polavaram project

వచ్చే నెల 17న గేట్లు

Updated By ManamTue, 11/06/2018 - 05:33
 • కీలక ఘట్టానికి సర్వం సిద్ధం

 • ఏప్రిల్ నాటికి ప్రధాన పనులు పూర్తి

 • వేగంగా నిర్మించి రికార్డు సృష్టిద్దాం

 • పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష

polavaramఅమరావతి: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన గేట్ల బిగింపు ప్రక్రియ డిసెంబరు 17న మొదలు పెట్టాలని జలవనరుల శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రపంచ రికార్డులు అన్నీ తిరగరాసేలా అత్యంత వేగంగా ప్రాజెక్టు నిర్మాణం పనులు జరగాలని అన్నారు. సోమవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో పోలవరం ప్రాజెక్టుతో సహా ప్రాధాన్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు గేట్ల కోసం ఇప్పటికే  60 మీటర్లు పొడవు, 20 మీటర్ల వెడల్పు కొలతలతో మొత్తం 48 గేట్లను సిద్ధం చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఏప్రిల్ నెలాఖరు కల్లా పోలవరం ప్రాజె క్టునకు సంబంధించి కాఫర్ డ్యామ్, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్ సహా ప్రధానమైన పనులన్నీ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. నెలకు 10 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు ఉత్పత్తి చేసే క్రషర్లు ఇక నుంచి వినియోగిస్తున్నామని నిర్మాణ సంస్థల ప్రతినిధులు సీఎంకు వివరించారు. 

80వ వర్చువల్ రివ్యూ
పోలవరం ప్రాజెక్టుపై 80వ సారి ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ రివ్యూ నిర్వహించారు. కాంక్రీట్ పనులు అత్యంత వేగంగా చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు మొత్తం 60.33 శాతం పూరి ్తకాగా, తవ్వకం పనులు 80.10 శాతం, కాంక్రీట్ పనులు 45.60 శాతం పూర్తయినట్టు తెలిపారు. కుడి ప్రధాన కాలువ 90 శాతం, ఎడమ ప్రధాన కాలువ 65.03 శాతం, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 61.91 శాతం పూర్తయినట్టు పేర్కొన్నారు. గత వారం స్పిల్ చానల్, స్పిల్ వే, పైలట్ చానల్, అప్రోచ్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్‌కు సంబంధించి 4.47 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు, స్పిల్ వే, స్పిల్ చానల్, స్టిల్లింగ్ బేసిన్‌కు సంబంధించి 52 వేల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు పూర్తయినట్టు అధికారులు సీఎంకు వివరించారు.

వారంలోనే 12 శాతం కాలనీల నిర్మాణం 
పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు నిర్మిస్తున్న కాలనీలలో మొదటి దశ పనులు డిసెంబరు నాటికి పూర్తి చేయాలని అధికారుల కు ముఖ్య మంత్రి గడువు విధించారు. గడిచిన వారం లో 12 శాతం పనులు పూర్తిచేశా మని అధికారులు వివరించారు. తూర్పు గోదావరి జిల్లాలో నిర్మిస్తున్న 17 కాలనీలకు సంబంధించి 46 శాతం పనులు, అలాగే పశ్చిమ గోదా వరి జిల్లాలో నిర్మిస్తున్న 29 కాలనీలకు సంబం దించి 42శాతం పనులు పూర్తయ్యాయని ఆయా అధికారులు నివేదిక అందించారు. 

విద్యుత్ సరఫరా పునరుద్ధరణ..
పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే రహదారి కుంగి, బీటలు వారి న దృశ్యాలను సీఎం పరిశీలించారు. పోలవరం ప్రాంతంలో ఎటువంటి భూప్రకంపనలు కానీ, పేలుడు వంటివి కానీ జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. రహదారి కుంగిపో వడం వల్ల దెబ్బతిన్న విద్యుత్ లైన్లు సరిజేసి సరఫరా పునరుద్ధరించామని చెప్పారు. మట్టి నమూనాలు పరిశోధన శాలకు పంపి రహదారి ఎందుకు బీటలు వారిందో తెలుసు కోవాలని సీఎం సూచించారు. మరోవైపు గోదావరి-పెన్నా మొదటిదశకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు ఈ నెలాఖరుకల్లా అన్ని ప్రాధాన్య ప్రాజెక్టులకు టెండర్లు పిల వడం పూర్తి కావాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. ఈ సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వ రరావు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పోలవరం ఆర్ అండ్ ఆర్ కమిషనర్ రేఖారాణి, ఈఎన్‌సీ వెంకటేశ్వరావు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

