whatsapp

తస్మాత్ జాగ్రత్త

Updated By ManamThu, 09/20/2018 - 00:55

imageనిజం చెప్పులు తొడిగేలోపులోనే అబద్ధం ఊరంతా చుట్టివస్తుందన్న ఆంగ్ల సామెత వాట్పాప్ పుణ్యమా అని నిజమవుతోంది. అనుమానం పెనుభూతమవుతోంది. పుకా ర్లు ప్రజల ప్రాణాల్ని హరించేస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవు తున్న తప్పుడు వార్తలు, పుకార్లు ప్రజల ప్రాణాలమీదకు వస్తున్నాయి. ఇటీవలె మహారాష్ట్ర, అసోమ్, జార్ఘండ్‌లలో అదే జరిగింది. పిల్లల్ని ఎత్తుకు పోతుపోయే ముఠా వచ్చింది అనే వాట్సాప్‌లో వచ్చిన వదంతిని నమ్మి ఐదుగురి ప్రాణాలను బలిపెట్టారు. చిత్రహింసలకు గురిచేసి చంపేశారు. పిల్లలను ఎత్తుకుళెతున్నారనే ఫేక్ వార్తల పుణ్యమా అని దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 29మంది చంపబడ్డారు. అంతేగాక గోమాంసం తరలిస్తున్నారనే అపవాదులను వాట్సాప్‌లో ప్రచారం చేయడం వల్ల ఎంతోమంది చంపబడుతున్నారు, దాడులు జరుగుతున్నాయి. 

సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పుకార్ల వల్ల జరిగే హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫల మవుతోందని విమర్శలు వస్తున్నాయి. వాట్సాప్ కంపెనీ కూడా ఫేక్ వార్తలు వైరల్ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం లేదు. విదేశీ కంపెనీ అయిన వాట్సాప్ కు కళ్లెం వేయడం ప్రభుత్వం చేతిలో లేదు. వాట్సాప్ డేటా సెంటర్, సర్వర్ అమె రికాలో ఉండటం వల్ల అక్కడి నుంచే మెసేజ్‌లు వైరల్ అవుతాయి. టెలీ కమ్యూని కేషన్ మంత్రిత్వ శాఖకు దీన్ని అదుపు చేయడం కష్టసాధ్యంగా మారింది. ఏ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారనే విషయాన్ని ట్రేస్ చేయడం కష్టసాధ్యమైన విషయం. వాట్సాప్ కంపెనీ కూడా ఈ మెసేజ్ లను కట్టడిచేయడం వీలుపడదు. ఎం దుకంటే వాట్సాప్‌లో మనం టైప్‌చేసి పంపే సందేశాన్ని సర్వర్ అంకెల్లో మార్చు కుని చేర్చాల్సిన వారికి మూల భాషలో పంపుతుంది. ఒక యూజర్ మరో యూజర్‌కు ఏం సందేశం పంపారో తెలుసుకోవడం కష్టసాధ్యమే. మనం వాట్సాప్ లో టైప్ చేసే మెసేజ్ వాట్సాప్ సర్వర్ దాన్ని అంకెల్లో మార్చుకుంటుంది. అక్కడి నుంచి ఎవరికైతే పంపాలో తిరిగి వాళ్లకు ఏ భాషలో రాశామో ఆ భాషలో కన్వర్ట్ అయి చేరుతుంది. మనం మన స్మార్ట్ ఫోన్ ద్వారా ఏదైనా  వాట్సాప్ మెసేజ్ పంపగానే సింగల్ టిక్ వస్తుంది. అంటే మనం పంపిన మెసేజ్ సర్వర్ దాకా చేరిందని అర్థం. ఒకవేళ రెండు టిక్‌లు వస్తే ఎవరికైతే మనం పంపాలనుకున్నామో వారిదాకా చేరిందని అర్థం. ఒకవేళ రెండు టిక్‌లు నీలం రంగులో మారితే మనం పంపిన మెసేజ్ వాళ్లు చది వారని, చూశారని అర్థం. ఆ మరుక్షణమే వాట్సాప్ తన సర్వర్ నుంచి ఆ మెసేజ్‌ను చెరిపేస్తుంది. సర్వర్ దగ్గర వాట్సాప్ మెసేజ్ లు భద్రపరిచే సౌలభ్యం లేదు.

