raghuram rajan

‘మొండి బాకీల్లో అందరి ప్రమేయం ఉంది’

Updated By ManamTue, 09/11/2018 - 22:22

raghuram-rajanన్యూఢిల్లీ: మొండి బాకీలు పెరిగిపోవడానికి బ్యాంకర్లు అతి నమ్మకంతో వ్యవహరించడం, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడంలో మందగతి, ఆర్థిక వృద్ధి మితంగా ఉండడం ప్రధాన కారణాలని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పార్లమెంటరీ ప్యానెల్‌కు సమర్పించిన ఒక నోట్‌లో పేర్కొన్నారు. ‘‘బొగ్గు గనుల కేటాయింపు సందేహాస్పదంగా ఉండడం, వాటిపై దర్యాప్తు జరిపేందుకు భయపడడం వంటి రకరకాల పాలనాపరమైన సమస్యలు ఢిల్లీలో యు.పి.ఏ, ఎన్.డి.ఏ ప్రభుత్వాలు రెండింటిలోను ప్రభుత్వ నిర్ణాయక క్రియను మందగతి పట్టించాయి’’ అని మురళీ మనోహర్ జోషీ నేతృత్వంలోని అంచనాల కమిటీకి సమర్పించిన పత్రంలో రాజన్ వ్యాఖ్యానించారు. 

అధిక లివరేజీతో సమస్య
నిలిచిపోయిన ప్రాజెక్టుల వ్యయాలు బాగా పెరిగిపోయాయి. ఫలితంగా, అవి రానురాను వడ్డీ కూడా చెల్లించలేని స్థితికి చేరుకున్నాయి. కొన్ని విద్యుదుత్పాదన కేంద్రాల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారతదేశంలో విద్యుచ్ఛక్తి కొరత ఉన్నప్పటికీ, అవి ఎటూ పాలుపోని స్థితిలో పడి ఉండడం, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే క్రమం ఈరోజు వరకు కూడా వేగం పుంజుకోలేదని సూచిస్తోంది. ఆర్థిక వృద్ధి పటిష్టంగా ఉన్న 2006-2008 కాలంలోనే పెద్ద సంఖ్యలో మొండి బాకీలు బయటపడ్డాయని ఆయన వెల్లడించారు. విద్యుదుత్పాదన కేంద్రాల వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులు ఇంతకుముందువి సకాలంలో, అనుకున్న బడ్జెట్ లోపలే పూర్తయ్యాయని కూడా ఆయన అన్నారు. ‘‘ఆ కాలంలోనే బ్యాంకులు తప్పిదాలు చేశాయి. అవి కంపెనీల పాత వృద్ధి, పనితీరును భవిష్యత్తుకు అన్వయించి చూసుకు న్నాయి. దాంతో ప్రమోటర్ ఈక్విటీ తక్కువగా ఉన్నా, ప్రాజెక్టులకు అధిక లివరేజి ఇచ్చేందుకు సుముఖత చూపాయి. కొన్ని సందర్భాల్లో అవి సొంతంగా జాగ్రత్తగా లెక్కలు వేసుకోకుండానే,  ప్రమోటర్లకు చెందిన ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ సమర్పించిన ప్రాజెక్టు నివేదికలను ఆధా రం చేసుకుని రుణాలు ఇచ్చేందుకు సంతకాలు చేసిన మాట కూడా వాస్తవం’’ అని ఆయన అన్నారు. ‘‘అప్పట్లో బ్యాంకులు చేతికి చెక్కుబుక్కు ఇచ్చి అవసరమైన రుణ మొత్తాన్ని వేసుకోవాల్సిందిగా ఎలా కోరిందీ ఒక ప్రమోటర్ నాకు వివరించారు’’ అని రాజన్ చెప్పుకొ చ్చారు. నిర్హేతుక ఉత్సాహ, ఉద్వేగాలకు అదొక చారిత్రక ప్రతీక. ఆనాటి చక్రభ్రమణంలో అటువంటి దశలో మరి కొన్ని దేశాల్లో కూడా ఆ విధమైన ధోరణి చోటుచే సుకుందని ఆయన అన్నారు. ఊహించిన విధంగా వృద్ధి దురదృష్టవశాత్తు ఎల్లప్పుడూ చోటుచేసుకోదు. ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి ముందు పటిష్టమైన ప్రపంచ ఆర్థిక వృద్ధి కొద్ది ఏళ్లు కనిపించింది.  ఆయితే, ఆ వృద్ధి తర్వాత సంక్షోభానికి ముందే మందమనం కూడా చోటుచేసుకుందని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో మరింత మమేకమైన ఇండియాకు కూడా అది పాకిందని రాజన్ అన్నారు. 

