central government

మూడేళ్లకే ఉద్యోగులకు గ్రాట్యుటీ!

Updated By ManamMon, 11/12/2018 - 15:53
employees Gratuity tenure from five to three years?

న్యూఢిల్లీ : గ్రాట్యుటీ సర్వీసుపై కేంద్ర ప్రభుత్వం త్వరలో తీపి కబురు అందించనుంది. ఏ ఉద్యోగి అయినా గ్రాట్యుటీ పొందేందుకు ఉద్యోగుల సర్వీసును ప్రస్తుతమున్న ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలపనుంది. ఈ ఏడాది చివరిలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకోనుంది. ఇది కనుక అమల్లోకి వస్తే సంఘటిత రంగంలోని పనిచేసే లక్షలాది ఉద్యోగులు, కార్మికులకు ఇది నిజంగా శుభవార్తే. 

గ్రాట్యుటీ కాలపరిమితిని మూడేళ్ల కన్నా మరింత తగ్గించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఒకవేళ గ్రాట్యుటీ గడువును మూడేళ్లకు తగ్గిస్తే దాని ప్రభావం ఏవిధంగా ఉంటుందనే దానిపై  కార్మిక మంత్రిత్వ శాఖ... పరిశ్రమ సంస్థల నుంచి ఫీడ్‌బ్యాక్ కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు  కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం దీన్ని వర్తింపచేయాలని కేంద్రం యోచిస్తోంది.

గ్రాడ్యుటీ చట్టం, 1972 ప్రకారం పది లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉన్న సంస్థలో అయిదు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు సేవలందించినందుకు పొందే బహుమతే గ్రాట్యుటీ. ఉద్యోగులు పదవీ విరమణ చేసినా లేదా వాళ్లు ఆ సంస్థ నుంచి వైదొలిగే సమయంలో పనిచేసిన సంవత్సరాల ప్రాతిపదికన గ్రాట్యుటీ చెల్లించాలి. సెవెంత్ పే కమిషన్ అమలు అనంతరం  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం పన్ను రహిత గ్రాట్యుటీ మొత్తాన్ని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. అలాగే గ్రాట్యుటీ చట్టం యొక్క చెల్లింపులో మార్పు చేయాలంటూ యూనియన్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

గ్రాట్యుటీని పొందేందుకు ఎవరు అర్హులు?

  • ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు.
  • అయిదేళ్ల సర్వీస్ పూర్తైన తర్వాత ఉద్యోగి రాజీనామా చేసినప్పుడు.
  • ఏదైనా ప్రమాదం జరిగి మరణం లేదా శాశ్వత వైకల్యం సంభవించినప్పుడు.


రాఫెల్‌ ఒప్పందంపై పూర్తి వివరాలు ఇవ్వండి

Updated By ManamWed, 10/31/2018 - 12:10

Supreme Court, Rafale Dealన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రాఫెల్ స్కాంలో సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాఫెల్ ఒప్పందం గురించి పూర్తి వివరాలు ఇవ్వాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 10రోజుల్లో ఈ వివరాలు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 14వ తేదికి వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం. 



అల్లర్లు సృష్టించి, ప్రభుత్వాన్ని పడేయాలనుకుంటున్నారు

Updated By ManamFri, 10/26/2018 - 10:24

CM Chandrababu Naiduఅమరావతి: జగన్‌ను అడ్డుపెట్టుకొని బీజేపీ వాళ్లు రాజకీయం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకే దొంగదాడి చేయించుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. రెండోరోజు కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు నేరాలు చేసిన వ్యక్తులు రాజకీయ ముసుగులో ఉన్నారని విమర్శించారు. రాజకీయం పేరుతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించిన చంద్రబాబు.. ఎస్పీలకు, సీఐలకు తహశీల్దాలకు గవర్నర్ నేరుగా ఫోన్లు చేయొచ్చా అంటూ ప్రశ్నించారు.

విభజన చట్టం అమలు చేయమంటే కేంద్రం కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోందని, తప్పు చేసిన కేంద్రం మూల్యం చెల్లించక తప్పదు అని మండిపడ్డారు. నటుడు శివాజీ చెప్పినవన్నీ జరుగుతున్నాయని, రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి, ప్రభుత్వాన్నిపడగొట్టాలని చూస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. అల్లర్లు సృష్టించేందుకు అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి గూండాలను తెప్పిస్తున్నారని, బీహార్, ఒడిశా నుంచి ముఠాలను రప్పిస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. కేసులతో తమను కట్టడి చేయాలని చూస్తున్నారని, ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొంటామని ఈ సందర్భంగా చెప్పారు.



రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌

Updated By ManamWed, 10/10/2018 - 19:19
  • 78 రోజుల బోనస్‌కు కేంద్రం ఓకే

  • నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు వర్తింపు

  • ఒక్కో ఉద్యోగికి రూ.17.951 బోనస్

  • 11.91 లక్షల మంది ఉద్యోగులకు లబ్ది

Railway employees get 78 days bonus

న్యూఢిల్లీ : రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. దసరా సందర్భంగా ఈ ఏడాది కూడా 78రోజులకు బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను రైల్వే ఉద్యోగులకు  ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్(పీఎల్‌బీ) కింద రూ. 2,044.31 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన సమావేశం వివరాలను కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల 11.91 లక్షల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. 

కేబినెట్ నిర్ణయంతో ఉద్యోగులు తమ వేతనంతో పాటు రూ.17,951 అదనంగా బోనస్ కింద పొందనున్నారు.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్(ఆర్‌పీఎస్‌ఎఫ్) ఉద్యోగులకు ఇది వర్తించదు. మూల వేతనం రూ.7 వేల కంటే తక్కువగా ఉన్నవారికే ఈ బోనస్ వర్తించనుంది. కాగా, పర్యావరణానికి సంబంధింధి ఫిన్‌లాండ్ దేశంతో కుదిరిన ఒప్పందాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. 



రైతులకు కేంద్రం శుభవార్త...

Updated By ManamWed, 09/12/2018 - 18:43
  • ఇక నుంచి కొత్త ధాన్య సేకరణ విధానం

  • ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్

farmers

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్తను అందించింది. ఇటీవల ప్రతిపాదించిన కొత్త ధాన్య సేకరణ విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. బుధవారం సమావేశమైన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఇథనాల్ ధరలను పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త ధాన్య సేకరణ విధానం అమలులోకి వస్తే.. రైతులకు తప్పనిసరిగా మద్దతు రానుంది.

ఎందుకంటే.. కొత్త విధానం ప్రకారం.. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా తక్కువకు మార్కెట్ ధరలు తగ్గిన పక్షంలో కనీస మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం హామీ ఇస్తుంది. ఫలితంగా దళారులు తమ ఇష్టారాజ్యంగా పంట ఉత్పత్తులకు ధరలను నిర్ణయించి రైతులను నిలువు దోపిడీ చేసేవారు. కొత్త విధానంతో అలాంటి సమస్యలన్నింటికీ చెక్ పడనుంది.

కొంతమంది అధికారులు, పాలకుల స్వార్థంతో దళారులకు కొమ్ముకాస్తూ.. మార్కెట్‌ను శాసించేవారు. కృతిమంగా పంట ఉత్పత్తులకు డిమాండ్ పెంచడం, తగ్గించడం చేయడంతో రైతులకు న్యాయం జరిగేది కాదు. కానీ కొత్త విధానం వల్ల మార్కెట్‌లో మద్దతు ధర కంటే పంట ఉత్పత్తులకు తక్కువ ధర వస్తే.. ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించేలా హామీ ఉండడంతో ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉంది. 

తదనుగుణంగా తప్పనిసరి పరిస్థితుల్లో మార్కెట్‌లోని ధరలపై ప్రభుత్వం ఆజమాయిషీ తీసుకుని.. రైతులకు మద్దతు ధర కల్పిస్తుంది. ఇదిలావుంటే.. 22 పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. దీనికితోడు ఇటీవల ఈ పంటల ఉత్పత్తులకు మద్దతు ధరను పెంచారు. కొత్త ధాన్య సేకరణ విధానం వల్ల కేంద్రంపై రూ.40వేల కోట్ల అదనపు భారం పడుతుందని కేంద్రం అంచనా వేసింది. అలాగే లీటర్ ఇథనాల్‌కు ఇప్పుడు వస్తున్న రూ.47.5లను ఏకంగా రూ.52కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.