వాట్సాప్ వదంతుల వల్ల జరిగే ప్రాణనష్టం నేపథ్యంలో కంపెనీ ఈ విష యంలో పునరాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కూడా సోషల్ మీడియాలో వదంతులు, విద్వేషాన్ని రెచ్చగొట్టే సందేశాలు, వీడియోలు షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరిక జారీచేసింది. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ప్రామా ణికం కాదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఏదైనా వదంతి కానీ, వివాదాస్పద వీడియో కానీ షేర్ అవుతున్నట్లు తెలిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ ఇటీవలె ప్రకటించారు. మనవంతు బాధ్యతగా వాట్సాప్, ఫేస్‌బుక్‌లో వచ్చే వదంతులకు అడ్డుకట్ట వేయకపోతే పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదమూ లేకపోలేదు. అనుమానపు బూచితో ప్రజలు చంపబడు తున్నా మనకెందుకులే అని చేతులు కట్టుకుని కూర్చుంటే రేపటి రోజు మన వాళ్లకూ ఆ దుర్ఘతి పట్టవచ్చు.  మన సంబంధీకులు అనుమానం బూచికి బలి కావచ్చు. అసోమ్‌లోనూ ఇలాగే జరిగింది.  అపరిచితులంటూ ఇద్దరు యువకులను చితకబాది చంపేశారు. తామిక్కడి వారిమేనని, తమ ఇంటివారితో మాట్లాడాలని ఎంతగా ప్రాథేయపడినా గుంపు కనికరించలేదు. వాళ్లమాటను అస్సలు పట్టించుకోకుండా రక్తసిక్తమయ్యేలా చావబాదారు. సోషల్ మీడియాలో వచ్చే వాటికి స్పందించే ముందు, వాటిని షేర్ చేసేముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి. ఇలాంటి వదంతులు వ్యాపించకుండా మనవంతుగా ప్రయత్నిద్దాం. వదంతుల్ని, పుకార్లను వైరల్ కాకుండా  ప్రతీ ఒక్కరూ బాధ్యతగా స్మార్ట్ ఫోన్ వాడుకుందాం. 

- ముహమ్మద్ ముజాహిద్వాట్సాప్‌లో వీడియో గేమ్.. తుపాకీతో కాల్చుకుని మృతి

Updated By ManamTue, 09/11/2018 - 22:22

girl shootsభోపాల్: మధ్యప్రదేశ్‌లో మాజీ పోలీస్ అధికారి కుమార్తె రష్యన్ రౌలెట్ ఆడుతూ తుపాకీతో కాల్చుకుని మరణించింది.  ఢిల్లీలోని తన ఫ్రెండ్ నజ్మాతో వాట్సప్ లైవ్ వీడియో చాట్‌లో కరిష్మా యాదవ్ అనే 21 ఏళ్ల యువతి రష్యన్ రౌలట్ అనే ప్రమాదకరమైన ఆట ఆడినట్టు అధికారులు వెల్లడించారు. మార్కెట్‌కు వెళ్లిన కరిష్మా సోదరుడు ఇంటికి తిరిగి రాగా రక్తపు మడుగులో ఉన్న చెల్లిని చూసి ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమె మరణించింది. ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తుండగా తాము వాట్సప్ లైవ్‌లో చాట్ చేసుకుంటూ ఆట ఆడిన తీరును పోలీసులకు నజ్మా వివరించింది. గ్వాలియర్ నగరంలో ఉంటున్న కరిష్మా శుక్రవారం తన స్నేహితురాలితో ‘‘నేను నా లక్‌ను టెస్ట్ చేసుకుంటానని నాకు రివాల్వర్ చూపింది..ఈ రివాల్వర్‌లో కేవలం ఒకే బులెట్ ఉంటుంది, ఆ బులెట్ ఎక్కడుందో నాకు తెలియదు అంటూ తన చెవులకు ఆనించుకుని తుపాకీని ఎక్కుపెడుతూ చూద్దాం నా నొసట ఏం రాసుందో? చావా? బతుకా చూద్దాం అంటూ కాల్చుకుంది..అంతే కాల్ డిస్‌కనెక్ట్ అయిపోయింది..బహుశా అప్పుడే ఆమె కణతిలోకి బుల్లెట్ దూసుకెళ్లి ఉండవచ్చు’’ అంటూ నజ్మా పోలీసులకు వివరించింది.  రివాల్వర్‌లో కేవలం ఒకే ఒక బుల్లెట్ నింపి, చాంబర్‌ను స్పిన్ చేసి, ఇదే రివాల్వర్‌ను తలకు ఆనించుకుని ట్రిగ్గర్‌ను లాగి ఆడే ఆటను రష్యన్ రౌలట్ అంటారు. అదృష్టాన్ని పరీక్షించుకునే ఆటగా పేరుగాంచిన ప్రాణాంతక ఆటైన రష్యన్ రౌలట్  క్రేజీ గేమ్‌గా ఎంతో మంది ప్రాణాలు బలికొంటోంది. పార్టీ టికెట్ కావాలా  బాబూ...?

