరులు, పరపతి సామర్ధ్యం, విస్తృతి దృష్ట్యా సాధారణంగా అవే నాయ కత్వ బ్యాంకులుగా అవతరిస్తుంటాయి.

ఆపైన చిన్న చిన్న బ్యాంకులన్నీ కూడా దాన్ని గుడ్డిగా అనుసరి స్తుంటాయి. ఈ సంప్రదాయమే చిన్న బ్యాంకుల పాలిట శాపంగా మారుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింతగా మూలధనం సమకూర్చడం ద్వారా నిరర్ధక ఆస్తుల సమస్యను ఎదుర్కోవా లని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థకు మంచి జరుగుతుందని, మొండి బకాయిలు తద్వారా ఏర్పడిన రుణ ఒత్తిడిని తట్టుకోవడం పెద్ద బ్యాంకులకు సులభమవుతుంద న్నది ఆర్బీఐ అభిప్రాయం. అది ఏ మేరకు వాస్తవరూపం దాలుస్తుందన్నది భవిష్యత్తులో గానీ తేలదు. బ్యాంకులు రుణాలను మంజూరు చేసే క్రమంలో జాగ్రత్తగా వ్యవహరిం చడమే మొండి బాకీల సమస్యకు శాశ్వత పరిష్కారం!   

- శ్రీనివాస్ చిరిపోతుల, 
జయశంకర్ భూపాలపల్లి, 96034 71199త్వరలో పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్‌లు

Updated By ManamTue, 08/07/2018 - 23:07

ippbన్యూఢిల్లీ: చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ)ను ఈ నెల 21 న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక శాఖను నెలకొల్పి గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలందించాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ‘‘ఐపీపీబీని ఆవిష్కరించేందుకు  ఈ నెల 21న ప్రధాన మంత్రి సమయం ఇచ్చారు. ఇప్పటికే రెండు శాఖలు పనులను ప్రారంభించాయి. మిగతా 648 శాఖలు దేశంలోని ప్రతి జిల్లాలో అందుబాటులోకి రానున్నాయి’’ అని కమ్యునికేషన్ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు.  ఐపీపీబీ దేశవ్యాప్తపంగా ఉన్న 1.55లక్షల పోస్ట్ ఆఫీసుల ద్వారా గ్రామీణ ప్రజానీకానికి అర్థికపరమైన సేవలందివ్వనుంది. ఈ ఏడాది చివరి నాటికి 1.55 లక్షల పోస్టాఫీస్‌లను ఐపీపీబీలతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన తెలిపారు. ‘‘ప్రస్తుతం జిల్లా స్థాయిలో ఎక్కువగా ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థను ఐపీపీబీ గ్రామీణ స్థాయికి చేర్చనుంది. దీని ద్వారా దేశంలోనే అతి పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థగా ఐపీపీబీ ఎదగనుంది ’’ అని ఆయన పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న పెద్ద పోస్ట్ ఆఫీసుల నుంచి అనుసంధానపరచిన కేంద్రాల ద్వారా 11,000లకు పైగా పోస్ట్ మ్యాన్‌లు  డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలందివ్వనున్నారు. 17 కోట్ల పోస్టల్ సేవింగ్స్ ఖాతాల అనుసంధానానికి ఐపీపీబీకి పోస్టల్ బ్యాంకింగ్ అనుమతులు ఇచ్చింది. ఐపీపీబీ ద్వారా ఎన్‌ఆర్‌ఈజీఏ కూలీ డబ్బులు, పెన్షన్‌లు అందించే సేవలను నిర్వహించనుంది. పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఇచ్చే కార్డుల ద్వారా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.  ఐపీపీబీ మొబైల్ యాప్ కూడా ఆగస్టు 21న అందుబాటులోకి రావచ్చని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా మొబైల్  రీచార్జ్, కరెంట్ బిల్స్, డీటీహెచ్ బిల్స్, కళాశాల ఫీజుల చెల్లింపుతో పాటు దాదాపు అన్ని రకాల డిజిట్ చెల్లింపులు చేసుకోవచ్చని వారు తెలిపారు.ప్రైవేటీకరణ సర్వరోగ నివారిణి కాదు

Updated By ManamFri, 07/13/2018 - 01:06

BANKబ్యాంకుల ప్రైవేటీకరణ ఇటీవల చర్చనీయాంశమవుతోంది. సమర్ధవంతంగా పనిచేయడం లేదనే సాకుతో ప్రైవేటీకరణ బాట పట్టించడానికి ఏర్పాట్లు చేస్తున్నారన్న వాదనలు వినిపి స్తున్నాయి. బ్యాంకులను జాతీయం చేయడానికి దారితీసిన పరిస్థితులు, వాటి పనితీరును పరిశీలిద్దాం. 1969లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం సుమారు 14 బ్యాంకులను జాతీ యం చేసింది. దేశ ఆర్ధిక మూలాలకు జవజీవాలు అందించ డానికి ఈ చర్య తప్పనిసరి అని ప్రభుత్వం వివరణ ఇచ్చిం ది. దానికనుగుణంగానే పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు పనిచేసి దేశ ఆర్ధిక పరిపుష్టికి బాటలు వేశాయి. దీనితోపాటు 1980లో మరో ఆరు బ్యాంకులను జాతీయం చేశారు.  

ఈ క్రమంలో భారతీయ స్టేట్ బ్యాంక్‌తో పాటు దేశంలో 1,16,394 బ్రాంచిలతో అభివృద్ధి పథంలో కొనసాగుతున్నా యి. ఇందులో 33,864 బ్రాంచ్‌లు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ బ్యాంకులన్నీ 2017- 18లో వ్యవసాయ రంగంపై రూ. 6,22,685 కోట్ల రుణాలు మంజూరు చేశాయని గణాంకాలు సూచిస్తున్నాయి. డ్వాక్రా మహిళలకు, విద్యా రుణాల కోసం రు.1,30,000 కోట్లు మంజూరు చేశాయి. బడాబాబులకు ఇచ్చిన రుణాల వసూళ్ల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తుండడం వల్లే ప్రభుత్వ బ్యాంకులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయి తప్ప పాల కులు, వారి మేధోవర్గం చెప్తున్నట్లు సామాన్యులకు ఇస్తున్న సబ్సిడీ రుణాల వల్లకాదని  గ్రహించాలి. 