‘కేంద్రం చెప్పేదొకటి..చేసేదొకటి’

Updated By ManamTue, 07/31/2018 - 13:46
Yanamala ramakrishnudu

అమరావతి : కేంద్ర ప్రభుత్వం చెప్పే విషయాలకు... వాస్తవాలకు పొంతన లేదని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్‌పై ఆయన మంగళవారం అమరావతిలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ..‘ఏపీకి ఇచ్చిన హామీలు అమలు అయ్యేవరకూ కేంద్రంతో పోరాడతాం.

పదో షెడ్యూల్‌లోని సంస్థలపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కేంద్రం అమలు చేయడం లేదు. సుప్రీంకోర్టు, చట్టసభలను కేంద్రం తప్పుదోవ పట్టిస్తోంది. రైల్వేజోన్‌పై కేంద్రం చెప్పిందొకటి..చేసిందొకటి. పార్లమెంట్‌లో చట్టానికే దిక్కు లేకపోతే ఎవరికి చెప్పాలి.   

రిజర్వేషన్లపై కేంద్రం చట్ట సవరణ చేయాల్సి ఉంది. రాజ్యంగ సవరణ చేస్తుందో లేదో కేంద్రమే చెప్పాలి. మనం చట్టం చేసి పంపించాం. కాపుల రిజర్వేషన్లపై జగన్ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నాడు. ఇక రాష్ట్ర సమస్యలపై వైఎస్సార్ సీపీ, జనసేన పార్టలు కేంద్రాన్ని నిలదీయడం లేదు.’ అని విమర్శించారు.



ఏపీ సీఎస్‌కు కేంద్రం నుంచి పిలుపు

Updated By ManamTue, 02/20/2018 - 12:56

Dineshఅమరావతి: రాష్ట్రం గురించి చర్చలు జరిపేందుకు ఏపీ సీఎస్‌ దినేష్ కుమార్‌కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఈ మేరకు 23వ తేది సాయంత్రం హోంమంత్రిత్వ శాఖ మీటింగ్‌కు రావాలని సీఎస్‌కు సమాచారం వచ్చింది. పీఎంవో, రైల్వే బోర్డు అధికారులు పాల్గొనే ఈ మీటింగ్‌లో ఐదు అంశాలపై చర్చ జరగనుంది. అందులో రైల్వే జోన్, ఆర్థిక లోటు, కడప స్టీల్ ప్లాంట్, దుగ్గరాజపట్నం పోర్టులు ముఖ్యంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. వీటికి సంబంధించి రాష్ట్ర ప్రతిపాదనలు, స్టేటస్ రిపోర్ట్‌తో ఏపీ సీఎస్ రావాలని కేంద్రం సూచించింది. అలాగే ఈ భేటీలో తొమ్మిది, పది షెడ్యూల్‌లోని విభజనపైనా చర్చ జరగనుండగా.. తెలంగాణ రాష్ట్ర అధికారులు హాజరుకానున్నారు.



‘సైలెంట్‌గా కూర్చుంటే ఇక కుదరదు’

Updated By ManamSun, 02/04/2018 - 13:21

CM Chandrababu Naidu serious on Centreఅమరావతి: కేంద్రం ఏం చేస్తున్నా మనం ఇంకా సైలెంట్‌‌గా కూర్చుంటే కుదరదనీ.. మనం కూడా ఎదురుదాడికి దిగాలన్నట్లుగా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో టీడీపీ ఎంపీలు, మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించినట్లుగా తెలుస్తోంది. సుమారు రెండుగంటలుగా జరుగుతున్న ఈ సమావేశంలో ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. దశలవారీ ఆందోళనలు చేయాలని ఎంపీలు సూచించగా మరికొందరు రాజీనామా చేయాల్సిందేనని ఇంకొందరు ఎంపీలు చంద్రబాబుకు తేల్చిచెప్పారు. కేంద్రమంత్రులతో రాజీనామాలు చేయించాలని మరికొందరు ఎంపీలు.. సీఎంకు సూచించారు.