Updated By ManamMon, 09/03/2018 - 14:46
 • పార్టీ టికెట్ కావాలంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాల్సిందే..

 • ఫేస్‌బుక్‌లో 15,000 లైకులు, ట్విట్టర్‌లో 5000 మంది ఫాలోవర్లు తప్పనిసరి

 • తాజా నిబంధనతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ టికెట్ ఆశావాహులకు షాక్..

 • ‘సైబర్ వారియర్స్’ వర్సెస్ ‘రాజీవ్ కే సిపాయి’

Congress Tickets to go to Leaders Most Active on Social Media in madhya pradesh assembly ticket

భోపాల్ : ప్రస్తుత కాలంలో బిజినెస్‌లోనే కాదూ... పొలిటిక్స్‌లోనూ సోషల్ మీడియా పాత్ర కీలకంగా మారింది. తమ ప్రొడక్ట్‌ను సోషల్ మీడియాలో ఎలా మార్కెటింగ్ చేసుకుంటున్నారో... గత కొంతకాలంగా... రాజకీయ పార్టీలు కూడా తమకు అందుబాటులో ఉన్నంతవరకూ టెక్నాలజీని వాడుకుంటున్నాయి.

దీంతో ఉద్యోగం పొందేందుకు అర్హత ఎలా ఉండాలో రాబోయే ఎన్నికల్లో  పార్టీ టికెట్ ఆశించవారికి తప్పనిసరిగా సోషల్ మీడియాలో కొన్ని  అర్హతలు ఉండాల్సిందేనట... అది కూడా ఫేస్‌బుక్‌లో లైక్స్, ట్విట్టర్‌లో ఫాలోవర్స్, వాట్సాప్‌లో పెద్ద ఎత్తున గ్రూప్స్ ఉంటేనే సుమా.... పార్టీ టికెట్ కన్‌ఫర్మ్ అయ్యేంది. ఈ మేరకు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ  (ఎంపీసీసీ) పెట్టిన కొత్త రూల్... ఆశావాహులకు ఊహించని ఝలక్‌గా చెప్పుకోవచ్చు.

అంతేకాదు...సోషల్‌ మీడియాలో భారీగా ఫాలోవర్లు ఉన్నవారికే టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం... పార్టీ నేతలకు స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అభ్యర్థులకు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో తప్పనిసరిగా అకౌంట్స్ ఉండాల్సిందేనని పేర్కొంది. అలా అని సోషల్ మీడియాలో అకౌంట్ ఉంటే సరిపోదూ... అందుకు తగ్గట్టుగా లైక్స్, ఫాలోవర్స్‌ కూడా ఉండి తీరాల్సిందేనని రూల్స్ పెట్టింది. దీంతో  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న ఆశావాహులకు తాజా కండిషన్‌ ఊహించని షాక్ అనే చెప్పవచ్చు. 