ముఖ్యంగా 1991లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావును ప్రధానమంత్రిగా నియమించింది. దేశ ఆర్ధిక పురోగతిని పరుగులు పెట్టిం చాలనే ఉద్దేశంతో ఆయన ప్రపంచీకరణకు తలుపులు బార్లా తెరిచారు. పెట్టుబడులను ఆహ్వానించడం... వాటికి మౌలిక సదుపాయాలు, భారీ ఎత్తున రుణాలు మంజూరు చేయడం వంటి పనులన్నీ చకాచకా జరిగిపోయాయి. అయితే అందు కోసం దేశ ఆర్ధిక మూలాలను బలోపేతం చేస్తున్న పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల భవిష్యత్తుతో పాటు రైతులు మనుగడను కూడా తాకట్టుపెట్టడానికి పాలకులు సిద్ధమవుతున్నారన డానికి ఈ ఐదేళ్లలో రూ. 2,30,000 కోట్లు బ్యాంకుల్లో వసూ లు కాని మొండి బకాయిలను రద్దుచేసిన ఉదంతమే ఇందుకు నిదర్శనం. 

బ్యాంకుల్లో మొండి బకాయిలు ఎందుకు పెరుగు తు న్నాయి? ప్రపంచీకరణలో భాగంగా ఆతిధ్య కంపెనీలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న సొమ్ముకు కార్పొరేట్ కంపెనీలు కొంత జమచేసి భాగస్వామ్యంలో) పద్ధతిలో కార్పొరేట్ కంపెనీలను ప్రోత్సహించేందుకు భారీగా ఇచ్చిన రుణాలు తిరిగి రాకపోవడమే ప్రధాన కారణం.  ఒక్క మాటలో చెప్పాలంటే ఇరు భాగస్వామ్యాలనేది పేరుకే. కానీ ఎక్కువ మొత్తం భాగస్వామ్యం ప్రభుత్వరంగ బ్యాం కులదే. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ రుణాలు తీర్చాల్సిన అవసరం తమకు లేదని రుణాలు తీసుకున్న సంస్థలు భావి స్తున్నట్లుగా ఉంటున్నాయి. పెట్టుబడుల ప్రోత్సాహం పేరుతో ఆయా కంపెనీల అలవిమాలిన గొంతెమ్మ కోర్కెలు తీర్చడా నికి సిద్ధపడుతున్న ప్రభుత్వాల అసమర్ధ విధానాలే ఇందుకు కారణమని మనం గుర్తించాలి. 

తమ పాలనలోని వైఫల్యాలను కప్పిపిచ్చుకోవడానికి పాలకులు, వారి తొత్తులైన మేధావులు కొత్త పల్లవిని అందు కోవడం గమనార్హం. వీళ్లంతా దేశంలో పేదల సంక్షేమ పథ కాలకు, రైతుల రుణ మాఫీలకు, ఎరువులు, పురుగు మందు లు, విత్తనాలకు, విద్యుత్తుకు ఇస్తున్న సబ్సిడీలే దేశ ఆర్ధిక స్థితిపై పెనుభారం మోపుతోందని చెప్తూ అనుంగు మీడియా ద్వారా ఊదరగొడుతున్నారు. వాస్తవానికి దేశంలో వసూళ్లు కాని మొండి బకాయిలను చిత్తశుద్ధితో సకమ్రంగా రాబడితే పదేళ్లపాటు నిరాటంకంగా సబ్సిడీలను అమలు చేయొచ్చు. మన పాలకుల నిర్వాకానికి పబ్లిక్ సెక్టార్‌లోని బ్యాంకులను ప్రైవేటుపరం చేయాలని యోచించడం ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉంది. పోనీ ప్రైవేటు బ్యాంకుల పని సామర్ధ్యం కూడా పాలకులు ఊహిస్తున్నంత ఘనంగా ఏమీ లేదని గత కొన్నాళ్ల నుంచి జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అర్ధమవుతుంది. 1947 నుంచి 69 వరకు 559 ప్రైవేటు బ్యాంకులు  విఫలమయ్యాయి. బ్యాంక్ ఆఫ్ ద ఇయర్‌గా అవార్డు అందుకున్న గ్లోబల్ ట్రస్ట్‌బ్యాంక్ ఆ మరుసటి ఏడా దే రూ. 1100 కోట్ల నష్టాన్ని చవిచూడగా, 2003లో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో విలీ నం చేశారు. బ్యాంకులను జాతీయం చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి 2014 వరకు 23 ప్రైవేటు బ్యాంకులను పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో విలీనం చేసిన చరిత్రను బ్యాంకు లను ప్రైవేటుపరం చేయాలని సూచిస్తున్న మేధావులు గమనంలోకి తెచ్చుకోగలిగితే మేలు.  

దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులను దివాలా తీయిం చిన ఘనత కార్పొరేట్ కంపెనీలకే దక్కుతుందంటే అతిశ యోక్తి కాదు. ప్రధానంగా బ్యాంకులు ఇచ్చిన రుణాల్లో పేరు కుపోయిన నిరర్థక ఆస్తుల విలువ సుమారు రూ. 11 లక్షల కోట్లు కాగా (ఇది మన జాతీయస్థూల ఉత్పత్తిలో 25 శాతం) దీనిలో రూ. 500 కోట్లకు పైబడిన మొత్తం రూ. 9.5 లక్షల కోట్లకు పైబడి ఉంటుందని అంచనా. అనగా సుమారు 80 శాతానికి పైగా మొండిబకాయిలు బ్యాంకులకు గుదిబండగా మారాయని అర్ధమవుతోంది. ఇదంతా ఎవరి పాప ఫలితం? మన పాలకులు అనుసరిస్తున్న అసంబద్ధ విధానాల కారణం గానే బ్యాంకులు దివాళా తీసే స్థితికి చేరుకున్నాయని ఆర్ధిక విశ్లేషకులు వివరిస్తున్నారు. పారిశ్రామిక విధానంలో విదేశీ కార్పొరేట్ రంగంపై ఆసక్తి చూపిస్తున్న మన ప్రభువులు దేశంలో ఖాయిలా పడిన పరిశ్రమలను గాలికి వదిలేశారు. ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమలను క్రమంగా దివాలా తీయించే పరిస్థితిని సృష్టించి వాటిని ప్రైవేటు పరం చేయ డమో... మూసివేయించడమో చేసిన విధానాన్నే బ్యాంకుల విషయంలోనూ అనుసరిస్తున్నట్లు అనిపిస్తోంది. అదే జరిగితే దేశంలో ఆర్థిక రంగం అతలాకుతలమై సామాన్యులు రోడెక్కే ప్రమాదముంది.  

