kamal hasan

‘విశ్వరూపం 2’కి లైన్ క్లియర్

Updated By ManamSat, 03/17/2018 - 23:59

viswaroopam 2కమల్ హాసన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘విశ్వరూపం’ ఎన్నో వివాదాలను ఎదుర్కొంటూనే ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘విశ్వరూపం 2’ చిత్రాన్ని ప్లాన్ చేసిన కమల్ హాసన్ చాలా కాలంగా అదే పనిమీద ఉన్నారు. ఎన్నో అవాంతరాల మధ్య ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా యు/ఎ సర్టిఫికెట్ పొందింది. త్వరలోనే ఈ చిత్రం ఆడియోతోపాటు ట్రైలర్‌ని కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కమల్. సినిమా విడుదల తేదీని కూడా త్వరలోనే ప్రకటిస్తారని తెలుస్తోంది.

రాహుల్ బోస్, శేఖర్‌కపూర్, నాజర్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న కమల్.. త్వరలో శంకర్ దర్శకత్వంలో రూపొందే ‘భారతీయుడు 2’ చిత్రంలో నటించనున్నారు.'విశ్వ‌రూపం 2' ట్రైల‌ర్ అప్‌డేట్‌

Updated By ManamThu, 03/01/2018 - 22:03

viswaroopam 2లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టించ‌డ‌మే కాకుండా స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన చిత్రం 'విశ్వ‌రూపం'. ఐదేళ్ళ క్రితం విడుద‌లైన ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి కొన‌సాగింపుగా మ‌రో సినిమా రాబోతోంది. అదే 'విశ్వ రూపం 2'. ఆండ్రియా, పూజా కుమార్ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా ఈ ఏడాది ప్ర‌థ‌మార్థంలో తెర‌పైకి రానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ట్రైల‌ర్‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నారు. దీనిపై ఈ వారంలోనే క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.తనను చిన్నతనం నుంచి చూశా!

Updated By ManamMon, 02/26/2018 - 05:39

అప్పట్లో తనను కరెక్ట్ చేసే బాధ్యత నాదే
నటిగా, తల్లిగా శ్రీదేవి నిబద్ధత కనబరిచారు
తన ఆకస్మిక మరణం తీరని లోటు: కమల్

kamalచెన్నై: సినీ రంగంలో అతిలోక సుందరిగా పేరొందిన శ్రీదేవి అకాల మరణం తీరని లోటని సినీ నటుడు, రాజకీయవేత్త కమల్ హాసన్ పేర్కొన్నారు. బాలనటిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీదేవి అత్యున్నత స్థానాన్ని అందుకోవడం వెనక అలుపెరగని కృషి ఉందన్నారు. తన కృషికి తగ్గ స్థానాన్ని పొందారని తెలిపారు. తను కూడా బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన కారణంగా శ్రీదేవి ఎదుగుదలను దగ్గరి నుంచి చూడగలిగానని కమల్ వివరించారు. తామిద్దరం కలిసి పనిచేసిన సమయంలో శ్రీదేవి ఇంకా చిన్నపిల్లేనని.. అప్పుడప్పుడు నటనలో, డ్యాన్స్‌లో తనను కరెక్ట్ చేసే బాధ్యతను బాలచందర్ తనపైనే పెట్టేవారని గుర్తుచేసుకున్నారు. తొలినాళ్లలో నటనాపరంగా పరిణతి లేదు.. అయితే, ప్రతీరోజూ కొత్త విషయాలను నేర్చుకుంటూ తన ప్రతిభను సానబెట్టుకున్నారని కమల్ పేర్కొన్నారు. ఆమె ఒక్కో మెట్టు ఎక్కుతున్న తీరు నన్ను దిగ్భమ పరిచేదని చెప్పారు. నేనంటే తనకు, తనంటే నాకు ప్రత్యేక అభిమానం.. అయితే, తీరికలేని షెడ్యూల్ మూలంగా మా మధ్య దూరం పెరిగిందన్నారు. వృత్తిపై శ్రద్ధ, చేసే పనిపై చిత్తశుద్ధి విషయంలో మేమిద్దరమూ ఒకేలా ఉండేవాళ్లం.. అందుకే ఒకరిపై ఒకరికి అభిమానం ఉండేదని వివరిం చారు. ఈ ఏడాది జనవరిలో తనను చివరిసారిగా కలిసానని కమల్ గుర్తుచేసుకున్నారు. ఆ సమయం లో.. ఇప్పుడు కూడా సద్మా గీతం నా చెవుల్లో వినబడుతోందని చెప్పారు. అసమాన ప్రతిభావం తురాలైన, అందమైన నటి శ్రీదేవికి ఇదే కరెక్ట్ జోల పాట అని నాకన్పిస్తోందని పేర్కొన్నారు. సినీ రంగంలోనే కాదు ఓ తల్లిగా కూడా శ్రీదేవి నిబద్దతను చూపించారని కమల్ కొనియాడారు. జాన్వి, ఖుషిల పెంపకంలో ఆదర్శవంతమైన తల్లిగా నిలిచారన్నారు. కాగా, శ్రీదేవి ఆకస్మిక మరణంతో తీవ్ర విషాదంలో మునిగిన బోనీ కపూర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు కమల్ పేర్కొన్నారు.శ్రీ‌దేవి లాలిపాట వెంటాడుతోంది - క‌మ‌ల్‌