ఫేస్‌బుక్‌లో కనీసం 15,000 లైకులు, ట్విట్టర్‌లో 5000 మంది ఫాలోవర్లు, పెద్ద సంఖ్యలో వాట్సాప్‌ గ్రూపుల్లో ఉండాలని నిబంధనలు విధించింది.  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారంతా ఈనెల 15లోగా వారి సోషల్‌ మీడియా ఖాతాల వివరాలను పార్టీకి సమర్పించాలని సూచించింది. పనిలో పనిగా మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ పోస్టులను రీట్వీట్‌ చేయాలని, లైక్‌ కొట్టాలని, పార్టీ అధికారిక పేజీల్లో పోస్టులను తమ పేజీల్లో షేర్‌ చేయాలని పేర్కొంది.

‘సైబర్ వారియర్స్’ వర్సెస్ ‘రాజీవ్ కే సిపాయి’
మరోవైపు రానున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నెటిజన్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్‌, బీజేపీ శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు అధికార బీజేపీ, ప్రతిపక్షం కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని ఇప్పటి నుంచే హోరెత్తిస్తున్నాయి.

బీజేపీ ‘సైబర్ వారియర్స్’ అంటూ దూసుకువెళుతుంటే... అందుకు దీటుగా ‘రాజీవ్ కే సిపాయి’ అంటూ కాంగ్రెస్ పోటీ పడుతోంది. డిజిటల్‌ ప్రచారం కోసం  రెండు పార్టీలు ...ప్రత్యేకంగా ఇందుకోసం పెద్ద ఎత్తున సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నాయి. ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ యువ ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయి.వాట్సాప్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

Updated By ManamMon, 08/27/2018 - 12:00
supreme court

న్యూఢిల్లీ: సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. కాగా భారత్‌లో ఫిర్యాదుల సేకరణ కోసం ఓ ప్రత్యేక అధికారిని నియమించకపోడంపై వాట్సాప్ సంస్థకు న్యాయస్థానం ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. ఇందుకు సంబంధించి నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కాగా వాట్సాప్ మెసేజింగ్ సేవల దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తమవుతుండటంతో ఆ సంస్థకు ఇప్పటికే  కేంద్ర ఐటీ శాఖ రెండుసార్లు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

కాగా ఇటీవల వాట్సాప్ సీఈవో క్రిస్ డేనియల్ భారత్ పర్యటన సందర్భంగా కేంద్ర ఐటీ శాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఫేక్ న్యూస్ నియంత్రణ బాధ్యతను వాట్సాప్‌పై పెట్టడంతో పాటు, ఈ సమస్యకు పరిష్కరం చూపాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని కేంద్రం తరపున మంత్రి రవిశంకర్ స్పష్టం చేశారు.

supreme court

అలాగే వాట్సాప్‌కు భారత్‌లో ఓ కార్యాలయం ఏర్పాటు చేసి భారతీయ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని, అంతేకాకుండా ఫిర్యాదుల స్వీకరణకు ఓ గ్రీవెన్స్ అధికారిని నియమించాలని ఆయన ఈ సందర్భంగా వాట్సాప్ సీఈవోకు సూచించారు.  అయితే దీనిపై ఇప్పటివరకూ వాట్సాప్ సంస్థ స్పందించకపోవడంతో కేంద్రం ..ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.వాట్సాప్ సీఈవోతో రవిశంకర్ ప్రసాద్ భేటీ

Updated By ManamTue, 08/21/2018 - 15:02
WhatsApp

న్యూఢిల్లీ : వాట్సాప్‌కు భారత ప్రభుత్వం మరోసారి వార్నింగ్ ఇచ్చింది. ఫేక్ న్యూస్‌ను అడ్డుకట్ట వేసేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కేంద్ర న్యాయ, సమాచార శాఖ మంత్రి  రవిశంకర్ ప్రసాద్‌తో వాట్సప్ సంస్థ సీఈవో క్రిస్ డేనియల్ మంగళవారం భేటీ అయ్యారు. వాట్సాప్‌లో ఫేక్ న్యూస్ ప్రచారంపై ఈ సమావేశంలో చర్చించారు. నకిలీ వార్తలను అడ్డుకట్ట వేయడానికి కేంద్రమంత్రి ప్రధానంగా మూడు అంశాలను పేర్కొన్నారు.

