assembly elections

టీటీడీపీ తొలి జాబితా సిద్ధం

Updated By ManamSat, 09/22/2018 - 09:02
TTDP

హైదరాబాద్: తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల వేళ తొలి జాబితాను సిద్ధం చేసింది టీటీడీపీ. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జనసమితితో టీడీపీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ ప్రాభల్యం ఎక్కువగా ప్రాంతాలపై ఇప్పటికే ఓ అంచనాను వేసిన టీటీడీపీ.. తాజాగా తొలి జాబితాను సిద్ధం చేసింది. 

అభ్యర్థుల జాబితా
శేరిలింగంపల్లి – మొవ్వ సత్యనారాయణ
కూకట్‌పల్లి- మందాడి శ్రీనివాసరావు
సికింద్రాబాద్ – కూన వెంకటేష్‌గౌడ్
ఉప్పల్- వీరేందర్‌గౌడ్
ఖైరతాబాద్ -బి.ఎన్.రెడ్డి
సికింద్రాబాద్ కంటోన్మెంట్ – శ్రీనివాసరావు
రాజేంద్రనగర్-ఎమ్ భూపాల్‌రెడ్డి
సత్తుపల్లి – సండ్ర వెంకట వీరయ్య
సిట్టింగ్ ఎమ్మెల్యే ఖమ్మం – నామా నాగేశ్వరరావు
మిర్యాలగూడ -శ్రీనివాస్
కోదాడ – బొల్లం మల్లయ్యయాదవ్
ఆలేరు – శోభారాణి
పరకాల-రేవూరి ప్రకాష్‌రెడ్డి
ఆర్మూర్ – ఏలేటి అన్నపూర్ణ
హుజూరాబాద్ – ఇనగాల పెద్దిరెడ్డి
దేవరకద్ర – రావుల చంద్రశేఖర్‌రెడ్డి
మహబూబ్‌నగర్- చంద్రశేఖర్
మక్తల్ – కొత్తకోట దయాకర్‌‌రెడ్డి అభ్యర్థులుగా బరిలో దిగనున్నారు.అసెంబ్లీ ఎన్నికల బరిలో అమృత..?

Updated By ManamWed, 09/19/2018 - 10:00

Amrutha Varshiniమిర్యాలగూడ: తన తండ్రికి ఉన్న కులపిచ్చితో ప్రాణంగా ప్రేమించి, పెళ్లి చేసుకున్న ప్రణయ్‌ను తన కళ్ల ముందే పోగొట్టుకుంది అమృత వర్షిణి. ప్రస్తుతం అమృత ఐదు నెలల గర్భిణి కాగా., ఇలాంటి పరిస్థితి పగవారికి కూడా రాకూడదంటూ పలువురు సానుభూతిని ప్రకటిస్తున్నారు. మరోవైపు కుల వివక్ష లేని సమాజాన్ని చూడాలని ప్రణయ్ తనతో ఎప్పుడూ అంటుండే వాడని, అతడి ఆశయాన్ని నెరవేర్చేందుకు ఇప్పుడు తాను కృషి చేస్తానని అమృత చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో అమృతను పోటీలో నిలబడనున్నట్లు తెలుస్తోంది.

అమృతను ఏకగ్రీవంగా అసెంబ్లీకి పంపాలని సీపీఎం, టీ-మాస్ ప్రతిపాదించాయి. అమృతను ఓదార్చేందుకు వెళ్లిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీ-మాస్ చైర్మన్ కంచె ఐలయ్యలు.. ఆమెను పోటీకి నిలిపితే ఏకగ్రీవం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఈ విషయంపై అపద్ధర్మ సీఎం కేసీఆర్ చొరవ చూపితే స్వాగతిస్తామని చెప్పారు. కుల దురహంకారానికి బలైన ప్రణయ్ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. మరి ఎన్నికల బరిలోకి దిగేందుకు అమృత ఆసక్తిని చూపుతుందో లేదో చూడాలి.'మహాకూటమి.. మహావైఫల్యం తప్పదు'

Updated By ManamWed, 09/12/2018 - 21:17
  • తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం.. 