Updated By ManamSun, 02/25/2018 - 13:13

sreedeviక‌మల్ హాస‌న్‌, శ్రీ‌దేవి.. త‌మిళ తెర‌పై సెన్సేష‌న‌ల్ కాంబినేష‌న్‌. ఎన్నో హిట్ చిత్రాల్లో వీరి కెమిస్ట్రీ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. త‌న‌కు హిట్ పెయిర్‌గా నిలిచిన శ్రీ‌దేవి అకాల మృతిపై క‌మ‌ల్ ఇలా స్పందించారు. ''శ్రీ‌దేవి యువ‌తిగా ఉన్న ద‌శ నుంచి అద్భుత‌మైన (ప‌రిపూర్ణ‌) మ‌హిళ‌గా మారిపోయిన ద‌శ వ‌ర‌కు ఆమె జీవితానికి నేను ఓ సాక్ష్యంలా నిలిచాను. ఆమె త‌న‌కు ద‌క్కిన స్టార్ డ‌మ్‌కు అన్ని విధాలా అర్హురాలు. త‌ను ప‌రిచ‌యం అయిన‌ప్ప‌టి నుంచి చివ‌ర‌గా మేమిద్ద‌రం ఎదురుప‌డిన సంద‌ర్భం వ‌ర‌కు ఎన్నో జ్ఞాప‌కాలు న‌న్ను ఫ్లాష్‌లా వెంటాడుతున్నాయి. ఇప్పుడైతే 'స‌ద్మా' (వ‌సంత కోకిల‌)లోని లాలి పాట వెంటాడుతోంది. మ‌న‌మంతా త‌న‌ని మిస్ అయ్యాం'' అంటూ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.రాజకీయంగా కమల్ వికసిస్తారా?

