Telangana govt

ఆరోగ్యశ్రీ ఉద్యోగుల అవస్థలు

Updated By ManamWed, 10/31/2018 - 01:59
 • చాలీచాలని జీతాలతో ఉద్యోగుల దుర్భర పరిస్థితి.. రెండు నెలలకోసారి వేతనాలు

 • ఇంక్రిమెంట్లుండవు.. పదోన్నతులు కల్పించరు

 • అధిక పనిభారంతో ఇబ్బందులు

 • మహిళలకు ప్రసూతి సెలవులు అంతంతే

govtహైదరాబాద్: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఇటు ఉద్యోగం చేయలేక.. అటు వదులుకోలేక నరకయాతను పడుతున్నారు. చాలీచాలని జీతాలతో జీవితాలను భారంగా నెట్టుకొస్తున్నారు. ఏండ్ల తరబడి పనిచేస్తున్నా.. ఇంక్రిమెంట్లు, పదోన్నతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వానికి తమ సమస్యలను ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. 2009లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా ఆరోగ్య మిత్రలు, టీమ్ లీడర్లు, ఆఫీస్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1200 మంది ఆరోగ్య శ్రీ ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 800 మంది ఆరోగ్య మిత్రలు, 200 మంది ఆఫీస్ ఎగ్జిక్యూటివ్‌లు, వంద మంది టీమ్ లీడర్లు ఉన్నారు. ఆరోగ్య మిత్రలు రెండు రకాలుగా ఉంటారు. ఒకటి పీహెచ్‌సీల్లో పనిచేసేవారు కాగా, రెండోది నెట్‌వ ర్క్స్‌లో పనిచేస్తారు. పీహెచ్‌సీ ఆరోగ్య మిత్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మెడికల్ క్యాంపులు, గ్రీవెన్స్ సెల్ ద్వారా అనారోగ్యంతో ఉన్న వారిని చికిత్స కోసం నెట్‌వర్క్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తారు. వీరికి గతంలో 2008 నుంచి 2011 వరకు రూ.వెయ్యి ఫిక్స్‌డ్ అలవెన్సు ఇచ్చేవారు. ప్రస్తుతం అదీ రావడం లేదు. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జి అయ్యే వరకు రోగుల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నెట్‌వర్క్ ఆరోగ్య మిత్రలదే. టీం లీడర్లు ఆరోగ్య మిత్రలను పర్యవేక్షించడమే కాకుండా ఫీల్డ్ వర్క్ చేయాలి.

రెండు నెలలకోసారి జీతాలు..
అరకొర జీతాలతో కాలం వెళ్లదీస్తున్న ఉద్యోగులకు అవీ కూడా సకాలంలో అందడంలేదు. రెండు నెలలకొకసారి జీతాలు వస్తున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. థర్డ్‌పార్టీ సకాలంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు అందజేస్తున్నా వారు మాత్రం రెండు నెలలకోసారి ఇస్తున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా పనిభారం పెరిగిపోయింది. గతంలో ఆరోగ్య శ్రీ పథకంలో విధులు ప్రారంభించగా, ఆ తర్వాత 12 లక్షల ఉద్యోగుల హెల్త్‌కార్డులు, జర్నలిస్టు హెల్త్‌కార్డులను కొత్తగా చేర్చారు. దీంతో పనిభారం మరింత పెరిగిపోయింది. ఇందుకోసం మరికొంతమంది సిబ్బందిని రిక్రూట్‌మెంట్ చేస్తామని చెప్పినా అదీ అటకెక్కింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 5వేల మంది ఉద్యోగులు ఉండగా, రాష్ట్ర విభజనలో తెలంగాణకు 2200 మందిని కేటాయించారు. ప్రస్తుతం 1200 మంది మాత్రమే పనిచేస్తున్నారు. పనిభారంతో పాటు వేతనాలు సకాలంలో చెల్లించకపోవడంతో ఉద్యోగులు మానేస్తున్నారని, ఖాళీలను భర్తీ చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇక సెలవుల విషయంలోనూ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఏడాదిలో నాలుగు సెలవులు మాత్రమే ఇస్తున్నారని, మహిళలకు ప్రసూతి సెలవులు మూడు నెలల మాత్రమే ఇస్తున్నారు.