కరువు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ
రాష్ట్రంలో కరవు ప్రభావిత ప్రాంతాల్లోని రైతులకు వెం టనే ఇన్‌పుట్ సబ్సిడీ అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆదరణ-2 లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేయాలని సూచించారు. యూనిట్ల మంజూరు శరవేగంగా పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. 2 నెలల్లో 8 లక్షల యూనిట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని, ఒక్కపైసా అవినీతి జరిగినా సహించేదిలేద న్నారు. కాగా అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, స్వైన్ ఫ్లూ, డెంగీపై అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా అధికారులు శ్రద్ధవహించాలని సీఎం సూచించారు. 

ప్రతి చుక్క సద్వినియోగం 
‘‘రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ ర్షపాతంలో తీవ్ర లోటులో ఉంది. ఎగువ నుంచి వరద ప్రవాహాలు లేవు. రబీలో రైతులు నాట్లు త్వరితగతిన వే సేలా చూడాలి. రిజర్వాయర్లలో ఉన్న ప్రతి నీటి చుక్కనూ సద్వినియోగం చేసుకుని దిగుబడులు తగ్గకుండా చూడాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. రబీలో 100 శాతం కన్నా అధికంగా సాగుచేసిన జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని ఆయన అధికారులకు సూచించారు. అలాగే కరువు, తుపాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. కాగా బాపట్ల వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విత్తనాల పాకెట్లు సరఫరాలో అధికారులు నిర్లక్ష్యం వహించారని, పాకెట్లు తారుమారు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పనులను ముమ్మరం చేయాలని, మెటీరియల్ కాంపోనెంట్ నిధులు పెంచుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో సిమెంట్ రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. అలాగే గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. పగుళ్లు, బీటలుపై చంద్రబాబు ఆరా

Updated By ManamMon, 11/05/2018 - 14:21
 chandrababu saw the Huge Cracks in Road Near Polavaram Project pictures

అమరావతి : పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే రహదారి ఉబికి, కుంగి, బీటలు వారిన దృశ్యాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..‘ఆ ప్రాంతంలో ఎటువంటి భూప్రకంపనలు కానీ, పేలుడు వంటివి జరగలేదు. మట్టి నమూనాలు పరిశోధనాశాలకు పంపి రహదారి ఎందుకు బీటలు వారిందో తెలుసుకోవాలని అధికారుల‌కు సూచించాను’ అని తెలిపారు. 

chandrababu review meeting on Huge Cracks in Road Near Polavaram Project

కాగా పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్ట్ సమీపంలో కలకలం రేగిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం పోలవరం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు సమీపంలో రోడ్డుపై బీటలు వారాయి. అది గమనించిన అక్కడి కార్మికులు భూకంపమని భయంతో పరుగులు తీశారు.

ప్రాజెక్టుకు కిలోమీటర్ దూరంలో రోడ్డుపై ఇలా భారీగా బీటలు ఏర్పడినట్టు అధికారులు గుర్తించారు. చెక్ పోస్టు నుంచి రోడ్డుపై అర కిలోమీటర్ వరకు దాదాపు 4 నుంచి 5 అడుగుల మేర పగుళ్లు ఏర్పడ్డాయి.త్వరలో వేలేరుపాడు వస్తా: పవన్

Updated By ManamSun, 10/07/2018 - 20:42
 • పోలవరం నిర్వాసితుల పక్షాన నిలుస్తా

 • పశ్చిమ జిల్లా పర్యటన పూర్తయ్యేలోపు వేలేరుపాడు సందర్శిస్తా

 • పోలవరం భూ నిర్వాసితులతో జనసేన చీఫ్ భేటీ

Polavaram project rehabilitation victims met pawan kalyan

ఏలూరు : పోలవరం భూ నిర్వసితులకు అన్నివిధాలా అండగా ఉంటామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. చట్టప్రకారం పరిహారం అందేవరకూ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆయనను ఆదివారం పోలవరం నిర్వాసిత గ్రామాలకు చెందిన మహిళలు కలిశారు. అలాగే ఇటీవల వరదలో కొట్టుకుపోయిన ఇటికలకోటకు చెందిన మహిళలు కలిసి తమ సమస్యలు వివరించారు. 