Updated By ManamSat, 02/24/2018 - 08:12

kamalఇల్లు అలకగానే పండుగ కాదు. సభ విజయవంతైవెునంత మాత్రాన రాజకీయంగా విజయం సాధిస్తారనే గ్యారంటీ ఏమీ లేదు. మదురై సభ ఓ రాజకీయ వేదికే కావచ్చు. కానీ, కమల్ హాసన్ ఓ షోమాన్‌గా ఓ వెలుగు వెలిగారు. ఆయన మొదటి షో బాగా హిట్టయింది. హాస్యం, వ్యంగ్యం మేళవించి ఏకవాక్య డైలాగులతో ఆయన చేసిన ప్రసంగం లక్షలాది మంది అభిమానులను, ప్రేక్షకులను, వీక్షకులను ఆకట్టుకుంది. నిజానికి ఆయ న ఆ సభలో మాట్లాడినవన్నీ వాస్తవాలే. తమిళనాడు రాజకీయ వేదిక మీద ఒక కొత్త నాయకుడు అవతరించాడన్న అభిప్రాయాన్ని ఆయన విజయవంతంగా కలిగించారు. ఆయన తమిళనాడు అవినీతిని క్షాళన చేస్తోరో లేదో ఇప్పుడే చెప్పలేం కానీ, ఆయన ప్రసంగించిన తీరు మాత్రం బాగుంది. ఆయనలో ఓ అసలు సిసలు నాయకుడు ఉన్నాడనిపించింది. ఆయన మీదా, ఆయన పార్టీ మక్కల్ నీతి మయ్యం మీదా దేశవ్యాప్తంగా ఆసక్తి రేగడానికి ఆయ న స్టార్ హోదాయే కారణమనడంలో సందేహం లేదు. అటు దేశ, విదేశీ పత్రికలు, ఇటు స్థానిక పత్రికలు సైతం రజనీకాంత్ కంటే కమల్ హాసనే నయం అన్న రీతిలో వార్తలు గుప్పించాయి. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా రాజకీయ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న విషయం విదితమే. కమల్ హాసన్ గురించి ప్రస్తుతం ఆసక్తి కనబరుస్తున్నవారంతా, ప్రతి గ్రామం లోనూ కార్యకర్తలు ఉన్న పెద్ద పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకేలను సైతం చిన్నవి చేసి చూపించడం విశేషం. కమల్ హాసన్ పార్టీ రావడంతో ఇక ఆ పార్టీల గురిం చి పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేదన్నట్టు రాష్ట్రంలో పరిస్థితి మారిపోయింది. 

ఢిల్లీకి, తమిళనాడుకు ఎంతో భేదం
నిజానికి తమిళనాడు రాజకీయాల గురించి తెలిసిన వ్యక్తులందరికీ, ఇటువంటి అభిప్రాయంలో వాస్తవం లేదని ఇట్టే అర్థైవెుపోతుంది. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీతో ఈ పార్టీని పోల్చడం కూడా వాస్తవదూరం. ఓ రాష్ట్రమన్న పేరే గానీ ఢిల్లీ ఓ పెద్ద నగరపాలక సంస్థ. అనేక కులాలు, కులతత్వాలు, పట్టణాలు, నగరాలతో ఉన్న తమిళనాడు వంటి రాష్ట్రం ఢిల్లీకే కాక, ఇతర రాష్ట్రాలకు సైతం భిన్నైమెంది. కమల్ హాసన్, రజనీకాంత్‌లు రాజకీయంగా సాగించబోయే పోరాటాలు ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు, రాజకీయ సంస్కృతికి పూర్తిగా విరుద్ధం. అయితే, కమల్ హాసన్ అరంగేట్రం బాగుందని మాత్రమే ఇక్కడ పెద్దగా చెప్పుకోవచ్చు. 
ఓ పార్టీని నిర్మించడం ఎంతో వ్యయప్రయాస లతో కూడుకున్న పని. రాజకీయాలు ఆషామాషీ వ్యవహారం కాదు. ఇక్కడ రాజకీయాల్లో బతికి బట్టకట్టాలన్నా, ఎన్నికల్లో పోటీ చేయాలన్నా ప్రసంగాలతో సరిపోదు. భారీగా నిధులు అవసరం. ఇక బూత్ స్థాయి నిర్వహణ సామర్థ్యం అత్యవసరం. కమల్ హాసన్ తన పార్టీ నిర్మాణానికి, ఎన్నికల్లో పోటీ చేయడానికి నిష్కళంకైమెన నిధులు తీసుకు వస్తానంటున్నారు. భారతదేశంలో రాజకీయ పార్టీల తీరుతెన్నులు చూసినవారికి ఇదెంత పెద్ద సవాలో తేలికగా అర్థమవుతుంది. నాలుగున్నర దశాబ్దాలుగా చలనచిత్ర జీవితంలో మునిగి తేలుతున్న కమల్ హాసన్‌కు ఇది కొత్త వ్యవహారం. రాజకీయ వ్యాపారంలో వృత్తి నిపుణులు ఎందరో ఉన్నారు. వీరితో తలపడడం సినిమాల్లో విలన్లతో తలపడడం అంత తేలిక కాదు. 