అలాగే భారతీ చట్టాల ప్రకారం సోషల్ మీడియా నడుచుకోవాలని రవిశంకర్ ప్రసాద్ ఈ సందర్భంగా వాట్సాప్ సీఈవోకు స్పష్టం చేశారు. ఫేక్ న్యూస్‌ను ట్రాక్ చేసేందుకు ఓ సాంకేతిక పరిష్కారం చూపించాలని, అలాగే భారత్‌లో జవాబుదారిగా వాట్సాప్ సంస్థకు చెందిన ఓ అధికారి ప్రత్యేకంగా ఉండాలని ఉండాలని సూచించారు. 

మూడు ప్రధాన అంశాలు..
1. భారత్‌లో ప్రత్యేకంగా వాట్సాప్  ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక అధికారిని నియమించడం.
2. భారత చట్టాలకు అనుగుణంగా వాట్సాప్‌ నడుచుకోవడం. 
3. ఫేక్ న్యూస్ ట్రాక్ చేసేందుకు మరింతగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించేలా చేయడం

భేటీ అనంతరం రవిశంకర్ ప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ...ఓవైపు వాట్సాప్‌తో ఉపయోగాలతో పాటు, మరోవైపు నకిలీ వార్తల బెదడ వల్ల నేరాలు కూడా పెరిగిపోతున్నాయన్నారు. విద్య, ఆరోగ్యం, కేరళకు సాయం విషయంలో వాట్సాప్ భాగస్వామ్యాన్ని అభినందించిన ఆయన...ఫేక్ న్యూస్ వల్ల దాడులు, ప్రతికారాలకు వాట్సాప్ కారణం అవుతోందన్నారు.

ఇది భారతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. కాగా  ఫేక్‌న్యూస్‌కు చెక్ పెట్టడానికి ఫార్వర్డెడ్ మెసేజ్ లేబుల్‌తోపాటు ఇలాంటి మెసేజ్‌లను ఐదుగురి కంటే ఎక్కువమందికి ఫార్వర్డ్ చేయకుండా పరిమితి విధించిన విషయం తెలిసిందే.ఆండ్రాయిడ్ యూజర్లకు ఓ గుడ్‌న్యూస్, ఓ బ్యాడ్‌న్యూస్

Updated By ManamFri, 08/17/2018 - 12:23

whats appమెసేజింగ్ యాప్‌లలో దూసుకుపోతున్న వాట్సాప్, సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌తో జతకట్టింది. దీంతో ఆండ్రాయిడ్‌ యూజర్లకు ఒక గుడ్‌న్యూస్‌, మరో బ్యాడ్‌న్యూస్‌ రాబోతున్నాయి. అందులో గుడ్‌న్యూస్ ఏంటంటే.. గూగుల్‌ డ్రైవ్‌ స్టోరేజ్‌లో మీ వాట్సాప్‌ డేటా స్టోరేజ్‌ స్పేస్‌ను కౌంట్‌ చేయరని వాట్సాప్‌ తెలిపింది. 

ఇక బ్యాడ్‌న్యూస్‌ ఏమిటంటే.. ఏడాది కంటే ఎక్కువ కాలం పాటు గూగుల్‌ డ్రైవ్‌ అప్‌డేట్‌ చేయకపోతే మాత్రం, వాట్సాప్‌ బ్యాకప్‌లన్నీ ఆటోమేటిక్‌గా తొలగించబడనున్నట్లు తెలిపింది. ‘‘ఆటో-డిలీట్‌ ఆప్షన్‌ నవంబర్‌ 12 నుంచి అందుబాటులోకి వస్తుంది. మాన్యువల్‌ బ్యాకప్‌ ద్వారానే మీ ఫైల్స్‌ను, మెసేజ్‌లను సురక్షితంగా ఉంచుకోవాలి. మీ చాట్స్‌ను అక్టోబర్‌ 30 లోపే మాన్యువల్‌ బ్యాకప్‌ చేసుకోవాలి’’ అని ఎక్స్‌డీఏ డెవలపర్స్‌ యూజర్లకు సూచించింది.

