tjac

కూటమిలో సీట్ల లొల్లి

Updated By ManamMon, 10/22/2018 - 07:16
 • టీజేఎస్‌కు గరిష్ఠంగా తొమ్మిది సీట్లు?

 • నేడో రేపో తేలనున్న సీట్ల సంఖ్య

 • పార్టీ శ్రేణుల్లో ఒకింత నిరాశ

 • నేడు టీజేఎస్ కీలక భేటీ

congressహైదరాబాద్: మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కిరాలేదు. కేసీఆర్‌ను గద్దె దించాలనే ఉద్ధేశంతో ఏర్పాటైన మహాకూటమి భాగస్వామ్య పార్టీ నేతల్లో గందరగోళం నెలకొంది. ఓవైపు అధికార పార్టీ టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుంటే.. మహాకూటమిలో మాత్రం ఇంకా సీట్లపైనే స్పష్టత రాలేదు. ప్రధానంగా కాంగ్రెస్, టీజేఎస్ మధ్యలో సీట్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా టీజేఎస్ 36 సీట్లను మొదట ఆశించి నప్పటికీ.. కేసీఆర్‌ను గద్దె దించాలనే లక్ష్యంతో సీట్ల సంఖ్యను తగ్గించుకునేందుకు సైతం కోదండరాం సిద్ధపడ్డారని తెలుస్తోంది. కానీ కాంగ్రెస్ మాత్రం చర్చల పేరుతో నాన్చుడుదోరణి వ్యవహరి స్తోంది. కొద్ది రోజుల క్రితం నగరంలోని ఓ హోటల్‌లో కాంగ్రెస్, టీజేఎస్ నేతలు జరిపిన భేటీ అసంపూర్తిగా ముగిసింది. ఈ సమావే శానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి రామచంద్ర కుంతియా, ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శి బోసు రాజు, ఇటు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, దిలీప్‌కుమార్ తదితరులు హాజరైన సంగతి తెలిసిందే. దాదాపు మూడు గంటల పాటు జరిగిన భేటీలో ప్రధానంగా సీట్ల సర్దుబాటుపైనే చర్చ జరిగింది. తమ పార్టీకి కనీసం 15-17 స్థానాలను ఖచ్చితంగా సరు ్దబాటు చేయాలని టీజేఎస్ నేతలు కోరినట్టు తెలుస్తోంది. అయితే గరిష్ఠంగా తొమ్మిది స్థానాలు కేటాయించేందుకు కాంగ్రెస్ సుముఖత తెలిపినట్టు సమాచారం. దాంతో పార్టీ కోర్ కమిటీలో చర్చించి సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని టీజేఎస్ నేతలు చర్చ లు ముగించినట్టు తెలుస్తోంది. ఇరు పార్టీల మధ్య సీట్ల సంఖ్య కొలిక్కి రావడానికి కేవలం మూడు నాలుగు సీట్లే అడ్డంకిగా ఉన్నా యి. ఒకట్రెండు రోజుల్లోనే మరోసారి సమావేశమై.. సీట్ల సంఖ్యపై తుది నిర్ణయం తీసుకోవాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి.

త్వరగా తేల్చండి..
పొత్తుల లెక్కలు సాధ్యమైనంత త్వరగా తేల్చాలనీ, ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక ఇప్పటికే కొలిక్కి వచ్చిన నేపథ్యంలో సీట్ల సంఖ్య, స్థానాల సర్దుబాటే ప్రధాన అజెండాగా ముందుకెళ్లాలని నిర ్ణయించాయి. అధికార టీఆర్‌ఎస్ ఇప్ప టికే ప్రచారం ప్రారంభించిన తరుణంలో ఇంకా సాగదీయడం సరికాదనే భావన మహా కూటమి భాగస్వామ్య పార్టీల్లో వ్యక్తమవుతోంది. ఇదిలావుంటే.. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం.. ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రచారానికే పరిమితం అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారం మహాకూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తోన్న కాంగ్రెస్ పార్టీ చేస్తోందన్న ఊహగానాలు లేకపోలేదు. దీనిపై కోదండరాం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోదండరాం ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పడంతో టీజేఎస్ పార్టీ శ్రేణుల్లో ఏర్పడిన గందరగోళం వీడిపోయిందనే చెప్పాలి.

16 సీట్లివ్వకుంటే.. టీజేఎస్ బయటికే..
మూడుసీట్లపై సీపీఐ సైతం అసంతృప్తి

మహాకూటమిలో సీట్ల పంచాయితీ ముదిరి పాకానపడింది. మహాకూటమి కొనసాగడంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.   సీట్ల పంపకాలపై తెలంగాణ జనసమితి ఆదియవారం వరకు గడువు విధించింది. కాంగ్రెస్ స్పష్టమైన నిర్ణయం ప్రకటించ కుంటే.. సోమవారం జరిగే కోర్ కమిటీ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంటామని టీజేఎస్ స్పష్టం చేసింది. మరోవైపు సీపీఐ సైతం మూడు సీట్లు ఇస్తే.. కూటమిలో కొనసాగడం ఎందుకని పార్టీ శ్రేణుల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో అధికార పక్షాన్ని ఢీకొట్టేందుకు ఏకమైన విపక్షాల మహాకూటమి చీలిక దిశగా వెళుతోంది. సీట్ల పంపకాలపై కాంగ్రెస్ నాన్చుడు ధోరణిపై భాగస్వామ్య పార్టీలు ఆగ్రహంతో ఉన్నాయి.  అటు పొత్తులపైనా తెలంగాణ జనసమితి కోర్ కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. మాజీ ఎమ్మెల్సీ దిలీప్, రచనారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 9 సీట్లకు ఒకే అనమని ఎవరు అన్నారని రచనా రెడ్డి నిలదీశారు. 16 సీట్లకు తక్కువ ఇస్తే కూటమిలో చేరాల్సిన అవసరం లేదని కోర్ కమిటీ సభ్యులు అన్నారు.ఈనెల 24న పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