ఇంకా మొగ్గ దశలోనే....
అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల మీ ద ఆయన ఆలోచనలన్నీ ఇంకా పూర్తిగా రూపుదిద్దుకోలేదు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అవి ఓ స్థిరైమెన భావాలుగా మారాలంటే కొంతకాలం పడుతుంది. అంతేకాదు, అనేక అంశాల మీద ఆయన ధోరణి ఇంకా చలనచిత్ర నిర్మాణానికి దగ్గరగానే ఉం ది. ఏ దర్శకుడో పక్కనే ఉండి యాక్షన్, కట్ వంటి మాటలతో ఆయనను నియంత్రించాల్సి ఉందేమోనని కూడా అనిపించింది. వాస్తవ జీవితానికి, సినిమా జీవితానికిహస్తిమశకాంతరం తేడా ఉందనే సంగతి ఆ యన గ్రహించుకోవడానికి మరి కొంతకాలం పడుతుంది. 

కమల్ రాజకీయాలలో నిలదొక్కుకోవడానికి దోహదపడే సానుకూల అంశాలేమిటి అన్నది ఆలోచించాలి.  తమిళనాడులో ప్రస్తుతం చక్రం తిప్పుతు న్న కీలక రాజకీయ నాయకులంతా  ప్రజల నమ్మకానికి దూరం అవుతున్న సమయంలో కమల్ హాసన్ రాజకీయ అరంగేట్రమ్ చేశారు. తాను ప్రజలకు సరైన నాయకుడినని, వారి ఆకాంక్షలను తీర్చే విషయంలో తనపై పూర్తి నమ్మకం పెట్టుకోవచ్చని ఆయన ము న్ముందు నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఆయన, రజనీకాంత్ తమ రాజకీయ ప్రవేశంతో వివిధ పార్టీల అధ్యక్షులు, అధినేతలలో పోటీ దిగుతున్నారన్న విషయాన్ని గమనించాలి. కమల్ హాసన్ కన్నా ముందే ఎం.కె. స్టాలిన్, టి.టి.వి. దినకరన్, అంబుమణి రామదాస్ వంటి నాయకులు ఇక్కడి రాజకీయాలలో పాతుకుపోయి ఉన్నారు. వారిని కాదని ప్రజలు కమల్ హాసన్‌ను ఆదరించాలన్నా, వారితో కమల్ ఢీకొనాలన్నా అంత తేలిైకెన విషయం కాదు. కేవలం సినిమా హీరో అనుభవంతో వీరిని నెగ్గుకు రావడం కష్టం. ప్రజల భావోద్వేగాలు కొంత కాలైమెన తర్వాత చల్లబడే అవకాశం ఉంది. ఈలోగా కమల్ తనను తాను నిరూపించుకోవాలి. 

తమిళ భాషాభిమానం గురించి కమల్ హాసన్ తన ప్రసంగంలో ఎక్కువ సేపు మాట్లాడారు. దేశమంతా ఒకే భాష ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఆయన తమిళ ప్రాధాన్యం గురించి మరీమరీ నొక్కి చెప్పడం ఆలోచించాల్సిన విషయం. దేశంలో బహుళ భాషలుండడం సహజైమెన విషయమనీ, రాష్ట్రంలో తమిళాన్ని కాపాడుకోవడానికి చేయగలిగిందంతా చేయాలని ఆయన చెప్ప డం ఓ పెద్ద సవాలుగానే పరిగణించాలి. భాష విషయంలో తమిళ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తానని ఆయన చెబితే చెప్పి ఉండవచ్చు. కానీ, ఈ భాషను కాపాడడానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత చేసినా సరిపోదు. 