"ప్రధాని మోదీ ఫొటోలు పెట్టలేదని కొంతమంది బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని అదంతా నిజం కాదన్నారు. పార్టీలకతీతంగా కేంద్ర బడ్జెట్‌ను అందరూ వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ ఇంకా నాటకాలాడుతున్నారు. వీటన్నింటిపైనా ప్రజలకు నిశితంగా వివరించండి. నాలుగు బడ్జెట్ల తర్వాత కూడా ఇంకా సహనం ఎక్కడుంటుంది?. ఏపీని ప్రత్యేకంగా చూడాలని చాలాసార్లు కేంద్రానికి చెప్పాను. నియోజకవర్గాల పునర్విభజన అసలు సమస్యేకాదు. విభజన చట్టంలో పెట్టారు కాబట్టి అడుగుతున్నాం అంతే. దాన్ని ప్రధానాంశంగా తీసుకుని మీరెవరు మాట్లాడొద్దు" అని పార్లమెంటరీ సమావేశంలో మంత్రులు, ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.



ఆస్తుల వివరాలు చెప్పకపోతే 'నో' ప్రమోషన్

Updated By ManamWed, 12/27/2017 - 07:57

Moneyన్యూఢిల్లీ: వచ్చే నెల నాటికి దేశంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులంతా తమ ఆస్తుల వివరాలను చెప్పాలని లేదంటే ప్రమోషన్లు, విదేశీ పోస్టింగులకు సంబంధించి విజిలెన్స్ అనుమతులు నిలిపివేస్తానని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రెయినింగ్‌ (డీవోపీటీ) హెచ్చరించింది. ఈ మేరకు అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తున్న ఐఏఎస్‌లకు సూచించింది. 

దీని ప్రకారం 2018 జనవరి 31 నాటికి స్థిరాస్తులకు సంబంధించి రిటర్నులు (ఐపీఆర్‌) దాఖలు చేయాలని పేర్కొంది. ఐపీఆర్‌ దాఖలు చేయని అధికారులకు సంబంధించిన ప్రమోషన్లు, విదేశీ పోస్టింగులకు సంబంధించిన విజిలెన్స్‌ అనుమతులు నిలిపివేస్తామని అడిషనల్ సెక్రటరీ పీకే త్రిపాఠి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక డీవోపీటీ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,004 మంది ఐఏఎస్‌ అధికారులు పనిచేస్తున్నారు.



అన్నదాతలకు ఆసరా ఏదీ?

Updated By ManamWed, 09/20/2017 - 16:55

రైతే దేశానికి వెన్నెముక అని అంటారు. కానీ ఇప్పుడా వెన్నెముకే విరిగిపోతోంది. రైతుకు కనీస ఆదాయం కూడా ఉండటం లేదు. పదిమందికీ అన్నం పెట్టే రైతన్న తాను రోజుకు మూడు పూట్లా నాలుగు వేళ్లు నోట్లో పెట్టుకోలేకపోతున్నాడు. పిల్లలకు సరైన చదువులు చెప్పించే పరిస్థితి కూడా ఉండట్లేదు. ఆరుగాలం కష్టపడి పొలంలో ఎండనక, వాననక, పగలనక, రేయనక నిరంతరాయంగా కష్టపడినా దానికి తగిన ఫలితం రావడం లేదు. గిట్టుబాటు ధర కాదు కదా.. కనీసం మద్దతు ధర కూడా లభించడం లేదు. ప్రపంచంలో ఏ వస్తువు తయారు చేసేవాళ్లయినా దాని ఉత్పత్తి కోసం అయిన ఖర్చు, పన్నులు, రవాణా, నిల్వ, మార్కెటింగ్.. వీటన్నింటితో పాటు తమ లాభాలు కూడా వేసుకుని ఆ ధరకు అమ్ముతారు. అంటే ఆ వస్తువు ధరను వాళ్లే నిర్ణయిస్తారు. అందుకే పావలా, అర్ధ రూపాయి తయారీ ఖర్చు ఉండే వస్తు వులు వినియోగదారుల వరకు వచ్చేసరికి రూపాయి, రూపాయన్నరకు కూడా అమ్ముతుంటారు. గుండు సూది నుంచి మోటారు కారు వరకు ఇదే సిద్ధాంతం అమలవుతుంది. కానీ ఒక్క వ్యవసాయో త్పత్తుల విషయంలో మాత్రం ఇది అమలు కావడం లేదు.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రైతులు తమ కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకునే పొలాల్లో ఎంత కష్టపడి పెంచినా వాటికి తగిన ధర మాత్రం రావడం లేదు. కుటుంబం మొత్తం కష్టపడి పొలాల్లో పనిచేసి దుక్కి దున్నడం నుంచి మొదలుపెట్టి, చివరకు దిగుబడి వచ్చిన పంటను మార్కెట్ వరకు తరలించి అమ్ముకుందాం అనుకు నేసరికి అప్పటివరకు చాలా ఎక్కువ స్థాయిలో ఉండే రేట్లు కూడా ఒక్కసారిగా పడిపోతున్నాయి. ఇటీవలి వరకు ఉల్లిపాయల ధర ఆకాశంలో ఉండేది. వినియోగదారులు కొనాలంటే కిలో 60 రూపాయలకు పైగా కూడా వెళ్లింది. దాంతో కిలో ఉల్లిపాయలు కొనుక్కుని వాటినే వారం, రెండు వారాలు కూడా వాడుకోవల్సిన పరిస్థితి తలెత్తింది. కానీ తీరా పంట సీజన్ మొదలై రైతుల చేతికి దిగుబడి వచ్చి, దాన్ని మార్కెట్ వరకు తీసుకెళ్లేసరికి వాళ్లకు కిలో 3 రూపాయల కంటే ఇచ్చేది లేదని వ్యాపారులు కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు. క్వింటాలుకు 300 రూపాయలు మాత్రమే ధర చెల్లిస్తా మని తెలుగు రాష్ట్రాలలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన కర్నూలు మార్కెట్లో వ్యాపారులు చెప్పారంటే.. పరిసి ్థతి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అన్నాళ్లు కష్టపడిన పంటను అంతే ధరకు అమ్మాలంటే కనీసం లారీ రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఒక రైతు గుండెపోటుతో మరణించాడు కూడా. 

