Ganta srinivasa rao

నేను కూలీ నెంబర్ వన్

Updated By ManamWed, 09/05/2018 - 22:59
  • రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్ చేయడమే లక్ష్యం  

  • మానవవనరుల అభివృద్ధి బాధ్యత టీచర్లదే

  • గురుపూజోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు 

chandrababuగుంటూరు: ఆకాశమే హద్దుగా ఎదిగే అవకాశం విద్యార్థులకు ఉందని, వారిని ఆ దిశగా నడిపించే దిక్సూచిలా ఉపాధ్యాయులు ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విద్యార్థులను  ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ద్వారా రాష్ట్రాన్ని మేలైన మానవ వనరులకు గమ్యస్థానంగా మలచాలని, ఈ బాధ్యతను ఉపాధ్యాయులందరూ తీసుకోవాలని కోరారు. మానవ వనరుల అభివృద్ధికే బడ్జెట్‌లో ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. బుధవారం మంగళగిరిలో జరిగిన గురుపూజోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సాధారణ కుటుంబంలో పుట్టిన సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఎదగడం ఆయన పట్టుదలకు నిదర్శనమని అన్నారు. అదే పట్టుదల, స్ఫూర్తి ఇప్పుడు అందరికీ కావాలన్నారు. chandrababuరాధాకృష్ణన్ వంటి వ్యక్తి తెలుగు గడ్డపై పెరగడం మనకు గర్వకారణమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను విజ్ఞానాంధ్రప్రదేశ్‌గా, ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి వివరించారు. తాను రాష్ట్రంలో నెంబర్‌వన్ కూలీలా కష్టపడుతున్నానని, అందరం అదేస్థాయిలో శ్రమిస్తే అత్యుతమ ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. తనను జీవితంలో ఎక్కువ ప్రభావితం చేసింది గురువులేనని, తనకు వారిపై అంచంచల విశ్వాసం, నమ్మకం ఉందన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తా...
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సమాజంలో సమస్యలకు పరిష్కారం చూపేదిగా చదువు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఒత్తిడి నడుమ విద్యను అభ్యసించే పరిస్థితి ఉండకూడదని, ఆహ్లాదంగా-ఆనందంగా విద్యను అర్జించేలా చూడాలని చెప్పారు. ఉపాధ్యాయులు 24 గంటలు తరగతి గదుల్లోనే గడపకుండా ప్రకృతిని ప్రేమిస్తూ సేద తీరాలని, ఒత్తిడి తగ్గించుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు నరేగా నిధులతో ప్రహరీ గోడలు నిర్మించడంతో సహా 2022 నాటికి అన్ని జూనియర్ కళాశాలలకు సొంత భవనాలు సిద్ధం చేయాలని సంకల్పించామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా మరికొన్ని ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు ప్రారంభిస్తున్నామని, అలాగే ఉపాధ్యాయుల నియామకాలు చేపడతామని చెప్పారు. డ్రాప్ అవుట్స్ భారీగా తగ్గించగలగడం, 2014కు ముందు విద్యారంగంలో వెనుకబడిన రాష్ట్రాన్ని ప్రస్తుతం దేశంలోనే 3వ ర్యాంకులో నిలబెట్టడం ప్రభుత్వ విజయాలుగా పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి నిత్య విద్యార్థి: గంటా  
విద్య, విజ్ఞానం అంటే ఎంతో ఆసక్తి చూపే ముఖ్యమంత్రి గతంలో ఏ ప్రభుత్వం చేయనంతగా విద్యాభివృద్ధికి రూ.25 వేల కోట్లు ఖర్చు పెట్టారని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఎంతో జ్ఞానం వున్నా కొత్త విషయాలు నేర్చుకునేందుకు ముఖ్యమంత్రి నిత్య విద్యార్ధిలా ముందుంటారని చెప్పారు. కార్యక్రమంలో ముందుగా జ్యోతిని వెలిగించి, సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాల వేసి సభను ప్రారంభించిన ముఖ్యమంత్రి, చివరిగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి పురస్కారాలు ప్రదానం చేశారు.

పీవీ సింధుకు సత్కారం
ఉపాధ్యాయ దినోత్సవ వేడుకకు హాజరైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును సభా వేదిక మీద ముఖ్యమంత్రిchandrababu గౌరవించి, సత్కరించారు. దేశం గర్వించదగిన క్రీడాకారిణి పీవీ సింధూ ఈ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందని, ఆంధ్రప్రదేశ్‌కు ఖ్యాతిని, గౌరవాన్ని తీసుకువచ్చారని చెప్పారు. కామన్వల్త్ క్రీడలు, వరల్డ్ చాంపియన్ షిప్, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన సింధుకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఒలంపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించాలని ఆకాంక్షించారు.   పీవీ సింధు 23 ఏళ్ల వయసులోనే ఇన్ని విజయాలు సాధించడం వెనుక ఆమె ఎంతో కఠోరంగా శ్రమించారని చెప్పారు. సింధు మాదిరిగా ఎందరినో తయారుచేయాలని ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి కోరారు.