నో ప్రమోషన్.. నో ఇంక్రిమెంట్లు
ఆరోగ్య శ్రీ పథకం సఫలీకృతమవ్వడంలో ఉద్యోగుల పాత్ర కీలకమైంది. దేశవ్యాప్తంగా పేరుప్రఖ్యాతలు తెచ్చినప్పటికీ ఉద్యోగులకు చేసింది అతంతమాత్రమే అని చెప్పొచ్చు. సుమారు పదేండ్లుగా పనిచేస్తున్నా ఏ ఒక్క ఉద్యోగికి ప్రమోషన్ ఇచ్చిన దాఖాలాల్లేవు. 2014 తర్వాత ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు సైతం లేవు. పీజీలు చేసి అర్హతలు ఉన్నప్పటికీ పదోన్నతులు అందని ద్రాక్షగానే మారాయి. రోజురోజూకీ అన్నిరకాల ధరలు విపరీతంగా పెరుగుతున్నా తమకు మాత్రం వేతనాలు పెంచడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్య మిత్రలు రూ.10,350 చేతికి తీసుకుంటుండగా, టీం లీడర్లు, ఆఫీస్ ఎగ్జిక్యూటివ్‌లు రూ.12,900చొప్పున తీసు కుంటున్నారు. కానీ ప్రభుత్వ జీఓ ప్రకారం ఆరోగ్య మిత్రలకు రూ.21వేలు, టీం లీడర్లు, ఆఫీస్ ఎగ్జిక్యూటివ్‌లకు రూ.29వేలు రావాల్సి ఉంది.

ఉద్యోగ భద్రత కల్పించాలి
దేశవ్యాప్తంగా ఆరోగ్య శ్రీ పథకానికి పేరు ప్రఖ్యాతలు రావడానికి ఉద్యోగులే ప్రధాన కారణం. ఎంతో కష్టపడి రాత్రనకా.. పగలనకా.. విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగులకు భద్రత లేక పోవడంతో అభద్రతాభావానికి లోనవుతున్నారు. కనీసం ట్రస్ట్ పరిధిలోకి ఉద్యోగులుగా చేర్చాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. ఇంక్రిమెంట్లు, పదోన్నతులు కల్పించడంతో పాటు మహిళలకు ప్రసూతి సెలవులు ఇవ్వాలి. 
- పి.చంద్రశేఖర్, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ఆరోగ్య శ్రీ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్'ఆ మూడింటిలో తెలంగాణ నెంబర్‌వన్'

Updated By ManamThu, 09/06/2018 - 16:55
 • మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ 

Uttam kumar reddy, KCR, Telangana govt, TPCC Cheif, Farmers suicidesహైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలను నాలుగున్నరేళ్లు కేసీఆర్ మోసం చేశారని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. భారతదేశంలో రైతుల ఆత్మహత్యల్లో, మద్యం అమ్మకాల్లో, అప్పులు చేయడంలో తెలంగాణ నెంబర్‌వన్‌ని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ మీడియా సమావేశంలో చెప్పినవన్నీ అబద్ధాలేనని అన్నారు. గురువారం ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ స్థాయి మరిచి విజ్ఞత మరిచి మాట్లాడరని దుయ్యబట్టారు. నాలుగున్నరేళ్ల పాటు కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుందని ధ్వజమెత్తారు. బందిపోటు దొంగల్లాగా తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. మాట ఇచ్చి మోసం చేసిన కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు.

డబుల్ బెడ్ రూం ఇళ్లు ముస్లిం రిజర్వేషన్లపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని విధాలుగా తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. పోయేకాలం వచ్చి శాసనసభను రద్దు చేసుకున్నారని, ఎన్నికల కమిషన్ టీఆర్ఎస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందా? అని ఉత్తమ్ ఆరోపించారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చుట్టూ తిరిగి కాళ్లు పట్టుకున్న రోజులు మర్చిపోయారా? ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో మత ఘర్షణలు జరిగాయన్నది అవాస్తమని ఉత్తమ్ కొట్టిపారేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ముస్లింలను మోసం చేసిన కేసీఆర్‌ను గద్దె దించాలని ఉత్తమ్ విమర్శించారు. కాగా, శుక్రవారం ఉదయం 10.30 గంటలకు పీసీసీ కార్యవర్గ అత్యవసర సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితిపై టీపీసీసీ చర్చించనున్నట్టు తెలుస్తోంది.   వైద్య విద్యార్థులకు స్టైఫండ్ పెంపు..

