polavaram project

'చంద్రబాబుకు బాగా ముడుపులు అందాయి'

Updated By ManamSat, 02/17/2018 - 17:43

Jairam ramesh, Chandrababu naidu, Polavaram project, AP bifurcation న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బాగా ముడుపులు అందాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. విదేశాల్లో ఆయన ముడుపులు తీసుకున్నట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. విభజన చట్టాన్ని అమలు చేయడంలో బీజేపీ, టీడీపీలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. నాలుగేళ్ల పరిపాలనలో టీడీపీ కేవలం పునాది రాళ్లకే పరిమితమయిందని చెప్పారు.

రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని తెలిపారు. విభజన హామీలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు ఇద్దరూ డ్రామాలాడుతున్నారని అన్నారు. ఏపీ విభజన శాస్త్రీయంగా జరగకుంటే పార్లమెంట్‌లో మెజార్టీ ఉన్న బీజేపీ..చట్టంలో మార్పులు చేయమనండి.. కాంగ్రెస్ మద్దతిస్తుందని చెప్పారు. బిరబిర.. చకచక!

Updated By ManamFri, 02/16/2018 - 09:19

polavaram works speed up

 • హైస్పీడ్‌గా పోలవరం పనులు.. 

 • ఇప్పటికే 53 శాతం పూర్తి

 • వేసవిలో డయాఫ్రం వాల్ సిద్ధం

 • జూలైకి 60% కాంక్రీటు పనులు

 • 2019 నాటికి గ్రావిటీ ద్వారా నీరు..

 • 2018లో నీళ్లు ఇవ్వడం కష్టమే

 • లెక్కలు రూపొందించిన అధికారులు

అవురావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి.. లక్షల ఎకరాలకు సాగునీరు, వేల గ్రామాలకు తాగునీటితో పాటు విద్యుత్ ఉత్పత్తిలో కూడా కీలకపాత్ర పోషించే పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూలైలో గోదావరికి వరద ప్రవాహం ప్రారంభమయ్యే నాటికి దాదాపు 70 శాతానికి పైగా పనులు పూర్తిచేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందు కోసం ప్రస్తుతం పనిచేస్తున్న భారీ మట్టి తవ్వకం యంత్రాలు, కాంక్రీటు యంత్రాలకు తోడుగా ఏప్రిల్‌లో అదనపు యంత్రాలు రానున్నాయి. మరో రూ. 3000 కోట్లు ఖర్చు చేస్తే 2019 నాటికి స్పిల్‌వే ద్వారా వరద ప్రవాహాన్ని మళ్లించొచ్చని లెక్కలు రూపొందించారు. 

ఈ ఏడాది జూన్ ఆఖరుకు మట్టి పనులు, డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తిచేయుడంతో పాటు, దాదాపు 6 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు కూడా పూర్తి చేయునున్నారు. 2019 ఎన్నికల నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి కాలువలకు నీటిని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే సోవువారం ప్రాజెక్టును స్వయంగా సందర్శించనున్నారు. ఈ సందర్భంగా జరగాల్సిన పనులపై అధికారులు, కాంట్రాక్టర్లకు ఆయన దిశానిర్దేశం చేయునున్నారు.

2018 జూన్ నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నీళ్లు అందిస్తామని ముఖ్యమంత్రి పలు సందర్భాలలో చెప్పారు. కానీ.. అది సాధ్యమయ్యే లక్షణాలు లేవు. జూన్ నాటికి మట్టి తవ్వకాలు పనులు, కాంక్రీటు లైనింగ్ పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌండింగ్ పనులు వేగంగానే జరుగుతున్నాయి. అయినా ప్రధాన డ్యాం నిర్మాణ పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు. ఇది పూర్తయితేనే గ్రావిటీ ద్వారా కాలువలకు నీరివ్వచ్చు. దీని నిర్మాణం 2019లో పూర్తవుతుందని అధికారుల అంచనా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో 2018లో నీళ్లివ్వడం మాత్రం కుదరని పనే. 