ఇందుకోసం ‘‘సెట్టింగ్స్‌కు వెళ్లి, చాట్‌, చాట్‌బ్యాకప్‌ను క్లిక్‌ చేయాలి. ఆండ్రాయిడ్‌ యూజర్లు తమ ఫోన్‌ను మార్చినప్పుడు, కొత్త ఫోన్‌లో వాట్సాప్‌ను సెట్టింగ్‌ చేసుకోవడంతో పాటు పాత ఫోన్‌లోని చాట్లను బ్యాకప్‌ చేసుకోవచ్చు. కొత్త ఫోన్‌కు చాట్‌ డేటా అంతా ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. ఈ విషయాలపై ఇప్పటికే గూగుల్‌.. గూగుల్‌ డ్రైవ్‌కు వాట్సాప్‌ అకౌంట్లతో లింక్‌ అయి ఉన్న ఖాతాదారులందరికీ సమాచారం అందజేస్తుంది.  అయితే యూజర్లెప్పుడూ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. గూగుల్‌ డ్రైవ్‌లో స్టోర్‌ చేసుకునే వాట్సాప్‌ చాట్‌లు, మెసేజ్‌లు ఎండ్‌-టూ-ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌ కాదు’’ అంటూ పేర్కొంది.వాట్సప్‌లో ‘మోమో’ చాలెంజ్

Updated By ManamTue, 08/07/2018 - 16:17
 • మరో బ్లూవేల్ చాలెంజ్

 • వాట్సప్‌లో వస్తున్న మోమో చాలెంజ్

 • తల్లిదండ్రులూ.. అప్రమత్తం

 • శిల్పం బొమ్మతో చాలెంజ్

 • జాగ్రత్తగా ఉండాలి: నిపుణులు

After Blue Whale Challenge, is Momo Challenge

లండన్ : నిన్న మొన్నటి వరకు హల్‌చల్ చేసిన బ్లూవేల్ చాలెంజ్ లాగే ఇప్పుడు మరో కొత్త చాలెంజ్ టీ నేజర్లను ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహిస్తోంది. ఈ సరికొత్త మోమో చాలెంజ్ వాట్సాప్ ద్వారా వ్యాపిస్తోంది. వాట్సాప్‌లో ముందుగా ఓ శిల్పం బొమ్మ వస్తుందని, అందులో పలు చాలెంజిలు వస్తాయని చెబుతున్నారు. క్రమంగా అవి అందుకున్నవారి జీవితాలు ప్రమాదంలో పడతాయి. అచ్చం బ్లూవేల్ చాలెంజ్‌లాగే చాలా తీవ్రమైన ప్రవర్తన రూపంలో ఈ చాలెంజలు వస్తాయి.

ఏంటీ మోమో..?
వాట్సాప్‌లో ఓ శిల్పం బొమ్మ వస్తుంది. దాన్ని జపాన్‌కు చెందిన కళాకారుడు మిదొరి హయాషి తయారు చేశాడని అంటున్నారు. అయితే ఆ శిల్పానికి గానీ, ఈ కళాకారుడికి గానీ గేమ్‌తో సంబంధం లేదు. టోక్యోలోని వెనీలా గ్యాలరీలో ఉన్న ‘మదర్ బర్డ్’ శిల్పం ఫొటోనే ఇలా బయటకు వస్తోంది. దాంతోపాటు కొన్ని భయంకరమైన కళారూపాలు కూడా వస్తాయి. అర్జెంటీనాలో 12 ఏళ్ల అమ్మాయి ఈ చాలెంజ్ వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు బ్యూనస్ ఏర్స్ టైమ్స్ తెలిపింది. దాంతో ఆమెకు ఈ మెసేజిలు పంపింది ఎవరో తెలుసుకోడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. స్పెయిన్ పోలీసులు కూడా మోమో చాలెంజితో జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు.