సీపీఐది అదే పరిస్థితి..
మరోవైపు సీపీఐ కూడా కాంగ్రెస్ నేతల తీరుపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలు సీట్లపై ఎటూ తేల్చడం లేదని ఆగ్రహంగా ఉన్నారనే చర్చ సాగుతోంది. కూటమి కోసం మొదటి నుంచి ప్రయత్నాలు చేసిన సీపీఐ పార్టీలో మహాకూటమి పరిణామాలు చిచ్చురేపాయి. మగ్దూం భవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం వాడివేడిగా కొనసాగింది. ఈ సమావేశంలో మూడు సీట్లు తీసుకుని కూటమిలో కొనసాగడం ఎందుకని కొంతమంది సీనియర్లు ప్రశ్నించారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా ఆ మాత్రం సీట్లు గెలవలేమా అని ప్రశ్నిస్తున్నారు. సీపీఐకి బలం ఉన్న 25 స్థానాల్లో పోటీ చేద్దామని కొందరు నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మూడు సీట్లు ఇస్తే కూటమి నుంచి బయటకు రావడమే ఉత్తమం అని మెజార్టీ నేతలు అన్నట్టు సమాచారం. పోరుకు సమాయత్తం

Updated By ManamMon, 10/08/2018 - 00:01
 • రెండ్రోజుల్లో టీఆర్‌ఎస్ 14 మంది జాబితా

 • దూసుకుపోతున్నా పెంచిన కాంగ్రెస్

 • నమ్మినవారికే టీటీడీపీ టికెట్లు

 • గెలుపుమాదేనంటోన్న బీజేపీ

partyహైదరాబాద్: తెలంగాణలో అసలు సిసలు ఎన్నికల పోరుకు తెరలేచింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంలో రాష్ట్రం రణక్షేత్రాన్ని తలపిస్తోంది. పార్టీలన్నీ ఎన్నికల పోరుకు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్ 105 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచార సమరంలో దూసుకుపోతోంది. మొత్తం 119 నియోజకవర్గాలకు 105 మందిని ప్రకటించిన కేసీఆర్.. మరో 14 మందిని రెండ్రోజుల్లో ప్రకటించనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. దీనికితోడు టీఆర్‌ఎస్ అధినాయకత్వం ప్రజారంజక మేనిఫెస్టోను తయారుచేస్తోంది. టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలోని పలు కీలక అంశాలను కొన్నింటిని కేసీఆర్ లీకులు వదిలారు. 

అశీర్వాద సభల తో ప్రజల ముందుకు
టీఆర్‌ఎస్ ఎన్నికల వ్యూహాలను పకడ్బందీగా అమలు చేస్తూనే..  ప్రచారంలోనూ దూసుకు పోతున్నారు ఆ పార్టీ నేతలు. ప్రజా అశీర్వాద సభల పేరుతో అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు చేరువయ్యేందుకు కృషి చేస్తున్నారు. సభలతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. కేసీఆర్ ప్రసంగాల్లో కాస్త కరుకుదనాన్ని జోడించి గులాబీ కేడర్‌లో జోష్ నింపుతున్నారు. ఉద్యమకాలం నాటి ప్రసంగాలను మళ్లీ గుర్తుకు తెస్తూ సెంటిమెంట్ ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారు. ‘తెలంగాణపై పెత్తనం ఢిల్లీ, అమరావతిలో ఉండాలా?.. మన చేతిలో ఉండాలా?’ అంటూ సరికొత్త నినాదాన్ని అందుకున్నారు. టీడీపీ, కాంగ్రెస్ నాయకులే టార్గెట్‌గా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల నల్లగొండలో నిర్వహించిన ప్రజా అశీర్వాద సభ నాటి ప్రసంగం నుంచి కేసీఆర్ దాడి స్పష్టంగా కన్పిస్తోంది.

ప్రచారంలో దూకుడు పెంచిన కాంగ్రెస్
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కాంగ్రెస్ కూడా ప్రచారంలో దూకుడు పెంచింది. ఇప్పటికే ఎన్ని కలకు సంబంధించిన పలు కమిటీలను ప్రకటిం చిన కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులపై దృష్టి సారించింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డీకే అరుణ, భట్టి, రేవంత్‌రెడ్డి, జానారెడ్డి సహా నేతలంతా ఎన్నికల బాధ్యతలను భుజాలకెత్తుకున్నారు. 2014 ఎన్నికల్లో ఎన్నికల కంటే ముందే సీఎం సీటుపై యుద్ధాలు చేసుకున్న కాంగ్రెస్ నాయకులు.. ప్రస్తుతం గతాను భవంతో జాగ్రత్త పడుతున్నారు. అంతా కలిసి ఉన్నామన్న సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అధిష్టానం కూడా పదవులపై క్లారిటీ ఇవ్వడంతో ఎవరికి వారు ప్రచారంపైనే దృష్టి పెట్టారు. ఎన్నికల విషయంలో సీఈసీ నిర్ణయాన్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ స్వాగతించారు. డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామనే ధీమాను వ్యక్తం చేస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.

మహాకూటమి రూపంలో స్వీప్
మహాకూటమి ద్వారా అధికారంలోకి వస్తామన్న ధీమాలో కాంగ్రెస్ ఉంది. అందుకనుగుణంగానే మిత్రపక్షాలతో పట్టువి డుపులకు కూడా సిద్ధమం టోంది. టీడీపీకి దక్షిణ తెలంగా ణలో ఉన్న ఓటు బ్యాంకును అనుకూలంగా మలుచుకుని కూటమి రూపంలో స్వీప్ చేయాలని చూస్తోంది. అదే సమయంలో ఉత్తర తెలంగాణలో గట్టి పోటీ ఇచ్చి ఆశించిన సీట్లు సాధిస్తే అధికారం చేజిక్కించుకోవడం పెద్ద కష్టం కాదన్న వ్యూహంతో అడుగులు వేస్తోంది. ప్రయోగాలకు పోకుండా సర్వేల ద్వారా గుర్తించి గెలుపుగుర్రాలకే సీట్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇక నుంచి ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేసేందుకు అధిష్టానం పెద్దలు ఇక్కడే మకాం వేసే అవకాశం ఉంది.