Updated By ManamSat, 09/01/2018 - 19:45

Medical students, Stipend hike, Telangana govt, TRS govt, CM KCRహైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పలు రంగాలకు తీపి కబురు అందించింది. వైద్య విద్యార్థులకు స్టైఫండ్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. హౌస్ సర్జన్, పోస్టు గ్రాడ్యుయేషన్, సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థులకు స్టైఫండ్ పెంచుతున్నట్టు ప్రకటించింది.

పెంచిన స్టైఫండ్ శనివారం నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటికే తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీ, హెల్త్ స్కీమ్, ప్రమోషన్లు కల్పించిన కేసీఆర్ సర్కార్.. రాష్ట్ర మహిళా ఉద్యోగులకు కూడా ఏడాదికి 5వరకు ప్రత్యేక సాధారణ సెలవులు, 180 రోజుల పాటు  ప్రసూతి సెలవులను ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

Updated By ManamTue, 08/28/2018 - 20:59

IAS Tranfers, Telangana govt, 11 districts collectorsహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకేసారి 11 జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో ఐఏఎస్‌ల బదిలీలు జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఐఏఎస్‌లను బదిలీ చేసి మరో జిల్లాకు కలెక్టర్లుగా బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్ కలెక్టర్‌గా రఘునందన్ రావు బదిలీ కాగా, రంగారెడ్డి కలెక్టర్‌గా లోకేశ్ కుమార్ బదిలీ అయ్యారు.

సిరిసిల్ల రాజన్న జిల్లా కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి, వరంగల్ అర్బన్ కలెక్టర్‌గా పాటిల్ ప్రశాంత్ జీవన్, సిద్దపేట జిల్లా కలెక్టర్‌గా కృష్ణభాస్కర్, కొమురంభీం అసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఆర్‌జీ హన్మంతు, ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా ఆర్‌వీ కర్ణన్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా వి.వెంకటేశ్వర్లు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఎం. హన్మంతరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా అమోయ్ కుమార్ బదిలీ అయ్యారు.

అయితే ప్రస్తుతం హైదరాబాద్ కలెక్టర్‌గా ఉన్న యోగితారాణి కుటుంబ సంక్షేమ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి బదిలీ కాగా, ఆమెకు ఇంకా ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదని సమాచారం. తెలంగాణ సర్కార్‌కు రుణపడి ఉంటాం..

Updated By ManamWed, 08/22/2018 - 18:24

kerala floods victims

 • తెలంగాణ వాసులుగా గర్వ పడుతున్నాం

 • మంత్రి కేటీఆర్, కవిత చొరవతో క్షేమంగా ఇంటికొచ్చాం

 • కేరళలో చదవుకుంటున్న తెలంగాణ వైద్య విద్యార్థినులు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని కేరళ నుంచి రాష్ట్రానికి చేరిన వైద్య విద్యార్థినులు చెప్పారు. మరీ ముఖ్యంగా మంత్రి కేటీఆర్, ఎంపీ కవితల సేవల మరవలేమని.. వాళ్ల చొరవతోనే మేం ఈనాడు రాష్ట్రానికి వచ్చామన్నారు. కేరళ వరదలలో చిక్కుకున్న తెలంగాణ వైద్య విద్యార్థినులు ఖమ్మంకు చెందిన మౌర్య రాఘవ్, వరంగల్‌కు చెందిన షారోన్ శార్వాణీలు మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత గారి చొరవతో వారి స్వస్థలాలకు క్షేమంగా చేరడం పట్ల వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకెళితే.. మెడిసిన్ చదివి ఎండీ చేయడానికి కోచింగ్ కోసం కేరళలోని కొట్టాయం వెళ్ళిన వీరు ఉంటున్న హాస్టల్ ప్రాంతం ముంపుకు గురైంది. తెలిసిన ప్రొఫెసర్ సహాయంతో మరో చోటికి మారి 3వ అంతస్తులో రెండ్రోజుల పాటు అక్కడే ఉన్నారు. అక్కడి నుండి తమ పరిస్థితిని కుటుంబసభ్యులకు వివరించగా వారు నిజామాబాద్ ఎంపీ కవితకు సమాచారం అందించారు. అలాగే మంత్రి కేటీఆర్ కార్యాలయాన్ని సంప్రదించారు. ఎంపీ కవిత వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అలాగే కేరళ అధికారులకు సమాచారమిచ్చారు. 