నిజమేనా.. ఉత్తదా?
వాస్తవానికి మోమో చాలెంజ్ అనేదాన్ని కొంతమంది సైబర్ నేరస్తులు వాడతారని, యూజర్ల సమాచారాన్ని దీనిసాయంతో వాళ్లు తస్కరిస్తారని నిపుణులు అంటున్నారు. ఈ గేమ్ ఇప్పటికి ఎంతవరకు వ్యాపించిందో తెలియదు గానీ, యువతలో మాత్రం ఆత్మహత్యకు ప్రేరేపించేలాగే ఉంటుందని తెలుస్తోంది. ఇలాంటి పనికిమాలిన చాలెంజిల విషయంలో అప్రమత్తంగా ఉండాలని యువతతో పాటు తల్లిదండ్రులను కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ఉచ్చులో పడొద్దని చెబుతున్నారు. వాట్సాప్ గ్రూపు కాలింగ్ ఫీచర్ రెడీ..

Updated By ManamTue, 07/31/2018 - 18:25
 • వాట్సాప్ గ్రూపులో వీడియో-ఆడియో కాలింగ్‌ ఫీచర్

 • ఐఓఎస్, ఆండ్రియాడ్ ఫోన్లలో వేగంగా పనిచేసే కొత్త ఫీచర్

 • గ్రూపు కాలింగ్‌లో ఒకేసారి నలుగురు గ్రూపు సభ్యులకు పరిమితి

WhatsApp, Group Video, Voice Calling Feature, Android, iOS Usersప్రముఖ మెసేంజర్ దిగ్గజం వాట్సాప్ ప్రవేశపెట్టిన గ్రూపు (వాయిస్ & వీడియో) కాలింగ్ ఫీచర్ ఎట్టకేలకు లైవ్‌లోకి వచ్చేసింది. గత ఏడాది అక్టోబర్ నెలలో తొలిసారి ఈ గ్రూప్ కాలింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన ఫేస్‌బుక్ అనుబంధ మెసేజింగ్ సంస్థ యాప్‌.. ఈ ఏడాది మేలో జరిగిన వార్షిక ఎఫ్8 డెవలపర్ కాన్ఫిరేషన్‌లో అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త వాట్సాప్ గ్రూపు కాలింగ్ ఫీచర్‌ ప్రపంచంలోని అన్ని ఆండ్రియాడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చేసింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా గ్రూపులోని సభ్యుల్లో నలుగురు మాత్రమే ఒకేసారి గ్రూపు కాల్ మాట్లాడే అవకాశం ఉంది. రోజుకు 2 బిలియన్ల నిమిషాల పాటు వినియోగదారులు వాట్సాప్‌తో సమయాన్ని గడుపుతున్నారని, గ్రూపు వీడియో కాల్స్ ద్వారా వినియోగదారులకు మరింత చేరువయ్యే అవకాశం ఉందని వాట్సాప్ దిగ్గజం పేర్కొంది. 2016 నుంచి వాట్సాప్‌లో వీడియో కాల్స్‌ను అనుమతిస్తోంది. కానీ, ఇప్పటివరకూ ఆండ్రియాడ్, ఐఓఎస్ ఫోన్‌లో పనిచేసే గ్రూపు వీడియో కాల్‌లో ఇద్దరు సభ్యులకు మాత్రమే పరిమితి విధించగా అదికాస్తా నలుగురు సభ్యుల వరకు పరిమితి పెంచుతున్నట్టు వాట్సాప్ వెల్లడించింది. ఈ సరికొత్త వీడియో కాలింగ్ ఫీచర్ నెమ్మదిగా పనిచేసే నెట్‌వర్క్‌లపై కూడా వేగంగా పనిచేసేలా రూపొందించినట్టు తెలిపింది. అంతేకాక, ఆడియో, వీడియో కాలింగ్‌ను సెక్యూరిటీ పరంగా చాటింగ్ తరహాలో ఎన్డ్ టూ ఎన్డ్ ఎన్‌క్రిప్టిట్‌గా చేసినట్టు వెల్లడించింది. 