స్పిల్ చానల్..
జూన్ చివరి నాటికి స్పిల్ చానల్ మట్టి తవ్వకం పనులు పూర్తి చేయునున్నారు. స్పిల్ చానల్ కాంక్రీట్ బ్లాక్‌ల నిర్మాణానికి ఏజెన్సీ ద్వారా డిజైన్లు సవుర్పించారు. కాంక్రీటు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. 2019 మార్చి నాటికి స్పిల్ చానల్ కాంక్రీటు పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. 2019 జూన్ నాటికి స్పిల్ చానల్ బ్రిడ్జి పనులు పూర్తిచేయునున్నారు.

స్టిల్లింగ్ బేసిన్..
స్పిల్‌వే స్టిల్లింగ్ బేసిన్‌లో 4.44 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులకు గాను.. ఫిబ్రవరి 12 నాటికి 1.26 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయ్యాయి. 2019 మార్చి నాటికి స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీటు పనులు కూడా పూర్తి చేయునున్నారు.

కుడి, ఎడమ కాలువలు..
ఇప్పటివరకు కుడి కాలువ తవ్వకం పనులు 91 శాతం, ఎడమ కాలువ తవ్వకం పనులు 60 శాతం పూర్తయ్యాయి. ఎడమ కాలువ కాంక్రీట్ లైనింగ్ పనులు 14.63 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను 9.821 లక్షల క్యూబిక్ మీటర్లు పూర్తయ్యాయి. కుడి కాలువ కాంక్రీటు లైనింగ్ పనులు 18.697 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను 15.853 లక్షల క్యూబిక్ మీటర్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది జూన్ కల్లా మట్టి తవ్వకం, కాంక్రీటు లైనింగ్ పనులు పూర్తిచేయాలని చూస్తున్నారు.

డయాఫ్రం వాల్..
నది మధ్యలో దాదాపు 300 అడుగుల లోతులో కడుతున్న డయాఫ్రం వాల్ నిర్మాణం 68 శాతం పూర్తయింది. ఈ ఏడాది జూన్ నాటికి దీనిపి పూర్తిచేయాలని యోచిస్తున్నారు. డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ ఏడాది నవంబర్‌లో ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం ప్రారంభించనున్నారు. 

కాఫర్ డ్యామ్..
కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌండింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. దాదాపు 78 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది నవంబర్‌లో డ్యాం నిర్మాణ పనులు చేపట్టి 2019 నాటికి పూర్తిచేయనున్నారు.

రేడియల్ గేట్ల నిర్మాణం
రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఒక గేటును పూర్తిస్థాయిలో సిద్ధం చేశారు. ఈ ఏడాది చివరి నాటికి మరిన్ని గేట్లను సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. స్పిల్ వే..ఫిబ్రవరి 12 నాటికే స్పిల్ వే మట్టి పనులు 100 శాతం పూర్తయ్యాయి. 11.95 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకు గాను 3.75 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయ్యాయి. ఈ వేసవిలో దాదాపు 5 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి స్పిల్‌వే కాంక్రీటు పనులు పూర్తి చేయనున్నారు.

     ఈ ఏడాది అక్టోబర్‌లో స్పిల్ వే బ్రిడ్జి ప్రారంభించి 2019 నాటికి పూర్తిచేయనున్నారు. స్పిల్‌వేకు ముందున్న అప్రోచ్ చానల్‌లో 101.48 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి వాటిని కూడా పూర్తి చేయునున్నారు. స్పిల్ చానల్ తర్వాత ఉన్న పైలట్ చానల్‌లో మిగిలిన 71 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులను ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు.'పోలవరం ఖర్చంతా కేంద్రమే భరించాలి'

Updated By ManamFri, 01/12/2018 - 12:40

Chandrababu naidu, PM Narendra modi, Polavaram projectన్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఢిల్లీలో మోదీతో శుక్రవారం చంద్రబాబు భేటీ అయ్యారు. గంటసేపు కొనసాగిన సమావేశంలో చంద్రబాబు పలు సమస్యలను మోదీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా విభజన సమస్యలు, పోలవరం, నియోజవర్గాల పునర్విభజన, రెవెన్యూ లోటు సహా తదితర అంశాలపై ఆయన మోదీతో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా చంద్రబాబు 17 పేజీల వినతిపత్రాన్ని మోదీకి అందించారు.

రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను 175 నుంచి 225కి పెంచడంతోపాటు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలని మోదీని కోరారు. అమరావతి నిర్మాణం కోసం వచ్చే కేంద్ర బడ్జెట్‌లో తగిన నిధులను కేటాయించాలని తెలిపారు.  కృష్ణా నది యాజమాన్య బోర్డు పరిధి, విధివిధానాలను ఖరారు చేసి, నోటిఫికేషన్ జారీ చేసే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కోరారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలనన్నింటినీ నెరవేర్చాలని విన్నవించారు. పోలవరం ప్రాజెక్టుకు..మరో బ్రేక్!

Updated By ManamSat, 01/06/2018 - 00:28
 • ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ వాహనాలు సీజ్

 • దేనా బ్యాంకుకు 120 కోట్ల బకాయి

 • చెల్లించనందుకు అధికారుల చర్యలు

 • అడ్డుకున్న జంగారెడ్డిగూడెం ఆర్డీవో

 • కలెక్టర్ అనుమతి తీసుకోవాలని సూచన

 • యంత్రాలు లేకుంటే పనులు సాగేదెలా?

 • గతంలోనూ ఈ సంస్థైపె దివాలా పిటిషన్

polavaram project, breakపోలవరం/జంగారెడ్డిగూడెం, జనవరి 5 (మనం ప్రతినిధి): ప్రతిష్ఠాత్మకైమెన పోలవరం ప్రాజెక్టుకు మరో బ్రేక్ పడింది. ఈ ప్రాజెక్టు హెడ్ వర్క్స్ పనులు చేస్తున్న ట్రాన్స్‌ట్రాయ్ సంస్థకు చెందిన వాహనాలను బ్యాంకర్లు సీజ్ చేశారు. దేనా బ్యాంకులో తీసుకున్న రుణాన్ని ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ తిరిగి చెల్లించక పోవడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. మూడేళ్ల క్రితం హైదరాబాద్ దేనా బ్యాంకులో ఈ సంస్థ రూ. 87 కోట్ల రుణం తీసుకుంది. బకాయి చెల్లించడంలో జాప్యం చేస్తోంది. వడ్డీతో కలిపి ఇప్పటికి బకాయి మొత్తం రూ. 120 కోట్లకు చేరుకుంది. దీంతో బ్యాంకు అధికారులు పోలవరం వద్ద ఉన్న ఈ సంస్థ కార్యాలయానికి శుక్రవారం వెళ్లారు. బకాయి చెల్లించేందుకు తమకు మరికొంత సమయం కావాలని ట్రాన్స్‌ట్రాయ్ అధికారులు కోరగా, బ్యాంకు అధికారులు అందుకు అంగీకరించలేదు. ఆ సంస్థకు చెందిన 64 వాహనాలను, టిప్పర్లను సీజ్ చేయడానికి ప్రయుత్నించారు. ప్రాజెక్టు పనుల వద్దకు వెళ్లి 2 జేసీబీలను, మరో వాహనాన్ని సీజ్ చేశారు. మిగతా వాహనాలను బ్యాంకర్లు సీజ్ చేస్తుండగా, జంగారెడ్డిగూడెం ఆర్డీవో మోహన్ కుమార్ అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్ట్ పనుల వద్దకు వచ్చి వాహనాలను ఎలా సీజ్ చేస్తారని, సీజ్ చేయాలంటే కచ్చితంగా కలెక్టర్ అనుమతి తీసుకోవాలని తెలిపారు. నిబంధనల ప్రకారం మొబిలైజేషన్ అడ్వాన్స్ రూపంలో వాహనాలు కొనుగోలు చేశారా.. లేదా? అని ప్రశ్నించారు. కలెక్టర్ అనుమతి తీసుకోవాలని ఆర్డీవో చెప్పడంతో.. బ్యాంకు అధికారులు పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. 

