chukka sathaiah

చుక్క సత్తయ్యకు ఎంపి కవిత నివాళి

Updated By ManamFri, 11/10/2017 - 13:56
Chukka Sathaiah

ప్రముఖ ఒగ్గు కథ కళాకారుడు చుక్క సత్తయ్య భౌతికకాయానికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత నివాళులు అర్పించారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం మాణిక్యపూర్‌కు సీఎం కార్యాలయం ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ లతో హైదరాబాద్ నుండి  వెళ్లారు. సత్తయ్య కుటుంబ సభ్యులను కవిత ఓదార్చారు. ఈ సందర్భంగా చుక్క సత్తయ్య తెలంగాణ సమాజానికి, ఒగ్గు కథకు గుర్తింపు తేవడానికి చేసిన కృషిని ఆమె కొనియాడారు.


తన జీవితాన్ని ఓగ్గు కథ కళారూపానికి అంకితం చేసిన సత్తయ్య మృతి తెలంగాణకు తీరని లోటని కవిత అన్నారు. చుక్కా సత్తయ్య వారసులు కూడ ఆయన బాటలో నడుస్తుండటం ఆయనకు ఒగ్గు కథ పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తున్నదని అన్నారు.
 చుక్క సత్తయ్య పేరు చిరస్ఠాయిగా నిలిచే విధంగా తెలంగాణ ప్రభుత్వం కళాకారులకు తోడ్పటునిస్తుందని కవిత తెలిపారు. అలాగే మరుగున పడిన కళలను, కళాకారులను,  తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య తదితరులు చుక్కా సత్తయ్య కు నివాళులు అర్పించారు.



చుక్క సత్తయ్య ఇక‌లేరు..

Updated By ManamThu, 11/09/2017 - 12:54

chukka sathaiah, no more,  artistజనగాం: ప‌్ర‌ఖ్యాత ఒగ్గు క‌ళాకారుడు చుక్క స‌త్త‌య్య ఇవాళ(82) క‌న్నుముశారు. ఒగ్గు క‌థ చెప్ప‌డంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని ఏర్ప‌రుచుకున్నారయ‌న‌. చిన్న‌ప్ప‌టి నుంచే ఒగ్గు క‌థ‌పై ఉన్న మ‌క్కువ‌తో ఒగ్గుక‌థ‌నే శ్వాస‌త‌గా మార్చుకొని దేశ వ్యాప్తంగా ఎన్నో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు. ఇందిరా గాంధీ ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు స‌త్త‌య్య ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను గుర్తించి స్వ‌యంగ‌గా ఇందిర‌గా రా గాంధీ త‌న చేతుల‌తో స‌న్మానించారు.    

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగ‌త నేత వైఎస్‌రాజశేఖరడ్డిచే ‘రాజీవ్‌గాంధీ’ అవార్డు రాష్ట్ర సాంస్కృతిక శాఖచే హంస అవార్డు, మద్రాస్ వారిచే కళాసాగర్ అవార్డు తదితర సత్కారాలు అందుకున్నారు. జనగామ కేంద్రంగా జ్యోతిర్మయి లలిత కళా సమితిని ఏర్పాటు చేశారు. ఒగ్గుకథ, ఒగ్గు డొళ్లు శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసి ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇస్తున్నారు. ఒగ్గు కళకు ఆయన అందించిన సేవలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం సత్తయ్యకు ప్రతి నెల రూ.10వేల పింఛను అందిస్తోంది. 

 

 





Related News