  • విపక్షాలపై మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజం

Jupalli Krishnarao, Opposition parties, TRS party, KCR, Assembly elections, Massive allianceహైదరాబాద్: రానున్న ఎన్నికల్లో విపక్షాల మహాకూటమి మహా వైఫల్యం చెందబోతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు జోస్యం చెప్పారు. రాష్ట్రం విశాల ప్రయోజనం కోసమే పొత్తులు కుదుర్చుకుంటున్నట్టు ప్రతిపక్షాలు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జూపల్లి మాట్లాడారు. ఈ సందర్భంగా జూపల్లి విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచకపడ్డారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఈ విశాల ప్రయోజనం ఎక్కడికి వెళ్ళింది ?  అని సూటిగా ప్రశ్న లేవనెత్తారు. కేవలం ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ను గద్దె దించడం అనే అవకాశవాదం కోసం ఈ మహా కూటమి ఏర్పడుతుందని దుయ్యబట్టారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ భారీ సంఖ్యలో సీట్లు గెలిచి మళ్ళీ అధికారంలోకి రాబోతోందని స్పష్టం చేశారు. సురేష్ రెడ్డి లాంటి వారు కాంగ్రెస్ టికెట్ ఖరారైనా దాన్ని కాదనుకుని టీఆర్ఎస్‌లో చేరారని జూపల్లి ప్రశంసించారు. 

వనపర్తిలో కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి తాను ఘోరంగా ఓటమి పాలవుతున్నట్టు కార్యకర్తలతో అంటున్నారని, తనకు కాకుండా కాంగ్రెస్ టికెట్ వేరే వారికిచ్చినా బాగుండు అని చిన్నారెడ్డి అంటున్నారని మంత్రి జూపల్లి చెప్పారు. వనపర్తిలో ఈసారి నిరంజన్ రెడ్డి గెలవడం ఖాయమని తేల్చిచెప్పారు. టీఆర్ఎస్‌ను మహా కూటమి, ఏ మాయల కూటమి ఏం చేయలేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని అడ్డుకుంటున్న చంద్రబాబు పార్టీని మహబూబ్ నగర్‌లో తరిమి కొడతారన్నారు. విజయవాడలో పాలమూరు రంగారెడ్డికి వ్యతిరేకంగా తీర్మానం చేసిన బాబు పార్టీకి మహబూబ్ నగర్‌లో స్థానం లేదన్నారు. ఓట్లు అడిగేందుకు టీడీపీకి ఆ పార్టీతో కలుస్తున్న కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఎవరినో భయపెట్టి టీఆర్ఎస్ గెలవాలనుకోవట్లేదని, గతంలో ఉన్న ప్రభుత్వాలు భయ పెట్టినా ప్రజలు భయపడ లేదని, తెలంగాణ వాదానికే ఓటు వేశారని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. తెలంగాణలో టీడీపీతో సీపీఐ పొత్తు ఖరారు

Updated By ManamSun, 09/09/2018 - 19:09

TDP-CPI alliance, finalized discussions, Assembly electionsహైదరాబాద్: తెలంగాణలో టీడీపీ, సీపీఐ పొత్తు ఖరారైంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆదివారం టీడీపీతో సీపీఐ పొత్తుపై చర్చలు జరిగాయి. తెలంగాణ టీడీపీతో అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని సీపీఐ నిర్ణయించింది. చర్చలు ముగిసిన అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మహాకూటమి కావాలనుకుంటున్నామని, కలిసి వచ్చే వారందరితో మాట్లాడతామని చెప్పారు. గెలిచే సీట్లు మాత్రమే అడుగుతామన్నారు. ఈ ప్రభుత్వానికి అధికారమే తప్ప రైతు సమస్యలు ముఖ్యం కాదని చాడ విమర్శలు గుప్పించారు. 