kerala floods victims

మంత్రి కేటీఆర్ కూడా కేరళ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులను అప్రమత్తం చేసారు. రైలు మార్గం పునరుద్ధరించడంతో మంగళవారం రాత్రి పొద్దుపోయాక కొట్టాయం నుంచి ఖమ్మం, వరంగల్‌కు విద్యార్థినులు చేరుకున్నారు. కవిత ఆదేశాల మేరకు ఖమ్మం చేరిన మౌర్య రాఘవ్ను తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి నేడు ఖమ్మం వెళ్లి పరామర్శించారు. పెద్ద విపత్తు నుండి బయటకు తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, తల్లిలాగా తమ సమస్యను అర్ధం చేసుకొని ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ పరిస్థితి వాకబు చేసిన ఎంపీ కవితకు డాక్టర్ మౌర్య, ఆమె తల్లి మంజుల కృతజ్ఞతలు తెలిపారు. కేరళలో తమ ఇబ్బందులు మీడియాకు తెలిపారు. 

ktr and kavitha

మూడు రోజుల పాటు కూరగాయలు దొరక్కపోవడంతో దుంపలు ఉడికించుకొని తిన్నామని తెలిపారు. కొట్టాయంలో ఎక్కువ ప్రాంతాలు నీట మునగడంతో రైల్వే స్టేషన్ వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని తెలయడంతో తెలంగాణ  ప్రభుత్వం వినతి మేరకు అక్కడి కలెక్టర్ ప్రత్యేక ఎస్కార్టుతో రైల్వే స్టేషన్ చేర్చారని వారు తెలిపారు. తమ ప్రభుత్వం తమపై చూపించిన చొరవ పట్ల ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారని డా. మౌర్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర వాసి కావడం గర్వంగా ఉందని మౌర్య ఎంపీ కవితకు రాసిన లేఖలో తెలిపారు. మౌర్య కుటుంబ సభ్యులను బుధవారం నాడు కలిసిన వారిలో తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు పసుల చరణ్, జిల్లా నాయకులు రవికిరణ్, గట్టు కరుణ, వనం నాగేంద్ర, వీరభద్రరావు, అరవింద్ రెడ్డి, మనోజ్ తదితరులు ఉన్నారు.

kerala floods victims medicine studentsరైతు సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యం

Updated By ManamFri, 07/27/2018 - 22:40
 • విత్తన విక్రయాల్లో అవినీతిపై కఠిన చర్యలు

 • తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ ఆకున్ సబర్వాల్

akunహైదరాబాద్: రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ ఆకున్ సబర్వాల్ అన్నారు. తూనికల, కొలతల శాఖ నిబంధనలపై విత్తన ఉత్పత్తిదారులకు  తెలంగాణ సీడ్‌మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆకున్ సబర్వాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత, ప్రమాణాలు కలిగిన విత్తనాలను సరైన తూకంలో రైతులకు అందించడం ద్వారా వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించినట్టు అవుతుందన్నారు. విత్తనాల నాణ్యతా, తూకంలో ఏమాత్రం రాజీ పడొద్దని విత్తన కంపెనీ యాజమాన్యాలకు కంట్రోలర్ విజ్ఞప్తి చేశారు.