 ఇప్పటికే దేశంలో వనరుల దోపిడీకి అవకాశం కల్పించి బడా కార్పొరేట్ కంపెనీల బలోపేతానికి తీవ్రంగా కృషి చేస్తు న్న మన పాలకులు బ్యాంకింగ్ రంగాన్ని కూడా ప్రైవేటు పరం చేసి కార్పొరేట్ శక్తుల చేతికి అప్పగిస్తే దేశ భవిష్యత్తుకే ప్రమాదంగా పరిణమిస్తుంది. కేవలం తమ స్వార్థ ప్రయోజ నాల కోసం దేశాన్ని ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టేసే ప్రమాదకర మైన క్రీడకు తెరతీస్తే అది భస్మాసుర హస్తం కాగలదని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే ఆర్ధిక మూలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ముఖ్యంగా పాలకుల చేతుల్లో ఉంది. ఎగవేతదారుల నుంచి బకాయిలు జప్తు చేసి బ్యాంకులను ఆర్ధికంగా పరిపుష్టి చేసే మార్గాలు అన్వేషించి,  దేశాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి. ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగులబెట్టుకోకూడదు. ఆర్ధికంగా దివాలా స్థితిలో ఉందని దేశాన్ని తాకట్టు పెట్టే దుస్థితి కల్పించకూడదు. అదే జరిగితే భారత దేశం తిరిగి పరాయి పాలనలోకి వెళ్లడం ఖాయం.
ఇక్బాల్ యం.జి
7396048316 రుణాలు తిరిగి చెల్లిస్తా: మాల్యా

Updated By ManamTue, 06/26/2018 - 15:54

రుణం చెల్లించాలన్నదే నా అభిమతం
అప్పుడు.. ఇప్పుడూ.. అదే ప్రయత్నంలో ఉన్నా: మాల్యా

న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించానని.. ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నానని విజయ్ మాల్యా స్పష్టం చేశారు. అయితే, బ్యాంకులు మాత్రం తనను రుణాల ఎగవేతదారుగా పోస్టర్లకు ఎక్కించాయని ఆయన విమర్శించారు.

mallya

భారత్ లో ఉన్నపుడు కూడా పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించాలనే ప్రయత్నించినట్లు వివరించారు. అందుకోసం పట్టుదలగా ప్రయత్నించానని చెప్పారు. ఈ విషయంలో రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడంతో బ్యాంకులు తనను ముద్దాయిగా నిలబెట్టాయని ఆరోపించారు. ఎప్పుడైతే లోన్ రికవరీ అంశంలో రాజకీయ శక్తులు జోక్యం చేసుకున్నాయో.. అప్పుడిక తనకు చేయడానికి ఏమీ మిగలలేదని మాల్యా తెలిపారు. 

వాస్తవానికి రుణాల వసూలు అంశం సివిల్ పరిధిలోకి వచ్చినా.. భారత ప్రభుత్వం మాత్రం ప్రజల ముందు తనను క్రిమినల్‌గా నిలబెట్టిందని మండిపడ్డారు. 2016లో ఇదే విషయానికి సంబంధించి ప్రధాని మోదీతో పాటు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి తాను లేఖ రాసానని మాల్యా తెలిపారు. అయితే, వారి నుంచి తనకు ఎలాంటి జవాబు రాలేదని పేర్కొన్నారు. తాజాగా ఆ లేఖలను మాల్యా మీడియాకు విడుదల చేశారు. లిక్కర్ బేరన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ మాల్యా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దాదాపు 9 వేల కోట్ల రుణం తీసుకుని విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్న మాల్యాను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలపై మాల్యా మంగళవారం  స్పందించారు. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలన్నదే తన అభిమతమని స్పష్టం చేశారు. న్యాయ పర్యవేక్షణలో తన ఆస్తులను విక్రయించడానికి కోర్టు అనుమతి ఇవ్వాలని ప్రస్తుతం మాల్యా కోరారు. విక్రయించిన ఆస్తుల ద్వారా తాను బ్యాంకులకు రుణాలు చెల్లించనున్నట్టు ఒప్పుకున్నారు. ఈమేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేస్తూ.. తాను గతంలో ప్రధాని మోదీకి రాసిన లేఖనూ బయటపెట్టారు.స్తంభించిన బ్యాంకింగ్

Updated By ManamThu, 05/31/2018 - 06:35
  • దేశవ్యాప్తంగా నిలిచిన లావాదేవీలు.. సమ్మెలో తొలి రోజు 10 లక్షల మంది ఉద్యోగులు

  • వినియోగదారులకు తీవ్ర అవస్థలు.. కొన్ని ప్రైవేటు బ్యాంకుల్లో యథావిధిగా కార్యకలాపాలు

