puri jagannaath

'మెహ‌బూబా' డేట్ ఫిక్స‌య్యింది

Updated By ManamSat, 03/24/2018 - 14:19

mehaboobaపూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ తాజా చిత్రం 'మెహ‌బూబా'. ఆకాశ్ పూరి, నేహా శెట్టి జంట‌గా న‌టించిన‌ ఈ సినిమా.. 1971 ఇండియా -  పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెర‌కెక్కింది. ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వ‌ర్క్ జరుపుకుంటోంది. ఈ రోజు (శ‌నివారం) ఈ  సినిమా విడుద‌ల తేదిని ప్ర‌క‌టించింది చిత్ర బృందం. మే 11న ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు చిత్ర నిర్మాణ సంస్థ పూరీ క‌నెక్ట్స్‌ ప్ర‌క‌టించింది. ఇదిలా ఉంటే.. ప్ర‌ముఖ నిర్మాత‌ దిల్ రాజు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రిక‌ల్‌ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం ద్వారా ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు సందీప్ చౌతా.. టాలీవుడ్‌లో మూడో ఇన్నింగ్స్‌ను మొద‌లుపెడుతున్నారు.మ‌రోసారి పూరీ, చెర్రీ కాంబినేష‌న్‌?

Updated By ManamTue, 01/30/2018 - 20:17

puriమెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. త‌న తొలి చిత్ర ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌తో రెండోసారి సినిమా చేయ‌బోతున్నారా? అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవితో ప‌లు హిట్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు.. చిరు త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లోనూ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే పూరీ చెప్పిన పాయింట్ న‌చ్చ‌డంతో.. 'చిరుత' కాంబినేష‌న్‌లో మూవీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నార‌ట‌. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ 'రంగ‌స్థ‌లం' పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. ఆ తరువాత బోయ‌పాటి చిత్రాన్ని చేయ‌నున్నారు. వీటి త‌ర్వాతే పూరీతో సినిమా చేసే అవ‌కాశ‌ముంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్‌ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లోపు పూరీ కూడా త‌న కొడుకు ఆకాశ్‌తో చేస్తున్న 'మెహ‌బూబా'ని పూర్తి చేసి.. చెర్రీ కోసం పూర్తి స్క్రిప్ట్‌ని త‌యారు చేసుకుంటార‌ని స‌మాచారం.‘మెహబూబా’ షెడ్యూల్ పూర్తి

Updated By ManamThu, 01/11/2018 - 21:06

mehaboobaప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరి జగన్నాథ్‌ రూపొందిస్తున్న తాజా చిత్రం ‘మెహబూబా’. ఈ రొమాంటిక్ మూవీలో పూరి తనయుడు ఆకాష్ కథానాయకుడిగా న‌టిస్తుండ‌గా.. కన్నడ నటి నేహ శెట్టి కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. 1971లో జరిగిన ఇండియా, పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్‌ టూరింగ్ టాకీస్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. సందీప్ చౌతా సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా, గత నెల రోజులుగా హైదరాబాదులో నిర్విరామంగా జరుగుతున్న ఈ మూవీ షెడ్యూల్ తాజాగా పూర్తయింది. త‌దుప‌రి షెడ్యూల్ సంక్రాంతి అనంత‌రం ప్రారంభించ‌నున్నార‌ని తెలిసింది. చిత్రీక‌ర‌ణ తుదిద‌శ‌కు చేరుకున్న ఈ సినిమాని ఈ ఏడాది ప్ర‌థ‌మార్థంలోనే విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.కాజ‌ల్ పాత్ర‌లో అలియా భ‌ట్‌

Updated By ManamTue, 12/12/2017 - 15:12

alia bhattస్టూడెంట్ అఫ్ ది ఇయర్’ (2012)తో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన హీరోయిన్ అలియా భట్. ఈ ఐదేళ్ల ప్ర‌యాణంలో ‘హంప్టీ శర్మాకి దుల్హనియా’,   2 స్టేట్స్‌, ‘ఉడ్తా పంజాబ్’, ‘డియర్ జిందగీ’, ‘బద్రీనాథ్ కి దుల్హనియా’ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో ఈమె సంద‌డి చేసింది. ప్రస్తుతం మేఘన గుల్జార్ తెరకెక్కిస్తున్న మూవీ ‘రాజీ’లో నటిస్తుంది అలియా. ఇదిలా ఉంటే.. రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న ‘సింబా’ మూవీలో క‌థానాయిక‌గా నటించే అవ‌కాశం అలియాని వ‌రించింద‌ని బాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. 