విత్తనాల విక్రయంలో అక్రమాలకు పాల్పడుతూ తూకాల్లో రైతులను మోసం చేస్తున్నారని అనేక ఫిర్యాదులు రావడంతో తూనికల కొలతల శాఖ మే నెలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించిందన్నారు. ఈ తనిఖీల్లో 154 కేసులు నమోదు చేసి, రూ. 2.35 కోట్ల విలువ చేసే విత్తనాలను సీజ్ చేసినట్లు కమిషనర్ చెప్పారు.  విత్తన కంపెనీల విజ్ఞప్తి మేరకు తూనికల కొలతల శాఖ నిబంధనలు పాటించడానికి వారికి కొంత సమయం ఇచ్చామని చెప్పారు.  విత్తన ఉత్పత్తిదారులు కూడా ప్రభుత్వానికి సహకరించాలన్నారు. రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

రైతులకు విక్రయించే విత్తనాల విషయంలో నిజాయితీగా వ్యవహరించాలని విత్తనాల వ్యాపారులకు సూచించారు. రైతులకు విక్రయించే విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల తూకాల్లో మోసాలకు పాల్పడడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని చెప్పారు. అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు చేపడతామని కమిషనర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో సీడ్‌మెన్ అసోసియేషన్ ప్రతినిధులు ఎస్. జగదీశ్వర్, నిరంజన్, మల్లారెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.6.11 లక్షల మంది రైతులకు వంద శాతం నిధులు

Updated By ManamThu, 06/14/2018 - 17:29

rabi season funds, Telangana farmers, Telangana govtహైదరాబాద్: రబీ సీజన్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి వంద శాతం నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు గురువారం పౌరసరఫరాల సంస్థ అన్ని జిల్లాలకు నిదులను విడుదల చేసింది. రబీలో 3,313 కొనుగోలు కేంద్రాల ద్వారా 6.11 లక్షల మంది రైతుల నుంచి 35.25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసింది. దీని విలువ రూ. 5601.97 కోట్లు. దీనికి సంబంధించి ప్రతి పైసాను ఆన్‌లైన్‌ ద్వారా రైతు ఖాతాలో జమ చేసింది. మరో రూ. 349 కోట్లను కూడా జిల్లాలకు విడుదల చేశారు. రూ. 349 కోట్లు నిధులను బ్యాంకులు పనిదినాల్లో ఒకటి, రెండు రోజుల్లో రైతు ఖాతాల్లో జమ చేస్తారు. 

పండుగను దృష్టిలో పెట్టుకొని రైతులకు చెల్లింపులతో పాటు హమాలీ, రవాణా, గన్నీ సంచులకు సంబంధించిన చెల్లింపులు కూడా పూర్తి చేసినట్టు పౌరసరఫరాల సంస్థ పేర్కొంది. ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి ప్రతి పైసా చెల్లింపులు చేసి, దళారుల ప్రమేయానికి ఎలాంటి ఆస్కారం లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా నేరుగా రైతుల ఖాతాలోకి కనీస మద్ధతు ధర చెల్లింపులను జమ చేయనున్నారు. పౌరసరఫరాల సంస్థ దగ్గర నిధుల సమస్య లేదని, అవసరమైన నిధులున్నాయని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ శ్రీ అకున్‌ సబర్వాల్‌ తెలిపారు.కర్ణాటక ఎన్నికలకు తెలంగాణ సర్కార్ సాయం

Updated By ManamThu, 04/26/2018 - 16:31

Telangana govt helping to karnataka Elections

హైదరాబాద్: కర్ణాటక ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తోంది. 800మంది తెలంగాణ పోలీసులు ఎన్నికల్లో విధులు నిర్వహించనున్నారు. ఈ విషయమై సీఎస్ జోషి మీడియాతో మాట్లాడుతూ..  సరిహద్దు జిల్లాల్లోని చెక్‌పోస్ట్‌‌లు పటిష్టం చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీచేసినట్లు జోషి తెలిపారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, గద్వాల జిల్లాల్లో కర్ణాటక పోలింగ్‌కు 48 గంటల ముందు వైన్‌షాపులు బంద్ చేస్తామని సీఎస్ తెలిపారు.'డిండి ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టడమే సముచితం'