banksహైదరాబాద్: వేతన పెంపు డిమాండ్‌తో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన రెండు రోజుల సమ్మె తొలిరోజు బుధవారం బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దేశవ్యాప్తంగా 21 ప్రభుత్వరంగ బ్యాంకులు, కొన్ని ప్రైవేటు బ్యాంకులకు చెందిన పది లక్షలకు మందికి పైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెను గురువారం వరకు కొససాగించనున్నట్టు యునైటెడ్ ఫోరం అఫ్ బ్యాంకు యూనియన్స్ కన్వీనర్ వివిఎస్ ఆర్ శర్మ చెప్పారు. ఉద్యోగులు, అధికారులందరికీ స్కేల్ -7 ప్రకారం వేతన సవరణ చేయాలని బుధవారం డిమాండ్ చేసారని తెలిపారు.అయితే ఇండియన్ అసోసియేుషన్‌లో భాగస్వామ్యం కాని,ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, కోటక్‌మహీంద్రా బ్యాంకుల్లో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగించారని అన్నారు . అయితే ఇతర బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో ఉన్నందున చెక్కుల క్లియరెన్స్ వంటి కార్యకలాపాలు చేపట్టలేదు.  లాభాలలో వస్తున్న తరుగుదలను కుంటిసాకుగా చూపి 2శాతం వేతన పెరుగుదలను మాత్రమే చేయగలమని ప్రతిపాదించడం శోచనీయమని అన్నారు. వాస్తవానికి బ్యాంకు లాభాలలో 70శాతం నిరర్ధక ఆస్తులకు, మొండిబకాయిలకు కేటాయించడమే ప్రస్తుత బ్యాంకుల లాభాలపై ఒత్తిడికి మూలకారణమని విమర్శించారు. బ్యాంకింగ్ రంగ ఉద్యోగులకు వేతన సవరణ చేయాలని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు కేంద్ర ఆర్థిక శాఖ 2016 జనవరి నుంచి పలుమార్లు ఆదేశించిందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికే 12 సార్లు చర్చలు జరిపినప్పటికీ బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణ ఒప్పందం అసంపూర్తిగానే ఉన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 1979వ సంవత్సరం నుంచి అమలవుతున్న విధంగా అందరు అధికారులను(స్కేల్-7 వరకు ఈ వేతన సవరణ) ఒప్పందంలో భాగం  చేయాలని యునైటెడ్ ఫోరం అఫ్ బ్యాంకు యూనియన్స్ డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలను ప్రజలకు అందించేందుకు బ్యాంకు ఉద్యోగులు, అధికారులు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. న్యాయసమ్మతమయిన వేతన సవరణ ఒప్పందం విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వేతన సవరణను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. కేరళ, పశ్చిమబెంగాల్, బిహార్, జార్ఖ్‌ండ్‌లలో సమ్మె ప్రభావం ఎక్కువగా కనిపించింది.బ్యాంకులే కాదు, ఏటీఎంలూ పనిచేయవు

Updated By ManamWed, 05/30/2018 - 09:32

atm హైదరాబాద్: దేశవ్యాప్తంగా రెండు రోజుల బ్యాంకు ఉద్యోగుల సమ్మె మొదలైంది. వేతన సవరణపై చీఫ్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు దిగక తప్పలేదని, మొత్తం 9 బ్యాంక్ ఉద్యోగుల అసోషియేషన్లు సమ్మెలో పాల్గొంటున్నాయని బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ తెలియజేసింది. ఈ రెండు రోజుల పాటు ఏటీఎంలు కూడా పని చేయవని, ప్రజలు తమ న్యాయమైన డిమాండ్లను అర్థం చేసుకుంటారనే ఆశిస్తున్నామని యూఎఫ్బీయూ పేర్కొంది. కాగా చెక్కువ క్లియరెన్స్ మినహా ప్రైవేట్ రంగంలోని ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ తదితర బ్యాంకులు మామూలుగానే పనిచేయనున్నాయి. అయితే వేతనాలు పెంచాలని ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు ఈ సమ్మెను చేస్తున్నారు.

 యూకో బ్యాంక్‌లో రూ.621 కోట్లు మోసం

Updated By ManamSun, 04/15/2018 - 12:39

CBI Files Case Against Former UCO Bank Chairman For Rs. 621 Loss Involving Conspiracy

న్యూ ఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉదంతం మర్చిపోకముందే తాజాగా మరో బ్యాంకులో నిబంధనలకు విరుద్దుంగా రుణాలను మంజూరు చేసిన వ్యవహారం వెలుగు చూసింది. పేరుగాంచిన యూకో బ్యాంకు మాజీ ఛైర్మెన్, అరుణ్‌ కౌల్‌పై సిబిఐ కేసు నమోదు చేసింది. సుమారు రూ.621 కోట్ల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై యూకో బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ అరుణ్‌ కౌల్‌తో పాటు మరి కొంత మంది బిజినెస్‌ ఎక్జిక్యూటివ్‌లపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఎరా ప్రమోటర్లు బ్యాంకు చైర్మెన్‌తో కుమ్మకై బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను తమ స్వంత ఖాతాల్లోకి మళ్ళించుకొన్నారని అభియోగాలు నమోదయ్యాయి. పక్కా ప్లాన్‌‌తో చేసినప్పటికీ ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో నిందితులు కంగుతిన్నారు. రంగంలోకి సిబిఐ నిందితుల నుంచి నిజానిజాలు రాబట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

కాగా.. అరుణ్‌ కౌల్‌ 2010 నుంచి 2015 మధ్యంలో యూకో బ్యాంకుకు చైర్మన్‌గా వ్యవహరించారని, ఈ సంస్థలకు రుణాలు మంజూరు చేయడంలో అరుణ్‌ కౌల్‌దే ప్రధాన భూమిక అని సీబీఐ అధికారులు తెలిపారు. బ్యాంకింగ్‌ రంగంలో ఫిబ్రవరి తర్వాత బయట పడిన మరో పెద్ద మోసం ఇదే అని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే.. నిందితుల ఇళ్ళు, కార్యాలయాలపై సీబిఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఎరా ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌ ఇండియా (ఇఐఈల్‌) సిఎండి హేమ్‌సింగ్‌ భరానా, చార్టర్డ్‌ అకౌంట్లు పంకజ్‌ జైన్‌, వందనా శారదా, ఆల్టీస్‌ ఫిన్‌సర్వ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన పవన్‌ బన్సాల్‌పై కూడా సిబిఐ అభియోగాలు దాఖలు చేసింది. ఈ బ్యాంకు నుండి సుమారు రూ.650 కోట్లను స్వాహ చేసినట్టు సిబిఐ అనుమానిస్తుంది. అయితే ఈ కేసులో పోలీసులు, సీబీఐ ఎలా ముందుకెళ్తుందో.. నిందితులకు ఎలాంటి శిక్ష విధిస్తుందే వేచి చూడాల్సిందే.

