bellamkonda srinivas

బెల్లంకొండ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదల

Updated By ManamFri, 11/09/2018 - 12:15
Kavacham

కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిల్ల దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘కవచం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయగా.. ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ పోలీస్‌గా నటిస్తుండగా.. ఆ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు.

ఇక ఈ చిత్రంలో బెల్లంకొండ సరసన కాజల్ అగర్వాల్, మెహ్రీన్ నటిస్తుండగా.. నీల్ నితిన్ ముఖేశ్ విలన్‌గా నటిస్తున్నాడు. వశంధార క్రియేషన్స్‌పై థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.కొండచిలువతో చందమామ ఆటలు

Updated By ManamThu, 10/04/2018 - 12:29

Kajal Aggarwalకొత్త హీరోయిన్లు ఎంతమంది వస్తున్నా టాలీవుడ్‌లో తన స్థానాన్ని మాత్రం పదిలంగా ఉంచుకుంది చందమామ కాజల్. టాప్ హీరోలు చాన్స్‌లు ఇవ్వనప్పటికీ, యంగ్ హీరోలు అవకాశాలు ఇస్తుండటంతో వారితో ఆడిపాడుతోంది. కాగా కాజల్ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగా థాయ్‌లాండ్ వెళ్లిన కాజల్.. అక్కడ అందాలను చూసి ఎంజాయ్ చేస్తోంది. అంతేకాదు కొన్ని సాహసాలను కూడా చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ కొండచిలువను తన మెడలో వేయించుకున్న కాజల్.. దానితో ఆటలాడింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనికి అభిమానులు వావ్ అంటూ కామెంట్ పెడుతున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

 కుర్ర‌హీరోతో కాజల్ చ‌క్క‌ర్లు

Updated By ManamSat, 09/29/2018 - 11:32

Kajal Aggarwal, Bellamkonda Srinivasహీరోయిన్‌గా పుష్క‌ర కాలం దాటినా కుర్ర హీరోయిన్స్‌కు గ్లామ‌ర్ ప‌రంగా, పెర్ఫామెన్స్ ప‌రంగా గ‌ట్టిపోటీ ఇస్తుంది కాజ‌ల్ అగ‌ర్వాల్. ఇప్పుడు ఈ అమ్మ‌డు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో రెండు సినిమాల్లో మెయిన్‌లీడ్‌గా న‌టిస్తుంది. అందులో ఒక‌టి తేజ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ఒకటి. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ కాంబోడియాలో జ‌రుగుతుంది. కాంబోడియాలోని ప్ర‌సిద్ధ ఆల‌యం అంగ‌న్‌కోర్ వాట్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌లిసి చ‌క్క‌ర్లు కొడుతున్నారు. ఈ విష‌యాన్ని బెల్లంకొండ శ్రీనివాస్ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. ఈ ట్రిప్ ద్వారా త‌న‌కు కాజ‌ల్ వంటి బెస్ట్ ఫ్రెండ్ దొరికింద‌ని చెప్పాడు. అంతేకాదు ఈ కుర్ర హీరో కాజ‌ల్‌ను భుజాలపై ఎత్తుకుని కూడా ఫోటోలు దిగాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. తేజ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు అనీల్ సుంక‌ర నిర్మాత‌. స్పెషల్ సాంగ్‌లో ‘ఆర్‌ఎక్స్ 100’ భామ

Updated By ManamSun, 09/16/2018 - 15:31

Payal Rajput‘ఆర్ఎక్స్‌100’తో టాలీవుడ్‌లో క్రేజీ ఇమేజ్ సంపాదించుకున్న పాయల్ రాజ్‌పుత్‌కు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. అయితే సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఓ స్పెషల్ సాంగ్‌లో నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ తెరకెక్కిస్తున్న చిత్రంలో పాయల్ స్పెషల్ సాంగ్‌లో మెరవనున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, మన్నోరా చోప్రా హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే.నాలుగేళ్ల తరువాత టాలీవుడ్‌కు క్రేజీ విలన్

Updated By ManamMon, 09/10/2018 - 11:31

Sonu Soodఒకప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ విలన్‌గా పేరు తెచ్చుకున్న సోనూసూద్.. నాలుగేళ్ల తరువాత టాలీవుడ్‌లోకి రాబోతున్నాడు. ‘అరుంధతి’, ‘జులాయి’, ‘ఆగడు’, ‘సూపర్’, ‘అతడు’ వంటి చిత్రాల్లో నటించి అందరినీ మెప్పించిన సోనూసూద్.. ఈ మధ్య తమిళ్, హిందీ చిత్రాలలో బిజీగా ఉన్నాడు. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ తెరకెక్కిస్తున్న చిత్రం ద్వారా ఈ విలన్ మళ్లీ తెలుగులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో సోనూసూద్ రాజకీయ నాయకుడిగా కనపడనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో బెల్లంకొండ సరసన కాజల్ నటిస్తుండగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనున్న విషయం తెలిసిందే. కాగా 2014లో సోనూసూద్ తెలుగులో ఆగడులో సోనూసూద్ చివరిగా నటించాడు.(ఆ తరువాత 2016లో అభినేత్రితో వచ్చినప్పటికీ.. అది స్ట్రైట్ తెలుగు సినిమా కాదు.)బెల్లంకొండ సరసన మరో హీరోయిన్