ఎన్నికల క్షేత్రంలో టీడీపీ
షెడ్యూల్ విడుదలతో టీటీడీపీ సైతం ఎన్నికల క్షేత్రంలో దిగింది. మహా కూటమిలో కీలకంగా మారి ఇతర పార్టీలతో కూడా చర్చలు జరుపుతోంది. తమ అధినేత చంద్రబాబును విమ ర్శిస్తున్న కేసీఆర్ ఓటమే లక్ష్యంగా టీటీడీపీ తమ్ముళ్లు దూసుకుపోతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించడంతో పాటు పోత్తుల్లో వచ్చే సీట్లలో నామా నాగేశ్వరరావు, మండవ, రేవూరి, రావుల, కొత్తకోట, దేవేందర్‌గౌడ్, సండ్ర వెంకటవీరయ్య వంటి సీనియర్లను మాత్రమే రంగంలోకి దింపాలనుకుంటోంది. భవిష్యత్తులో పార్టీకి కట్టుబడి పని చేసే వారినే ఎంపిక చేయడంతో పాటు కేడర్‌కు మనోధైర్యం ఇచ్చే స్థాయి ఉన్న నేతలను ఆ పార్టీ నమ్ముకుంది.

ఒంటరి పోరుకు బీజేపీ..
ఇక తెలంగాణలో ఒంటిరి పోరుకు దిగిన బీజేపీ తమకున్న బలం తో అధికారంలోకి వస్తామని ధీమాగా ఉంది. తెలంగాణలో ప్రజలు మార్పును కోరుకుం టున్నారని, బీజేపీకి అధికారం కట్టబెడతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. త్వరలోనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్న వార్తలు విన్పిస్తున్నాయి. ఇప్పటికే పాలమూరులో అమిత్‌షా సమరశంఖం పూరించారు. త్వరలో కరీంనగర్‌లో మరో సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీ నాయకులు వ్యూహాలకు పదునుపెట్టారు. కేసీఆర్ పట్ల ఉన్న వ్యతిరేకత.. ఎంఐఎం పార్టీతో ఆయన బంధం బీజేపీ విజయానికి దోహదపడుతుందని బీజేపీ నాయకత్వం అశీస్తోంది. ఏదీ ఏమైనా మొత్తానికి తెలంగాణలో టీఆర్‌ఎస్ వర్సెస్ మహాకూటమి ఫైట్‌లో ఎవరు పంతం నెగ్గించు కుంటారో చూడాలి. అధికార పీఠంపై ప్రజలు ఎవరిని కూర్చోబెడతారో డిసెంబర్ 7న బ్యాలెట్ రూపంలో తీర్పు చెప్పనున్నారు.అమరుల ఆకాంక్షలే మా ఎజెండా

Updated By ManamTue, 10/02/2018 - 03:28
 • టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం

 • సిద్దిపేటలో అమరుల స్థూపానికి  నివాళ్లు

tjacసిద్దిపేట: ఎంతో మంది ఆత్మ బలిదానాలతో రాష్ట్రం ఏర్పడిందని, అమరుల ఆకాంక్ష నెరవేర్చడమే తెలంగాణ జన సమితి ప్రథమ కర్తవ్యమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. సోమవారం కరీంనగర్ వెళ్తూ సిద్దిపేటలోని అమరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం అక్కడికి వచ్చిన జన సమితి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రజల కనీస అవసరాలైన నీళ్లు, నిధులు, నియామకాలు అందించడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆత్మ బలిదానాలతో రాష్ట్రం ఏర్పడితే ఇప్పటికీ వారికి న్యాయం చేయలేదన్నారు. సీఎం కేసీఆర్ వేల కోట్లు వెచ్చించి ప్రగతి భవన్ నిర్మించుకున్నాడు తప్ప అమరులకు సృ్మతి చిహ్నం నిర్మించలేదన్నారు. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకుంటున్నారన్నారు. టీఆర్‌ఎస్ నియంతృత్వ, కుటుంబ అవినీతి పాలనను అంతం చేసేంత వరకు తెలంగాణ జన సమితి పోరాటం ఆపదన్నారు. కేసీఆర్ పథకాలన్నీ క మీషన్‌లమయం అయ్యాయని, కమీషన్ లేనిదే కేసీఆర్ పథకం లేదని ఎద్దేవ చేశారు. ఫామ్ హౌజ్‌కే పరిమితమైన సీఎంకు ప్రజా సమస్యలు ఎలా వినిపిస్తాయన్నారు. అంతేకాకుండా తాము అధికారంలోకి రాగానే అమరుల కుటుంబాలకు సహాయాన్ని అందించి సృ్మతి చిహ్నాన్ని నిర్మిస్తామని, ఉద్యమకారులకు తగిన గుర్తింపునిచ్చి ఆర్ధిక సహాయం అందిస్తామన్నారు. రాబోయే ప్రభుత్వంలో టీజేఎస్ కీలకంగా మారనుందని, భవిష్యత్ తెలంగాణకు మార్గదర్శకం చేస్తుందన్నారు. అలాగే పొత్తులలో సీట్లపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. అనంతరం పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ బైరి రమేష్, జిల్లా కన్వీనర్ ఎ. బాపురావు, జిల్లా కో ఆర్డినేటర్ తొడుపునూరి వెంకటేశం, టీజేఎస్ దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థి చిందం రాజ్‌కుమార్, రాష్ట్ర నాయకులు రతన్‌రావు, సర్ధార్ సలీమ్‌పాషా, మహిళా నాయకురాలు భవాని, జిల్లా కో కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.ఉద్యమకారులు, అమరుల ఆకాంక్ష సాధనే ధ్యేయం