 Arun Kaulసడన్ షాకిచ్చిన బ్యాంకులు

Updated By ManamThu, 03/22/2018 - 08:50

Banks Refusing Soiled New Currency Notes

హైదరాబాద్: మోదీ సర్కార్ పెద్ద నోట్లను రద్దు చేస్తూ వాటి స్థానంలో కొత్త నోట్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ముందున్న నోట్లకు ఇప్పుడొచ్చిన కొత్త నోట్లకు చాలా తేడా ఉంటుంది. రంగురంగులుగా నోట్లు రావడంతో కాస్త కలర్ పోయినా.. చిరిగినట్లుగా ఉన్నవాటిని ఇది వరకు మార్చుకోవడానికి బ్యాంకులు వెసులుబాటు కల్పించాయి. అయితే ఇకపైన చిరిగిన నోట్లు తీసుకునేది లేదంటూ  బ్యాంకులు సడన్ షాకిచ్చాయి. అంతేకాదు మీరు ఆర్బీఐకి వెళ్లి అష్టకష్టాలు పడినా సరే తీసుకునే పరిస్థితులే ఉండవు. మీ నోటు చిరిగితే మాత్రం ఇక అంతే సంగతులు అన్నమాట. చిరిగిన నోటును ఇంట్లో పెట్టుకోవడం తప్ప చేసేదేమీ లేదు.

అసలు కారణమిదీ..
పెద్ద నోట్లు రద్దు చేసి, కొత్త నోట్లను చలామణిలోకి తెచ్చి ఏడాదిన్నర అవుతున్నా... కొత్త నోట్లకు సంబంధించి చిరిగిన/దెబ్బతిన్న కొత్త నోట్ల మార్పిడికి మార్గదర్శకాలు ఇప్పటికీ రాలేదు. దీంతో ఒక వేళ చిరిగిన నోట్లు బ్యాంకులు తీసుకున్నా.. వాటిని కూడా కౌంటింగ్‌‌లో లెక్కలు తేల్చాల్సిందే. ఈ మేరకు మార్గదర్శకాలు లేకపోవడంతో వాటిని తీసుకోవడం లేదని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. అయితే బ్యాంకుల నుంచి సొమ్ము డ్రా చేసుకున్నప్పుడు, ఏటీఎంలలో మాత్రం చిరిగిన కొత్త నోట్లు వచ్చినా కష్టమే. వాటిని తిరిగి బ్యాంకుల వద్దకు తీసుకెళ్లినా పెద్ద ప్రయోజనం ఉండదు. చిరిగిన నోట్లను తీసుకోవట్లేదని సింగిల్ మాటతో బ్యాంకు సిబ్బంది ఒక్క మాటలో తేల్చేస్తుందంతే.

దాచిపెట్టుకోండి.. తర్వాత చూద్దాం..!
చిరిగిన నోట్లను తీసుకుని జనాలు బ్యాంకుల దగ్గరికెళితే.. ‘నోట్లన్నీ దాచిపెట్టుకోండి.. తర్వాత చూద్దాం’.. ఇదీ సిబ్బంది నుంచి వస్తున్న ఏకైక సమాధానం. దీంతో తీవ్ర నిరాశతో.. అత్యవసరానికి డబ్బులు లేక జనాలు ఇంటిబాట పడుతున్నారు. తమ నుంచి ఆదేశాలు వచ్చేవరకు చిరిగిన/ దెబ్బతిన్న కొత్త నోట్ల మార్పిడి చేయవద్దని రిజర్వు బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు ఉన్నట్లు బ్యాంకులు చెబుతున్నాయి. 

డబ్బులు దొబ్బేస్తున్నారు.. ఓ వైపు బ్యాంకులు నోట్లను తీసుకోకుండా తిరస్కరిస్తుండటంతో అత్యవసరాలకు డబ్బుల్లేక దేశ వ్యాప్తంగా జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక జనాలు తలలుపట్టుకుంటున్నారు. దీన్నే అదనుగా తీసుకుంటున్న కొందరు.. చిరిగిన నోట్లను తీసుకుంటామని చెప్పి  భారీగా కమీషన్ల దందాకు తెరలేపుతున్నారు. బ్యాంకులకు సమీపంలో తమ పని కానిచ్చేస్తున్నారు. రూ.2 వేల చిరిగిన నోటుకు రూ.500 నుంచి వెయ్యి వరకు కమీషన్ తీసుకున్నారు. ఇక, రూ.500 చిరిగిన నోటు మార్పిడికి రూ.200 నుంచి 300 వరకు కమీషన్‌గా తీసుకుంటున్నారు. అయినా సరే మా నోట్లు చేతులు మారితో చాలంటూ చిరిగిన నోట్ల బాధితులు అతి బలవంతంగా మార్చుకుంటుంటే.. ఇంకొందరు మాత్రం ‘మార్పిడి చేసుకునే రోజు’ వస్తుందేమో అని వేచి చూస్తున్నారు.

Banks Refusing Soiled New Currency Notesరూ.1000కోట్ల భారీ మోసం

Updated By ManamWed, 03/21/2018 - 22:11
  • 14 బ్యాంకులలో రూ.వెయ్యి కోట్లు హాంఫట్

  • బ్యాంకింగ్ రంగానికి కనిష్క్ గోల్డ్ సున్నం

  • మారిషస్‌లో ప్రమోటర్.. డైరెక్టర్ దంపతులు!

  • నీరవ్.. మాల్యా.. లలిత్‌ల తరహాలో పరార్

  • 215 కోట్ల మోసంపై సీబీఐకి ఎస్‌బీఐ ఫిర్యాదు

  • ఆ తర్వాత అదే బాటలో 13 యాజమాన్యాలు

2చెన్నై: దేశంలో పలువురు ప్రబుద్ధులు బ్యాంకులను ముంచిన కథలు ఒక్కొటొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా స్వర్ణాభరణాల శృంఖల సంస్థ కనిష్క్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్‌బీఐ నేతృత్వంలోని 14 ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకుల సమూహానికి సున్నం పూసింది. సదరు సంస్థ యజమానులు కూడా నీరవ్, విజయ్‌మాల్యా, లలిత్‌మోదీల తరహాలో విదేశాలకు చెక్కేశారు. మొత్తంమీద రూ.824.15 కోట్ల రుణం, వాటిపై వడ్డీసహా వెయ్యి కోట్లకు నామంపెట్టిన ఈ సంస్థ తెల్లారేసరికి దుకాణం మూసేసింది. నీరవ్ మోదీ రూ.12వేల కోట్లకు పీఎన్‌బీకి కుచ్చుటోపీ పెట్టి పారిపోయాకగానీ బ్యాంకు  యాజమాన్యం మేల్కొనలేదు. అదే తరహాలో కనిష్క్ మోసం గురించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కు అర్థమయ్యేసరికే దాని యజమానులు పరారయ్యారు. ఈ నేపథ్యంలో తాము రూ.215 కోట్ల మేర మునిగినట్లు ఎస్‌బీఐ నిరుడు నవంబరు 11న రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)కు నివేదించింది. ఆ తర్వాత 2018 జనవరి నాటికి మిగిలిన 13 బ్యాంకులు లబోదిబోమంటూ ఆర్బీఐ శరణుజొచ్చాయి. అటుపైన తొలుత ఎస్‌బీఐ చొరవ తీసుకుని సీబీఐకి ఫిర్యాదు చేయడంతో మిగిలిన బ్యాంకులూ దాన్ని అనుసరించాయి. కనిష్క్ సంస్థ ప్రధాన కార్యాలయం తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని టి.నగర్‌లో ఉంది.