Updated By ManamSat, 04/14/2018 - 12:55

Name of Dindi irrigation scheme, Telangana govt, CM Kcr హైదరాబాద్‌: డిండి ఎత్తిపోతల పథకానికి నీటిపారుదల రంగ నిపుణులు, దివంగత ఆర్.విద్యాసాగర్ రావు పేరు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాసాగర్ రావు మొదటి వర్ధంతి రానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకొని సంబంధిత దస్త్రంపై సంతకం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. సాగునీటి రంగంలో తెలంగాణపై జరిగిన వివక్షను విద్యాసాగర్ రావు ఎలుగెత్తి చాటారని.. సంక్లిష్టమైన విషయాలను చాలా సులువుగా అర్థమయ్యే విధంగా విడమరిచి చెప్పి ప్రజలను చైతన్య పరిచారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆయన.. ముఖ్యంగా సాగునీటి అంశాలపై విస్తృత చర్చకు అవకాశం కల్పించారని అభిప్రాయపడ్డారు.

ఫ్లోరైడ్ పీడిత నల్గొండ జిల్లాకు తాగునీరు, తెలంగాణలో బీళ్లుగా మారిన భూములకు సాగునీరు అందివ్వాలనేది విద్యాసాగర్ రావు జీవితాశయమన్న కేసీఆర్ చెప్పారు. ఆయనకు ఘననివాళిగా ఆయన పుట్టిన నల్గొండ జిల్లాకు నీరందించే డిండి ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టుకోవడం సముచితంగా ఉంటుందని భావిస్తున్నామని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత ప్రాంతాలకు మంచినీరు, సాగునీరు అందించే ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టడం సబబుగా ఉంటుందని అన్నారు. ఇకపై ఈ ప్రాజెక్టును ఆర్.విద్యాసాగర్ రావు డిండి ఎత్తిపోతల పథకంగా పరిగణించాలని నీటి పారుదల శాఖను ఆదేశించారు.గొర్రెలకు ఉచితంగా దాణా

Updated By ManamSun, 04/01/2018 - 01:32
 • ఒక్కో యూనిట్‌కు 4 బస్తాలు

 • గొర్రెలకాపరి మరణిస్తే 6 లక్షలు

 • రాష్ట్రవ్యాప్తంగా 17వేల నీటితొట్టెలు

talasaniహైదరాబాద్ (మనం ప్రతినిధి): వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెల కోసం ఉచితంగా దాణా అందిం చనున్నట్టు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇందుకుగానూ రూ.66 కోట్లు వెచ్చించనున్నట్లు వివరించారు. శనివారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణాలో ఇప్పటి వరకు 2,53,785 మంది లబ్ధిదారులకు 53 లక్షల పైచిలుకు గొర్రెలను పంపిణీ చేశామన్నారు. వీటి రక్షణకోసం యూనిట్‌కు 4 బస్తాల దాణాను అందిస్తున్నామన్నారు. వేసవిలో ఎక్కువ కోతలు ఇచ్చే మేలు రకపు పశుగ్రాస విత్తనాలను 75 శాతం రాయితీపై ఇవ్వనున్నట్టు వివరించారు. గొర్రెలకు బీమా సౌకర్యం కల్పించామని, చనిపోయిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తే పరిహారం పొందవచ్చని మంత్రి తెలిపారు.

             గొర్రెల పెంపకందారుడు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని తెలిపారు. రాబోయే కొద్దిరోజుల్లో తెలంగాణ మాంసం ఎగుమతి చేసే స్థాయికి చేరుతుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో ఆధునిక సౌకర్యాలతో గొర్రెల పెంపకంపై శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. పశువుల ఆరోగ్యానికి సంబంధించి 1962 కాల్‌సెంటర్ ద్వారా వెటర్నరీ సేవలందిస్తున్నామని, మొత్తం 100 సంచార పశు వైద్యశాలలు పనిచేస్తున్నాయన్నారు. శాఖ కార్యద ర్శి సందీప్‌కుమార్ సుల్తానియా మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకుని గొర్రెల తాగునీటిపై రాష్ట్రవ్యాప్తంగా 17వేల నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 3వేల నీటితొట్లు అందుబాటులోకి వచ్చాయని, గొర్రెల కోసం 90% సబ్సిడీ పై షెడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related News