Updated By ManamMon, 08/20/2018 - 12:55

Srinivas, Mehreenబెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కొత్త దర్శకుడు శ్రీనివాస్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్‌‌‌‌‌గా నటిస్తుండగా.. తాజాగా మరో ముద్దుగుమ్మ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమైంది. కృష్ణగాడి వీరప్రేమ గాథ, రాజా ది గ్రేట్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన మెహ్రీన్ ఈ చిత్రంలో భాగమైంది. హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. అందులో ఆదివారం జాయిన్ అయ్యింది మెహ్రీన్. వంశధార క్రియేషన్స్ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల మందుకు రానుంది.కాజల్ ‘కీకీ ఛాలెంజ్’ చూశారా..?

Updated By ManamMon, 08/13/2018 - 13:34

Kajal Aggarwal, Bellamkonda Srinivasకీకీ ఛాలెంజ్.. గత కొంత కాలంగా ఇంటర్నెట్‌ను ఊపేసిన ఛాలెంజ్. కారులోంచి దిగి కీకీ అనే పాటకు స్టెప్‌లు వేసి ఆ తరువాత మళ్లీ కారులోకి ఎక్కడమే ఈ ఛాలెంజ్. దీన్ని చేస్తూ ఎంతో మంది మరణించగా.. కొంతమంది తీవ్ర గాయాలపాలు అయ్యారు. ఇక మనదేశంలోనూ ఈ ఛాలెంజ్ విస్తరించింది. నటుడు ఆదా శర్మ, రెజీనా తదితరులు ఈ ఛాలెంజ్‌ను చేశారు. అయితే ఇకపై ఈ ఛాలెంజ్‌ను చేస్తే చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించడంతో ఆ తరువాత కాస్త తగ్గుముఖం పట్టింది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ ఛాలెంజ్‌ను కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి వెరైటీగా ప్రయత్నించారు. వీల్ చైర్‌లోంచి దిగి ఈ పాటకు స్టెప్‌లు వేశారు. జాగ్రత్త లేకుండా కీకీ ఛాలెంజ్‌ను చేస్తే దెబ్బలు తగిలి, తమలా అవుతారని, ఇలా వీల్‌చైర్‌లోనే ఉంటారని ఆ తరువాత ఈ ఇద్దరు చెప్పారు. కాగా ప్రస్తుతం ఈ ఇద్దరు శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ మూవీ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా.. షూటింగ్ మధ్యలో ఇలా ఛాలెంజ్‌ను చేశారు కాజల్, శ్రీనివాస్.

 ‘సాక్ష్యం’ రివ్యూ

Updated By ManamFri, 07/27/2018 - 15:14
Saakshyam

బ్యాన‌ర్‌: అభిషేక్ పిక్చ‌ర్స్‌
ప్ర‌ధాన న‌టీన‌టులు:  బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, పూజా హెగ్డే, శ‌ర‌త్‌కుమార్‌, మీనా, జ‌గ‌ప‌తిబాబు, అశుతోశ్ రానా, ర‌వి కిష‌న్, మ‌ధు గురుస్వామి, రావు ర‌మేశ్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, ప‌విత్రా లోకేశ్, వెన్నెల‌కిశోర్ త‌దిత‌రులు
స్వ‌ర‌క‌ర్త‌: హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌
కెమెరా: అర్థ‌ర్ ఎ.విల్స‌న్‌
సంభాష‌ణ‌లు:  సాయిమాధ‌వ్ బుర్రా
క‌ళ‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌
కూర్పు:  కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
నిర్మాత‌: అభిషేక్ నామ‌
స‌మ‌ర్ప‌ణ‌: ఈరోస్ ఇంటర్నేష‌న‌ల్‌, దేవాంశ్ నామా
ద‌ర్శ‌క‌త్వం: శ్రీవాస్‌