Updated By ManamSat, 09/29/2018 - 23:09
 • అందరి ఆకాంక్షలు తీరేలా మేనిఫెస్టో

 • ఆదివారం సభకు అతిధిగా అజిత్ సింగ్

 • 10న వరంగల్ లో పోరుసభ

 • టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం

kodandaramహైదరాబాద్: ఉద్యమకారులు, అమర వీరుల ఆకాంక్ష సాధనే ద్యేయంగా గట్టి ముసాయిదా తయారుచేశామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. వాటి అమలు తీరుపై కూడా చర్చిస్తామని ఆయన అన్నారు. అమరుల అకాంక్షలే తమ ఎజెండాయన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ జన సమితి కార్యాలయంలో అ పార్టీ అధ్యక్షుడు కోదండరాం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈసందర్భంగా కోదండరాం పలు విషయాలను ప్రజలకు వివరించారు. అందరి ఆకాంక్షలు నెరవేరేలా తమ మేనిఫెస్టోలో అంశాలు చేర్చాలని తెలంగాణలోని యావత్ సమాజం, యువత, నిరుద్యోగులు, పలువురు మేధావులు కోరుతున్నారని కోదండరాం చెప్పారు. రెండు రోజుల్లో ఎజెండా తయారు చేస్తామని, త్వరలో కార్యచరణ కూడా ఉంటుందన్నారు. ఆదివారం సాయంత్రం మహబూబ్ నగర్ లో బహిరంగ సభకు అజిత్ సింగ్ ముఖ్య అతిధిగా వస్తున్నట్లు చెప్పారు. సోమవారం కరీంనగర్ లో ఉధ్యమ ఆకాంక్ష సాధన ధూంధాం నిర్వహించనున్నట్లు చెప్పారు. వచ్చె నెల 3న మెదక్ నుండి వరంగల్ కు వారం రోజుల పాటు పోరుయాత్ర నిర్వహిస్తామని పేర్కోన్నారు. 10న వరంగల్ లో పోరుసభ... నిరంకుశ పాలనపై పోరాటానికి నిదర్శనంగా సభ ఉంటుందన్నారు. మహా కూటమి పొత్తుల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మొదటి దశలో మేనిఫెస్టోపైనే చర్చించనుండగా, ఇక రెండవ దశలోనే సీట్లపై చర్చలు జరుగుతాయన్నారు. మరో కూటమిపై చర్చలు జరగలేదన్నారు. అన్ని ప్రజాసంఘాల కోరిక మేరకు, చాలా ముందే ఎన్నికలు వచ్చినందుకే ఈ ప్రక్రియ చేపట్టామన్నారు. బీజేపీతో చర్చలు జరుగుతున్నాయన్న వార్తలతో విశ్వసనీయత దెబ్బతింటుదని ఆయన చెప్పారు. బీజేపీతో కూడా తెలంగాణపై అభిప్రాయం పంచుకున్నామని కోదండరాం ఈ సందర్భంగా వెల్లడించారు. అసెంబ్లీ రద్దుకు ముందే ఈ విషయాలు మాట్లాడమన్నారు. ఆ తరువాత సంప్రదింపులు జరగలేదన్నారు.ఎన్నికల కమిషనర్ ను కలిసి తెలంగాణలో పరిస్థితులను వివరించామని ఆయన వివరించారు. మాపై అధికార పార్టి గోబెల్స్ ప్రచారం చేస్తోందని కోదండరాం ఆరొపించారు. భవిష్యత్ తెలంగాణ కోసమే మా ప్రయత్నమన్నారు. అందులో భాగంగానే తాము ఓ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. తన పోటీ ఎక్కడన్న దానిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. పోలీసులు కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారని కోదండరాం మండిపడ్డారు. చాలా మందిపై దాడులు చేయాలని ఐటీ, ఈడీలను కోరుతున్న ముఖ్యమంత్రి ఇంటిపైనా కేంద్రప్రభుత్వ దాడులు చేయిస్త్తే వారనుకున్న ఫలితం దొరుకుతుందని అన్నారు. తెలంగాణకు, కేంద్రానికి దిశానిర్దేశం చేసే సత్తా తమకే ఉందన్నారు.

టీజేఎస్ నేత..దిలీప్ 
పొత్తులపై చర్చలు తప్ప..సీట్లపై చర్చలు జరగలేదని టీజేఎస్ నేత..దిలీప్ పేర్కోన్నారు. నిరంకుశ నియంత్రణ పాలన రూపు మాపేందుకు కలిసి పోరాడుతామని ఆయన చెప్పారు. అ ఎజెండాను అన్ని పార్టీలు అంగీకరించా యన్నారు.ఉమ్మడి మేనిఫెస్టో రూపూదిద్దుకుంటుందని అమలుకు చైర్మన్‌గా కోదండరాం ఉండటానికి వారు అంగీరించారని దిలీప్ చెప్పారు.కూటమిలో సీట్ల కొట్లాట

Updated By ManamTue, 09/25/2018 - 23:55
 • టిక్కెటివ్వకుంటే స్వతంత్రంగా.. పోటీ చేస్తామంటూ బెదిరింపులు

 • పొత్తుంటే సర్దుబాటు చేయాలని డిమాండ్

 • 18 నుంచి 20 స్థానాల్లో ఇండిపెండెంట్ల ముప్పు

 • ఆశావహులతో మంతనాలు జరుపుతున్న పార్టీల పెద్దలు

partyహైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపునకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ తమతో  కలిసి వచ్చే పార్టీల తో మహాకూటమి ఏర్పాటు చేసింది. పోరులో బలమైన అభ్యర్థులను నిలిపి అధికార పార్టీ అభ్యర్థులపై పైచేయి సాధించేందుకు వ్యూహాలు రచిస్తుంది. అందులో భాగంగా ఆయా పార్టీలతో సీట్ల సర్దుబాటు ప్రక్రియను వేగవంతం చేసింది. 90 స్థానాల్లో తాను పోటీ చేసి మిగిలిన 29 సీట్లు మిత్ర పక్షాలకు ఇచ్చేందుకు ప్రతిపాదనలు చేసింది. ఆయా పక్షాల నేతలు కూడా ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే, కాంగ్రెస్‌లో కొం దరు సీనియర్ నాయకులు పొత్తులో తమ సీటును  వదలవద్దని, ఏవిధంగానైనా తనకు దక్కేలా చూడా లని పార్టీ పెద్దలను కోరుతున్నారు. బలంలేని పార్టీలకు ఇస్తే గెలిచే సీటు కోల్పోతామని సూచిస్తున్నారు. దీంతో కూటమి నేతలను సీట్ల సర్దుబాటు ఇబ్బం దులకు గురి చేస్తుంది. ఆశించే నాయకులకు ఈసారికి సర్దుకోవాలని, ప్రభుత్వం ఏర్పడితే  ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని, అర్హులుంటే మంత్రి పదవులు కూడా కట్టబెడుతామని చెప్పారు. వారిలో కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎవరెన్ని చెప్పినా పోటీలో నిలుస్తామని హెచ్చరిస్తున్నారు. ఈసమస్య దక్షిణ తెలంగాణలో ఎక్కువగా ఉండడంతో కాంగ్రెస్ పెద్దలు మధనపడుతున్నారు.

రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాలో ఉందంటున్నారు. కూటమి మిత్రులు కూడా ఈజిల్లాలోనే ఎక్కువగా కావాలని డిమాండ్ చేస్తున్నారు. టిడిపి గడిచిన ఎన్నికల్లో 15సీట్లు దక్కించుకోగా అందులో మెజార్టీ స్దానాలు గ్రేటర్ పరిధిలోనే 9 స్దానాలు తమ ఖాతాలో వేసుకుంది. వాటిని తమకే వదిలేయాలని హస్తం పార్టీని కోరుతుంది. శేరిలింగంపల్లి,కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఎల్‌బినగర్, కుత్చులాపూర్, .జూబ్లీహిల్స్, సనత్‌నగర్, కంటోన్మెంట్ స్దానాల్లో అభ్యర్దులను బరిలో దించుతామని చెబుతుంది. కూటమి నేతలు  మాత్రం కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, కంటోన్మెంట్, ఉప్పల్ స్దానాలను ఇచ్చేందుకు సిద్దమని చెప్పింది.అయితే ఇందులో శేరిలింగంపల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్, టిడిపి క్యాడర్ ఎప్పడో గులాబీ గూటికి వెళ్లిందని అక్కడ వారికి బలం లేదని,ఆసీట్లు తనకే ఇవ్వాలని,లేకుంటే ఎన్నికలో పోటీ చేస్తానని హెచ్చరిస్తున్నారు. అక్కడ టిడిపి తరుపున మువ్వా సత్యనారాయణ, మండవ వెంకటేశ్వరరావు పేర్లు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ కూడా దేశం పట్టుబడుతుంది,అక్కడ నుంచి దివంగత పిజేఆర్ తనయడు విష్ణువర్ధన్‌రెడ్డి తను బరిలో ఉంటానని, పొత్తులో కేటాయించవద్దని టిపిసిసి నాయకులను కోరారు.ఒకవేళ వెళ్లిన పోటీ చేయడం ఖాయమని సంకేతాలు పంపారు.కుత్బులాపూర్ లో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ తనదే సీట్లని, పొత్తులో పెట్టవద్దని, నియోజకవర్గంలో దేశంకు బలంలేదని శ్రేణులు ఎవరులేరని చెబుతున్నారు.కేటాయించకుంటే స్వతంత్ర అభ్యర్దిగా రంగంలో ఉంటున్నట్లు  తెలుస్తుంది.ఎల్‌బినగర్‌పై టిడిపి జిల్లా అధ్యక్షులు సామరంగారెడ్డి ఆశిస్తున్నారు.కానీ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సీటు తనకే దక్కాలని పార్టీ పెద్దలను కోరారు.టిడిపికి ఇస్తే పోటీలో ఉంటానని చెబుతున్నారు. సనత్‌నగర్‌పై సీనియర్ నాయకులు మర్రి శశిధర్‌రెడ్డి ఉన్నారు.దానిని కూడా తమకు కేటాయిస్తే కూన వెంకటేష్‌గౌడ్ నిలబెడుతామని సైకిల్ నేతలు కోరుతున్నారు. దానిపై కొంత సందిగ్దత నెలకొంది.

కంటోన్మెంట్  సీటు విషయంపై ఇరుపార్టీలు తమకేనంటూ ప్రతిపాదనలు పెడుతున్నారు. ఆనియోజకవర్గం ఎస్సీ సీటు కావడంతో టిడిపి నుంచి నగర అధ్యక్షులు ఎం.ఎన్.శ్రీనివాస్‌ను బరిలో టిడిపి నిలపేందుకు ప్లాన్ చేస్తుంది. కాంగ్రెస్ నుంచి సర్వేసత్యనారాయణ అల్లుడు శశాంక్ రేసులో ఉంటానని ప్రచారం చేసుకుంటున్నారు.మహేశ్వరం నుంచి బిసి నాయకులు చింతల సురేందర్ యాదవ్ నిలిపేందుకు టిడిపి సిద్దం చేస్తుంది.హస్తం పార్టీ నుంచి మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి ఆశిస్తున్నారు. మహబూబ్  నగర్ టిడిపి తరుపున ఎర్ర చంద్రశేఖర్ పేరు ప్రతిపాదిన ఉంది. కాంగ్రెస్ నుంచి ఇబ్రహిం తనకే వస్తుందని అనుచరులతో వెల్లడిస్తున్నారు. రాకుంటే  ఒంటరిగా నిలుస్తున్నానని వెల్లడిస్తున్నారు.నారాయణపేట కూడ ఇవ్వాలని దేశం నేతలు కోరగా, ఇటీవల టిఆర్‌ఎస్ నియోజకవర్గం ఇంచార్జీ శివకుమార్‌రెడ్డి,హస్తం జెండా కప్పుకున్నారు. ఆయనకే ఇచ్చే అవకాశం ఉంది. నల్లగొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గం సిపిఐకి కేటాయిస్తారని తెలియడంతో ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి పొత్తులో ఇవ్వవద్దని, తనకే కేటాయించాలని కోరడంతో పొత్తులో చేతికి రాలేదని తెలియడంతో పార్టీ పెద్దలపై విమర్శలు చేసి షోకాజ్ నోటీసులు అందుకున్నారు. ఇండిపిండెంట్‌గా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు.మరో నాయకురాలు పాల్వాయి స్రవంతి కూడా తాను ఉంటానని అనుచరులతో చెబుతున్నట్లు తెలుస్తుంది.దేవరకొండ సీటు కూడా కామ్రేడ్ల్లకు ఇవ్వవద్దని నియోజకవర్గ బాధ్యులు జగన్‌లాల్ నాయక్, బిల్యానాయక్ కోరుతున్నారు. వారికి ఇస్తే ఓటమి తప్పదంటున్నారు. తామే ఉంటామని పార్టీ పెద్దలకు దరఖాస్తు చేసుకున్నారు.సూర్యాపేటలో టిడిపి నాయకులు పటేల్ రమేష్‌రెడ్డి టికెటు ఇవ్వాలని బాబును కోరారు. అందుకు ఆయన  ఒకే చెప్పినట్లు సమాచారం. అక్కడ నుంచి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తనకే సీటు వస్తుందని, పొత్తు లో వెళ్లితే బరిలో తప్పదంటున్నారు.అలేరులో కాంగ్రెస్, టిడిపి మధ్య సయోధ్య కుద రడంలేదు. హస్తం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ తనదే సీటు నని ప్రచారం చేస్తున్నారు. టిడిపి నుంచి ఆపార్టీ మహిళ అధ్యక్షురాలు ఒండ్రు శోభ రాణి పోటీలో ఉంటానని చెబుతున్నారు. నర్సంపేట నియోజకవర్గం టిడిపి సీనియర్ నాయకుల రేవూరి ప్రకాష్‌రెడ్డి తానుసైతమంటూ అప్పడే ప్రచారానికి సిద్దమైయ్యారు. అటునుంచి తాజా మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మళ్లీ హస్తం పార్టీ పోటీ చేసి గెలుస్తుందని చెప్పుకొస్తున్నారు.