ప్రతిసారీ ఇలాగే జరుగుతోంది. ఏదైనా ఒక పంటకు రేటు బాగుందని రైతులంతా పెద్ద ఎత్తున ఆ పంట పండించడం, తీరా వాళ్లు మార్కెట్ వరకు తీసుకొచ్చేసరికి దానికి ఏమాత్రం ధర పలకకపోవడంతో ఆ సరుకునంతా రోడ్లమీద పారబో యడం లేదా అక్కడికక్కడే తగలబెట్టడం లాంటి పరిణామాలు చాలాసార్లు చోటుచేసుకుంటున్నాయి. గతంలో మిర్చి పరిస్థితి ఇలాగే అయ్యింది. మిర్చిరైతుకు గిట్టుబాటు ధర కూడా రాకపోవడంతో ఆగ్రహం చెందిన రైతులు నడిరోడ్డు మీద మిర్చి లారీలను కూడా తగలబెట్టేశారు. ఉల్లి, టమోటా.. ఇలా అన్నింటి పరిస్థితీ ఇలాగే ఉంటుంది. టమోటా కూడా మొన్నటి వరకు రీటైల్ మార్కెట్లలోను, రైతు బజార్లలోను కిలో 60-70 రూపాయల వరకు పలికింది. కానీ, మదనపల్లె మార్కెట్లో మంచి సీజన్ వచ్చేసరికి నాలుగైదు కిలోలకు రూపాయి కూడా చెల్లించిన సందర్భాలు మనకు కనిపిస్తాయి. అసలు కిలో టమోటా పండించాలంటే ఎన్నాళ్లు కష్టపడాలి, భూమికి కౌలు ఎంత చెల్లించాలి, విత్తనాలు ఎంత పెట్టి కొనుగోలు చేయాలి, ఎంతకాలం ఆ మొక్కలను చంటిబిడ్డల్లా సాకాలి.. అన్నాళ్లూ రైతు, వాళ్ల కుటుంబ సభ్యుల పోషణ ఖర్చు ఎంతవుతుంది, ఆ లెక్కన టమోటా ఉత్పత్తి ధర, రవాణా, మార్కెటింగ్, లాభం.. ఇవన్నీ కలుపుకొంటే ఎంత పడుతుంది అన్న విషయాలను పట్టించుకోవాల్సిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దాంతో కిలోకు పావలా, 20 పైసలు కూడా తీసుకుని అమ్ముకోవడం, కాదనుకుంటే రోడ్ల మీదే సరుకు మొత్తం పారబోసి ఉత్త చేతులతో వెనక్కి తిరిగి వెళ్లడం లాంటి ఘటనలు చాలా సార్లు చూస్తూనే ఉన్నాం. అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తోంది? రైతే రాజు అని, జై జవాన్.. జై కిసాన్ అని ఇచ్చిన నినాదాలకు అర్థం లేకుండా ఎందుకు పోతోంది? దేశంలో మరే ఇతర వర్గానికీ లేని సమస్య రైతుల విషయంలోనే ఎందుకు వస్తోంది? ఈ విషయంలో పాలకులు ఎందు కంత దారుణంగా విఫలం అవుతున్నారు? వాళ్ల సమస్యలకు రుణ మాఫీలు మాత్రమే పరిష్కారం అవు తాయా అంటే ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే వాళ్లు ఎవరూ కనిపించడం లేదు. ముఖ్యంగా సన్న కారు, చిన్నకారు రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటోంది. 

