stock market

కొనసాగిన పతనం

Updated By ManamTue, 10/23/2018 - 22:09
  • క్షీణించిన రూపాయి... వాణిజ్య యుద్ధ కలవరమే కారణం 

  • ఆరు నెలల కనిష్ఠ స్థాయిలకు సూచీలు

bseముంబై: స్టాక్ మార్కెట్లకు గీటురాళ్ళుగా భావించే సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా నాల్గో సెషన్‌లో మంగళవారం పతనమయ్యాయి. గత ఆరు నెలల్లో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయిలకు అవి పడిపోయాయి. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా షేర్ల పతనం సూచీలను కిందకు గుంజింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం, అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ తగవు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు తిరిగి తలెత్తడం మార్కెట్ల క్షీణతకు కారణమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) సెన్సెక్స్ 287.15 పాయింట్లు కోల్పోయి 33,847.23 వద్ద ముగిసింది. గత ఏప్రిల్ 10 తర్వాత, సెన్సెక్స్ ఇంత బలహీన స్థితిలో పడడం ఇదే మొదటిసారి. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) నిఫ్టీ 98.45 పాయింట్లు కోల్పోయి 10,146.80 వద్ద ముగిసింది. ఏప్రిల్ 4 తర్వాత నిఫ్టీకి ఇదే అత్యంత కనిష్ఠ స్థాయి. అయితే, స్పెక్యులేటర్లు నష్టాలను తగ్గించుకునేందుకు ట్రేడింగ్ ముగింపు దశలో జరిపిన కొనుగోళ్ళు ఆ రెండు కీలక సూచీలు నష్టాలను తగ్గించుకునేందుకు సహాయపడ్డాయి. ఇదిఇలాఉండగా, అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించి రూ. 73.82 (ఇంట్రా-డే)గా ఉండడం కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ‘‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్ షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడం మంగళవారం నాడు సూచీలను దిగవ గతి పట్టించింది. మార్కెట్లో మిగిలినవన్నీ సర్దుబాటుకు గురికాగా, ఇటీవల పతనమవకుండా నిలదొక్కుకున్నది ఈ రెండు రంగాల షేర్లే. కరెన్సీ తరుగుదల గాలులు మందగించడంతో వీటిలో కొన్ని లాభాలు బుక్ చేసుకోవడానికి ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు’’ అని హెచ్.డి.ఎఫ్.సి సెక్యూరిటీస్‌కు చెందిన పి.సి.జి అండ్ క్యాపిటల్ మార్కెట్స్ గ్రూప్ అధిపతి వి.కె. శర్మ చెప్పారు. 

గత మూడు సెషన్లలో సెన్సెక్స్ 1028 పాయింట్లు కోల్పోయింది. 
‘‘మరోసారి తీవ్ర ఒడుదుడుకులతో సాగిన సెషన్‌లో, భారతీయ ఈక్విటీ గీటురాయి సూచీలు వరుసగా నాల్గో సెషన్‌లో తక్కువ స్థాయిలో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల సంకేతాలు బలహీనంగా ఉండడం దీనికి చాలా వరకు కారణం...స్వల్ప అధిక స్థాయిలో ముగిసిన విద్యుత్, రియల్టీ రంగాలను మినహాయిస్తే, ఇతర రంగాల సూచీలన్నీ నష్టాల్లోనే ముగిశాయి. ఐటీ, హెల్త్‌కేర్, ఎఫ్.ఎం.సి.జి షేర్లు ఎక్కువ నష్టపోయాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, ఏషియన్, యూరోపియన్ సూచీలు చాలా తక్కువ స్థాయిలో ట్రేడయ్యాయి’’ అని నిపుణులు చెప్పారు. వాల్‌స్ట్రీట్‌లో నష్టాలు వాటిపై ఆ రకమైన ప్రభావం చూపాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు సోమవారం రూ. 511.91 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ మదుపు సంస్థలు రూ. 303.21 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశాయని తాత్కాలిక డాటా సూచించింది. ఆందోళనతో అమ్మకాలు