ప్రాజెక్టు కోసం తీసుకున్న భూములకి పరిహారం విషయంలో న్యాయం చేయలేదని, 2016లో గ్రామాలు ఖాళీ చేయించారన్న విషయాన్ని తెలిపారు. పరిహారం, కుటుంబ ప్యాకేజీ విషయంలో తమకు అన్యాయం జరిగిందని బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని పవన్‌కు విన్నవించుకున్నారు. పోలవరం ముంపు బాధితులకు న్యాయం జరిగేవరకూ జనసేన అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన పూర్తయ్యేలోపు పోలవరం ముంపు గ్రామం వేలేరుపాడు సందర్శిస్తానని హామీ ఇచ్చారు.చంద్రబాబుది సవతి తల్లి ప్రేమ: పవన్

Updated By ManamMon, 10/01/2018 - 13:38
 • పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులతో పవన్ భేటీ

pawan kalyan interaction with polavarm rehabilitates in kukkunoor

కుక్కనూరు : ప్రజా పోరాట యాత్రలో భాగంగా విలీన మండలాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోమవారం పర్యటించారు. కుక్కనూరులో ఆయన పోలవరం నిర్వాసితులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ...‘నిర్వాసితుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుది సవతి తల్లి ప్రేమ. నిర్వాసితులకు న్యాయం చేయకుండా 2019 నాటిని పోలవరం ప్రాజెక్ట్ ఎలా పూర్తి చేస్తారు.

పునరావాస బాధితులకు నాలుగు శాతం మాత్రమే పరిహారం. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లలో ఎలాం ఉంటారు. ఒక గదిరి రెండుగా నిర్మించారు. విద్యార్థులకు బస్సు సౌకర్యం లేదు. ముఖ్యమంత్రికి పోలవరం ప్రాజెక్ట్‌పై ఉన్న శ్రద్ధ నిర్వాసిత ప్రజలపై లేదు?’ అని ధ్వజమెత్తారు. అంతకు ముందు అశ్వారావుపేటలో పవన్‌కు అభిమానులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు.ఉమాపై సీబీఐకి ఫిర్యాదు చేస్తా...

Updated By ManamSat, 09/22/2018 - 16:08
 • చంద్రబాబు పాలనంతా అవినీతిమయమే

 • పోలవరంపై కాగ్ ఇచ్చిన నివేదికపై ఉమ స్పందించరే?

 • మంత్రి ఉమాకు కమీషన్లు దండుకోవడమే లక్ష్యం

 • ఉమా అవినీతిపై పూర్తి ఆధారాలు ఉన్నాయి

 • రమేష్ బాబు, ఉమా మధ్య ఉన్న బంధం ఏంటి?.

vasantha krishna prasad

విజయవాడ : ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైలవరం సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన శనివారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘చంద్రబాబు పాలనంతా అవినీతిమయమే. 19న అసెంబ్లీలో కాగ్ నివేదికలో అనుచిత రాయితీలు పోలవరానికి అని ఇచ్చింది.

అవినీతి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు. ప్రతి విషయానికి స్పందించే మంత్రి ఇప్పటివరకు నోరు మెదపలేదు. పోలవరం సీఈ రమేష్ బాబు తెలంగాణ వ్యక్తి, అతనికి ఏమైనా అనుభవం ఉందా?. పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టు అతనికి ఎలా ఇచ్చారు? రమేష్ బాబు, ఉమా మధ్య ఉన్న బంధం ఏంటి?. 