పోలవరం ప్రాజెక్టు పనులలో ఏమాత్రం ఆలస్యం జరిగినా.. అది ప్రభుత్వానికి చాలా అప్రతిష్ఠ తీసుకొచ్చే అవకాశముంది. ప్రధానంగా.. కాఫర్ డ్యాం, హెడ్‌వర్క్స్ పనులు పూర్తి కాకపోతే గ్రావిటీతో నీళ్లు విడుదల చేయడం సాధ్యం కాదు. 2018 సంవత్సరంలోనే ఎలాగైనా పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం ఈ సంవత్సరం చివరిలోగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉండటంతో.. వీలైనంత త్వరగా పోలవరం నుంచి నీళ్లు ఇవ్వాలని, ఆ వైులేజితో ఎన్నికలకు వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ వరుసపెట్టి దానికి అడ్డంకులు తగులుతూనే ఉన్నా యి. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాజెక్టు పనులు ఆపాలని లేఖ రావడం, మరోవైపు ట్రాన్స్‌ట్రాయ్ వాహనాల సీజ్ లాంటి చర్యలతో అది మరింత ఆలస్యం అవుతోంది. 

గతంలోనూ పిటిషన్
తమ వద్ద తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ట్రాన్స్‌ట్రాయ్‌పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీ ఎల్‌టీ)లో గతంలో కెనరా బ్యాంకు దివాలా పిటిషన్ దాఖలు చేసింది. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్ సం స్థ ఆర్థికంగా దివాలా తీసిందని, అందుకే రుణాన్ని తిరిగి చెల్లించడం లేదని కెనరా బ్యాంక్ పేర్కొంది. ఈ పరిణామాలు పోలవరం ప్రాజెక్టు పనులపై ప్రభావం చూపుతాయనే ఆందోళన వ్యక్తవువుతోంది. దోస్తీ సా..గాలి