Updated By ManamMon, 10/22/2018 - 22:33
  • మూడో సెషన్‌లోనూ నష్టపోయిన మార్కెట్లు

sensexముంబై: భారతీయ ఈక్విటీలు వరుసగా మూడో సెషన్‌లో సోమవారం దిగువ గతిలో పయనాన్ని కొనసాగించాయి. ప్రధానంగా ఫినాన్షియల్, ఎనర్జీ రంగాల షేర్లలో చివరలో చోటుచేసుకున్న అమ్మకాలతో బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ)  ‘సెన్సెక్స్’ 181 పాయింట్లకు పైగా కోల్పోయింది. లిక్విడిటీ ఆందోళనలు, కంపెనీలు వెల్లడిస్తున్న రెండో త్రైమాసిక ఫలితాలు మిశ్రమంగా ఉండడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ముడి చమురు ధర పీపా 80 డాలర్లను మించడం కూడా సెంటిమెంట్లను బలహీనపరచింది. ‘సెన్సెక్స్’లోని 30 కంపెనీల్లో ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్ ఎక్కువగా 9.52 శాతం క్షీణించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.56 శాతం పతనమైంది. ‘సెన్సెక్స్’ 34,689.39 వద్ద మొదలై 34.748.69 పాయింట్ల స్థాయిని తాకింది. అయితే, ట్రేడింగ్ చివరి గంటలో అమ్మకాలు ఊపందుకోవడంతో అది ప్రతికూల స్థితిలోకి జారుకుని 34,082.76 కనిష్ఠ స్థితిని చూసింది. చివరకు, 181.25 పాయింట్ల పతనంతో 34,134.38 వద్ద ముగిసింది. ద్రవ్యతపై కలవరం, బలహీనంగా ఉన్న ప్రపంచ మార్కెట్ల సంకేతాలతో ‘సెన్సెక్స్’ గత రెండు సెషన్లలో 847 పాయింట్లు కోల్పోయింది. 

అదేమాదిరిగా, నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 కంపెనీల సూచి ‘నిఫ్టీ’ 10,224 నుంచి 10,408.65 మధ్య ఊగిసలాడిన తర్వాత, 58.30 పాయింట్ల నష్టంతో 10,245.25 వద్ద ముగిసింది. ‘‘ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ, నిఫ్టీ రేంజ్-బౌండ్‌లో ట్రేడ్ అయి, ప్రతికూల స్థితిలో ముగిసింది. లిక్విడిటీపై కలవరం, వడ్డీ రేటు దానికి కారణమయ్యాయి. మధ్య, చిన్న స్థాయి షేర్లు వాటి శక్తి మేరకు రాణించలేదు. ‘నిఫ్టీ’ లోని అగ్ర కంపెనీల క్యూ 2 ఫలితాలు మిశ్రమంగా ఉండడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలహీనపరచింది. భవిష్యత్తులో కంపెనీల ఆదాయాలు తగ్గే రిస్కు కనిపిస్తోంది’’ అని జియోజీత్ ఫినాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగాధిపతి వినోద్ నాయర్ అన్నారు. 
మార్కెట్‌లో పరిస్థితిని మెరుగుపరచేందుకు ఆర్.బి.ఐ చర్యలు తీసుకున్నప్పటికీ, మార్కెట్‌లో నెలకొన్న ద్రవ్యత కొరత, పెరుగుతున్న ముడి చమురు ధరలు వంటి స్థూల అంశాల ఆందోళనలతో సెంటిమెంట్లు బలహీనంగానే ఉండిపోయాయని బ్రోకర్లు చెప్పారు. 

sensexబ్రెంట్ క్రూడ్ పీపా ధర సోమవారం 80.14 డాలర్లను తాకింది. ఏషియాలోని ఇతర మార్కెట్ల విషయానికి వస్తే,  మరిన్ని ఉద్దీపన చర్యలు ఉంటాయనే వాగ్దానంతో చైనా కంపెనీల షేర్లు రెండో సెషన్‌లోనూ పెరిగాయి. సౌదీ అరేబియా, ఇటలీ, బ్రెక్సిట్‌లపై భౌగోళిక, రాజకీయ ఆందోళనలు తగ్గుముఖం పట్టేట్లు చేయడానికి కూడా ఆ వాగ్దానం దోహదపడింది. చైనా ప్రపంచంలోనే రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. మరింత క్రియాశీల ద్రవ్య విధానాన్ని తీసుకువస్తామని బీజింగ్ వాగ్దానం చేసింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత, తిరిగి ఇప్పుడు మళ్ళీ చైనాలో వృద్ధి నత్తనడక సాగిస్తోంది. తిరిగి దేశీయ స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు శుక్రవారం రూ. 618.26 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ మదుపు సంస్థలు కూడా రూ. 2.14 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించాయని తాత్కాలిక డాటా సూచించింది. అమ్మకాల ఒత్తిడి