నిజామాబాద్ ఆర్మూర్ బరిలో విద్యార్ది సంఘం నాయకుడు రాజారాం యాదవ్ ప్రచారం రథం సిద్దం చేసుకుంటున్నారు.అక్కడ నుంచి ఇద్దరు హస్తం పార్టీ నేతల మధ్య పోరు పెరుగుతుంది. హుస్నాబాద్ సీటు సిపిఐ కేటాయించారని, చాడ వెంకట్‌రెడ్డి సమరంలో ఉంటారని సమాచారంతో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి అక్కడ కాంగ్రెస్ బలంగా ఉందని, వారికి మరో స్దానం కేటాయించాలని, లేకుంటే రెబెల్‌గా నిలిచేందుకు సిద్దమైతున్నారు. కూటమిలో తెలంగాణ సమితి పోటీ స్దానాలు ఎక్కువగా ఉత్తర తెలంగాణలో ఉండటంతో అక్కడ పెద్దగా ఇబ్బందులు లేవని కోదండరాం అనుచరులు పేర్కొంటున్నారు.టిడిపి,సిపిఐ పోటీ చేసే స్దానాల్లోనే తిరుగుబాట్ల బెదడ ఉన్నట్లు కూటమి పెద్దలు భావిస్తున్నారు. వారికి సర్దిచెప్పిన తరువాతే సీట్లు ప్రకటించాలని టిపిసిసి నాయకులను కోరుతు న్నారు. ఒకవేళ స్వతంత్రులు ఉంటే గులాబీ పార్టీ గెలుపును అడ్డుకోలేమని సూచిస్తున్నారు. ఒకరిపై ఒకరు పొటీ చేస్తే మిత్ర ధర్మం ఉండదని, అవగాహనతో ఎన్నికల్లోకి వెళ్లి అధికారం సాధించుకోవాలని పేర్కొనట్లు ఆయా పార్టీ శ్రేణులు వెల్లడిస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీ కూటమి నాయకులు అందజేసిన బాబితాలోని అభ్యర్దులపై సర్వే చేయించి,దానిని పలితాలు బట్టి సీట్లు అటూఇటూగా మారవచ్చని, సీట్ల సంఖ్య కూడా తగ్గవచ్చని చెబుతున్నారు.పంచాయతీ కార్మికులకు వామపక్షాల అండ

Updated By ManamThu, 08/23/2018 - 22:45
 • డిమాండ్లు నెరవేర్చకపోతే ఐక్యంగా ఉద్యమం

 • హెచ్చరించిన రాష్ట్ర పార్టీల నేతలు

jacహైదరాబాద్: గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకుండా విధుల్లో నుంచి తొలగిస్తామని వారిని హెచ్చరించడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. గురువారం, హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్ష పార్టీల నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కనీస వేతనం, ఉద్యోగ భద్రత కోసం 32 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తుంటే, కనీసం చర్చలకు కూడా పిలవకుండానే, వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరించడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని సీపీఎం నేత డీజీ నర్సింహరావు దుయ్యబట్టారు. గతంలో సమ్మె చేసినప్పుడు సీఎం కేసీఆర్, అప్పటి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చట్టబద్ధంగా సమ్మె చేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరికాదని ఆర్‌ఎస్పీ నేత జానకిరాములు అన్నారు. సమ్మె చేస్తున్న కార్మిక సంఘాల్లో టీఆర్‌ఎస్ అనుబంధ ట్రేడ్ యూనియన్ కూడా ఉన్నదని కేసీఆర్ గ్రహించాలని ఎంసీపీఐయూ నేత మద్దికాయల అశోక్ హితవు పలికారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సీపీఐఎంఎల్(ఎన్‌డీ) నేత ఎం.హన్మేశ్ విజ్ఞప్తి చేశారు. కర్ణాటక తరహాలో కార్మికుల వేతనాలకు రాష్ట్ర ప్రభుత్వమే గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవ్వాలని సీపీఐఎంఎల్(ఎన్‌డీ) నేత అచ్యుతరామారావు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వామపక్షాలన్నీ ఏకమై ఉద్యమిస్తామని ఎస్‌యూసీఐ నేత మురహరి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ నేత గుండా మల్లేశం తదితరులు పాల్గొన్నారు.టీజేఏసీలో కొత్త ఊపు

Updated By ManamSun, 07/29/2018 - 01:02
 • నేడు టీజాక్ ఆధ్వర్యంలో ఆల్ పార్టీ నేతల రౌండ్ టేబుల్ సమావేశం 