మహాకూటమి జెండా ఎగురవేస్తాం: ఎల్ రమణ
సీపీఐతో చర్చల అనంతరం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ.. రేపు, ఎల్లుండి మిగతా పార్టీలతో మాట్లాడతామని, కాంగ్రెస్‌ పార్టీతోనూ మాట్లాడుతామని చెప్పారు. రానున్న రోజుల్లో మహాకూటమి జెండా ఎగురవేస్తామన్నారు. కేసీఆర్‌కు రాజకీయ, నైతిక విలువలు లేవని విమర్శించారు. అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా కలుపుకున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో టీడీపీ గెలుపు చారిత్రక అవసరమన్నారు. నవంబర్‌లో ఎన్నికలు.. డిసెంబర్‌లో ఫలితాలు..

Updated By ManamThu, 09/06/2018 - 20:10
  • ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం

  • హుస్నాబాద్‌ నుంచి ఎన్నికల ప్రచారం మొదలు.. 

  • డిసెంబరు మొదటి వారంలో ఎన్నికల ఫలితాలు

Assembly elections, November, Four states elections, TRS, KCR, Assembly dissolveహైదరాబాద్‌: నవంబర్‌లోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అక్టోబర్‌లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై నవంబర్‌లో ముగుస్తాయని వెల్లడించారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటే తెలంగాణలో కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ‘‘టీఆర్ఎస్ అధ్యక్షుడి హోదాలో హుస్నాబాద్‌ నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నాం. మంచి సమయంలో చేస్తే అంతా మంచే జరుగుతుంది. చెడ్డ సమయంలో చెడ్డగానే జరుగుతుంది. 9న అమావాస్య. 7వ తేదీ శ్రావణమాసం శుక్రవారం మంచిరోజు. అదేరోజున ఒక సభను ప్రారంభిస్తాం. చెడురోజులు వచ్చేలోపు కార్యక్రమంతా ముగించుకోవాలి. ఎన్నికలు కూడా వీలైనంత తొందరగా వచ్చే అవకాశం ఉంది.

రాజ్యాంగం ప్రకారం కచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలి. అక్టోబర్‌ మొదటి వారంలో ఎన్నికల ప్రక్రియ మొదలై నోటిఫికేషన్‌ వస్తుంది. నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయి. డిసెంబరు మొదటి వారంలో ఎన్నికల ఫలితాలు ప్రకటించే అవకాశముంది. మీడియా చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని విషయాలు వెలుగులోకి రానివ్వలేదు. కేంద్ర ముఖ్య ఎన్నికల అధికారితో, మిగతా ఇద్దరు కమిషనర్లతో స్వయంగా మాట్లాడాను. ఆషామాషీగా చేయరు కదా. సీఎస్‌ ఎస్‌.కె.జోషి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ కూడా మాట్లాడారు. అన్ని విషయాలు చర్చించాకే ఈ నిర్ణయాన్ని వెల్లడించాం’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు?

Updated By ManamMon, 08/20/2018 - 13:40
Uttam Kumar Reddy

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఊహాగానాలు జోరందుకున్నాయి. టీఆర్ఎస్ సర్కార్ ...అసెంబ్లీని రద్దు చేసి, ఎన్నికలు వెళతుందని కొద్దిరోజుల క్రితం వార్తలు వెలువడగా, తాజాగా టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నోటి నుంచి కూడా ముందస్తు ఎన్నికలు వినిపిస్తున్నాయి. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ.. హామీలపై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే టీఆర్ఎస్ సర్కార్ ముందస్తుకు వెళుతుందని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తామని ఉత్తమ్ పేర్కొన్నారు. 

త్వరలోనే ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపడతామని ఆయన, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అందరికీ ప్రాధాన్యత ఇస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు.  ఓటర్ల జాబితాలో ఓటర్లు తమ పేరు ఉందో లేదో సరిచూసుకోవాలని సూచించారు. ఇక వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఆన్‌లైన్ పోలింగ్ ద్వారా అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. టీఆర్ఎస్ సర్కార్...సర్పంచ్ నుంచి ఎంపీ వరకూ ప్రతి ఒక్కర్ని కొనుగోలు చేస్తుందన్నారు.'అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థలకూ ఎన్నికలు'