లోపించిన శ్రద్ధాసక్తులు
దేశంలో డిమాండ్ మందగిస్తున్న కొద్దీ వివిధ ప్రాజెక్టులలో చూపిన పటిష్టమైన డిమాండ్ అవాస్తవి కమైనదిగా క్రమేపీ అవగతమైంది. ప్రమోటర్, బ్యాంకర్ ఇద్దరిలోనూ ఆసక్తి లోపించడం కూడా ఎన్.పి.ఏల పెరుగుదలకు కారణమని రాజన్ అన్నారు. ఎన్.పి.ఏల సమస్యలో దుష్కృత్యాలు, అవినీతి పాత్రను ప్రస్తావిస్తూ, ‘‘నిస్సందేహంగా, కొన్నింటిలో అదున్నమాట నిజమే. కానీ, బ్యాంకర్ల అత్యుత్సాహాన్ని, అసమర్థతను, అవినీ తిని వేరుగా చూపడం కష్టం’’ అని ఆయన అన్నారు. ‘‘బ్యాంకర్లు మితిమీరిన విశ్వాసంతో వ్యవహరించారనేది స్పష్టం. ఈ రుణాలలో కొన్నింటి విషయంలో వారు  నామమాత్రపు పరిశీలన మాత్రమే జరిపి ఉంటారు. చాలా మంది స్వతంత్ర విశ్లేషణ చేయలేదు. ఆ ప్రాథమి కమైన పనుల విషయంలో వారు ఎస్.బి.ఐ క్యాప్స్, ఐ.డి.బి.ఐలపై అతిగా ఆధారపడ్డారు. అటువంటి విశ్లేషణ ఔట్‌సోర్సింగ్ వ్యవస్థలో ఉన్న ఒక బలహీనత. అనుచిత ప్రభావానికి అది అవకాశాలు చాలా పెంచేస్తుంది’’ అని ఆయన ఆ నోట్‌లో పేర్కొన్నారు.

ఎన్.పి.ఏలకు అడ్డుకట్ట 
నిరర్థక ఆస్తుల సమస్య బ్యాంకింగ్ రంగంలో పునరావృత్తం కాకుండా నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పాలనను మెరుగుపరచడం ఒకటిగా ఆయన తెలిపారు. ప్రాజెక్టు మూల్యాంకనం, పరిశీలన ప్రక్రియను కూడా చక్కదిద్దుకోవాలన్నారు. రికవరీ ప్రక్రియను పటిష్టపరచాలని కోరారు. ప్రభుత్వం నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులను దూరం చేయాలన్నారు. రాజన్ ఎన్.పి.ఏల సంక్షోభాన్ని గుర్తించి, దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించారని మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ప్రశంసించిన తర్వాత, అంచనాలపై పార్లమెంట్ కమిటీ తమకు విషయ నివేదన చేయవలసిందని రాజన్‌ను ఆహ్వానించింది. రఘురామ్ రాజన్ 2016 సెప్టెంబర్ వరకు మూడేళ్ళపాటు ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేశారు. ప్రస్తుతం షికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా ఉన్నారు.వృద్ధి అధోగతికి రాజన్ విధానాలే కారణం

Updated By ManamMon, 09/03/2018 - 22:34

raghuramన్యూఢిల్లీ: రుణాల ఎగవేతలో భారతీయ చిన్న మధ్యతరహా సంస్థలు  100 శాతం వృద్ధిని నమోదు చేసిన అపకీర్తిని మూటగట్టుకున్న, బ్యాంకులకు నిరర్ధక ఆస్తులు నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో పరిశ్రమలకు రుణాలందని స్థితికి ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అనుసరిమచిన విధానాలే కారణమని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఆరోపించారు. ‘‘వృద్ధి తగ్గుతూ వస్తున్న ధోరణి కొనసాగుతోంది. వృద్ధి ఎందుకు తగ్గుతూ వస్తోంది? బ్యాంకింగ్ రంగంలో ఎన్‌పీఏలు పెరిగిపోతుండటం వల్ల ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అవి రూ. 4 లక్షల కోట్లుగా ఉన్నాయి. అవి 2017 మధ్య కాలానికి రూ. 10.5 లక్షల కోట్లకు పెరిగాయి. ఎందుకంటే ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ హయాంలో చితికిన చితికిన ఆస్తులు, నిరర్థక ఆస్తులను గుర్తించే యంత్రాంగాలను ఏర్పాటు  చేశారు. దాంతో బ్యాంకులు పరిశ్రమలకు రుణాలు ఇవ్వడాన్ని నిలిపివేశాయి ’’ అని కుమార్ సోమవారం అన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత వృద్ధి మందగించడానికి కారణం గురించి ప్రశ్నించినప్పుడు మందగమనానికి పాత రూ. 500, రూ.1000 నోట్ల రద్దు కారణం కాదని రాజన్ విధానాలే ఆ స్థితికి దారి తీశాయని ఆయన విమర్శించారు.