 • కోదండరాం లేని లోటు పూడుస్తానంటున్న చైర్మన్ రఘు

 • హజరుకానున్న వివిధ జాతీయ పార్టీలు, తెలంగాణ ఇంటి పార్టీల నేతలు

TJACహైదరాబాద్: తెలంగాణ జేఏసీ పేరు వినగానే ప్రత్యేక రాష్ట్రం కోసం చెమట చిందించిన  తెలంగాణ  ఉద్యమ నేతల ఉద్యమ జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఉద్యమ జ్ఙాపకాలను ఒక సారి గుర్తుకు తెచ్చుకుంటే...మలిదశ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నాటి ఉద్యమ వీరులను, వారు చేసిన ఉద్యమాలను గుర్తు చేసుకోకఉండలేము.  టీజే ఏసీ ఏర్పడ్డాక తెలంగాణలో ఒక సంఘానికి ఏర్పడిన బలం ఎంతో యావత్ దేశ ప్రజలకు దాన్ని చూసేలా చేసింది. అది ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సాధనలో జేఏసీతో ప్రత్యక్షంగా రుజువైంది.  తెలంగాణ రాకముందు మొదట టీఆర్‌ఎస్, తెలంగాణ జేఏసీ చెట్టాపట్టాలేసుకుని ఉద్యమంలో పనిచేశాయి. దీంతో నీతోడు నాకు.. నాతోడు నీకు అన్నట్లు ఉద్యమంలో జేఏసీతో టీఆర్‌ఎస్ మెలిగింది. తర్వాత తెలంగాణ కోసం జేఏసీ పోరాటంలో అగ్రభాగాన నిలిచింది. కొన్నిసార్లు కే సీఆర్‌తో కలిసి నడిచింది. మరికొన్ని సార్లు కేసిఆర్‌ను కాదని ఉద్యమాలు నిర్మించింది. అంతిమంగా తెలంగాణ వచ్చింది. అప్పటితో జేఏసీకి కష్టాలు మొదలయ్యాయి. జేఏసీ మనుగడ తమకు నష్టం కలిగిస్తుందన్న ఉద్దేశంతో పాలక పార్టీ దాన్ని చిన్నాభిన్నం చేసేందుకు ప్రయత్నించింది. జేఏసీలో ఉన్న ఉద్యోగ సంఘాలను బయటకు వెళ్ళగొట్టింది. చివరకు కోదండరాంతోపాటు కొన్ని కుల సంఘాలు, సామాజిక సంస్థలు మాత్రమే జేఏసీలో మిగిలాయి. అయినా కోదండరాం ఉన్నంతకాలం జేఏసీ చురుకుగా కొససాగుతునే ఉంది. కానీ, ఎప్పుడైతే కోదండరాం జేఏసీ ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగారో.. అప్పటి నుంచి జేఏసీ ప్రతిష్ట మసకబారిన వాతావరణం కనబడిందన్న ప్రచారం జరుగుతుండగా... ప్రస్తుత జేఏసీ ఛైర్మన్ రఘు ఈనెల 29న ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ‘‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లాభమా? నష్టమా?’’ అన్న అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఇలా రఘు సరి కొత్త వాదంతో జేఏసీని ముందుకు తీసుకుతెవడంతో.. తెలంగాణలోని అన్ని పార్టీల చూపును తనవైపుకు తిప్పారు. ఇలా ఒక్కసారిగా అందరి చూపు ఇప్పుడు జేఏసీపై పడింది. జేఏసీని రఘు ఎం చేస్తారూ ? కొత్త ఊపు తెస్తారా? అన్న మాటలకు ఆయన చెక్ పెట్టారు.
 
సుదీర్ఘ కాలం జేఏసీలో పనిచేసిన కోదండరాం తెలంగాణ జన సమితి పార్టీని అనౌన్స్ చేసిన తర్వాత జేఏసీ ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. దీంతో తాను లేకపోయినా జేఏసీ పనిచేస్తుందని ఆయన గతంలోనే ప్రకటించారు. అయితే జేఏసీకి తమ పార్టీ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక మే 13వ తేదీన జేఏసీకి కొత్త ఛైర్మన్‌గా.. విద్యుత్ జేఏసీ నేత రఘు అయ్యారు. మే 13 నుంచి రెండు నెలలు గడిచిన క్రమంలో ఇప్పటి వరకు జేఏసీ కేవలం ఒక చిన్న సదస్సు మాత్రమే జరిపింది. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఈనెల 14వ తేదీన ‘‘ఉద్యమ ఆకాంక్షలు.. వర్తమాన తెలంగాణ’’ అనే అంశంపై సదస్సు జరిపింది. దీనికి ప్రొఫెసర్ నాగేశ్వర్, ఎం వేణుగోపాల్ లాంటి వక్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా 28 జిల్లాల నుంచి జేఏసీ ప్రతినిధులు హాజరయ్యారు. ఆ సదస్సు తర్వాత జేఏసీ విస్తృత స్థాయి సమావేశం జరిపింది. జేఏసీని బలోపేతం చేయాలని అందరూ నిర్ణయించారు. అందులో భాగంగానే ఈనెల 29న ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ‘‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లాభమా? నష్టమా?’’ అన్న అంశంపై రౌండ్ టేబుల్  సమావేశం నిర్వహించబోతున్నారు. దీనికోసం గత రెండు నెలలుగా పెద్ద కసరత్తే జరిపినట్లు జేఏసీ ఛైర్మన్ రఘు తెలిపారు. సమావేశంలో 45 నిమిషాల పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై రెండు ప్రజెంటేషన్స్ ఉంటాయన్నారు. తర్వాత నిపుణులు, రాజకీయ నేతల ఇంటరాక్షన్ ఉంటుందన్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్,తెలంగాణ జన సమితి,  బీజేపీ,సీపీఐ,సీపీఎం, న్యూ డెమోక్రసి, టీడీపీ, తెలంగాణ ఇంటి పార్టీల నేతలను ఆహ్వానించినట్లు ఆయన చెప్పారు. ఏప్రిల్ 2న కోదండరాం కొత్త పార్టీ ప్రకటన!