దక్షిణాదితో మవేుకం
ఆయన తన పార్టీ లోగోలో దక్షిణ భారతావనికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. తన రాజకీయాలు, తన ఆకాంక్షలు కేవలం తమిళనాడుకే పరిమితం కాదని, ఇవి తమిళనాడు ఎల్లలు దాటుతున్నాయని ఆయన చెప్పకనే చెప్పారు. ద్రవిడ దృక్పథం, ద్రవిడ ఆలోచనా ధోరణి అనేవి దక్షిణాది రాష్ట్రాలకన్నిటికీ ఒకే విధంగా ఉంటాయనేది ఆయన అభిప్రాయం కావ చ్చు. విధానాల విషయంలోనూ, నిధుల పంపిణీ, హిందీ అమలు తదితర రాజకీయ నిర్ణయాలలోనూ కేంద్రం దక్షిణ భారతదేశాన్ని వేరుగా చూస్తోందన్న అభిప్రాయం కూడా ఆయన ప్రసంగంలో వ్యక్తైమెంది. బహుశా అందుకనేనేమో, ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, కర్ణాటకకు చెందిన నటుడు ప్రకాశ్‌రాజ్ వంటి వారితో మాటామంతీ జరిపారు. ఆయన రాజకీయ ప్రవేశంపై ఈ నాయకులంతా ఆయనను ప్రత్యేకంగా అభినందిం చారు. అంటే, దక్షిణాదిలో క్రమంగా ఓ ఒత్తిడి వర్గం రూపుదిద్దుకుంటోందని అర్థం చేసుకోవాలి. 

ఆయన ఆలోచనలన్నీ గందరగోళంగా ఉంటాయని ఆయన విమర్శకులు చెబుతుంటారు. అయితే, ఆయన అస్తవ్యస్త భావాల వెనుక ఓ ఆదర్శం కూడా ఉందని గమనించాలి. ఆయన వాస్తవవాది కాదని కూడా కొంతమంది విమర్శకులు వాదిస్తుంటారు. ఆరువేల రూపాయల చొప్పున తీసుకుని ఓటు వేయడమన్నది దీర్ఘకాలంలో ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదని, మద్యానికి, ఉచిత కానుకలకు లొంగిపోవద్దని ఆయన చెప్పడం అందుకు కారణం. నిజానికి ఇటువంటి మాటలు ఎన్నికల ముందు ప్రతి రాజకీయ నాయకుడి నోటి నుంచి వచ్చేవే. అయితే, ఆయన ప్రజలకు ఇటువంటి మంచి సలహా ఇవ్వడం తప్పేమీ అనిపించుకోదు. రాజకీయ అవినీతిని ఆయన సీరియస్ అంశంగా పరిగణిస్తున్న విషయం ఇది చెప్పకనే చెబుతోంది. 

కమల్ హాసన్ ప్రసంగాన్ని లక్షలాది మంది విన్నారంటే అందుకు ఆయన నటుడు కావడం ఒక్క టే కారణం కాదు. కొద్ది కాలంగా తమిళనాడు రాజకీయాలు బురదమయం అయిపోయాయి. వీటి నుంచి ఓ సరైన నాయకుడు అవతరించకపోతాడా అని ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అందులోనూ జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే వ్యవహారాలు మరీ అధ్వానంగా మారిపోయాయని జనం భావిస్తున్నారు. మిగిలిన పార్టీల నాయకుల పట్ల జనంలో అభిమానం అడుగంటుతోంది. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే పార్టీలను తమిళ ప్రజలు ఏ నాడో తిరస్కరించారు. తమిళనాట, తమిళ అభిమా నం కలిగి ఉండి, సరైన నాయకత్వాన్ని అందించగలిగిన అవినీతి రహిత నాయకుడైతే నెత్తి మీద పెట్టుకుందామని జనం ఆశిస్తున్నారు. ఇటువంటి సమయంలో రజనీకాంత్ ముందు వచ్చినా ఆయనను ఇదే విధంగా జనం ఆదరించేవారు. ముందుగా కమల్ హాసన్ రంగ ప్రవేశం చేయడంతో జనం దృష్టి ఆయన మీద కేంద్రీకృతైమెంది. 