Updated By ManamMon, 12/18/2017 - 00:27
 • టీడీపీతో మిత్రబంధం ఉండాలి

 • 2019 వరకూ కొనసాగించాలి

 • ఏపీ కమలనాథుల ప్రయుత్నం

 • 19న ఢిల్లీకి ముఖ్యనేతల పయనం 

 • ప్రధాని, కేంద్రమంత్రులతో భేటీ 

 • మైత్రి లేకుంటే నష్టం తప్పదు

 • ఢిల్లీ పెద్దలకు చెప్పేందుకు కసరత్తు

 • చంద్రబాబుతో బీజేపీ నేతల భేటీ

babu+modiఅమరావతి, డిసెంబరు 17 (మనం ప్రతినిధి): ఎన్డీయేకు మిత్రపక్షమైనా.. లోటు బడ్జెట్‌తో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఆశించిన స్థాయిలో కేంద్రం  సాయం చేయడంలేదన్నది టీడీపీ నేతల భావన. ఇటీవల పోలవరం ప్రాజెక్టు     విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కేంద్రం తీరుపై ఆవేదన, ఆక్రోశంతో కాస్త కటువుగానే మాట్లాడినా తర్వాత మెత్తబడ్డారు. కేంద్రంతో కయ్యం వద్దని, సంయువునంతో వ్యవహరిద్దామని పార్టీ శ్రేణులకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తు ఉంటుందా.. ఉండదా? అన్న విషయంపై రాజకీయ వర్గాల్లో సందేహాలున్నాయి. 2019 వరకూ టీడీపీతో మైత్రీబంధాన్ని కొనసాగించేందుకు రాష్ట్ర బీజేపీ నాయుకులు ప్రయుత్నాలు చేస్తున్నారు. పార్టీలో కీలక పదవుల్లో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి, సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ వంటి కొందరు నాయకులను మినహాయిస్తే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు.. చంద్రబాబుకు అండగా నిలబడేందుకు వ్యూహ్మాకంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే చంద్రబాబును కలిసి తమ మనోభావాలను వెల్లడించిన బీజేపీ నాయకులు ఈ నెల 19, 20 తేదీల్లో ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఆ రోజుల్లో ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నట్టు తెలిసింది. బీజేపీ, టీడీపీల మైత్రీ బంధం విడిపోకుండా మరింత బలపడేలా చేయటమే ఈ పర్యటన పరమార్థమని ఆ పార్టీ ముఖ్య నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ఈ మేరకు  కార్యాచరణను రూపొందించినట్టు సమాచారం. పోలవరంతో పాటు ఇతర జలవనరుల సమస్యలు, పరిశ్రమల స్థాపన, రైల్వే ప్రాజెక్టులు, విభజన ఒప్పందం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ఇతర అనేక ప్రయోజనాలపై వారు మోదీతో చర్చించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరి, వైసీపీ అధ్యక్షుడు  జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్ర వివరాలను రేఖామాత్రంగానైనా తెలియజెప్పడం ద్వారా టీడీపీతో కలిసి ప్రయాణించాల్సిన రాజకీయ అవసరాలను వివరించాలని నిర్ణయించినట్టు తెలిసింది. మోదీని కలిసే కలిసే బృందంలో ‘ఎవరు ఏం మాట్లాడాలి’ అనే విషయమై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రధానిని కలిసే బృందంలో ఇద్దరు ఎంపీలు, రాష్ట్ర మ్రంతులతో పాటు ఎమ్మెల్యేలంతా ఉండే అవకాశం ఉంది. మోదీతో పాటు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కూడా వీరు భేటీ కానున్నారు. ఇటీవల పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం వైఖరితో నెలకొన్న పరిణామాలపై వివరించనున్నారు. టీడీపీ, బీజేపీల మధ్య మిత్రధర్మం కొనసాగుతుందని, ఎట్టిపరిస్థితుల్లో విడపోదన్న సంకేతాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చెప్పించాలన్నది కమలనాధుల ప్రధాన ఉద్దేశం. 

చంద్రబాబుతో సమస్యల ఏకరువు 
ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఇటీవల బీజేపీ ముఖ్యనేతల బృందం భేటీ అయింది. వీరి మధ్య చర్చలు సుదీర్ఘంగా జరిగినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై చంద్రబాబు వీరితో చర్చించినట్టు తెలిసింది. బీజేపీ నాయకులు రాష్ట్రంలో తమకున్న సమస్యలను ఏకరవు పెట్టినట్టు తెలిసింది. తాము మిత్రపక్షం అయినా క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకుల పెత్తనమే కొనసాగుతోందని, నియోజకవర్గాల్లో గృహాల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందని చెప్పినట్టు తెలిసింది. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల వారి సమస్యలను తానే స్వయంగా పర్యవేక్షించి పరిష్కరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వంతో చర్చించాల్సిన ప్రధాన విషయాలు, వారిని ఒప్పించాల్సిన అంశాల గురించి ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. 

టీడీపీతో సఖ్యత ఉంటేనే ప్రయోజనాలు
రాష్ట్రంలో టీడీపీతో బంధాన్ని వీడటం బీజేపీ ప్రజా ప్రతినిధులకు ఇష్టం లేదు. నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్ల హవాను వీరు ఇప్పటికే తట్టుకోలేకపోతున్నారు. అధికారుల నుంచి పనులు అంత తేలిగ్గా కావటం లేదు. నియోజకవర్గాల్లో ప్రజలు తమను కాదని టీడీపీ నాయకులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతంతమాత్రంగా ఉన్న మైత్రీబంధాలు తెగిపోతే.. రానున్న ఏడాదిన్నర కాలంలో క్షేత్ర స్థాయిలో తాము ఏమీ చేయలేమన్న భావన బీజేపీ నేతల్లో ఏర్పడింది. 2019 ఎన్నికల్లో తిరిగి పోటీ చేయాలన్నా, ఆ లోపు నియోజకవర్గాల్లో ఏవైనా పనులు చేయాలన్నా, స్వప్రయోజనాలు కాపాడుకోవాలన్నా టీడీపీతో మైత్రి కొనసాగితేనే సాధ్యమన్న అభిప్రాయం వారిలో ఏర్పడింది. ఇందువల్లే రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య సత్సంబంధాలు కొనసాగేలా, మిత్రపక్షమన్న హోదాకు ఢోకా లేకుండా చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. 