తల్లిదండ్రులే తొలి గురువులు: సింధు
ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ తన తల్లిదండ్రులు తన కు మొదటి ఉపాధ్యాయులని, తనను ఈస్థానంలో గురువులే నిలిపారని అన్నారు. రాష్ట్రానికి, దేశానికి మరింత పేరు తెస్తానని, ప్రజల ఆశీస్సులు కావాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్ బాబు, పలువురు ప్రజా ప్రతినిధులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.'డీఎస్సీపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం' 

Updated By ManamTue, 09/04/2018 - 20:44

Ganta Srinivasa rao, DSC Posts, AP cabinet meetingవిజయవాడ: డీఎస్సీ పరీక్షపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఏపీ మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్సీ పోస్టులకు సంబంధించి వివరాలను సిద్ధం చేశామన్నారు. ఈనెల 6న జరిగే ఏపీ కేబినెట్ సమావేశంలో డీఎస్సీపై ఓ నిర్ణయానికి వస్తామని పేర్కొన్నారు. ట్రిపుల్‌ ఐటీలకు సంబంధించి సంబంధిత అధికారులు, డైరెక్టర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇందులో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులు, మెంటార్లు, బోధనేతర సిబ్బంది సమ్మె నోటీసు అంశంపై చర్చిస్తామన్నారు. అదేవిధంగా నూజివీడు ట్రిపుల్‌ ఐటీపై వస్తోన్న అనేక విమర్శలపైనా సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి గంటా స్పష్టం చేశారు. ఏపీ సెట్ ఫలితాలు విడుదల

Updated By ManamSun, 08/19/2018 - 00:55
  • పరీక్షకు 33,320 మంది హాజరు

  • 2,481 మంది అభ్యర్థుల అర్హత.. 7.4 శాతం ఉత్తీర్ణత: మంత్రి గంటా

  • 20న జరగాల్సిన జ్ఞానభేరి వాయిదా.. వాజ్‌పేయి మృతితో మంత్రి నిర్ణయం

ganta srinivashవిశాఖపట్నం: రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష (ఏపీసెట్) ఫలితాలను మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. శనివారం విశాఖపట్నంలోని ఏయూ కాన్వకేషన్ హాల్‌లో ఫలితాలను ప్రకటించారు. ఏపీ సెట్‌కు 42,663 మంది దరఖాస్తు చేసుకోగా 33,320 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 31 సబ్జెక్టుల్లో జరిగిన పరీక్షలో పురుషుల్లో 17,471 మంది హాజరవగా 1553 మంది అర్హత సాధించారన్నారు. అలాగే మహిళల్లో 15,489 మంది హాజరవగా 928 మంది అర్హత సాధించారని తెలిపారు. మొత్తం 2,481 మంది అర్హత పొందారని వెల్లడించారు. 7.4 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. గతేడాది కన్నా ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగిందని మంత్రి గంటా వెల్లడించారు. ఏపీ సెట్‌ను ఏయూ వరుసగా మూడో సంవత్సరం సమర్థంగా నిర్వహించిందన్నారు.

జ్ఞానభేరి వాయిదా
ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్‌లో ఈ నెల 20న నిర్వహించాల్సిన జ్ఞానభేరి కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతి కారణంగా వాయిదా వేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 27న నిర్వహించాలని భావిస్తున్నామన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి తేదీని ఖరారు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు, రెక్టార్ ఆచార్య కె.గాయిత్రి దేవి, రిజిస్ట్రార్ ఆచార్య కె.నిరంజన్, ఏపీసెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.మంత్రి గంటా ఇంటి వద్ద ఉద్రిక్తత

Updated By ManamMon, 07/30/2018 - 14:29

ganta విశాఖపట్నం: మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ విశాఖలోని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటి వద్ద కార్మికులు బైఠాయించారు. ఏళ్లుగా పనిచేస్తున్న వారికి కనీస వేతనం ఇవ్వని ప్రభుత్వం, ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ఎంతవరకు సమంజసం అంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గంటా ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. అక్కడికి చేరుకున్న పోలీసులను కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో హైవేను దిగ్బంధించేందుకు కార్మికులు ప్రయత్నించగా.. భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది.పవన్ తీరు చూసి జనం నవ్వుతున్నారు: మంత్రి

Updated By ManamWed, 07/18/2018 - 08:53

ganta, pawan అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను మరీ చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారని, ఆయన తీరును చూసి జనం నవ్వుకుంటున్నారని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి పవన్‌పై ఫైర్ అయ్యారు. ప్రజలకు ఏదో చేయడానికి అన్నీ వదిలేసుకుని వచ్చానని పదేపదే చెబుతున్న పవన్ మాటలు ఉత్తవేనని అన్నారు. 