ఇల్లు అలకగానే పండుగ కాదు. కమల్ హాసన్ మదురై సభ విజయవంతైవెునంత మాత్రాన ఆయన రాజకీయంగా విజయం సాధిస్తారనే గ్యారంటీ ఏమీ లేదు. సినిమా నటులను విపరీతంగా అభిమానించే తమిళనాడులో ఓ 20 వేల మంది ప్రేక్షకులను కూడగట్టడం పెద్ద కష్టమేమీ కాదు. తిరుపతిలో నటుడు చిరంజీవి బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజారాజ్యం పార్టీని ప్రకటించినప్పుడు లక్షలాది మంది హాజరయ్యారు. కమల్ హాసన్ పార్టీ పేరు కూడా ప్రజా అనే మాటతోనే ప్రారంభం కావడం కాకతాళీయమే. అయి తే, చివరికి ప్రజారాజ్యం పార్టీ నిలవలేకపోయింది. చిరంజీవి కూడా కాంగ్రెస్‌లో చేరిపోవడం గుర్తుండే ఉంటుంది. కమల్ హాసన్ ఏం చేయబోతున్నారన్నది కాలమే చెప్పాలి. తమిళనాడులో సినిమా రంగం నుంచి వచ్చినవారిలో ఎం.జి. రామచంద్రన్, జయలలిత, కరుణానిధి తమిళనాడు రాజకీయాలను అనేక దశాబ్దాలపాటు శాసించారు. కమల్ హాసన్ కూడా వారిలా రాజకీయాలను చక్కని మలుపు తిప్పాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

politicallyజి. రాజశుక 

సచేతనకమల్ హాసన్ నోట ‘శ్రీమంతుడు’ డైలాగ్!

Updated By ManamThu, 02/22/2018 - 08:58

 Kamal Haasan Political Dialogue

అవును మీరు వింటున్నది నిజమే.. ‘శ్రీమంతుడు’ సినిమాలోని డైలాగ్‌ను విలక్షణ నటుడు కమల్ హాసన్ వాడేశారు. ఆ డైలాగ్ రావడంతో ఇదెక్కడో సినిమాల్లో విన్నట్లుందే అని జనాలంతా ఒకింత ఆశ్చర్యపోయారు. కాస్త ఆలోచించగా ఓహ్.. అందులో తప్పేముంది ఆ సినిమాలో నటించింది ఆయన కూతురేగా అందుకే ఈ డైలాగ్ పార్టీ ప్రకటించే సమయంలో వాడేశారులే అని జనాలంతా అనుకున్నారు. బహుశా శృతి సలహా మేరకు ఈ డైలాగ్‌‌ను కమల్ సభా వేదికగా పేల్చారేమో అని ఆయన అభిమానులు అనుకుంటున్నారట.

‘శ్రీమంతుడు’ డైలాగ్ ఇదీ..!
‘ఊరు చాలా ఇచ్చింది. ఎంతోకొంత తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే లావయిపోతారు....’
అనే డైలాగ్‌‌ అందరికీ గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా ఇది తెలుగు రాష్ట్రాల యువతీయువకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కూడా. కొరటాల శివ దర్శకత్వంలో.. మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా నటించిన శ్రీమంతుడు సినిమా సూపర్ హిట్ అయింది. 