Updated By ManamWed, 10/17/2018 - 23:11
  • లాభాల స్వీకరణలో ఇన్వెస్టర్లు

  • కొనసాగిన రూపాయి కష్టాలు 

  • వెరసి మూడు రోజుల లాభాలకు బ్రేక్

rupeeeముంబై: బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ)కి గీటురాయిగా భావించే ‘సెన్సెక్స్’ మూడు రోజుల లాభాల ర్యాలీకి బుధవారం బ్రేక్ పడింది. బి.ఎస్.ఇ 30 షేర్ల ‘సెన్సెక్స్’ 383 పాయింట్లు పతనమైంది. పెరుగుతున్న ముడి చమురు ధరలు, రూపాయి మారకం విలువలో హెచ్చు తగ్గులు ఇన్వెస్టర్లలో కలవరం రేపాయి. ఆ బెంబేలు భారీయెత్తున అమ్మకాలకు పురికొల్పాయి. ప్రధానంగా ఫినాన్షియల్, మోటారు వాహనాల రంగ షేర్లలో అమ్మకాలు ముమ్మరంగా చోటుచేసుకున్నాయి. అమ్మకాలు, కొనుగోళ్ళు ఉవ్వెత్తున ఒకదాని తర్వాత ఒకటిగా చోటుచేసుకోవడంతో ‘సెన్సెక్స్’ దాదాపు 880 పాయింట్లు పెరగడమో లేదా తగ్గడమో అవుతూ వచ్చింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ కూడా 131.70 పాయింట్లు పతనమై 10,500 స్థాయి దిగువకు జారుకుంది. ముఖ్యంగా ఆటో, రియల్టీ, ఆయిల్-గ్యాస్ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని చవిచూశాయి. ద్రవ్యత ఆందోళనలతో సెంటిమెంట్లు దెబ్బతిన్నాయి. అవి నాన్-బ్యాంకింగ్ ఫినాన్షియల్ షేర్ల ధరలు పతనమొందేట్లు చేశాయి. 

బలపడని రూపాయి
ఇదిఇలాఉండగా, ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి ఆరంభంలో బలాన్ని ప్రదర్శించి రూ. 73.37గా ఉన్నప్పటికీ, తర్వాత 13 పైసలు క్షీణించి, అమెరికన్ డాలర్‌తో (ఇంట్రా-డేలో) రూ. 73.61 అయింది. రూపాయి ఇలా క్షీణించడం ఈక్విటీలపై ప్రభావం చూపింది. మొత్తం మీద మదుపరులలో వేచి చూసే ధోరణి కనిపించింది. వారు అప్రమత్త ధోరణిని అనుసరించారు. ‘సెన్సెక్స్’ బుధవారం 35,543.38 వద్ద మొదలై ఎర్లీ ట్రేడ్‌లో 35,605.43ను తాకింది. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ క్యూ 2 ఫలితాలు ఊహించిన దానికన్నా మెరుగ్గా ఉండడంతో ‘సెన్సెక్స్’ మొదట్లో ఎగువ గతిలో సాగింది. అయితే, ఇన్వెస్టర్లు అన్ని రంగాల షేర్లను అమ్మడం ప్రారంభించడంతో పరిస్థితి మారింది. వారి అమ్మకాలు చాలా వరకు లాభాలను మూటగట్టుకునే స్వభావంతో సాగినవే. అమెరికా కేంద్ర బ్యాంక్‌కు చెందిన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్.ఓ.ఎం.సీ) సమావేశ వివరాలు వెల్లడి కానున్నాయి. అమెరికాలో వడ్డీ రేట్లు ఏ గతిలో సాగనున్నాయో అవి సూచించే అవకాశం ఉంది. ఫలితంగా, గ్లోబల్ మార్కెట్లు మిశ్రమంగానే సాగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించబోయే ఫలితాల కోసం ఎదురు చూస్తున్న మదుపరులు అప్రమత్త వైఖరిని అనుసరించారు. దానితో, ‘సెన్సెక్స్’ చివరకు 382.90 పాయింట్ల నష్టంతో 34,779.58 వద్ద ముగిసింది. ఇక ‘నిఫ్టీ’ ఇంట్రా-డేలో 10,700 స్థాయిని తిరిగి అందుకుని, చివరకు 131.70 పాయింట్లు నష్టపోయి, 10,453.05 వద్ద ముగిసింది. దేశీయ మదుపు సంస్థల నిర్విరామ కొనుగోళ్ళు, పునరుద్యమించిన గ్లోబల్ ఈక్విటీ మార్కెట్ల స్ఫూర్తితో ‘సెన్సెక్స్’ గత మూడు సెషన్లలో దాదాపు 1161 పాయింట్లు పెరిగింది. కాగా, విదేశీ మదుపు సంస్థలు మంగళవారం రూ. 1165.63 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ మదుపు సంస్థలు రూ. 1059.44 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేసినట్లు తాత్కాలిక డాటా సూచించింది. 

పెరిగిన క్రూడ్ ధరలు
బ్రెంట్ క్రూడ్ ధరలు పీపాకు (0.38 శాతం పెరిగి) 81.72 డాలర్లు పలుకుతూండగా, వెస్ట్ టెక్సాస్  ఇంటర్మీడియట్ క్రూడ్ ధర 0.26 శాతం పెరిగి పీపాకు 72.11 డాలర్లుగా ఉంది. అమెరికాలో చమురు నిల్వలు తగ్గడం ముడి చమురు ధరలను అలా ఎగదోసింది. 