‘‘ఆర్థిక వ్యవస్థలో అప్పటికే క్షీణిస్తున్న ధోరణి ఉంది. వృద్ధి రేటు 2015-16 చివరి త్రైమాసికంలో  తగ్గిపోవడం ప్రారంభించింది. అది వరుసగా ఆరు త్రైమాసికాల పాటు క్షీణిస్తూ వచ్చింది’’  అని ఆయన అన్నారు. రెండో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ 2018-19 మొదటి త్రైమాసికంలో ప్రకటించిన ఫలితాలతో బ్యాంకిగ్ రంగంలో సంక్షోభం భయటపడింది. అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ. 940 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. పరిస్థితులు మెరుగుపడడానికి ముందు మరింత అధ్వానంగా పరిణమించవచ్చని భారతీయ రిజర్వు బ్యాంకు 2018 జూన్‌నాటి ‘ఆర్థిక స్థిరత్వ నివేదిక’లో వెల్లడించింది. ఆర్బీఐ స్థూలంగా మూడు రకాల స్థితులను అంచనా వేసింది. అన్ని పరిస్థితులు సద్దుమణిగితే ఎన్‌పీఏలు 12.2 శాతం వరకు పెరగొచ్చు. పరిస్థితులు దారుణంగా మారితే 13.3 శాతం వరకు ఉండొచ్చు. ‘‘ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమలకు రుణాలివ్వడం తగ్గిపోయింది. పెద్ద పరిశ్రమల వృద్ధి రేటు కూడా 2 నుంచి 1.5 శాతం వరకు తగ్గిపోవచ్చు. కొన్ని త్రైమాసికాల్లో వృద్ధి ప్రతికూలంగా కూడా ఉండొచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థలోనే తొలిసారి వాణిజ్య పరిశ్రమలు ఆస్తులు అమ్ముకుని రుణ భారాన్ని తగ్గించుకోవడం ఇప్పుడే అధికంగా ఉంది. వృద్ధి రేటు తగ్గడానికి ఇవే ప్రధాన కారణాలు. దీని వల్లే ప్రస్తుత ప్రభుత్వం మూలధన వ్యయాన్ని పెంపొందించింది’’ అని కుమార్ అన్నారు. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోని  14.4 శాతంగా ఉన్న పెట్టుబడుల వృద్ధి  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తగ్గి పెట్టుబడుల్లో వృద్ధి 10 శాతంగా నమోదైంది. ఆ పదవికి దరఖాస్తు చేసుకోవాలనుకోవడం లేదు

Updated By ManamThu, 05/17/2018 - 10:52

Raghu Ram Rajan  న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ గవర్నర్‌ పదవికి దరఖాస్తు చేసినట్లు ఇటీవల వార్తలు రాగా.. తాజాగా వాటిపై ఆయన స్పందించారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ ఉద్యోగానికి తాను దరఖాస్తు చేసుకోవాలని అనుకోవడం లేదని రాజన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం షికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చాలా హ్యాపీగా ఉన్నానని పేర్కొన్నారు.

ఇంకా చెప్పాలంటే తాను ప్రొఫెషనల్ సెంట్రల్ బ్యాంకర్‌ను కాదంటూ వ్యాఖ్యానించారు. అయితే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్‌గా మార్క్ కార్నీ పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ పదవికి రఘురామ్ రాజన్ దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటున్నారని ఇటీవల వార్తలు వెలువడ్డాయి.

 జైట్లీకి రఘురాం బడ్జెట్ టిప్

Updated By ManamWed, 01/24/2018 - 16:15
raghuram rajan

ఫిబ్రవరి 1న పార్లమెంటులో వార్షిక బడ్జెట్ సమర్పించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాయత్తమవుతున్నారు. బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దడంలో ఆయన నిమగ్నమై ఉన్నారు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ సర్కారు ప్రవేశపెట్టనున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్...విత్త మంత్రికి ఓ సలహా ఇచ్చారు. జైట్లీ ద్రవ్య లోటు పెరగకుండా చూస్తారని ఆశిస్తున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో అధికరం కొందరి దగ్గరే కేంద్రీకరణ కావడం సరైన పరిణామం కాదన్నారు. 