భూపేష్‌కుమార్ జైన్, అతని భార్య నీతా జైన్ ఈ సంస్థకు ప్రమోటర్లు, డైరెక్టర్లుగా ఉన్నారు. అయితే, వెయ్యికోట్లకు టోకరా వేసిన ఈ దంపతులతో మాట్లాడేందుకు యత్నించినా వారు అందుబాటులో లేరని బ్యాంకులు వాపోతున్నాయి. కాగా, వీరు ప్రస్తుతం పర్యాటక స్వర్గం మారిషస్‌లో మజా చేస్తున్నారని సమాచారం. ఈ ఉదంతంపై 2018 జనవరిలో ఎస్‌బీఐ యాజమాన్యం సీబీఐకి ఫిర్యాదు చేసినా ఇంకా ఎఫ్‌ఐఆర్ సిద్ధం కాలేదు. కనిష్క్ సంస్థ రాత్రికిరాత్రే రికార్డులను తారుమారు చేసి, తెల్లారేసరికి బిచాణా ఎత్తేసిందని మొరపెట్టుకుంది. తమ నేతృత్వంలోని 14 బ్యాంకుల కన్సార్షియం నుంచి కనిష్క్ సంస్థ రూ.824.15 కోట్లదాకా రుణాలు తీసుకున్నట్లు తెలిపింది. వడ్డీతో కలిపి ఈ బకాయిలు రూ.వెయ్యి కోట్లు దాటినట్లు పేర్కొంది. తొలుత 2017 మార్చిలో 8 సభ్య బ్యాంకులకు ఈ సంస్థ వడ్డీ ఎగ్గొట్టినట్లు వెల్లడించింది. ఏప్రిల్ నాటికి మొత్తం 14 బ్యాంకులకూ బకాయి చెల్లింపులు నిలిపివేసిందని పేర్కొంది. దీంతో 2017 మే 25న తాము కనిష్క్ కార్పొరేట్ కార్యాలయం, ఫ్యాక్టరీ, షోరూములను తనిఖీ చేసేందుకు యత్నించగా అక్కడ ఏ కార్యకలాపాలూ సాగడం లేదని స్పష్టమైనట్లు బ్యాంకుల అధికారులు తెలిపారు. మరోవైపు రికార్డులను తారుమారు చేశామని, సరుకు నిల్వలు తరలించేశామని భూపేష్ జైన్ బ్యాంకర్లకు ఒక లేఖ కూడా రాశారు.

నష్టాల పేరిట 2017 మే నెలలోనే మూత
వ్యాపార నష్టాలను భరించలేని స్థితిలో కనిష్క్ సంస్థ 2017 మే నెలలోనే బోర్డు తిప్పేసిందని ‘మద్రాస్ జ్యూయలర్స్ అండ్ డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధి తెలిపారు. కాగా, ఎస్‌బీఐ రికార్డుల ప్రకారం 2007 నుంచీ కనిష్క్ సంస్థ రుణాలు పొందుతోంది. అలా సంవత్సరాలు గడుస్తున్నకొద్దీ బ్యాంకులు సదరు సంస్థకు రుణ పరిమితిని పెంచాయి. మరోవైపు కనిష్క్‌కు ఐసీఐసీఐ బ్యాంకు ఇచ్చిన రుణ వసూలు బాధ్యతను ఎస్‌బీఐ స్వీకరించింది. ఆ సమయానికి నిర్వహణ మూలధన రుణం రూ.50 కోట్లు, నిర్దిష్ట కాలవ్యవధి రుణాలు రూ.10 కోట్లుగా ఉన్నాయి. ఈ మొత్తాన్ని 2011 మార్చి నెలలో పీఎన్‌బీ, బ్యాంక్ ఆఫ్ ఇండియాలతో సంయుక్తంగా బహుళ బ్యాంకుల ఒప్పందంగా మార్చుకున్నారు. ఇక కనిష్క్ ఉదంతంపై కార్పొరేషన్ బ్యాంకు ఏజీఎం సౌందర రాజన్‌ను ఓ మీడియా సంస్థ ప్రతినిధి సంప్రదించగా- దీన్ని గురించి తమకు తెలుసునని ఆయన జవాబివ్వడం గమనార్హం. అయితే, బ్యాంకుల కన్సార్షియానికి నాయకత్వం వహించిన ఎస్‌బీఐ అన్ని ప్రశ్నలకూ జవాబివ్వగలదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర బ్యాంకులతో పోలిస్తే కనిష్క్ తమవద్ద తీసుకున్న నిర్వహణ మూలధన రుణం కేవలం రూ.20 కోట్లేనని చెప్పారు.