Updated By ManamFri, 06/22/2018 - 20:54

Chandrababu naidu, local elections, Assembly elections, State peopleఅమరావతి: అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్‌ ఎన్నికలతో పాటే స్థానిక సంస్థలకు కూడా ఒకేసారి ఎన్నికలు రానున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా నేతలతో శుక్రవారం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన నాలుగేళ్లలో్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. తలసరి ఆదాయం రెట్టింపు చేశామని గుర్తు చేశారు. మూడేళ్లుగా రెండంకెల వృద్ధిరేటు సాధిస్తున్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. రాష్ట్ర ప్రజలకు మంచి పనులు చేస్తున్న టీడీపీకి గతంలో కంటే ఈసారి ఓటింగ్‌ శాతం పెరగాలన్నారు. పార్టీలో ప్రతి నాయకుడు, కార్యకర్తలంతా రాజకీయ విశ్లేషకులుగా మారాలని సూచించారు.

పార్టీకి ఉన్న బలాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అన్ని రాజకీయ పార్టీలూ టీడీపీపై విషప్రచారం చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ తీరుపై మండిపడిన చంద్రబాబు..  జైలుకు పోకుండా ఉండేందుకే బీజేపీతో జగన్‌ సన్నిహితంగా ఉంటున్నారని విమర్శించారు. ఎన్నికలు రాకుండా చూసుకొని రాజీనామాల పేరుతో వైసీపీ ఎంపీలు నాటకాలు ఆడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. కర్ణాటక ఎన్నికల్లో పవన్ ప్రచారం

Updated By ManamMon, 05/07/2018 - 11:31

Pawan  బెంగళూరు: కర్ణాటకలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో వేగాన్ని పెంచాయి అన్ని పార్టీలు. ఇందుకోసం సెలబ్రిటీలను కూడా రంగంలోకి దిగుతున్నారు. ఇక తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. జేడీయూ పార్టీ తరఫున కర్ణాటకల్లోని పలు ప్రాంతాల్లో పవన్ ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రకటించింది. అయితే ఈ విషయంపై మాట్లాడిన ఆ పార్టీ ప్రెసిడెంట్ కుమారస్వామి, ఎన్నికలు సమీపిస్తున్నాయని కాబట్టి పవన్ ఎప్పుడొస్తాడన్నది మాత్రం చెప్పలేమని పేర్కొన్నారు. కాగా ఈ నెల 12న కర్ణాకటలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
 ప్రశాంతంగా పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు

Updated By ManamThu, 12/14/2017 - 10:00

Gujaratగుజరాత్‌: గుజరాత్‌లో ఇవాళ రెండో దఫా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు తమ ఓటును వినియోగించుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరోబెన్ గాంధీనగర్‌లో ఓటు వేయగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు తన కుటుంబంతో సహా నారన్‌పురాలో ఓటు వేసి వచ్చారు. అలాగే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ గట్లోడియాలో.. యువ నేత హార్ధిక్ పటేల్ తల్లిదండ్రులు భారత్ పటేల్, ఉషా పటేల్ వీరమ్‌గమ్‌లో తమ ఓట్లను వినియోగించుకున్నారు. మరోవైపు గత కొన్ని రోజులుగా గుజరాత్‌లో కనిపించిన ఎన్నికల హడావిడి ఈ రోజుతో ముగియనుండగా ఈ నెల 18న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

 

Anandiben Patel

HeenaBharathహిమాచల్ ప్రదేశ్ లో నేడే పోలింగ్!

Updated By ManamThu, 11/09/2017 - 09:46

assembly elections, himachalpradheshహిమాచ‌ల్ ప్ర‌దేశ్‌: హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హోరాహోరీ పోరు ప్రారంభ‌మైంది. ప్ర‌ధాన ప‌క్షాలైన బీజేపీ, కాంగ్రెస్ ఆధిప‌త్యం కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ప్ర‌చారంలో పోటాపోటీగా హామీలు కురిపించి ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాయి. ప్ర‌చారం ముగియ‌డంతో ఎన్నిక‌ల పోలింగ్‌పై నేత‌లు దృష్టి సారించారు. మొత్తం 68 నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగ‌నుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జ‌రుగ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. 983 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగాను, 399 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఈ కేంద్రాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన అన్ని ఏర్పాట్లు చేసింది. 

Related News