కొసమెరుపు
గుజరాత్ ఎన్నికల ఫలితాలు చంద్రబాబు, మోదీ సత్సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. పోలవరంపై స్పష్టమైన అవగాహనతో కేంద్రం ఉంది. గుజరాత్ ఫలితాలు బీజేపీని నిరాశపరిస్తే చంద్రబాబు వైఖరిలోనూ మార్పు రావచ్చని బీజేపీ ముఖ్యనాయకుడొకరు వ్యాఖ్యానించారు. 
 ప్రశ్నించేవారు ఆన్‌లైన్లో చూసుకోండి

Updated By ManamThu, 12/14/2017 - 16:46

polvaram project, ap cm chandrababuపోలవరం ప్రాజెక్ట్‌పై గల్లీ నుంచి ఢిల్లీ దాకా రగడ నడుస్తూనే ఉంది. ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఒడిదుడుకుల మధ్య నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఇంతలో చిన్న కలవరపాటు, ఏమైందో ఏమోగానీ అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు కేంద్రంపై అసహనం వ్యక్తంచేశారు. అటు తర్వాత విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి. దోచుకునేందుకే టెండర్లు మారుస్తున్నారంటూ ఆరోపణలతో దుమ్మెత్తిపోశాయి. అంతేకాకుండా ప్రాజెక్ట్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇలాంటి తరుణంలో విమర్శలకు చెక్ పెట్టారు సీఎం చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే తన జీవిత ఆశయమని చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించి ప్రజల్లో ఎలాంటి అపోహలు లేవని, అవన్నీ తొలగిపోయాయని తెలిపారు. కొందరు మాత్రం కావాలనే పోలవరంపై కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పోలవరంపై ఉడుం పట్టు పట్టానని... ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని కుండబద్దలుకొట్టారు. పోలవరంకు సంబంధించిన ఖర్చుల వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో ఉంచామని... శ్వేత పత్రాలు అడిగేవారు ఆన్ లైన్లో చెక్ చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. అడ్డుకుంటే.. ఊరుకోం

Updated By ManamTue, 12/12/2017 - 00:48
 • గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి

 • అడ్డుపడేవారికి మీడియా సహకరించొద్దు.. 

 • నిర్మాణానికి అందరూ సహకరించాలి

 • ప్రాజెక్టు నిర్మాణంలో రాజీపడే ప్రసక్తే లేదు.. 

 • కేంద్రం నుంచి ఇంకా 3200 కోట్లు రావాలి

 • 2 లక్షల మందికి పరిహారం చెల్లించాల్సిఉంది..

 • కొత్త ప్యాకేజీ వల్ల వ్యయం 11 రెట్లు పెరిగింది 

 • పూర్తయితే కరువు ఉండదు: చంద్రబాబు.. 

 • పోలవరం సందర్శించిన ముఖ్యమంత్రి 

 

ap cmపోలవరం /జంగారెడ్డిగూడెం, డిసెంబరు 11 (మనం ప్రతినిధి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుపడితే చూస్తూ ఊరుకోబోమని, ఎవరైనా అడ్డుపడితే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ముఖ్యమంత్రి నారా చంద్రబా బు నాయుడు హెచ్చరించారు. ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సోవువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే ద్వారా పనులను పరిశీలించారు. ఇంజనీర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల, భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడే వారికి మీడియా సహకరించవద్దని కోరా రు. అప్పుడే వాళ్లు తోకముడిచి వెళ్లిపోతా రని, వారికి అనుకూలంగా వార్తలు రాస్తే రాష్ట్రానికి హాని జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం దృష్ట్యా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అంతా కలిసికట్టుగా సహకరిస్తే నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. కొందరు ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించకపోగా కేంద్రప్రభుత్వం వద్ద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, దీనివల్ల రాష్ట్రానికే నష్టమన్న వాస్తవాన్ని గ్రహించాలని, రాజకీయం చేయవద్దని ఆయన హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ పక్షాల నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, వారి బండారం బయుటపెడతామని హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికే జీవనాడిగా మారుతుందని చంద్రబాబు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా 3200 కోట్లు  రావాల్సి ఉన్నదని ఆయన చెప్పారు. 2లక్షల మందికి పరిహారం ఇవ్వాల్సి ఉందని, ఇంకా 95,818 కుటుంబాలకు ఒక్కొక్కరికీ 17 నుంచి 18 లక్షల రూపాయల వరకు చెల్లించాల్సి ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వల్ల ప్రాజెక్టు వ్యయం 11 రెట్లు పెరిగిందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యయాన్ని ఎక్కడా అధికం చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