రైల్వే జోన్ కోసం టీడీపీ విశాఖలో దీక్ష చేస్తున్న సమయంలోనే ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్, ఆ దీక్షకు ఎందుకు మద్దతివ్వలేదని ప్రశ్నించారు. మోదీని చూసి పవన్, జగన్ ఇద్దరు భయపడుతున్నారని గంటా వ్యాఖ్యానించారు.టెట్‌లో.. 57% అభ్యర్థుల ఉత్తీర్ణత

Updated By ManamTue, 07/03/2018 - 00:37
  • ఫలితాలు విడుదల చేసిన మంత్రి గంటా

  • జూలై 6న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 9 వరకు దరఖాస్తుల స్వీకరణ

  • ఆగస్టు 24, 25, 26 తేదీల్లో రాత పరీక్ష.. సెప్టెంబరు 15న డీఎస్సీ ఫలితాల వెల్లడి

Gantaఅమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో మొత్తం 57.48 శాతం మంది అర్హత సాధించినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గల వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఆయన టెట్-2018 ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్ష కు 3,97,957 మంది దరఖాస్తు చేసుకోగా 3,70,573మంది హాజరయ్యారని.. వారిలో 2,13,042 మంది ఉత్తీర్ణత సాధిం చారని పేర్కొన్నారు. పేపర్-1లో 69.36%, పేపర్-2ఏ సోషల్‌లో 45.1%, 2ఏ గణితం, సైన్స్‌లో 42.33 శాతం, 2ఏ లాంగ్వేజెస్‌లో 57.27 శాతం, పేపర్ 2బీ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో 54.06 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు.  10,351 ఉపాధ్యాయ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్‌ను జూలై 6న ఏపీపీఎస్సీ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. జూలై 7 నుంచి ఆగస్టు 9 వరకు దరఖాస్తులు స్వీకరణ, ఆగస్టు 24, 25, 26 తేదీల్లో రాత పరీక్ష, సెప్టెంబరు 15న ఫలితాల విడుదల ఉంటాయని మంత్రి గంటా వెల్లడించారు. రిజర్వేషన్ల ప్రకారం అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

టాపర్‌లు వీరే..
పేపర్ 1 - వేమన కుసుమ(146 మార్కులు), కృష్ణా జిల్లా
పేపర్ 2ఏ సోషల్ స్టడీస్ - ఆర్ల విష్ణుప్రియ(136 మార్కులు), ఒంగోలు, 
పేపర్ 2ఏ మాథ్స్, సైన్స్ - విజయలక్ష్మి(135 మార్కులు), విజయనగరం
పేపర్ 2ఏ తెలుగు - చింతపల్లి లావణ్య(134 మార్కులు), నెల్లూరు
పేపర్ 2ఏ హిందీ - అచ్చుకుట్ల గౌసియా(142 మార్కులు), కడప
పేపర్ 2ఏ ఇంగ్లిష్ - ఎం.ప్రభాకర్ బాబు(138 మార్కులు), గుంటూరు
పేపర్ 2బీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ - షంషుద్దీన్(135 మార్కులు), కృష్ణా జిల్లా
పేపర్ 2బీ ఫిజికల్ ఎడ్యుకేషన్ - పి.వేణుగోపాల్(135 మార్కులు), చిత్తూరుఏపీ టెట్ ఫలితాలు విడుదల

Updated By ManamMon, 07/02/2018 - 11:28

Ganta srinivasa rao

విశాఖ : ఏపీ టెట్ ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇవాళ ఉదయం విశాఖలో ఉపాధ్యాయ అర్హత రాత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 57.48 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

కాగా ఫలితాలను జూన్ 30న విడుదల చేయాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో ఫలితాల విడుదలకు రెండురోజులు జాప్యం జరిగింది. గత నెల పదో తేదీ నుంచి 19 వరకూ టెట్ పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా ఈ పరీక్షకు మొత్తం 3,97,957 మంది దరఖాస్తు చేసుకోగా 3,70,576 మంది పరీక్షకు హాజరయ్యారు.ఆ విషయాలన్నీ మంత్రి చినరాజప్పకు చెప్పా: గంటా 