కనిష్క్‌కు బ్యాంకులు సమర్పించిన రుణ వివరాలు
ఎస్‌బీఐ రూ.215 కోట్లు; పీఎన్‌బీ రూ.115 కోట్లు; యూబీఐ రూ.50 కోట్లు, సిండికేట్ బ్యాంక్ రూ.50 కోట్లు; బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.45 కోట్లు; ఐడీబీఐ బ్యాంకు రూ.45 కోట్లు; యూకో బ్యాంకు రూ.40 కోట్లు, తమిళనాడు మర్కెంటైల్ బ్యాంకు రూ.37 కోట్లు; ఆంధ్రాబ్యాంకు రూ.30 కోట్లు; బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.30 కోట్లు; హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.25 కోట్లు; ఐసీఐసీఐ రూ.25 కోట్లు; సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.20 కోట్లు, కార్పొరేషన్ బ్యాంక్ రూ.20 కోట్ల వంతున రుణవసతి కల్పించాయి.గాడిలో పడనున్న బ్యాంకులు

Updated By ManamThu, 12/28/2017 - 22:35

rbi న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులలోకి కొత్తగా మూలధనాన్ని చొప్పిస్తూనే, కొత్త ఏడాది (2018)లో ప్రభు త్వం బ్యాంకింగ్ రంగ సంస్కరణలను ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంది. నిరర్థక ఆస్తుల (ఎన్.పి.ఏ)ల సంక్షో భం నుంచి బ్యాంకులను బయుటపడేయాలని ప్రభుత్వం ప్రయుత్నిస్తోంది. రుణాల వృద్ధి గత 25 ఏళ్ళలో ఎన్నడూ లేనంత తక్కువగా ఉంది. దానిని పునరుద్ధరించాలని భావిస్తోంది. ఎన్.పి.ఏలతో కుంగిపోతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు రెండేళ్ళ కాలంలో అసాధారణైమెన రీతిలో రూ. 2.11 లక్షల కోట్ల మూలధనాన్ని సవుకూర్చనున్నట్లు ప్రభుత్వం అక్టోబరులో ప్రకటించింది. 2015 మార్చిలో రూ. 2.75 లక్షల కోట్ల మేరకు ఉన్న ఎన్.పి.ఏలు రెండున్నర రెట్లకు పైగా పెరిగి 2017 జూన్ నాటికి రూ. 7.33 లక్షల కోట్లకు చేరాయి. బ్యాంకులకు ప్రకటించిన రూ. 2.11 లక్షల కోట్ల ప్యాకేజీలో రీక్యాపిటైలెజేషన్  బాండ్ల ద్వారా రూ. 1.35 లక్షల కోట్లను చొప్పించనున్నారు. 

సంస్కరణల బాట
రీక్యాపిటైలెజేషన్ బాండ్ల రూపురేఖలను ఆర్థిక మంత్రిత్వ శాఖ త్వరలో ప్రకటించవచ్చు. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తం ఇవ్వనున్నదీ కూడా తెలుపవచ్చు. బ్యాంకులలోకి మూలధనాన్ని చొప్పించే ప్రక్రియ ఏమంత తేలికైన వ్యవహారం కాబోవడం లేదు. దాని వెనుకే వరుసగా పలు సంస్కరణలు రానున్నాయి. బ్యాంక్ బోర్డులను పటిష్టం చేయడం, ఎన్.పి.ఏల పరిష్కారం, హెచ్.ఆర్. అంశాలు వంటివి ఉండబోతున్నాయి. అప్పుడే భవిష్యత్తులో అవి స్పందనాయుతమైన, బాధ్యతాయుతమైన బ్యాంకింగ్ నిర్వహించగలవు. ‘‘సంస్కరణల ఎజెండాకు అత్యధిక ప్రాముఖ్యం ఉంది. మూలధనీకరణతోపాటే, దానిని అమలుజరుపవలసి ఉంది. చాలా సంస్కరణలు వస్తాయి. ఎందుకంటే, సిసలైన వ్యక్తులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా, వారి అవసరాన్ని ఆధారం చేసుకుని రుణాల మంజూరు కొనసాగాలి. వారు ఇబ్బందులు పడకూడదు’’ అని ఫైనాన్షియల్ సర్వీసుల కార్యదర్శి రాజీవ్ కుమార్ అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎం.ఎస్.ఎం.ఇ)లు, సమ్మిళిత ఫైనాన్షియల్ వృద్ధి, ఉద్యోగాల సృష్టిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.

రెండు ఆర్డినెన్సులు
 ప్రభుత్వ రంగ బ్యాంకుల రంగంలో ఏకీకరణకు వెసులుబాటు కల్పించేందుకు ప్రత్యామ్నాయ యంత్రాం గం (ఏ.ఎం) ద్వారా మిశ్రమం చెందేందుకు పి.ఎస్.బిలకు మంత్రివర్గం ఆగస్టు నెలలో సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. తర్వాత, ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన గత నెలలో ఒక ప్యానెల్ ఏర్పాటు చేశారు. సమ్మిశ్రమ పథకాలు రూపొందించేందు కు సూత్రప్రాయంగా ఆమోదం కోరుతూ బ్యాంకుల నుం చి వచ్చే ప్రతిపాదనలను ఈ ప్యానెల్ పరిశీలిస్తుంది. అది ఆమోదించిన ప్రతిపాదనలపై ఒక నివేదికను మూడు నెల ల కొకసారి క్యాబినెట్‌కు పుంపుతారు. ఈ ప్యానెల్‌లో రైల్వే లు, బొగ్గు శాఖ మంత్రి పీయూష్ గోయల్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా సభ్యులుగా ఉన్నారు. కొండ లా పెరిగిపోయిన ఎన్.పి.ఏలను తగ్గించాలని కంకణం కట్టుకున్న ప్రభుత్వం ఈ ఏడాది రెండు ఆర్డినెన్సులు జారీ చేసింది. అవి 2017 బ్యాంకింగ్  నియంత్రణ (సవరణ) ఆర్డినెన్స్. 2017 ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్ప్ట్స్రీ కోడ్ (సవరణ) ఆర్డినెన్స్. దివాలా ప్రొసీడింగులు చేపట్టవలసిందిగా ఏ బ్యాంకుైనెనా ఆదేశించే, ‘స్ట్రెస్సడ్ ఎసెట్ల’ (ఎన్.పి.ఏలు ముదిరితే స్ట్రెస్సడ్ ఎసెట్లు అవుతాయి) పరిష్కారానికి దిశానిర్దేశం చేసే అధికారాన్ని ఈ ఆర్డినెన్సు ఆర్.బి.ఐ.కి కట్టబెడుతోంది. ఆర్.బి.ఐ అంతర్గత సలహా కమిటీ రూ. 5,000 కోట్లకు పైగా మొత్తం ఇమిడి ఉన్న 12 పెద్ద స్ట్రెస్సడ్ ఎసెట్లను గుర్తించింది. మొత్తం స్థూల ఎన్.పి.ఏలలో అవే 25 శాతం (రూ. 1.75 లక్షల కోట్ల) మేరకు ఉన్నాయి. ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్ప్ట్స్రీ కోడ్ కింద వాటిపై ప్రొసీడింగులు చేపట్టవలసిందిగా సూచించింది. దివాలాకు వెళ్ళిన అన్ని కేసులలోను భద్రత ఉన్న రుణాల విషయంలో 50 శాతం మొత్తాన్ని, భద్రతలేని రుణాల విషయంలో 100 శాతం మొత్తాన్ని పక్కన పెట్టవలసిందిగా బ్యాంకులకు కేంద్ర బ్యాంక్ సలహా ఇచ్చింది. 