నాది ఉడుం పట్టు.. వదలను
తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో పోలవరం ప్రాజెక్టుపై చూపుతున్న శ్రద్ధ, శ్రమ అంతా ఇంతా కాదని.. ప్రతి వారం దీనిైపె సమీక్షిస్తున్నానని చంద్రబాబు అన్నారు. ఎవరెన్ని చెప్పినా, ఎంతమంది అడ్డుపడినా 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి తన ఉడుంపట్టు వదలనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టు విషయంలో రాజీలేదని అన్నారు. ప్రాజెక్టు పూర్తయితే కరువు పరిస్థితులు ఉండవని, వృథాగా పోయే గోదావరి జలాలను ప్రాజెక్టు వద్ద నిలుపుదల చేసి పంటలు పండించడమే కాకుండా, సమృద్ధిగా తాగునీరు, విద్యుత్ ఉత్పత్తితో బహుళ ప్రయోజనాలు పొందవచ్చని చంద్రబాబు చెప్పారు.నిర్మాణంలో కొంత మట్టిపని ఉన్నదని, కాంక్రీట్ పని ప్రధాన సమస్యగా మారిందని, కేంద్ర ప్రభుత్వం కాపర్ డ్యామ్‌కు అనుమతిస్తే 20రోజుల్లో పూర్తి చేస్తామని, డయాఫామ్ వాల్ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని, స్పిల్ వే పనులు కూడా పెద్ద సమస్య కాదని, ప్రధాన డ్యామ్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు.    పోలవరానికి నిధులు

Updated By ManamMon, 12/11/2017 - 19:08

ap cmపోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్రం మరోసారి రూ.378.22 కోట్ల నిధులు రిలీజ్ చేసింది. దీంతో నైర్యాశ్యంలో ఉన్న రాష్ట్ర సర్కార్‌కు కొంచెం ఉపశమనం కల్గింది. ప్రాజెక్ట్‌ను ముందుకు నడిపించాలా? లేదా ఆపేయమంటారా? అంటూ అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అటూ కేంద్రంలోనూ, ఇటూ రాష్ట్రంలోనూ పెను దుమారమే రేపింది. టెండర్లు నిలిపేయాలంటూ కేంద్రం నుంచి వచ్చిన లేఖతో టీడీపీ ప్రభుత్వం పరేషాన్‌కు గురైంది. కేంద్రమే ఇలా ఆటంకాలు సృష్టిస్తే..ప్రాజెక్ట్ ఎప్పటికల్లా పూర్తిచేస్తామంటూ ఒకింత కేంద్రంపై చంద్రబాబు అసహనాన్ని వ్యక్తంచేశారు. దీంతో అప్రమత్తమైన కేంద్రం..పోలవరానికి ఎటువంటి ఢోకాలేదని, కేంద్రమే దాన్ని పూర్తిచేస్తాదంటూ కేంద్రమంత్రి గడ్కరీ హామీ ఇవ్వడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. అన్నట్టుగానే కేంద్రం సోమవారం రూ.378.22 కోట్లు విడుదల చేసింది.  రాష్ట్ర స‌ర్కారు పెట్టిన ఖ‌ర్చులో భాగంగానే ఈ నిధులు విడుదల చేస్తున్న‌ట్లు తెలిపింది. నిధులు రిలీజ్ కావడంతో రాష్ట్ర సర్కార్‌లో మళ్లీ జోషొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం పూర్తి చేస్తామని సర్కార్ చెబుతోంది.రాజమండ్రిలో 'పోలవరం' కేంద్ర బృందం