 పూరి జగన్నాధ్ డైరెక్షన్‌లో యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘టెంపర్’ (2015) సినిమాకి రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. యాక్షన్ డ్రామాగా వచ్చిన ‘టెంపర్’ బాక్సాఫీస్ వ‌ద్ద‌ మంచి విజయం సాధించింది. కామెడీ, యాక్షన్ సినిమాలను తెరకెక్కించే రోహిత్ శెట్టి ఈ చిత్రానికి డైరెక్టర్. తాజాగా విడుదలైన టీజర్ పోస్టరుకి మంచి స్పందన వచ్చింది. ఈ మూవీని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్, రోహిత్ శెట్టి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్ 28న ఈ సినిమా విడుద‌ల కానుంది.'మెహ‌బూబా'.. ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి

Updated By ManamWed, 11/15/2017 - 17:07

mehaboobaపూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం 'మెహ‌బూబా'. ఆయ‌న త‌న‌యుడు పూరీ ఆకాష్ ఇందులో క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. నేహా శెట్టి క‌థానాయిక‌గా ప‌రిచ‌యమ‌వుతున్న ఈ సినిమా.. తాజాగా ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, హ‌ర్యానా, పంజాబ్ వంటి ప్ర‌దేశాల్లో దాదాపు నెల రోజుల పాటు ఈ షెడ్యూల్ జ‌రిగింది. ఈ షెడ్యూల్ లో హీరోహీరోయిన్ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ని చిత్రీక‌రించార‌ని తెలిసింది. పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో సాగే ఈ సినిమాకి సందీప్ చౌతా సంగీత‌మందిస్తున్నాడు. 1971 ఇండో - పాక్ యుద్ధం నేప‌థ్యంలో ఈ సినిమా ఉంటుంది.పూరీ 33వ చిత్రం 'మెహ‌బూబా'

Updated By ManamThu, 09/28/2017 - 13:19

వేగంగా సినిమాల‌ను తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ శైలే వేరు. ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన సంవ‌త్స‌రం (2000) నుంచి ప్ర‌తి సంవ‌త్స‌రం.. త‌న నుంచి ఓ సినిమా ఉండేలా చ‌క్క‌టి ప్ర‌ణాళిక‌ల‌తో సినిమాల‌ను తెర‌కెక్కిస్తున్నారాయ‌న‌. పూరీ రూపొందించిన చిత్రాల్లో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలున్నాయి. అలాగే డిజాస్ట‌ర్ చిత్రాలున్నాయి. అయితే ప్ర‌తి చిత్రంలోనూ త‌న మార్క్ పంచ్ డైలాగ్స్‌కి కొద‌వలేదు. హీరోల‌ని కొత్త‌గా చూప‌డంలోనూ పూరీ స్టైల్ వేరు. త‌న గ‌త చిత్రం 'పైసావ‌సూల్‌'లోనూ నంద‌మూరి బాల‌కృష్ణ‌ని కొత్త‌గా చూపించారాయ‌న‌.

ఇదిలా ఉంటే.. పూరీ జ‌గ‌న్నాథ్ త‌న 33వ చిత్రాన్ని త‌న త‌న‌యుడు ఆకాష్ పూరీతో తెర‌కెక్కించ‌నున్నారు. 1971 ఇండో-పాక్ వార్ నేప‌థ్యంలో సాగే ఇన్‌టెన్స్ ల‌వ్‌స్టోరీ ఇద‌ని.. 'మెహ‌బూబా' పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం ద్వారా నేహాశెట్టి క‌థానాయిక‌గా ప‌రిచ‌యం కానుంద‌ని.. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు సందీప్ చౌతా బాణీలు అందించ‌నున్నార‌ని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. అక్టోబ‌ర్ నుంచి చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంద‌ని.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, పంజాబ్‌, రాజ‌స్థాన్ లో షూటింగ్ ఉంటుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. పూరీ జ‌గ‌న్నాథ్ టూరింగ్‌ టాకీస్ ప‌తాకంపై ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. అన్న‌ట్టు.. ఇవాళ పూరీ జ‌గ‌న్నాథ్ పుట్టిన‌రోజు.రామ్‌చ‌ర‌ణ్ తొలి చిత్రం 'చిరుత‌'కి ప‌దేళ్లు