`అల్లుడు శీను` విడుద‌లై ఇప్ప‌టికి నాలుగేళ్లు. ఈ నాలుగేళ్ల‌లో ఆ చిత్ర హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న‌టించింది నాలుగు సినిమాలు. తాజా సినిమా `సాక్ష్యం`. త‌న‌దైన క‌న్విక్ష‌న్‌తో, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో మార్కు క్రియేట్ చేసుకున్న శ్రీవాస్ ఈ సారి ప్ర‌కృతిని ప‌లవ‌రిస్తూ చేసుకున్న క‌థ `సాక్ష్యం`. ఆర‌డుగుల‌కు పైగా ఎత్తున్న సాయి శ్రీనివాస్ ఇందులో చేసిన యాక్ష‌న్ సీక్వెన్స్ ఇప్ప‌టికే సినిమాపై అంచ‌నాలు పెంచాయి. ట్రైల‌ర్ ప్రామిసింగ్‌గా ఉండ‌టంతో ప‌లువురు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మ‌రి అంచ‌నాలను ఈ సినిమా ఎలా చేరుకుంది? అంద‌రినీ మెప్పిస్తుందా? అనేది తెలుసుకోవాలంటే ఒక‌సారి రివ్యూ చ‌దివేయండి. 

క‌థ‌
న్యూయార్క్ లో  కొన్ని వేల కోట్ల‌కు అధిప‌తి విశ్వ సంస్థల అధినేత  శివ‌ప్ర‌కాష్ (జె.పి). ఆయ‌న భార్య (ప‌విత్రా లోకేష్) శివ భ‌క్తురాలు. వీరి త‌నయుడు విశ్వ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌). తండ్రి ఎక‌నామిక్స్ ని ఇష్ట‌ప‌డితే, కొడుకు అడ్వంచ‌ర్స్ చేయ‌డానికి మొగ్గుచూపుతుంటాడు. త‌న ఇష్ట‌ప్ర‌కార‌మే అడ్వంచ‌ర‌స్ వీడియో గేమ్స్ ని త‌యారు చేస్తుంటాడు. ఆ క్ర‌మంలోనే ఓ సారి సౌంద‌ర్య ల‌హ‌రి (పూజా హెగ్డే)ని చూస్తాడు. ఆమెని తొలి చూపులోనే ప్రేమించిన అత‌ను ఓ సారి ఆమెను చెంపపై కొడ‌తాడు. దాంతో బాధ‌ప‌డ్డ ఆమె కార‌ణాంత‌రాల వ‌ల్ల ఇండియాకు చేరుకుంటుంది. ఆమెను క‌న్విన్స్ చేసుకోవ‌డానికి ఇండియాకు వెళ్తాడు విశ్వ‌. అయితే అత‌నికి తెలియ‌కుండా కొంద‌రిని చంపుతుంటాడు. అందులో అత‌ని ప్ర‌మేయం ఉండ‌దు. అత‌ను చేస్తున్న ప‌నికి, అత‌ని టీమ్ త‌యారు చేసిన వీడియో గేమ్స్ కి కొన్ని సంబంధాలు క‌లుస్తుంటాడు. విశ్వ చంపిన వాళ్ల‌ల్లో మునుస్వామి (జ‌గ‌ప‌తిబాబు) సోద‌రులు ఉంటారు. వారికి ప‌ట్టిన గ‌తే చివ‌రికి మునుస్వామికి కూడా ప‌డుతుంది. ఇంత‌కీ మునుస్వామి ఎవ‌రు? అత‌ని ఊరు స్వ‌స్తిక్ పురంతో విశ్వ‌కున్న అనుబంధం ఏంటి?  నిజంగా ప్ర‌కృతి, పంచ‌భూతాలు మంచి వైపు నిలుస్తాయా?  చెడును ఎలా అంతం చేస్తాయి వంటివి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

ప్ల‌స్ పాయింట్స్‌:
- కెమెరా వ‌ర్క్‌
- నేప‌థ్య సంగీతం
- నిర్మాణ విలువ‌లు
- రివేంజ్ డ్రామాలో కాన్పెప్ట్ కొత్త‌గా ఉండ‌టం
మైన‌స్ పాయింట్స్:
- కామెడీ లేక‌పోవ‌డం
- పాట‌లు 
- ల‌వ్ ట్రాక్‌