ఆధార్‌ను తప్పనిసరి చేయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆధార్ వివరాలు సురక్షితంగా ఉందన్న భరోసాను ప్రజల్లో కల్పించాలన్నారు. ఆధార్ గోప్యతకు సంబంధించిన హామీలు ఉల్లంఘనకు గురికావడం కాస్త ఆందోళన కలిగిస్తున్నట్లు చెప్పారు. ఆధార్‌ను ఎక్కడ వాడాలో? ఎక్కడ వాడకూడదో? ఓ సంస్థాగత వ్యవస్థ ఉండాలన్నారు.మరోసారా..? ఇష్టం లేదు!

Updated By ManamThu, 11/09/2017 - 14:11
  • కేజ్రీవాల్ ఆఫర్‌కు రఘురామ్ రాజన్ తిరస్కారం.. అధ్యాపక వృత్తికి మరోసారి బ్రేక్ ఇచ్చే ఉద్దేశం లేదు

  • ఆయన తరఫున షికాగో యూనివర్సిటీ ప్రకటన

Former RBI Governor Raghuram Rajan file photoన్యూఢిల్లీ, నవంబరు 9: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభ ఆఫర్‌ను ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తిరస్కరించారు. మరోసారి తన అధ్యాపక వృత్తి నుంచి బ్రేక్ తీసుకునే ఉద్దేశం తనకు లేదని ఆయన ప్రస్తుతం పనిచేస్తున్న షికాగో యూనివర్సిటీ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ‘‘భారత్‌లో ఎన్నో విద్యా సంబంధమైన కార్యకలాపాల్లో ప్రొఫెసర్ రఘురామ్ రాజన్ పాల్గొంటున్నారు. ఆయన షికాగో యూనివర్సిటీలో ఫుల్‌టైం లెక్చరర్‌గా విధులు నిర్వర్తిస్తు్న్నారు. ఆ బాధ్యతల నుంచి తప్పుకొనే ఆలోచన అయితే ఇప్పుడు ఆయనకు లేదు’’ అని షికాగో యూనివర్సిటీ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది. జనవరిలో ఏఏపీ (ఆమ్ ఆద్మీ పార్టీ)కి మూడు రాజ్యసభ సీట్లు వస్తాయని, అందులో ఒక స్థానాన్ని కేటాయిస్తామని రాజన్‌కు కేజ్రీవాల్ ఆఫర్ చేశారు. ఆ ఆఫర్‌ను తిరస్కరిస్తూ ఆయన తరఫున షికాగో యూనివర్సిటీ ప్రకటనను జారీ చేసింది. రఘురాం రాజన్‌కు కేజ్రీవాల్ ఆఫర్

Updated By ManamWed, 11/08/2017 - 16:51

Raghuram Rajanఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌ త్వరలో రాజ్యసభకు నామినేట్ కానున్నారు. రఘురాం రాజన్‌ను రాజ్యసభకు నామినేట్ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో ఢిల్లీలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీకానుండగా...వీటిలో ఒక స్థానాన్ని రఘురాం రాజన్‌తో భర్తీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

 

ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతల సమాచారంలో రఘురాం రాజన్ అభ్యర్థిత్వంపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ విషయంలో రఘురాం రాజన్ అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు లేఖ పంపగా...దీనిపై రఘురాం రాజన్ ఎలాంటి ప్రతి స్పందన తెలియజేయలేదని తెలుస్తోంది. వాస్తవానికి ఈ రాజ్యసభ సభ్యత్వాన్ని ఆప్ నేత కుమార్ విశ్వాస్ ఆశిస్తున్నారు. ఆయనకు చెక్ పెట్టే ఉద్దేశంతోనే రఘురాం రాజన్ పేరును ఆప్ అగ్రనాయకత్వం తెరమీదకు తెచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాలపై కుమార్ విశ్వాస్ ఎలా స్పందిస్తారో రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది. 

మన్మోహన్ సింగ్ హయాంలో ఆర్బీఐ గవర్నర్‌ పదవిలో మూడేళ్లు కొనసాగిన రఘురాం రాజన్, రెండోసారి పొడగింపు పొందాలని ఆకాంక్షించారు. అయితే మోదీ సర్కార్ ఆయనకు రెండోసారి అవకాశం కల్పించేందుకు నిరాకరించింది. ప్రస్తుతం ఆయన యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఈ యేడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి కోసం రఘురాం రాజన్ పేరును కూడా పరిశీలించినా...చివరకు అమెరికా ఆర్థికవేత్త రిచర్డ్ థాలెర్‌ను ఈ అవార్డు వరించింది.

Related News