ప్రతి సోమవారం పోలవరం వెళ్లి కమీషన్లు తీసుకోవడమే ఉమా లక్ష్యం. తెలంగాణలో హరీష్ రావు చిత్తశుద్ధితో పనిచేస్తుంటే నువ్వు మాత్రం ఒట్టి హడావిడి చేస్తూ డ్రామాలు. అసమర్థ సాగునీటి మంత్రి ఉమా... కమీషన్లు దండుకోవడమే లక్ష్యం. ఉమా రాజీనామా చెయ్. పోలవరం, పట్టిసీమ అవినీతిపై కాగ్ నివేదిక నేపధ్యంలో ఉమాపై సీబీఐకి ఫిర్యాదు చేస్తాను. వచ్చే వారం లీగల్ ఒపీనియన్ తీసుకుని సోమ, మంగళవారంలో ఫిర్యాదు చేస్తా. ఉమా అవినీతిపై పూర్తి ఆధారాలు ఉన్నాయి, అన్ని సీబీఐకి అందచేస్తా.’ అని తెలిపారు.పోలవరం ఓ చరిత్ర: లోకేశ్

Updated By ManamWed, 09/12/2018 - 16:02

Polavaram Project, Lokesh Babu, Project prices, పశ్చిమగోదావరి: పోలవరం ప్రాజెక్టు ఓ చరిత్రని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులు కట్టాలంటే తరాలు మారిపోవడం ఆనవాయితీని, కానీ, పోలవరాన్ని నాలుగేళ్లలో ఓ రూపునకు తెచ్చామన్నారు. కేంద్రం వేసే కొర్రీలన్నింటికీ సమాధానం చెబుతున్నామని లోకేశ్ తెలిపారు. నిర్మాణ జాప్యంతో ప్రాజెక్టు ధరలు పెరుగుతాయని లోకేశ్ చెప్పారు. 14న జలసిరికి హారతి

Updated By ManamTue, 09/11/2018 - 23:20
 • మూడు రోజుల పాటు పూజలు

 • పోలవరం పనులు పుంజుకోవాలి.. నాణ్యతకు పెద్ద పీట వేయాలి

 • అవుకు టన్నెల్ నుంచి నీళ్లిస్తాం.. అధికారులతో సీఎం చంద్రబాబు

polavaramఅమరావతి: ఈనెల 14, 15, 16 తేదీల్లో  జలసిరికి హారతి కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలను సందర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటానని ఆయన వెల్లడించారు. ఈ నెల 14న రాయలసీమ, 15న ఉత్తరాంధ్ర లో, 16న రాజధాని ప్రాంతంలో జలసిరికి హారతిలో పాల్గొంటానని సీఎం స్పష్టం చేశారు. 74వ పోలవరం వర్చువల్ ఇన్‌స్పెక్షన్‌లో చంద్రబాబు మంగళవారం ఉదయం పాల్గొన్నారు. రాబోయే 3నెలలు పోలవరం నిర్మాణానికి అత్యంత కీలకమని, ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం కావాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు 58.15 శాతం పనులు పూర్తయ్యాయని...గత వారం రోజుల్లో 0.25 శాతం పనులు మాత్రమే జరిగాయన్నారు. హెడ్ వర్క్స్ పనులు ఈ వారం 0.34 శాతం జరగ్గా, మెయిన్ డ్యామ్ పనులు 0.36 శాతం జరిగాయన్నారు. ఎక్సకవేషన్, కాంక్రీట్ పనులు వేగవంతం చేయాలని సీఎం సూచించారు. ఎడమ ప్రధాన కాలువ పనులు 0.23 శాతం జరిగాయని, స్పిల్ వే ఛానల్ పనుల వేగం తగ్గిందన్నారు. కాంక్రీట్ పనుల వేగం కూడా తగ్గిందని..స్పిల్ వే ఛానల్, కాంక్రీట్ పనులు వేగం పెరగాలని కోరారు. కాంక్రీట్ పనులు జూన్‌లో 1,58,869క్యూ.మీ. గరిష్ఠంగా జరిగిందని.. రాబోయే నెలల్లో దానిని అధిగమించాలని సూచించారు. లక్షా 85వేల క్యూ.మీ కాంక్రీట్ పనులు జరగాలని లక్ష్యం విధించారు. వర్షాలు లేకపోయినా, ప్రాజెక్టు పనులు ఎందుకని ఊపందుకోలేదని అధికారులను ప్రశ్నించారు. 