గురువారం సెలవు
దసరా సందర్భంగా స్టాక్ ఎక్చ్సేంజీలకు గురువారం (అక్టోబర్ 18) సెలవు ప్రకటించారు. మార్కెట్లలో జోష్

Updated By ManamTue, 10/16/2018 - 22:17

bseముంబై: ఈక్విటీ గీటురాయి ‘సెన్సెక్స్’ వరుసగా మూడో సెషన్‌లోనూ మంగళవా రం విజయ పరంపరను కొనసాగించి, 297 పాయింట్లు పెరిగి, కీలకమైన 35,000 స్థాయిని తిరిగి అందుకుంది. రూపాయి బలపడడం, కార్పొరేట్ ఆదాయాల సీజన్ ఆరోగ్యకరమైన రీతిలో ప్రారంభమవడం వంటి సానుకూల స్థూల సంకేతాలు స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చాయి. 

బలపడిన రూపాయి
ఫారెక్స్ మార్కెట్‌లో అమెరికన్  డాలర్‌తో రూపాయి మారకం విలువ 25 పైసలు బలపడి (ఇంట్రా-డేలో) రూ. 73.58గా నిలిచింది. సడలిన ముడి చమురు ధరలు దీనికి తోడు ప్రపంచ ముడి చమురు ధరలు సడలాయి. ఏషియాలోని ఇతర మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు లభించాయి. యూరోపియన్ మార్కెట్లలో షేర్లు హెచ్చు స్థాయిలో మొదలయ్యాయి. ఇవి కూడా మార్కెట్ ర్యాలీని పెంపొందించాయి. బ్రెంట్ క్రూడ్ పీపా మంగళవారం 80.58 డాలర్లు పలికింది. బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల ‘సెన్సెక్స్’ సెషన్‌లో సానుకూల స్థితిలోనే కొనసాగి 34,913.06 పాయింట్ల నుంచి 35,215.79 మధ్య ఊగిసలాడింది. అంతిమంగా 297.38 పాయింట్ల లాభంతో 35,162.48 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ 10,600 స్థాయిని తాకిన తర్వాత, 10,604.90 గరిష్ఠ స్థాయిని చూసింది. చివరకు 72.25 పాయింట్ల లాభంతో 10,584.75 వద్ద ముగిసింది. ‘‘మధ్య, చిన్న స్థాయి షేర్ల మద్దతుతో ‘నిఫ్టీ’ మంగళవారం అధిక స్థాయిని అందుకుంది. ‘నిఫ్టీ’కన్నా విస్తృత సూచీలు ఎక్కువ లాభపడ్డాయి. పి.ఎస్.యు బ్యాంకుల షేర్లు అగ్ర భాగాన నిలువగా, బ్యాంకింగ్ షేర్లు మిశ్రమ పెరుగుదలను సాధించాయి. ప్రపంచ సంకేతాలు కూడా మిశ్రమంగానే ఉన్నాయి. అమెరికన్ మార్కెట్లు క్షీణించగా, ఇతర మార్కెట్లలో చాలా భాగం స్థిరపడినట్లుగా కనిపించాయి’’ అని పీఎన్బీ పరిబస్ నిర్వహిస్తున్న పి.ఎం.ఎస్ షేర్‌ఖాన్ ఫండ్ మేనేజర్ రోహిత్ శ్రీవాస్తవ అన్నారు. 

ఇద్దరివీ కొనుగోళ్ళే
దేశీయ మదుపు సంస్థలు సోమవారం రూ. 294.78 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా, విదేశీ మదుపు సంస్థలు కూడా రూ. 67.86 కోట్ల విలువ చేసే ఈక్విటీలను కొనుగోలు చేశాయని తాత్కాలిక డాటా సూచించింది. ప్రపంచ మార్కెట్ల పతనాన్ని అనుసరించి ఇటీవల తీవ్ర పతనాన్ని చూసిన దేశీయ మార్కెట్లు, కంపెనీలు రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించడం మొదలుపెట్టిన సమయంలో తిరిగి గాడిన పడ్డాయని బ్రోక ర్లు చెప్పారు. ఎదురు గాలిలో ఆరోహణ