Updated By ManamThu, 12/07/2017 - 21:37

polavaramరాజమండ్రి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలించేందుకు ముగ్గురు సభ్యుల కేంద్ర బృందం గురువారం రాజమండ్రి చేరుకుంది. శుక్రవారం వీరు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఢిల్లీ నుంచి రాజమండ్రి చేరుకున్న కేంద్ర బృందం సభ్యులు... అక్కడి ఓ ప్రైవేటు హోటల్లో బస చేస్తున్నారు.  పోలవరం ప్రాజెక్టు మ్యాప్‌లను వారు పరిశీలించారు. రాజమండ్రి నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరి పోలవరం చేరుకుంటారు. కాపర్‌ డ్యాంతో పాటు ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఈ కేంద్ర బృందంలో వైకే చౌబే, ఆర్‌సీ శర్మ, శంకదీప్‌ చౌదరి ఈ బృందంలో ఉన్నారు. పోలవరం కాపర్‌ డ్యాం టెండర్లు నిలిపివేయాలని కేంద్రం లేఖ రాయడంతో పోలవరం అంశం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రబృందం పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్రానికి సుప్రీం జరిమానా

Updated By ManamWed, 11/08/2017 - 00:53
 • రూ. 25 వేలు వడ్డించిన సుప్రీం
 • పోలవరంపై కౌంటర్ దాఖలు 
 • చేయుకపోవడైంపె కోర్టు ఆగ్రహం
 • ఒడిశా కేసులో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్
 • ఇంప్లీడ్ పిటిషన్లను స్వీకరించిన కోర్టు
 • ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలపొచ్చని సూచన

polavaram project, suprem courtన్యూఢిల్లీ, నవంబరు 7: ఏపీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఒడిశా దాఖలు చేసిన కేసులో ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం కేంద్రానికి రూ.25వేల జరిమానా విధించింది. జరిమానా ఉపసంహరించాలని కేంద్రం చేసిన విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఒరిజినల్ కేసులో కొన్ని సవరణలు కోరుతూ చేసిన విజ్ఞప్తిపై రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. కాగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఒడిశా దాఖలు చేసిన కేసులో తమకు కూడా అవకాశం కల్పించాలని కోరుతూ తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిని జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం ఆమోదించింది.  కాగా తెలంగాణ పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్.. విభజన చట్టలోని సెక్షన్ 90 ప్రకారం ఆ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టుతో సంబంధం లేదని వాదించింది. ఏపీ అభ్యంతరాలను నమోదు చేసిన జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ దీపక్ మిశ్రా.. కేసు విచారణ సందర్భంలో అభ్యంతరాలను కోర్టుకు తెలిపే స్వేచ్ఛ ఇచ్చినట్లు పేర్కొన్నారు. 


పోలవరం ప్రాజెక్టు కారణంగా గిరిజనుల హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, అడవిబిడ్డల ఆక్రందనలను పట్టించుకోవడం లేదంటూ దాఖైలెన మరో పిటిషన్ మీద కూడా కేంద్రం సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ఇంతకుముందే తెలిపింది. పోలవరం ప్రాజెక్టు కారణంగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 600 ఆవాసాలు మునిగిపోతాయని, సుమారు 8000 ఎకరాల అటవీభూములు, 500 ఎకరాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పోతుందని ఆ పిటిషన్‌లో తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఇంతకుముందు ఇచ్చిన పర్యావరణ అనువుతిని జాతీయ పర్యావరణ అప్పిలేట్ 2007లో రద్దుచేసింది. కానీ, దానిపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా... ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపాలంటూ 2011 ఫిబ్రవరి 8న ఆదేశాలిచ్చి తర్వాత వాటిని అబెయున్స్‌లో పెట్టింది. 

Related News