తమిళనాడు నాకు చాలా ఇచ్చింది తిరిగిచ్చేస్తా..!
విలక్షణ నటుడు కమల్ హాసన్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చేశారు. ఫిబ్రవరి-21న తాను అనుకున్న ముహూర్తానికి  తమిళనాట కొత్త పార్టీని ప్రకటించారు.‘మక్కళ్ నీది మయ్యమ్’ అనే పార్టీ పేరుతో తమిళనాడు ప్రజల్లోకి వెళ్లనున్నారు. పార్టీ ప్రకటన అనంతరం ఈ సందర్భంగా కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ‘తమిళనాడు నాకు చాలా ఇచ్చింది. .నేను ఇప్పుడు తిరిగివ్వాలి’ అని శ్రీమంతుడులో లాగా డైలాగ్ పేల్చారు.! " నేను మీ నేతనుకాను.. మీ చేతిలో పనిముట్టును. నాకు ఒబామా, చంద్రబాబు, విజయన్, కేజ్రీవాల్ ఆదర్శం. ఈ పార్టీ ప్రజల కోసమే... నేను నాయకుణ్ని కాదు... మీలో ఒకణ్ని... మీ అనుచరుణ్ని మాత్రమే... మీ మాటే వింటా... మీ వెన్నంటి నడుస్తా’’నంటూ తమిళనాడు పౌరులకు హామీ ఇచ్చారు. 

మంచిని మాత్రమే స్వీకరిస్తా..!
సభకు హాజరైన అశేష ప్రజానీకాన్ని చూసి ఉప్పొంగిపోతున్నానని, అందరూ ఏకమైతే సాధించగల విజయాలకు ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ సభ ఒక నమూనా మాత్రమేనని, రాష్ట్రవ్యాప్తంగా ప్రజాదరణతో ఇలాంటి సభలు మరెన్నో జరుగుతాయని ప్రకటించారు. అన్ని పార్టీలలోని మంచిని మాత్రమే స్వీకరిస్తానని కమల్ స్పష్టం చేశారు.క‌మ‌ల్‌కు జోడీగా న‌య‌న్‌?

Updated By ManamTue, 01/30/2018 - 20:02

nayanర‌జ‌నీకాంత్‌, విజ‌య్‌, అజిత్‌, విక్ర‌మ్‌, సూర్య‌.. ఇలా త‌మిళంలోని అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ జోడీ క‌ట్టిన లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌.. ఈ జాబితాలో మిగిలి ఉన్న మ‌రో అగ్ర క‌థానాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌తోనూ క‌లిసి న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారని కోలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'భార‌తీయుడు' (1996) చిత్రానికి సీక్వెల్‌గా క‌మ‌ల్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో సినిమా రానున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ మూవీలో క‌థానాయిక పాత్ర‌కు న‌య‌న‌తార పేరు ప‌రిశీలిస్తున్నార‌ని చెన్నై సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక స‌మాచారం వెలువ‌డుతుంది. ఇదిలా ఉంటే.. చిరంజీవి క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న భారీ బ‌డ్జెట్ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'లోనూ న‌య‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. శ్రుతి హాస‌న్‌.. 'డబుల్ ధ‌మ‌కా' ఫొటోషూట్

Updated By ManamSun, 01/28/2018 - 19:40

sruthi hasanన‌ట‌న‌కి ప‌ర్యాయ‌ప‌దంలా నిలిచారు లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌. అలాంటి క‌మల్‌కు న‌ట‌వార‌సురాలిగా తెరంగేట్రం చేసింది శ్రుతి హాస‌న్‌. క‌థానాయిక‌గా కేవ‌లం గ్లామ‌ర్ పాత్ర‌ల‌కే ప‌రిమితం కాకుండా.. అభిన‌యానికి ఆస్కార‌మున్న పాత్ర‌ల్లోనూ మెప్పించింది. అయితే, ఈ మ‌ధ్య సినిమాల విష‌యంలో కాస్త జోరు త‌గ్గించి.. ఆచితూచి అడుగులు వేస్తోంది ఈ ముద్దుగుమ్మ‌.