Updated By ManamMon, 10/15/2018 - 22:13
  • స్వల్పంగా పెరిగిన స్టాక్ మార్కెట్ సూచీలు

bseముంబై: బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల సున్నిత సూచి సోమవారం సుమారు 132 పాయింట్లు లాభపడి 34,865.10 వద్ద ముగిసింది. కొన్నాళ్ళుగా సాగుతున్న  వాణిజ్య వైరం, పెరుగుతున్న ముడి చమురు ధరల రూపంలో ఎదురు గాలులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను దెబ్బతీయడం కొనసాగుతున్నప్పటికీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ షేర్లలో కనిపించిన కొనుగోళ్ళు ‘సెన్సెక్స్’కు ఊతమిచ్చాయి. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ 40 పాయింట్లు లాభపడి 10,512.50 వ ద్ద ముగిసింది. రూపాయిలో తాజా బలహీనత, పెరుగుతున్న ముడి చమురు ధరలు, ఏషియాలోని ఇతర మార్కెట్లలో మందగొడి  ధోరణితో ఇన్వెస్టర్ల మనోభిప్రాయాలు  ఆచితూచి వ్యవహరించే ధోరణితో సాగాయి. అమెరికా-చైనా వాణిజ్య వివాదం, చైనా ఆర్థిక వ్యవస్థలో మందగమనానికి ఉన్న అవకాశం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే విధానాన్ని కొనసాగించవచ్చనే సంకేతాలు ఏషియాలో ఇతర మార్కెట్లలో మందగతికి కారణమయ్యాయి. 

దెబ్బతిన్న రూపాయి
ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి మరోసారి రూ. 74 స్థాయిని ఛేదించింది. అమెరికన్ డాలర్‌తో మారకంలో (ఇంట్రా-డేలో) రూ. 74.05గా ఉంది. బలపడిన బ్రెంట్ క్రూడ్ చమురుకు సంబంధించి అంతర్జాతీయ గీటురాయిగా భావించే బ్రెంట్ క్రూడ్ 0.98 శాతం పెరిగి, పీపా 81.79 డాలర్లుగా పలుకుతోంది. ‘‘అమెరికా-సౌదీ అరేబియాల మధ్య ఉద్రిక్తత హఠాత్తుగా పెరగడంతో చమురు ధరలు ఎగశాయి. ఫలితంగా రూపాయి ఒత్తిడికి లోనవుతూ వస్తోంది. క్యూ 2 ఫలితాల సీజన్ సానుకూల ధోరణిలోనే మొదలైంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎఫ్.ఎం.సి.జి రంగాల్లో  పెద్ద  కంపెనీలు ప్రకటిస్తున్న ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి’’ అని జియోజీత్ ఫినాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగాధిపతి వినోద్ నాయర్ అన్నారు. 

పెరిగిన టోకు ద్రవ్యోల్బణం
టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచి సెప్టెంబర్‌లో రెండు నెలల గరిష్ఠ స్థాయి 5.13 శాతంగా ఉంది. ఆహార వస్తువుల ధరలు బలపడడం, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం దానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. 

తగ్గిన పారిశ్రామిక ఉత్పత్తి
పారిశ్రామిక ఉత్పత్తి  ఆగస్టులో  మూడు నెలల కనిష్ఠ స్థాయి 4.3 శాతానికి పడిపోయింది. రిటైల్ ద్రవ్యోల్బణం మాత్రం స్వల్పంగా పెరిగి సెప్టెంబర్‌లో 3.77 శాతంగా ఉంది. 

దేశీయ మదుపు సంస్థల మద్దతు
దేశీయ మదుపు సంస్థలు శుక్రవారం రూ. 1287 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ. 1322 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారని తాత్కాలిక డాటా సూచించింది. లాభాల్లో మార్కెట్లు

Updated By ManamFri, 10/12/2018 - 23:26
  • తగ్గిన ముడి చమురు ధరలు.. 

  • డాలరుతో మారకంలో కోలుకున్న రూపాయి

bseముంబై: ముడి చమురు ధరల్లో తగ్గుదల, రూపాయిలో రికవరీ రెండూ కలసి బి.ఎస్.ఇ ‘సెన్సెక్స్’ను శుక్రవారం పైకెత్తాయి.  బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల సున్నిత సూచి 700 పాయింట్లకు పైగా పెరిగింది. ‘సెన్సెక్స్’ గత 19 నెలల్లో ఒకే రోజులో ఇంత అత్యధిక స్థాయిలో లాభప డడం ఇదే మొదటిసారి. వరుసగా రెండు సెషన్లలో నష్టాల తర్వాత, గ్లోబల్ మార్కెట్లు కూడా బలం పుంజుకున్నాయి. ఫారెక్స్ మార్కెట్‌లో అమెరికన్ డాలర్‌తో మారకంలో రూపాయి 53 పైసలు పటిష్టపడి (ఇంట్రా-డేలో) రూ. 73.59 గా నిలిచింది. వారం వారీగా చూస్తే, రెండు సూచీలు గత ఆరు వారాల్లో మొదటిసారిగా లాభాలతో ముగిశాయి. ఈ వారంలో ‘సెన్సెక్స్’ 366.59 పాయింట్లు, ‘నిఫ్టీ’ 156.05 పాయింట్లు పెరిగాయి. 

రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్‌కు తిరిగి రావడంతో, కొనుగోళ్ళ ఉధృతితో ‘సెన్సెక్స్’ 34,808.42 పాయింట్ల అధిక స్థాయిని తాకింది. తర్వాత, అది లాభాలలో కొన్నింటిని వదులుకుంది. అయినా, గణనీయంగా 732.45 పాయింట్ల పెరుగుదలతో 34,733.58 వద్ద ముగిసింది. ‘సెన్సెక్స్’ 2017 మార్చి తర్వాత ఒకే రోజులో ఇన్ని పాయింట్లు మూటగట్టుకోవడం ఇదే మొదటిసారి. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ 237.85 పాయింట్ల లాభంతో 10,472.50 వద్ద ఈ వారానికి ముగింపు పలికింది. డే ట్రేడ్‌లో అది 10,492.45 పాయింట్ల అధిక స్థాయిని తాకింది. ఇన్వెస్టర్లు ఇటీవల దెబ్బతిన్న ఆటో, రియల్టీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్.ఎం.సి.జి, బ్యాంకింగ్, విద్యుత్, మౌలిక వసతులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్ షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ మదుపు సంస్థలు కూడా మార్కెట్‌లోకి అవిచ్ఛిన్నంగా నిధులను ప్రవహింపజేశాయి.మార్కెట్లో ‘రిలీఫ్ ర్యాలీ’

Updated By ManamWed, 10/10/2018 - 22:48

marketముంబై: ఇటీవలి వరుస పతనాల తర్వాత, స్టాక్ మార్కెట్ సూచీలు రెండూ బుధవారం బలమైన పునరాగమనాన్ని కనబరచాయి. బాగా దెబ్బతిన్న ఫినాన్షియల్, మోటారు వాహనాలు, లోహాల రంగ షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోలు చేయడం, కనివిని ఎరుగని కనిష్ఠ స్థాయిల నుంచి రూపాయి కొంత కోలుకోవడం మార్కెట్ల ఆరోహణకు ఊతమిచ్చాయి. బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల సున్నిత సూచి 34,493.21 వద్ద ఆరంభమై 34,858.35 అధిక స్థాయిని తాకింది. చివరకు 461.42 పాయింట్ల లాభంతో 34,760.89 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ కూడా 10,400 కీలక స్థాయిని తిరిగి అందుకుంది. అది ఒక దశో 10,482.35 స్థాయిని తాకి, చివరలో 159.05 పాయింట్ల లాభంతో 10,460.10 వద్ద ముగిసింది. కొనుగోలు కార్యకలాపాలు వేగం పుంజుకోవడంతో కీలక సూచీలు సెషన్ పొడుగూతా సానుకూల స్థితిలోనే కొనసాగాయి. బి.ఎస్.ఇ ‘సెన్సెక్స్’ మంగళవారం దాదాపు 175 పాయింట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. నగదు కొరతతో బాధపడుతున్న నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీల (ఎన్.బి.ఎఫ్.సిల)కు చెందిన రూ. 45,000 కోట్ల విలువ చేసే ఆస్తులను కొనుగోలు చేయాలని ఎస్.బి.ఐ నిర్ణయించడం కూడా సెంటిమెంట్‌ను పెంపొందించింది. ఐ.ఎల్ అండ్ ఎఫ్.ఎస్ గ్రూప్ సంస్థలు వరుసగా రుణాల ఎగవేతలకు పాల్పడుతూండడంతో ఎదురు గాలులు ఎదుర్కొంటున్న ఎన్.బి.ఎఫ్.సిలకు ద్రవ్యత మద్దతు సమకూర్చడానికి ఎస్.బి.ఐ నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నారు. గత కొద్ది రోజుల్లో బాండ్ ప్రతిఫలాలు తగ్గాయని, ఈ దశలోరూపాయి బలపడడం ‘రిలీఫ్ ర్యాలీ’కి సాయపడిందని బి.ఎన్.పి పరిబస్‌కు చెందిన ఫండ్ మేనేజర్ రోహిత్ శ్రీవాస్తవ అన్నారు. అమ్మకాలు మితిమీరి సాగిన మార్కెట్లో ఒత్తిడి సడలడానికి, కొత్త కొనుగోళ్ళు లేదా నష్టాలు తగ్గించుకునేందుకు జరిపిన కొనుగోళ్ళకు పురికొల్పిందని ఆయన తెలిపారు. 