Updated By ManamThu, 06/21/2018 - 20:24

Ganta srinivasa rao, Chinarajappa, Chandrababu naiduవిశాఖ: విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును గురువారం మంత్రి గంటా శ్రీనివాసరావు కలిసారు. భోజన విరామ సమయంలో మంత్రి గంటాతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. సాయి ప్రియ రిసార్ట్స్‌లోని విడిది వాహనంలో ఇద్దరూ కలిసి భోజనం చేశారు. అనంతరం మంత్రి గంటా మీడియాతో మాట్లాడుతూ.. విమానాశ్రయ వేళలు, రహదారి టోల్‌ ఛార్జీల పెంపుపై సాయంత్రం సీఎం సమీక్షిస్తారని వెల్లడించారు. అలాగే తనను బాధించిన అంశాలను జిల్లా ఇంఛార్జి మంత్రి, హోంశాఖ మంత్రి చినరాజప్పకు చెప్పానని గంటా తెలిపారు.

సీఎం పర్యటనలో పాల్గొనాలని చినరాజప్ప కోరారని, అందుకే తాను పాల్గొన్నానని అన్నారు. పార్టీ తీరుపై కొద్దిరోజులుగా అసంతృప్తిగా ఉన్న గంటా శ్రీనివాసరావు రెండ్రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేతలకు సైతం ఆయన దూరంగా మెలుగుతున్నారు. దీంతో ఆయన పార్టీ మారనున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో గంటాను బుజ్జగించేందుకు విశాఖ ఇన్‌ఛార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప రంగంలోకి దిగారు. ఫలించిన రాయబారం.. అలకవీడిన గంటా

Updated By ManamThu, 06/21/2018 - 11:44

ganta  విశాఖపట్నం: టీడీపీ అధిష్టానంపై అలకబూనిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఎట్టకేలకు తన అలకను వీడారు. గంటాను బుజ్జగించేందుకు మంత్రి చినరాజప్ప ఈ ఉదయం అతని నివాసంకు వెళ్లి చర్చలు జరిపారు. చర్చల అనంతరం అలకవీడిన గంటా శ్రీనివాసరావు.. ఈ సాయంత్రం భీమిలిలో సీఎం పర్యటనకు హాజరు అయ్యేందుకు ఒప్పుకున్నారు. 

అనంతరం మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ.. భీమిలి నియోజకవర్గం సర్వేపై మంత్రి గంటా అసంతృప్తిగా ఉన్నారని, నిరంతరం ప్రజల్లో ఉండి పనిచేస్తుంటే, సర్వేలు ఆయనను బాధించాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో గంటా ఫోన్‌లో మాట్లాడారని, వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన భీమిలి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని చిన రాజప్ప చెప్పారు.గంటా అలకతీర్చేందుకు వెళ్లిన చినరాజప్ప

Updated By ManamThu, 06/21/2018 - 08:42

ganta విశాఖపట్నం: సర్వేల పేరుతో తనను అప్రతిష్టపాటు చేస్తున్నారంటూ అలకబూనిన ఏపీ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావును బుజ్జగించేందుకు ఉమముఖ్యమంత్రి చినరాజప్ప విశాఖపట్నానికి చేరుకున్నారు. కాసేపట్లో గంటా ఇంటికి చేరుకోనున్న చినరాజప్ప ఆయనను బుజ్జగించనున్నారు. అయితే ఇటీవల అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశానికి గంటా హాజరుకాకపోవడం కలకలం రేపింది. ఓ సర్వేలో తనపై అసంతృప్తి వచ్చిందన్న కారణంతోనే ఆయన ఈ సమావేశానికి డుమ్మా కొట్టినట్లు తెలిసింది.

మరోవైపు గురువారం గంటా నియోజకర్గమైన భీమిలిలో సోలార్ ప్యానెళ్ల ఉత్పత్తిని ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు రానున్నారు. ఈ సమయంలో ఆ కార్యక్రమానికి గంటా రాకపై అనుమానాలు వ్యక్తం అవ్వడంతో అతడిని బుజ్జగించేందుకు చినరాజప్ప రంగంలోకి దిగారు. కాగా సర్వేపై గంటా బాధపడుతున్నారని తెలిసి పార్టీకి చెందిన పలువురు నేతలు ఆయన ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. సర్వేలు పట్టించుకోవల్సిన అవసరం లేదని, చంద్రబాబు కూడా మనసులో పెట్టుకోలేదని వారు గంటాతో చెప్పినట్లు సమాచారం.

Related News