మా మనవడు ఉత్సాహంగా ఉన్నాడు...
‘మా మనవడు కూడా పోలవరం చూడాలని ఉత్సాహంగా ఉన్నాడు. ‘ఏం చేస్తున్నావురా’ అని అడిగితే ‘పోలవరం కడుతున్నా’ అంటున్నాడు. పిల్లలకు కూడా పోలవరం కట్టాలన్న పట్టుదల ఉంది. భావితరాల భవిష్యత్తు అంతా పోలవరంపైనే ఆధారపడి ఉంది. అధికారులంతా పట్టుదలగా పనిచేయాలి. అడ్డంకులను అధిగమించాలి. ఒక చరిత్రలో మనమంతా భాగస్వాములం అనే స్ఫూర్తితో పనిచేయాలి. రేడియల్ గేట్ల పనులు షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలి. సిడబ్ల్యూసి నుంచి డిజైన్లకు ఎప్పటికప్పుడు ఆమోదం లభించేలా శ్రద్ధ చూపాలి. మొత్తం 27 డిజైన్లకుగాను సెప్టెంబర్‌లో 19, అక్టోబర్‌లో 8 డిజైన్లకు ఆమోదం వస్తుందని అంచనా. పోలవరం పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు. 

అవుకు టన్నెల్ ద్వారా నీళ్లు విడుదల..
అసెంబ్లీ సమావేశాలు పూర్తికాగానే.. అవుకు టన్నెల్ నుంచి నీటిని విడుదల చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టులను కూడా సందర్శిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, ఛీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర రావు, ఇతర అధికారులు  పాల్గొన్నారు.పోలవరం పనులకు అడ్డంకిగా గోదారి వరద

Updated By ManamTue, 08/21/2018 - 13:42
godavari flood water

ఏలూరు : గోదావరి వరద నీరు పోలవరం ప్రాజెక్ట పనులకు అడ్డంకిగా మారింది. ప్రాజెక్ట్ స్పిల్‌వేలోకి వరద నీరు ప్రవేశిస్తోంది.  సింగన్నపల్లి, గంగాలమ్మ కాలువ నుంచి వరద నీరు ముంపు గ్రామం చేగొండపల్లిని తాకి అక్కడ నుంచి ప్రాజెక్ట్‌లోకి వస్తోంది. దీంతో వరద నీరు లోపలికి రాకుండా నవయుగ కంపెనీ సిబ్బంది ఎత్తుగా మట్టి కట్టడం నిర్మిస్తున్నారు. అయితే గట్టు దాటితే ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుకునే అవకాశం ఉంది.

మరోవైపు జిల్లాలో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో పలువురు నేతలు పర్యటించారు. చింతలపూడి ఎమ్మెల్యే, మాజీమంత్రి పీతల సుజాత మంగళవారం జంగారెడ్డిగూడెంలో ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అలాగే ఎంపీ మురళీమోహన్, జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ తదితరులు నల్లజర్ల మండలంలో వరద బాధితుల్ని పరామర్శించారు. అయితే వరద నీటిలో చిక్కుకున్న తమకు సాయం అందటం లేదంటూ పలుచోట్ల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘పోలవరం’ 57.41 శాతం పూర్తి 

Updated By ManamMon, 08/13/2018 - 23:54
 • 86 జలాశయాల్లో 380.68 టీఎంసీల నీరు

 • చెరువులు, భూగర్భాలలో 867 టీఎంసీలు 

 • సరైన ప్రణాళికలతో సమర్థ నీటి నిర్వహణ

 • అధికారులతో సీఎం చంద్రబాబునాయడు

imageఅమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 57.41 శాతం పనులు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వర్షాలు పడుతున్నా పనులు అనుకున్న మేర పూర్తిచేసే ప్రయత్నం జరుగుతున్నదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వివిధ దశల్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులతో పాటు పోలవరం ప్రాజెక్టు పనులపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రధాన డ్యామ్ పనులు 44.23 శాతం, ఎడమ కాలువ పనులు 62.74 శాతం, కుడి కాలువ పనులు 90 శాతం పూర్తయ్యాయని అన్నారు.