కాస్త తేరుకున్న రూపాయి
ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్‌తో మారకంలో రూపాయి విలువ 34 పైసలు బలపడి బుధవారం ఇంట్రా-డేలో రూ. 74.05 గా నిలిచింది.  ‘‘అమెరికాలో బాండ్ ప్రతిఫలాలు, డాలర్ మంగళవారం చల్లబడడం (తగ్గడం)తో గ్లోబల్ మార్కెట్లు కూడా ఊపిరి పీల్చుకున్నాయి. ఒత్తిడి ఇలాగే సడలితే, రానున్న రోజుల్లో కూడా ఈ లాభాలు కొనసాగవచ్చు’’ అని శ్రీవాస్తవ అన్నారు.

తగ్గని ముడి చమురు సెగ
మురుకు అంతర్జాతీయ గీటురాయిగా తీసుకునే బ్రెంట్ క్రూడ్ ధర పీపాకు దాదాపు 84.30 డాలర్లు పలుకుతోంది.  ‘‘అందరి దృష్టి కంపెనీలు ప్రకటించబోయే త్రైమాసిక ఫలితాలపైకి మళ్ళుతోంది. ఈక్విటీ మార్కెట్లకు అది కొంత ఊరట కల్పించవచ్చు’’ అని శాంక్టమ్ వెల్త్ మేనేజ్‌మెంట్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అధికారి సునీల్ శర్మ అన్నారు. 

ఏవియేషన్ షేర్లకు రెక్కలు
విమాన ఇంధనంపై ఎక్సైజ్ సుంకంలో కోత పెట్టవచ్చనే వార్తలతో జెట్ ఎయిర్‌వేస్, స్పైస్‌జెట్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌ల షేర్ల ధరలు 7.78 శాతం వరకు పెరుగుదలను చూశాయి.మళ్ళీ నష్టాల్లోకి జారిన మార్కెట్లు

Updated By ManamTue, 10/09/2018 - 22:06

bseముంబై: బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల సెన్సెక్స్ మంగళవారం 175 పాయింట్లు కోల్పోయి 34,299 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ 47 పాయింట్లు నష్టపోయి 10,301 వద్ద ముగిసింది. ఏషియాలో ఇతర మార్కెట్లు కూడా 17 నెలల కనిష్ఠ స్థితులను చూశాయి. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనానికి దారితీస్తున్న సూచనలు వెల్లడవుతున్నాయనే ఆందోళనలతో గ్లోబల్ మార్కెట్‌లో సెంటిమెంట్లు ప్రతికూలంగా మారాయి. కాగా, దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఒడుదొడుకుల ట్రేడింగ్‌ను చూశాయి. మోటారు వాహనాలు, వినియోగ వస్తువులు, రియల్టీ, చమురు, ఇంధన వాయు, బ్యాంకింగ్ రంగాల షేర్లు విస్తృత అమ్మకాలను చవి చూశాయి. సెన్సెక్స్ 34,651.82 పాయింట్ల వద్ద బలమైన స్థితిలో ఆరంభమైనా తర్వాత అమ్మకాల ఒత్తిడితో క్షీణించింది. అది ఇంట్రా-డేలో 34,233.50 కనిష్ఠ స్థితిని చూసింది. 

ఏడేళ్ళ కనిష్ఠానికి టాటా మోటార్స్
టాటా మోటార్స్ షేర్ ధర దాదాపు ఏడేళ్ళ కాలంలో అత్యంత కనిష్ఠ స్థాయిగా చెప్పదగిన రూ. 170.65కి పడిపోయింది. కంపెనీ యాజమాన్యంలోని జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలు 12.3 శాతం తగ్గినట్లు సోమవారం వెల్లడించింది. సెప్టెంబర్‌లో దాని ప్రపంచ అమ్మకాలు 57,114 యూనిట్లుగా ఉన్నాయి. చైనాలో డిమాండ్ మందగించడం అమ్మకాలు తగ్గడానికి కారణమని కంపెనీ పేర్కొంది. చివరకు టాటా మోటార్స్ షేర్ ధర మంగళవారం రూ. 184 వద్ద ముగిసింది. ప్రపంచ డిమాండ్ బలహీనంగా ఉండడం వల్ల వెస్ట్ మిడ్‌ల్యాండ్ ప్లాంట్‌ను రెండు వారాలపాటు మూసివేయనున్నట్లు కంపెనీ ప్రకటించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది. రూపాయి మారకం విలువ సరికొత్త కనిష్ఠ స్థితికి క్షీణించడం కూడా నిరుత్సాహాన్ని నింపింది. విదేశీ మదుపు సంస్థలు సోమవారం రూ. 1805 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించినట్లు తాత్కాలిక డాటా వెల్లడించింది. విదేశీ ఫండ్లు ఇలా మదుపు మొత్తాలను వెనక్కి తీసుకోవడం, ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటడంతో మదుపరులలో కలవరం కొనసాగింది. నష్టాలకు బ్రేక్