తమకున్న అర ఎకరం, ఒక ఎకరానికి తోడు మరికొంత భూమిని కౌలుకు తీసుకుని ఏదో ఒక పంట సాగుచేస్తే దానికి గిట్టుబాటు ధర రాకపోవడంతో కనీసం కౌలు డబ్బులు కట్టే పరిస్థితి కూడా కనిపిం చడం లేదు. మరోవైపు పెద్దరైతులు మాత్రం ప్రభుత్వా ల నుంచి వచ్చే సబ్సిడీలు, ఇతర ప్రయోజనాలను పెద్ద మొత్తంలో అందుకుంటూ అన్ని రకాలుగా లాభపడు తున్నారు. చిన్న రైతులు కనీసం పూట గడిచే పరిస్థితి కూడా కనిపించక ఏం చేయాలో అర్థం కాక అల్లాడు తున్నారు.అందులోనూ ఈమధ్యకాలంలో దేశంలో చాలా చోట్ల వ్యవసాయం కూడా కార్పొరేటీకరణ దిశగా పయనిస్తోంది. కార్పొరేట్ శక్తులు ఈ రంగంలోకి కూడా ప్రవేశించి, చిన్న కమతాలు ఉన్న రైతుల నుంచి భూములు లీజుకు తీసుకుంటున్నాయి. పెద్ద పెద్ద కమతాలుగా వాటిని మార్చి వంద, రెండొందల ఎకరా ల్లో సాగు చేస్తున్నాయి. పెద్ద పెద్ద యంత్రాలతో భూమి దున్నడం, కలుపు తీయడం, డ్రోన్లతో ఎరువులు చల్లించడం.. ఇలా అన్నిరకాలుగా టెక్నాలజీని ఉప యోగించుకుంటూ ఖర్చు తగ్గించుకుంటున్నాయి. చివ రకు తమ సొంత పొలాల్లో ఆ రైతులనే కూలీలుగా మారుస్తున్నాయి. కార్పొరేట్ కంపెనీలు కావడంతో తాము పండించిన పంటను మెరుగైన పద్ధతులలో కోల్ స్టోరేజీలలో నిల్వచేయడం, గిట్టుబాటు ధర వచ్చేవరకు వాటిని అక్కడే ఉంచి, ధరలు బాగా పెరిగిన తర్వాత అమ్ముకుని భారీ మొత్తంలో లాభాలు మూటగటు ్టకోవడం లాంటివి వాళ్లకు సాధ్యం అవుతున్నాయి. బక్క రైతులు అన్నాళ్లు ఆగే పరిస్థితి ఉండదు. పండించిన పంటను వెంటనే అమ్ముకుంటే తప్ప సాగుకు చేసిన అప్పులు తీరవు. ఇలా ఒక విషవలయంలో చిన్నరైతు చిక్కుకుపోతున్నాడు. చిన్న రైతులు పండించే ఉత్పాద నలను అమ్ముకోడానికి అంటూ ప్రారంభించిన రైతు బజార్ల వ్యవస్థ కూడా దారుణంగా విఫలమైంది. రైతు బజార్లలో ఎక్కడ చూసినా వ్యాపారులే కనిపిస్తున్నారు తప్ప రైతులకు చోటు ఉండటం లేదు. పొరపాటున ఎక్కడైనా ఒకరిద్దరు రైతులు అక్కడివరకు వచ్చినా, వాళ్లకు ఏదో ఒక మూల.. చిట్ట చివర స్టాల్ ఇస్తున్నారు. ముందు వరుసలో ఉండేవన్నీ పెద్ద వ్యాపారుల స్టాళ్లే. దాంతో వినియోగదారులు రాగానే ఎదురుగా కనిపించే చోట నాలుగు రకాలు కొనేసు కుని వెళ్లిపో తున్నారు. ఇలా రైతులకు అక్కడ ప్రవేశం దొరకడమే గగనం అనుకుంటే, చిట్ట చివర ఉండటంతో బేరాలు కూడా రావడం లేదు.