Updated By ManamSat, 03/31/2018 - 16:56

Kodandaram, new party, TJAC, Kodandaram new partyహైదరాబాద్: తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) చైర్మన్ కోదండరాం నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావానికి రంగం సిద్ధమవుతోంది. టీజేఏసీ దరఖాస్తు చేసుకున్న తెలంగాణ జనసమితి పేరుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. అయితే, పార్టీ పేరు, జెండా, ఎజెండా ఏమిటి అనేది ఏప్రిల్ 2న కోదండరాం ప్రకటించనున్నారు. ఏప్రిల్ 4న పార్టీ పతాకం ఆవిష్కరించి, పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. కోదండరాం పెట్టబోయే కొత్త పార్టీ పేరు తెలంగాణ జనసమితిగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 29న భారీ బహిరంగ సభ ఏర్పాటుకు టీజేఏసీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్, ఎల్బీ స్టేడియంలలో ఎక్కడో ఒకచోట బహిరంగ సభ ఏర్పాటు చేసుకొనేందుకు అవకాశం ఇవ్వాలని పోలీసులను కోరారు. కోదంరాం కొత్త పార్టీ పతాకంలో తెలుపు, నీలం, పచ్చరంగులతో పాటు అమరవీరులు, కార్మికులు, రైతుల చిహ్నాలను ఉంచినట్టు సమాచారం.మిలియన్ మార్చ్ టెన్షన్..టెన్షన్...

Updated By ManamSat, 03/10/2018 - 10:06

Police-oppression-on-TJAC-Million-March-Meet-Hyderabad 2018

 •  ట్రాఫిక్ మళ్లింపు.. ట్యాంక్‌ బండ్‌ పరిసరాల్లో ఆంక్షలు

హైదరాబాద్: శనివారం టీ.జేఏసీ మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే జేఏసీ కోరిన అనుమతిని నగర పోలీసులు నిరాకరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, నగర పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అప్పర్ ట్యాంక్‌బండ్‌ను మూసివేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై నుంచి వచ్చిపోయే ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అశ్వక దళాలు, టియర్‌ గ్యాస్‌, వజ్ర వాహనాలు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.

ఇప్పటికే.. 350 ప్రత్యేక చెక్‌పోస్టులను పోలీసులు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం ట్యాంక్ బండ్పై పోలీసులు భారీగా మోహరించారు. సుమారు 12వేల మంది పోలీసులు మోహరించారు. మరోవైపు ట్యాంక్ బండ్కు సమీపంలో ఉన్న లుంబునీ పార్క్, ఎన్టీఆర్ పార్కు, సంజీవయ్య పార్కులను మూసివేశారు. ట్యాంక్ బండ్ పై ఎలాంటి సభలు.. సమావేశాలు నిర్వహించడానికి అనుమతి లేదని, ఏర్పాట్లు చేస్తే అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ట్యాంక్‌ బండ్‌కు వెళ్లే రహదారులు ముళ్లకంచెలతో మూసివేశారు. కాగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలువురు జేఏసీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో రూఫ్‌ టాప్‌ వాచ్ చేపట్టారు. ఇదిలా ఉంటే తార్నాకలోని కోదండరాం ఇంటి వద్ద భారీగా మఫ్టీ పోలీసులు మోహరించారు. ఓయూతో పాటు సున్నితమైన ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసుల మోహరించారు. 

సభ నిర్వహించి తీరుతాం..
ఎన్ని అడ్డంకులు ఎదురైనా స్ఫూర్తి సభను నిర్వహించి తీరుతామని కోదండరాం స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన.. 2011 మార్చి 10 న జరిగిన మిలియన్ మార్చ్ స్ఫూర్తిని గుర్తు చేసుకోవడానికే శనివారం ట్యాంక్ బండ్ పై స్ఫూర్తి సభ ఏర్పాటు చేశామన్నారు. అయితే స్ఫూర్తి సభకు పోలీసులు అనుమతులు నిరాకరించినప్పటికీ అడ్డుకుంటే నిరసన వ్యక్తం చేస్తామన్నారు. ఇవాళ మగ్ధూమ్ భవన్ నుంచి ట్యాంక్ బండ్‌కు ర్యాలీ నిర్వహిస్తామని.. అరెస్ట్‌లు ఆపకపోతే ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుందని జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు. అటు జేఏసీ నేతల సవాళ్లు.. ఇటు పోలీసుల హెచ్చరికలతో శనివారం ఏం జరగబోతోందా అని ఆసక్తి జనాల్లో నెలకొంది.

మిలియన్ మార్చ్ టెన్షన్..టెన్షన్...మార్చి 10న పార్టీ ఆవిర్భావం ?

Updated By ManamTue, 02/20/2018 - 05:04

kodandaramతెలంగాణ జేఏసీ చైర్మెన్ కోదండరామ్ నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడు పార్టీ ఆవిర్బావాన్ని చేపడతారనే విషయం ఉత్కంఠను రేపుతోంది. మార్చి 10 వ తేదీన పార్టీ ఆవిష్కరణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే రోజున కొత్త పార్టీ పేరును ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆదివారం హైదరాబాద్‌లోని జేఏసీ కార్యాలయంలో కోదండరామ్ ఆధ్వర్యంలో జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన అంశాలను చర్చించారు. ప్రత్యేకంగా కోదండరామ్ స్థాపించదలచిన పార్టీపైనే చర్చించినట్లు సమాచారం.

 
మలిదశ ఉద్యమ దిశను మార్చిన చారిత్రక మిలియన్ మార్చ్ జరిగిన మార్చ్ 10న కోదండరామ్ పార్టీ ఆవిష్కరణ చేపడితే బాగుంటుందని సమావేశంలో సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా  నుంచి సుమారు 15 వేల మందిని సమీకరించాలని పలువురు నాయకులు సూచించారు. ఇందుకోసం ప్రణాళికాబద్దంగా జిల్లాకో నాయకుడిని ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లో పార్టీ ఆవిర్భావ సమావేశం ఏర్పాటుపై కొందరు భిన్నాభిప్రాయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. వరంగల్ లో నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.  కోదండరామ్ అమెరికా  వెళ్లనున్న నేపథ్యంలో నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఈ నెలాఖరున తిరిగి రాగానే తుది నిర్ణయం చేయనున్నట్లు తెలుస్తోంది. మార్చి మొదటి వారంలో పూర్తి స్థాయి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.

Related News