Updated By ManamMon, 10/08/2018 - 22:05
  • ఆటుపోట్ల ట్రేడింగ్‌లో లాభపడ్డ మార్కెట్లు

bseముంబై: తీవ్ర ఆటుపోట్లతో సాగిన సెషన్‌లో, ఇటీవల దెబ్బతిన్న, చౌక ధరకు లభిస్తున్న బ్యాంకింగ్, చమురు, ఇంధన వాయు, మోటారు వాహనాల రంగ షేర్లను మదుపరులు కొనుగోలు చేయడంతో, మూడు రోజులుగా కొనసాగిన పతన పరంపరకు, సోమవారం తెరపడింది. సెన్సెక్స్, నిఫ్టీలు సోమవారం సానుకూల స్థితిలో ముగిసేందుకు ఆ కొనుగోళ్ళు సాయపడ్డాయి. అలలుగా ఎగసిన అమ్మకాలు, కొనుగోళ్ళతో సెన్సెక్స్  660 పాయింట్లు పెరగడం, తగ్గడం అవుతూ వచ్చింది.  దేశీయ మదుపు సంస్థలు స్థిరంగా కొనసాగించిన కొనుగోళ్ళ మద్దతుతో బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల సున్నిత సూచి  34,636.43 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. కానీ, తర్వాత ఎటువైపూ స్థిరంగా మొగ్గ కుండా పెరుగుతూ, తగ్గుతూ వచ్చిన మార్కెట్లో, అమ్మకాల ఒత్తిడి వేగం పుంజుకోవడంతో, సెన్సెక్స్  33,974.66 పాయింట్ల అత్యల్ప స్థితికి పడిపోయింది. అయితే, మళ్ళీ చివరలో కొనసాగిన కొనుగోళ్ళతో సెన్సెక్స్ 97.39 పాయింట్లు లాభపడి అంతిమంగా 34,474.38  స్థాయి వద్ద ముగిసింది. వరుసగా గత మూడు సెషన్లలో సెన్సెక్స్ 2,149.15 పాయింట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ)  50 షేర్ల సూచి నిఫ్టీ కూడా 31.60 పాయింట్లు పుంజుకుని 10,348.05 వద్ద ముగిసింది. సోమవారంనాటి సెషన్లో అది 10,198.40 నుంచి 10,398.35 మధ్య ఊగిసలాడింది. సరసమైన ధరలకు లభించిన షేర్లను కొనుగోలు చేయడంతోపాటు, నష్టాలను తగ్గించుకునేందుకు ఇన్వెస్టర్లు జరిపిన కొనుగోళ్ళు కూడా మార్కెట్లో రికవరీకి దోహదపడ్డాయి. కంపెనీలు త్రైమాసిక ఫలితాలను వెల్లడించనుండడం ఈ వారంలో ప్రారంభం కానుండడంతో ఆశావహ ధోరణితో కూడిన అమ్మకాలు చోటుచేసు కోవడంతో సెంటిమెంట్ కొంతవరకు బలపడిందని ఒక బ్రోకర్ చెప్పారు.నేటి నుంచి ట్రేడింగ్‌కు ఆవాస్ ఫినాన్షియరీ షేర్లు

Updated By ManamSun, 10/07/2018 - 22:06

bseన్యూఢిల్లీ: ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) ద్వారా ఇటీవల రూ. 1,734 కోట్లను పొందిన ఆవాస్ ఫినాన్షియరీస్ సోమవారం స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కానుంది. ఈ సంస్థ తక్కువ, మధ్యస్థ ఆదాయాల వారికి గృహ రుణాలను అందిస్తోంది. కాగా, సెప్టెంబర్ 25-27 మధ్య ఒక్కో షేర్‌కు రూ. 818 నుంచి రూ. 821 చొప్పున ఐపీఒకు వెళ్లింది. ఇందులో 97 శాతం వాటను ఐపీఓకు కంపెనీ ఉంచింది. అయితే అవాస్ ఫినాన్షియరీస్ ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల్లో వేరు వేరు సర్క్యూలర్‌పై ట్రేడ్ కానున్నాయి. ఐపీఓ ద్వారా 1,62,49,359 ఆన్న షేర్ల యాంకర్ పార్టిషన్‌తో కలిపి 63,36,439 షేర్లకు తగ్గాయి. ఈ ఇష్యూను ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్, సిటీ గ్రూపు గ్లోబల్ మార్కెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇడెల్‌వైస్ ఫినాన్షియల్ సర్వీస్ లిమిటెడ్, స్పార్క్ క్యాపిటల్ అడ్వైసర్(ఇండియా) ప్రైవేట్ లిమి టెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు నిర్వహించాయి.

Related News