sruthiఇదిలా ఉంటే.. ఈ రోజు (ఆదివారం) త‌న 32వ పుట్టిన రోజు జరుపుకుంటోంది ఈ అందాల తార‌. ఈ సంద‌ర్భంగా ఓ క్యాలెండ‌ర్ ఫొటోషూట్‌ కోసం శ్రుతి దిగిన ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు సినిమాల్లో డ్యూయెల్ రోల్ చేసే అవ‌కాశం అందుకోలేక‌పోయినా.. ఇలా ఈ క్యాలెండ‌ర్ ఫొటోషూట్ ద్వారా ఆ ముచ్చ‌టా తీర్చుకుంది శ్రుతి. మొత్తానికి.. ఈ ఫోటోషూట్‌తో మ‌రోసారి త‌న అభిమానుల‌ను ఫిదా చేసేసింది శ్రుతి.

sruthi hasan

 'విశ్వ‌రూపం2'పై క‌మ‌ల్ ట్వీట్‌

Updated By ManamFri, 12/22/2017 - 21:28

vr2క‌మ‌ల్ హాస‌న్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం 'విశ్వ‌రూపం 2'. ఆండ్రియా, పూజా కుమార్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రం.. ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉంది. కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆల‌స్యం జ‌రిగింది. రీసెంట్‌గా చెన్నైలో ఈ సినిమా తాలుకు.. పెండింగ్ ఉన్న వ‌ర్క్‌ని ఫినిష్ చేసింది చిత్ర బృందం. కాగా, ఈ రోజు (శుక్ర‌వారం) ఈ చిత్ర సాంకేతిక బృందంతో క‌మ‌ల్ దిగిన ఫొటోని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ''విశ్వ‌రూపం2 అవుట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. దీనికి కార‌ణ‌మైన సాంకేతిక బృందానికి కృత‌జ్ఞ‌త‌లు'' అని పేర్కొన్నారు. అంతేకాకుండా.. నిర్మాత‌ల‌లో ఒక‌రిగా త‌న అన్న చంద్ర‌హాస‌న్ పేరుని కూడా ప్ర‌స్తావిస్తూ ఎమోష‌న‌ల్‌గా స్పందించారు. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 26న ఈ సినిమా తెర‌పైకి రానుంద‌ని స‌మాచార‌మ్‌.ర‌జ‌నీ, క‌మ‌ల్‌.. జాతీయ పండ‌గ‌లు

Updated By ManamSat, 12/02/2017 - 17:57

rajani, kamalతమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన‌ తాజా చిత్రం ‘కాలా’. గతంలో రజనీతో ‘కబాలి’ని తెరకెక్కించిన పా.రంజిత్ ఈ సినిమాని రూపొందించారు. రజనీ అల్లుడు, హీరో ధనుష్ వండర్‌బ‌ర్‌ ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. షూటింగుని పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో  వుంది. ఈ చిత్రం విడుదలపై నెలకొని ఉన్న సందిగ్ధతను రజనీ తొలగించారు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘2.O’ విడుదల తర్వాతే ఈ సినిమా రిలీజ్ ఉంటుందని రజనీ స్వయంగా వెల్లడించారు. తాజా స‌మాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15, 2018న విడుదల చేయడానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేసుకుంటున్న‌ట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం 2’ రిపబ్లిక్ డే సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 26, 2018న‌ విడుద‌ల కానుంది. అంటే..త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కి చెందిన ఇద్ద‌రు లెజండ‌రీ యాక్ట‌ర్ల కొత్త సినిమాలు జాతీయ పండ‌గ‌ల స‌మ‌యంలోనే సంద‌డి చేయ‌నున్నాయ‌న్న‌మాట‌.

Related News