గేలరీ వాక్ కి స్పిల్‌వే సిద్ధం అవుతోందని అధికారులు వివరించారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఇతర తవ్వకం పనులు 77 శాతం పూర్తయ్యాయని తెలియజేశారు. జెట్ గ్రౌటింగ్ పనులు 94.2 శాతం, కాంక్రీట్ పనులు 33.7 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటిదాకా పోలవరం ప్రాజెక్టును లక్షమంది సందర్శించినట్లు ప్రకటించారు.అన్ని జిల్లాల నుంచి ప్రాజెక్టు సందర్శనకు ప్రోత్సహించాలని, వారికి పూర్తి వివరాలు తెలియజేయాలన్నారు. పునరావాస పనులు వచ్చే డిసెంబర్‌కి పూర్తిచేయాలన్నారు. ఈ పనులకు చెల్లించే బిల్లులపై జీఎస్టీ గురించి కూడా చీఫ్ ఇంజనీర్ల బోర్డు సమావేశం అవుతోందన్నారు. ఈ అంశాలను కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ వనరుల కింద అందుబాటులో ఉన్న జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో అధికారులు వ్యూహాలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

మొత్తం రెండు కోట్ల ఎకరాలకు నీరందించాలన్నారు. ఇందుకోసం భూగర్భ జలాలు, జలాశయాలు, చెరువులలో ఉన్న నీటిని సమర్థ నిర్వహణ చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.  వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో అధిక శ్రద్ధ పెట్టాలని చంద్రబాబు సూచించారు. మొత్తం రాష్ట్రంలో 86 జలాశయాల్లో 380.68 టీఎంసీ నీరు అందుబాటులో ఉందన్నారు. మిగిలిన చెరువులు, భూగర్భ జలాలు ఇతర వనరులు చూస్తే మొత్తం 867 టీఎంసీలు అందుబాటులో ఉందని ముఖ్యమంత్రి వివరించారు. రెండు కోట్ల ఎకరాలకు నీరు, తాగునీరు, పరిశ్రమలకు నీరు ఇవ్వడానికి ఎలా నీరు వినియోగించాలన్న అంశంపై  పరిశీలించాలన్నారు. మొత్తం వివిధ దశల్లో ఉన్న 25 సాగునీటి ప్రాజెక్టులను డిసెంబర్ కల్లా పూర్తిచేసే లక్ష్యంతో పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కాగా, 37,546 చిన్న తరహా సాగునీటి చెరువులు ఉన్నాయి, 10 లక్షల పంట కుంటలు నిర్మిస్తున్నాం, చెక్ డ్యామ్‌లు నిర్మించి అన్ని చెరువుల్లో నీటిని నిల్వ చేయాలన్నారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, సీఎం ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్ పాల్గొన్నారు. రాయపాటికి మరో షాక్

Updated By ManamSat, 08/11/2018 - 17:18
 • ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీపై సీజీఎస్‌టీ అధికారులు దాడులు

rayapati sambasiva rao

హైదరాబాద్ : టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు మరో షాక్ తగిలింది. రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ ఇండియా లిమిటెడ్ కార్పొరేట్ కార్యాలయంపై సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (సీజీఎస్‌టీ) అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లోని బేగంపేట్, కమలాపురికాలనీలోని కార్యాలయాల్లో అధికారులు నిన్న (శుక్రవారం) సోదాలు జరిపారు.  రాయపాటికి చెందిన ఆ సంస్థ పన్నులు ఎగవేత కారణంగానే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

కాగా సీజీఎస్‌టీ అధికారుల దాడులపై రాయపాటి సాంబశివరావు కూడా స్పందించారు. తమ కార్యాలయంపై జరిగిన దాడులు వాస్తవమేనని ఆయన అంగీకరించారు. తమ సిబ్బందికి జీఎస్టీ కట్టాలని ఎలాంటి సూచనలు లేనందున వారు దాన్ని విస్మరించారన్నారు. అయితే సీజీఎస్‌టీ అధికారులు ఆకస్మిక సోదాలతో వారు దిగ్ర్భాంతికి గురయ్యారన్నారు. మరోవైపు ఈ దాడులపై ట్రాన్స్‌ట్రాయ్ సిబ్బంది మాత్రం పెదవి విప్పడం లేదు.

Related News