మెరుగైన మార్కెటింగ్ వ్యవస్థను రైతుల వరకు తీసుకెళ్ల డానికి ప్రభుత్వా లకు మనసు ఒప్పడం లేదు. ఎన్నికల ప్రయోజనాల కోసం రైతు రుణమాఫీ లాంటి ఆకర్షణీయమైన చాక్లెట్లు, బిస్కట్లు ఇచ్చి అప్ప టికప్పుడు వారి ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారే తప్ప.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఏంటన్న విషయాన్ని ఆలోచించలేకపోతున్నారు. రైతులు తమ పంట పొలాల నుంచి కూరగాయ లను నేరుగా కాలనీలకు తీసుకొచ్చి అమ్ముకు నేందుకు వీలుగా వాళ్లకు చిన్నపాటి రవాణా వాహనాలు సమకూరిస్తే.. నలుగురైదుగురు రైతులు కలిసి చిన్న సహ కార సంఘంగా ఏర్పడి తమ కూర గాయలను తామే అమ్ముకుంటారు.

అప్పుడు మధ్యలో దళారుల ప్రమేయం ఉండదు కాబట్టి ఇటు రైతుకూ తగినంత ధర వస్తుంది, అటు వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన కూరగాయలు అందుతాయి. అలాగే బియ్యం, ఇతర పప్పు దాన్యాలు కూడా. వీటన్నింటినీ ఆరుగాలం శ్రమించి పండించే రైతుకు పైసల్లోనే ధరలు లభిస్తుంటే, కొనుగోలు చేసే సమయంలో వినియోగ దారులకు మాత్రం చుక్కలు కనపడుతున్నాయి .వ్యవసాయరంగ అభివృద్ధి విషయం లో డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ లాంటివాళ్లు చేసిన సూచనలను ఏ ప్రభుత్వమూ అమలు చేయడం లేదు. ఉత్పత్తి ఖర్చు ఎంతయిందో లెక్కించి, దానికి రెట్టింపు ధరను కనీస మద్దతుధర లేదా గిట్టుబాటు ధరగా నిర్ణయించాలని ఇచ్చిన సలహాలు ఎవరికీ పట్టడం లేదు.

రైతులు లేనిదే అసలు ఈ ప్రపంచంలో తినడానికి తిండి కూడా దొరకదన్న కనీస విషయాన్ని కూడా ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కాదు. ఉత్పాదక రంగంపై విపరీతంగా దృష్టి సారించి, ఆ రంగానికి బోలెడన్ని సదుపాయాలు, సౌకర్యాలు, రాయితీలు కల్పించి వాళ్లకు తగినంత ఉత్పత్తి చేసుకునే అవకాశం కల్పించడమే కాక వాళ్లు  తమ ఇష్టానుసారం ఎంతకు కావాలంటే అంతకు అమ్ముకునే స్వేచ్ఛ ఇస్తున్నారు. తద్వారా వాళ్లు లాభాల మీద లాభాలు ఆర్జించేందుకు ప్రత్యక్షం గానే సహకరిస్తున్నారు. మరి అదే విధానాన్ని రైతుల విషయంలో ఎందుకు అమలుచేయ లేకపోతున్నారన్న ప్రశ్నకు మాత్రం ఎక్కడా సమాధానం రావడం లేదు. దేశంలో రైతులు బాగుపడాలంటే అంతా కలిసి పెద్ద కమతాలు ఏర్పాటు చేసుకోవాలని మాత్రం చెబు తున్నారు. వినడానికి బాగానే ఉన్నా, అమలులో ఇది చాలా కష్టం అవుతుంది. అందుకే ఈ విధానాన్ని కార్పొరేట్ పెద్దలు అందిపుచ్చుకున్నారు. రైతులకు పప్పు బెల్లాలు మాత్రం పెట్టి తాము భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. రైతు బాగుపడితే దేశం చల్లగా ఉంటుందన్న విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా గమనించి, వాళ్లకు మేలు చేసే విధానాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 

చంద్రశేఖర శర్మ





Related News