మరో జాగ్రత్త చర్య
దివాలా ప్రొసీడింగుల కింద ఉన్న ఆస్తులను బ్యాంకులు వేలం వేసి రావలసిన బకాయిలో కొంత మొత్తాన్ని అయినా రాబట్టుకుంటాయి. రుణాలు ఎగవేసిన ప్రమోటర్లు తిరిగి తమ సంస్థలను కైవసం చేసుకునేందుకు అలాంటి వేలంపాటలలో పాల్గొనడానికి వీలు లేకుండా నిషేధిస్తూ ప్రభుత్వం గత నెలలో మరో ఆర్డినెన్సు తెచ్చింది. ఉద్దేశపూర్వకంగానే బ్యాంకుల రుణాలు ఎగవేసినవారు, ఎన్.పి.ఏ ఖాతాలున్నవారు బిడ్డింగ్‌లో పాల్గొనకుండా చేయడం ప్రభుత్వ ఉద్దేశం. ఈ ఆర్డినెన్సుకు పార్లమెంట్ ఇంకా ఆమోదం తెలుపవలసి ఉంది. వివేకహీనమైన వ్యక్తులు ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్ప్ట్స్రీ కోడ్‌లోని నిబంధనలను దుర్వినియోగం లేదా కలుషితం చేయుకుండా నివారించేందుకు భద్రతా ప్రమాణాలుగా ప్రభుత్వం వాటిని తెచ్చింది. పరిష్కారాలకు ఇంకా ఆమోదం లభించవలసి ఉన్న కేసులకు ఈ సవరణలు వర్తిస్తాయి. మొండి బకాయిలు రాబట్టుకునేందుకు ఇన్‌సాల్వెన్సీ ప్రొసీడింగుల కింద చేపట్టిన వేలం పాటలలో సొంత ఆస్తులకు తిరిగి బిడ్డింగ్ జరుపకుండా కొందరు ప్రమోటర్లను నివారించడం ఈ మార్పుల ప్రధాన ఆంతర్యం. 

ఎగవేతదార్ల రెండవ జాబితా
పెద్ద ఎగవేతదార్లతో ఆర్.బి.ఐ. ఆగస్టులో రెండవ జా బితా తయారు చేసింది. డిసెంబరు 13కల్లా 28 పెద్ద ఖా తాలను పరిష్కరించవలసిందని బ్యాంకులను ఆదేశించిం ది. లేకపోతే, వాటిని డిసెంబరు 31కల్లా ఇన్‌సాల్వెన్సీ ప్రొసీడింగులకు ఎన్.సి.ఎల్.టికి పంపవలసిందని కోరింది. వీటిలో దాదాపు 23 ఖాతాలను దివాలా ప్రొసీడింగులకు పంపడానికి బ్యాంకులు సిద్ధవువుతున్నాయి. మొండి బాకీలలో దాదాపు 40 శాతం (దాదాపు రూ. 4 లక్షల కోట్లు) ఈ 28 ఖాతాలదే. ట్రైబ్యునల్ విచారణకు వెళ్ళనున్నవాటిలో ఆసియన్ కలర్ కోటెడ్ ఇస్పాత్,క్యాస్‌టెక్స్ టెక్నాలజీస్, కోస్టల్ ప్రాజెక్ట్స్, ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ, ఐ.వి.ఆర్.సి.ఎల్, ఆర్చిడ్ ఫార్మా, ఎస్.ఇ.ఎల్. మాన్యుఫ్యాక్చరింగ్, ఉత్తమ్ గాల్వా మెటాలిక్,  ఉత్తమ్ గాల్వా స్టీల్, విసా స్టీల్, ఎస్సార్ ప్రాజెక్ట్స్, జై బాలాజీ ఇండస్ట్రీస్, మన్నెత్ పవర్, నాగార్జున ఆయిల్ రిఫైనరీ, రుచి సోయా ఇండస్ట్రీస్, విండ్ వరల్డ్ ఇండియాలను కొన్నింటిగా చెప్పుకోవచ్చు. 

మరో విశేషం
బ్యాంకింగ్ రంగానికి సంబంధించినంతవరకు 2017 లో మరో విశేషం ఉంది. అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బి.ఐ)లో ఐదు అసోసియేట్ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంక్ విలీనం కావడం. దీనితో ఎస్.బి.ఐ ప్రపంచంలోని టాప్ 50 బ్యాంకులలో ఒకటిగా అవతరించిం ది. ఎస్.బి.ఐకి మొత్తం 37 కోట్ల మంది ఖాతాదార్లు ఉన్నా రు. దాదాపు 24,000 శాఖలున్నాయి. దేశవ్యాప్తంగా రమారమి 59,000 ఏ.టి.ఎంలు నిర్వహిస్తోంది. దానివద్ద 26 లక్షల కోట్ల రూపాయులకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. అది ఇచ్చిన రుణాలు రూ. 18.50 లక్షల కోట్ల మేరకు ఉన్నాయి. సామాజిక రంగంలో, ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన్ మంత్రి వయ వందన యోజన (పి.ఎం.వి.వి.ైవె) ప్రారంభించింది. వృద్ధాప్యంలో సామాజిక భద్రత కల్పించడం, 60 ఏళ్ళు, అంతకుమించి వయసు ఉన్న వారిని కాపాడడం దాని లక్ష్యం. మార్కెట్‌లోని అస్థిర పరిస్థితుల కారణంగా భవిష్యత్తులో వారి వడ్డీ ఆదాయం పడిపోకుండా చూసేందుకు ఆ ఏర్పాటు చేసింది.

Related News