స‌మీక్ష: 
ప్ర‌తి మ‌నిషి త‌ను చేసే త‌ప్పుల‌ను నాలుగు దిక్కుల్లో ఎవ‌రూ చూడ‌లేద‌నుకుంటాడు. కానీ  పై నుండి ప్ర‌కృతి అనే ఐదో క‌న్ను మ‌నిషి త‌ప్పుల‌ను గ‌మ‌నిస్తూ ఉంటుంది. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌కృతి లెక్క స‌రిచేస్తుంది. అనే కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు శ్రీవాస్ సినిమాను చ‌క్క‌గా రాసుకున్నాడు. క‌థలో హీరో, హీరోయిజం ఉన్నప్ప‌టికీ.. దానికి ప్ర‌కృతి అనే ఎలిమెంట్ ఎలా యాడ్ అయ్యింది.. హీరో రాసుకున్న గేమింగ్‌లో అనుకున్న‌ట్లుగానే విల‌న్స్ హీరో చేతిలో చనిపోవ‌డం అనే పాయింట్స్ కొత్త‌గా ఉంటాయి. సంభాష‌ణ‌లు స‌న్నివేశాల ప‌రంగా బావున్నాయి. హీరో బెల్ల‌కొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమా యాక్ష‌న్ ఎపిసోడ్ కోసం బాగానే క‌ష్డ‌ప‌డ్డాడు. సిక్స్‌ప్యాక్ అంతా పెంచాడు. హీరోయిన్ పూజాహెగ్డే కేవ‌లం పాట‌ల‌కే ప‌రిమితం అయ్యింది. ఆమె పాత్ర ప‌రిధిమేర చ‌క్క‌గా న‌టించిందది. ఇక జ‌గ‌ప‌తిబాబు, అశుతోష్‌రాణా, ర‌వికిష‌న్ అండ్ గ్యాంగ్ విల‌నిజం సినిమా న‌డిచే క్ర‌మంలో బ‌ల‌హీనంగా అనిపిస్తుంది. ఇక రావు ర‌మేశ్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, ప‌విత్రా లోకేష్‌, వెన్నెల‌కిశోర్‌, కృష్ణ భ‌గ‌వాన్ త‌దిత‌రులు వారి వారి పాత్రల ప‌రంగా చ‌క్క‌గా న‌టించారు. హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రామేశ్వ‌ర్ సంగీతంలో పాట‌లు ఆక‌ట్టుకునేలా లేవు. అయితే బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. అర్థ‌ర్ విల్స‌న్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి. లాజిక్స్‌కి నిమిత్తం లేకుండా కొన్ని ప‌నులు జ‌రుగుతుంటాయి. అలాంటి వాటిని చూడాలే త‌ప్ప ఏం చేయ‌లేమ‌నే కాన్సెప్ట్‌లో సినిమాను చిత్రీక‌రించారు. 
బోట‌మ్ లైన్‌:  సాక్ష్యం.. ప్ర‌కృతి చేసే ప్ర‌తీకార చ‌ర్య‌
రేటింగ్‌: 3/5‘సాక్ష్యం’కు సెన్సార్ ఇబ్బందులు

Updated By ManamSat, 07/21/2018 - 12:59

Saakshaym బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా శ్రీవాస్ తెరకెక్కించిన చిత్రం ‘సాక్ష్యం’. ఈ నెల 27న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావించింది. ఈ నేపథ్యంలో సెన్సార్ సర్టిఫికేట్‌ కోసం సభ్యుల ముందుకు చిత్రాన్ని తీసుకెళ్లింది చిత్ర యూనిట్. అయితే సెన్సార్ సభ్యులు మాత్రం సినిమాను సెన్సార్ ఇచ్చేందుకు నిరాకరించారట.

కథానుగుణంగా ఈ చిత్రంలో కొన్ని బ్రతికిఉన్న పక్షులు, జంతువులను వాడారట. అయితే అందుకు సంబంధించిన అనుమతులు(ఎన్‌ఓసీలు) తీసుకోలేదట. దీంతో సెన్సార్ చేసేందుకు అధికారులు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడిప్పుడు ఎన్‌ఓసీలు తీసుకురావడం కష్టంతో చాలా కష్టంతో కూడుకున్న పని. దీంతో ఈ మూవీ మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.నెగ‌టివ్ షేడ్‌లో కాజ‌ల్‌?

Updated By ManamTue, 07/10/2018 - 13:16

Kajal `ల‌క్ష్మీక‌ల్యాణం, నేనే రాజు నేనే మంత్రి` చిత్రాల త‌ర్వాత కాజ‌ల్ అగ‌ర్వాల్ తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌లో అనీల్ సుంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా న‌టిస్తున్నాడు. కాజ‌ల్ కోసం తేజ స‌రికొత్త పాత్ర‌ను డిజైన్ చేశాడ‌ట‌. నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో కాజ‌ల్ క‌న‌ప‌డుతుంద‌ట‌. ఈ చిత్రంలో సోనూసూద్ కూడా విల‌న్‌గా న‌టిస్తున్నాడు.  అలాగే బెల్లంకొండ శ్రీనివాస్‌, సోనూసూద్ అన్న‌ద‌మ్ములుగా క‌నిపిస్తార‌ట‌. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా స్టార్ట‌య్యింది. ఎన్టీఆర్ బ‌యోపిక్ య‌న్‌.టి.ఆర్‌.. వెంకీ చిత్రాల నుండి తేజ డ్రాప్ అయిన త‌ర్వాత చేస్తున్న చిత్ర‌మిది. 
 

Related News