Updated By ManamThu, 09/28/2017 - 11:48

మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడుగా భారీ అంచ‌నాల మ‌ధ్య 'చిరుత' చిత్రంతో తెరంగేట్రం చేశాడు రామ్‌చ‌ర‌ణ్‌. తొలి చిత్ర‌మే అయినా.. ఎక్క‌డా ఆ ఫీలింగ్‌ని మెగాభిమానుల‌కే కాకుండా ప్రేక్ష‌కుల‌కు కూడా క‌లిగించ‌లేదు చ‌ర‌ణ్‌.  అంత‌గా.. ఆ చిత్రంలో ఈజ్ చూపించాడు. ముఖ్యంగా పాట‌ల్లో చిరుని గుర్తుకు తెచ్చేలా డాన్స్‌ల‌తో మెప్పించాడు.  తొలి చిత్రం విష‌యంలో చ‌ర‌ణ్‌కి ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ నుంచి కూడా మంచి స‌పోర్ట్ ల‌భించింది. అభిమానులు చిరు త‌న‌యుడిని ఎలా చూడాల‌నుకుంటున్నారో అలా తెర‌పై చూపించ‌డంలో పూరీ నూటికి నూరు శాతం స‌క్సెస‌య్యాడు. చ‌ర‌ణ్‌ తెర‌పై తొలిసారిగా క‌నిపించే దృశ్యం నుంచి చివ‌రి స‌న్నివేశం వ‌ర‌కు సాధ్య‌మైనంత వ‌ర‌కు మెగాభిమానుల‌ను మెప్పించే ప్ర‌య‌త్నం చేశాడు పూరీ.  బాబాయ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన‌ 'బ‌ద్రి'  ద్వారా పూరీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైతే.. ఆ పూరీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 'చిరుత' చిత్రం ద్వారా త‌ను క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవ‌డం రామ్‌చ‌ర‌ణ్‌కి స‌మ్‌థింగ్ స్పెష‌లే.

ఇక  చిరంజీవి న‌టించిన ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు సంగీత‌మందించిన‌ మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ  ఈ చిత్రంలో అదిరిపోయే పాట‌లు ఇచ్చాడు. చిరుతో 'జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి', 'చూడాల‌ని ఉంది', 'ఇంద్ర' వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను నిర్మించిన సి.అశ్వ‌నీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నేహాశ‌ర్మ హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన ఈ చిత్రం  2007లో ఇదే సెప్టెంబ‌ర్ 28 (ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ పుట్టిన‌రోజు కూడా  కావ‌డం విశేషం)న విడుద‌లైంది. అంటే.. ఇవాళ్టితో రామ్‌చ‌ర‌ణ్ న‌ట ప్ర‌స్థానానికి ప‌దేళ్లు పూర్త‌వుతున్నాయ‌న్న‌మాట‌.'సూప‌ర్' మ్యూజిక్ డైరెక్ట‌ర్‌.. మ‌ళ్లీ వ‌స్తున్నాడు

Updated By ManamFri, 09/15/2017 - 17:18

'నిన్నే పెళ్లాడుతా', 'చంద్ర‌లేఖ‌', 'ప్రేమ‌క‌థ‌', 'సూప‌ర్‌', 'బుజ్జిగాడు', 'జోష్‌.. ఈ పేర్లు విన‌గానే ఠ‌క్కున గుర్తొచ్చే పేరు సందీప్ చౌతా. ఫ‌లితాలు ఎలాంటివి అయినా ఆయా సినిమాల్లో సందీప్‌ సంగీతానికి మంచి మార్కులు ప‌డ్డాయి. ఏడేళ్ల క్రితం విడుద‌లైన నాగార్జున చిత్రం 'కేడి' త‌రువాత తెలుగు సినిమాల‌కు దూరంగా ఉన్న సందీప్ చౌతా.. మ‌ళ్లీ తెలుగు సినిమా చేయ‌బోతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో 'సూప‌ర్', 'బుజ్జిగాడు' వంటి చిత్రాల‌ను సందీప్ కాంబినేష‌న్‌లో చేసిన పూరీ జ‌గ‌న్నాథ్‌నే తాజా చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించనున్నారు. పూరీ త‌న‌యుడు ఆకాష్ హీరోగా న‌టించే ఈ సినిమా అక్టోబ‌ర్‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డ‌వుతాయి. సందీప్ తెలుగులో కంటే హిందీ సినిమాల‌కే ఎక్కువ‌గా ప‌నిచేశాడు. 

Related News