గ్రూపు వీడియో-ఆడియో కాల్ ఇలా చేయొచ్చు.. 
వాట్సాప్ గ్రూపు వీడియో-ఆడియో కాల్ చేసేముందు మీ ఫోన్ కాంటాక్ట్‌లోని ఓ నెంబర్‌కు వీడియో (ఆడియో) కాల్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఓ బటన్ కనిపిస్తుంది. మీ ఫోన్ స్ర్కీన్‌పై టాప్ రైట్ కార్నర్‌లో మరో గ్రూపు సభ్యున్ని జాయిన్ చేసుకొని కాల్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి కాల్ కనెక్ట్ అయితే చాలు.. టాప్ రైట్ కార్నర్‌లో మరో సభ్యునికి కాల్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మరో ఇద్దరి సభ్యులను కాల్‌కు కనెక్ట్ చేయొచ్చు. తద్వారా నలుగురు గ్రూపు సభ్యులు ఒకేసారి మాట్లాడుకోవచ్చు. ఇక్కడో గమనిక.. ఈ కొత్త ఫీచర్ కోసం గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి వాట్సాప్‌ కొత్త వెర్షన్ ఆప్‌డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అసత్య వార్తలపై సమరం

Updated By ManamMon, 07/23/2018 - 13:16

బ్రిటన్‌లో స్టార్టప్‌ను ఆరంభించిన ఎన్‌ఆర్‌ఐ జైన్

lyric jainలండన్: అసత్య.. నకిలీ వార్తలు! సామాజిక మాధ్యమాల్లో విర్రవీగుతున్న ఈ వార్తలు మన దేశంలో ఎంతటి బీభత్సాన్ని సృష్టిస్తున్నాయో తెలిసిందే. ఇలాంటి వార్తలకు చెక్ పెట్టేందుకు బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్త లిరిక్ జైన్ కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా ఓ స్టార్టప్ సంస్థను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన లిరిక్ జైన్.. కేంబ్రిడ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తిచేశారు.

ఫేస్‌బుక్, వాట్సప్ తదితర సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా అసత్య వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. భారత్‌లో వీటి ప్రభావం మరీ దారుణంగా ఉంది. చిన్నపిల్లలను ఎత్తుకెళ్తున్నారనే వార్తలు ప్రచారం కావడంతో.. తమ ప్రాంతంలో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే చాలు వారి వివరాలకు తెలుసుకోకుండా సామూహిక దాడులకు పాల్పడుతున్నారు. కొట్టి చంపేస్తున్నారు. 

ఇలాంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా  అనేక దేశాల్లోనూ కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో ఓ సాంకేతిక పరిజ్ఞానాన్ని జైన్ రూపొందించారు. ప్రస్తుతం ఈ పరిజ్ఞానంపై పరీక్షలు జరుగుతున్నాయి. విజయ వంతమైతే బ్రిటన్, అమెరికాలో సెప్టెంబరు నుంచి ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. మన దేశంలో మాత్రం అక్టోబర్‌లో అందుబాటులోకి రావొచ్చు. వాట్సప్‌లో కొత్త ఫీచర్!

Updated By ManamMon, 07/09/2018 - 21:27

imageన్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న వాట్సప్ మెసేజింగ్ యాప్‌లో మరో కొత్త సౌకర్యం రానున్నది. వినియోగదారులు తమకు వచ్చే సందేశాల్లోని లింకులు నిజమైనవా? నకిలీవా? తెలుసుకునే అవకాశం లభించనుంది. ఆ లింకులను ఓపెన్ చేస్తే నష్టమా? ప్రమాదమా? అనే వివరాలను అందివ్వనుంది. ఒకవేళ లింకులు నకిలీవైతే ఆ మెసేజ్‌లపై ‘అనుమానాస్పదం( సస్పీషియస్) పేరుతో ఓ సందేశం రానుంది. ఈ హెచ్చరిక ద్వారా వినియోగదారులు జాగ్రత్త పడే అవకాశముంది.

Related News